తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2020

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2020 పురస్కార గ్రహీతలు

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు అందజేసే పురస్కారం.[1] గౌరమ్మను గంగలో పూజించే బతుకమ్మ సాక్షిగా.. దుర్గమ్మను నైవేద్యంతో పూజించే బోనం సాక్షిగా.. స్త్రీలను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం తెలంగాణ రాష్ట్ర సంప్రాదాయం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తుంది.[2]

2020 పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిభామూర్తుల్లో 20 కేటగిరీలకుగాను 30 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసింది.[3][4] వీరికి 2020, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాదులోని రవీంద్రభారతిలో లక్ష రూపాయల నగదు పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, మహిళా-శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, మీర్‌పేట్‌ మేయర్‌ దుర్గ దీప చౌహాన్‌, సంగారెడ్డి మేయర్‌ మంజుశ్రీ, కార్పోరేటర్లు తదితరులు పాల్గొని పురస్కారాలు అందజేశారు.[5][6]

పురస్కార గ్రహీతలు[మార్చు]

క్రమసంఖ్య పేరు స్వస్థలం రంగం విభాగం చిత్రమాలిక
1 సయ్యద్ సల్వా ఫాతిమా పాతబస్తీ, హైదరాబాదు విమానయాన మొదటి మహిళా పైలట్
2 మల్లారి జమ్మ మేడిపల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా జానపదం ఒగ్గుకథ Mallari Jamma.jpeg
3 పల్లె వాణి జానపదం బోనాలు Palle Vani.jpeg
4 మంగ్లి సత్యవతి జానపదం గాయని
5 వంగీపురం నీరజాదేవి వనపర్తి శాస్త్రీయ నృత్యం నృత్యకారిణి Vangipuram Neeraja Devi.jpg
6 అయినంపూడి శ్రీలక్ష్మి బోధన్‌, నిజామాబాదు జిల్లా సాహిత్యం కవయిత్రి
7 ప్రొ. సూర్యా ధనుంజయ్ బల్లు నాయక్‌ తండా, మిర్యాలగూడ సాహిత్యం తెలుగు సాహిత్యం Surya Dhanunjay.jpeg
8 లక్ష్మీరెడ్డి చిత్రకళ చిత్రకారిణి
9 మంజులా కళ్యాణి (స్వయంకృషి) చెన్నాపూర్‌ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సేవ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సేవ
10 బొండా రామలీల (మల్లికాంబ మనో వికాస కేంద్రం) హన్మకొండ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సేవ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సేవ
11 పి. సరిత ఆదిలాబాద్ మహిళా హక్కులు మహిళా హక్కులకు కృషి
12 స్రవంతి అసాధారణ ప్రజ్ఞ దివ్యాంగ బ్యాంకు అధికారిణి
13 దీక్షిత మహబూబాబాద్‌ క్రీడారంగం వెయిట్ లిఫ్టింగ్
14 గోలి శ్యామల హైదరాబాదు క్రీడారంగం స్విమ్మింగ్
15 జి. నిర్మలా రెడ్డి నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్ల పల్లి మండలం, చిలకమర్రి పాత్రికేయం పాత్రికేయురాలు G. Nirmala Reddy.jpeg
16 బేగరి లక్ష్మమ్మ హుమ్నాపూర్‌, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా వ్యవసాయం మహిళా రైతు Begari Lakshmamma.jpeg
17 మిల్కూరి గంగవ్వ లంబాడిపల్లి, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా సామాజిక మాధ్యమం తెలంగాణ భాష, సంస్కృతి ప్రచారం
18 డా. మంజులారెడ్డి మహబూబ్‌నగర్‌ సైన్స్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్త
19 అనిత పవార్ శంకర్‌తాండ, ఉట్నూర్‌ మండలం, ఆదిలాబాద్ జిల్లా ఆరోగ్య సేవ స్టాఫ్ నర్సు
20 శారద పెంచికల్‌పేట, బెజ్జూర్‌ మండలం, కొమురంభీం జిల్లా ఆరోగ్య సేవ ఏఎన్ఎం
21 పూనం కవిత బర్లగూడెం, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్య సేవ ఆశా కార్యకర్త
22 డి. సంధ్యారాణి సరస్వతీనగర్‌, ఉప్పల్‌, మేడ్చల్ జిల్లా మహిళా, శిశు సంక్షేమసేవ అంగన్ వాడీ టీచర్
23 ఎన్.వి.ఎల్. సౌజన్య జమ్మిగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా, శిశు సంక్షేమసేవ పర్యవేక్షకురాలు
24 టేకం యమునాబాయి మహిళా, శిశు సంక్షేమసేవ సహాయకురాలు
25 మనీషా సబూ పోచారం, ఘటకేసర్ మండలం, మేడ్చల్ జిల్లా కార్పోరేట్ రంగం ఇన్ఫోసిస్ సెంటర్ హెడ్
26 మన్నే ఉషారాణి పారిశ్రామికవేత్త ఎఫ్ఎల్ఓ వైస్ చైర్మన్
27 డా. పర్చా అంజలీదేవి హన్మకొండ వైద్యరంగం వైద్యసేవ Parcha Anjalidevi.jpeg
28 డా. అరుణా దేవి హైదరాబాదు యోగా యోగా శిక్షకురాలు
29 డా. సరోజ్ బజాజ్ హైదరాబాదు సామాజిక సేవ సామాజిక సేవ
30 మమతా రఘువీర్ నల్లగొండ సామాజిక సేవ సామాజిక సేవ

ఇవికూడా చూడండి[మార్చు]

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017
  2. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2018
  3. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2019

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, జిందగీ (7 March 2017). "ప్రతిభకు పురస్కారం!". మూలం నుండి 8 మార్చి 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 8 March 2020. Cite news requires |newspaper= (help)
  2. నమస్తే తెలంగాణ, జందగీ (7 March 2018). "యత్ర నార్యస్తు పూజ్యంతే." మూలం నుండి 8 మార్చి 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 8 March 2020. Cite news requires |newspaper= (help)
  3. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". మూలం నుండి 8 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 8 March 2020. Cite news requires |newspaper= (help)
  4. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". మూలం నుండి 8 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 8 March 2020. Cite news requires |newspaper= (help)
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (8 March 2020). "రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోంది: మంత్రి సత్యవతి రాథోడ్‌". మూలం నుండి 8 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 8 March 2020. Cite news requires |newspaper= (help)
  6. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". మూలం నుండి 9 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 9 March 2020. Cite news requires |newspaper= (help)