ఐనంపూడి శ్రీలక్ష్మి

వికీపీడియా నుండి
(అయినంపూడి శ్రీలక్ష్మి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఐనంపూడి శ్రీలక్ష్మి
ఐనంపూడి శ్రీలక్ష్మి


వ్యక్తిగత వివరాలు

జననం 15 ఆగస్టు, 1967
బోధన్‌, నిజామాబాద్‌ జిల్లా
జాతీయత భారతీయురాలు
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

ఐనంపూడి శ్రీలక్ష్మి ఆకాశవాణి, హైదరాబాదులో రెండు దశాబ్దాలు అనౌన్సరుగా పనిచేసారు. ఆమె రచయిత్రి. ఆమె అనేక ఆర్టికల్స్, పుస్తకాలు, కవితలు ప్రచురించారు. కొన్ని డాక్యుమెంటరీలు కూడా తయారుచేసారు. ఆమె చిత్రాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలిండియా రేడియోలో పేరొందిన వ్యక్తులతో ఇంటర్వ్యూ కార్యక్రమాలను నిర్వహించారు.[1] 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె నిజామాబాదు జిల్లా లోని బోధన్లో 1967 ఆగస్టు 15 న జన్మించారు. విజ్ఞానశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ ను గిరిరాజ్ కళాశాలలో పూర్తిచేసారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.యి.డి చేసారు. ఆమె హైదరాబాదు ఆకాశవాణిలో అనౌన్సరుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు కవిత్వం, చిత్రనిర్మాణాలపై ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక ఆర్టికల్స్, పుస్తకాలు, కవితలను వివిధ విషయాలలో (ఫైన్ ఆర్ట్స్, సినిమాలు) ప్రచురించారు.

సాహితీ సేవలు[మార్చు]

ఆమె పాఠశాల విద్యాభ్యాసం నుండే సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. పాఠశాలలో కవితలు వ్రాసేవారు. పాఠశాల మ్యాగజైన్ కు ఎడిటరుగా ఉండేవారు. ఆమె 2000లో ఇండూర్ స్పెషల్ ఇష్యూలోని ఎడిటోరియల్ మెంబరుగా ఉన్నారు. ఆమె యోజన మాసపత్రిక, ప్రజాశక్తిలో వివిధ రచయితలు, కవులు వ్రాసిన కవితలు, కథలు, నవలలకు సమీక్షలు వ్రాసారు. 2001లో "అలలవాన", 2003 లో దృక్కోణం (భావ చిత్రాలు) పుస్తకాలను ప్రచురించారు.2011 లో లైఫ్@చార్మినార్ అనే దీర్ఘ కవితను ప్రచురించారు. ఆమె ఒక డాక్యుమెంటరీలో దీర్ఘ కవితను ప్రవేశపెట్టారు. ఈ కవిత 5వ కాఫిసో జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ జ్యురీ అవార్డును కైవసం చేసుకుంది. ఆమె వ్రాసిన కవిత "వెన్నెల దుఃఖం" నకు 2012 జనవరి 18రంజని-కుందుర్తి అవార్డు వచ్చింది.[3]

అవార్డులు[మార్చు]

  1. "కీర్తి పురస్కారం" - ఉత్తమ రచయిత్రి విభాగం - తెలుగు విశ్వవిద్యాలయం, 2013.[4]
  2. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[5]

మూలాలు[మార్చు]

  1. "About Inampudi Sreelaxmi". మూలం నుండి 2015-08-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-06-30. Cite web requires |website= (help)
  2. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". మూలం నుండి 8 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 9 March 2020. Cite news requires |newspaper= (help)
  3. నమస్తే తెలంగాణ, తెలంగాణ (26 March 2020). "కేసీఆర్ మెచ్చిన ఐనంపూడి శ్రీలక్ష్మి కవిత ఇదే". ntnews. మూలం నుండి 26 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 26 March 2020.
  4. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". మూలం నుండి 9 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 9 March 2020. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులు[మార్చు]