గోలి శ్యామల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్యామల గోలి
జననం1973
జాతీయత భారతదేశం
వృత్తిఓపెన్‌ వాటర్‌ స్విమ్మర్‌
యానిమేషన్‌ సినిమాల నిర్మాత
దర్శకురాలు
రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
30 కిలోమీటర్ల పొడవైన పాక్‌ జలసంధిని ఈదిన మహిళగా గుర్తింపు

గోలి శ్యామల భారతదేశానికి చెందిన అంతర్జాతీయ ఓపెన్‌ వాటర్‌ స్విమ్మర్‌, యానిమేషన్‌ సినిమాల నిర్మాత, దర్శకురాలు, రచయిత. ఆమె 47 ఏళ్ల వయసులో 30 కిలోమీటర్ల పొడవైన పాక్‌ జలసంధిని 13.47 గంటల్లో పూర్తి చేసి ప్రపంచంలోనే రెండవ, భారతదేశానికి చెందిన రెండవ మహిళగా, తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించింది.[1] గోలి శ్యామల 2020 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2]

సాధించిన ఘనతలు[మార్చు]

 • 2019 జనవరిలో విజయవాడలో ఆక్వా డెవిల్స్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణ రివర్‌ స్విమ్మింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించింది.
 • 2019 జూన్‌లో కర్నాటకలోని తోన్నూరు లేక్‌లో ఐదు కిలోమీటర్ల పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
 • 2019 ఆగస్టు 20న సౌతాఫ్రికలోని గ్వాంగ్జులో ఫినా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఓపెన్‌ వాటర్‌లో 3 కిలోమీటర్ల పోటీలో 22వ స్థానంలో నిలిచి, భారత దేశం తరుపున తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి మహిళగా గుర్తింపు పొందింది.
 • 2019 అక్టోబర్‌లో లక్నోలో మాస్టర్స్‌ నేషనల్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానంలో నిలిచింది.
 • 2019 నవంబర్‌లో పాట్నాలో గంగా నదిలో జరిగిన ఓపెన్‌ కేటగిరీ 13 కిలోమీటర్లు పోటీలో 6వ స్థానంలో నిలిచింది.
 • 2019 డిసెంబర్‌లో కోల్‌కతాలోని హుగ్లీ రివర్‌లో 12 డిగ్రీల చల్లని వాతావరణంలో ఈత పోటీలో పాల్గొని ఓపెన్‌ కేటగిరీలో 14 కిలోమీటర్ల విభాగంలో 7వ ర్యాంక్‌ సాధించింది.
 • 2019లో గురజాత్‌లోని పోర్‌బందర్‌లో అరేబియా సముద్రంలో ఓపెన్‌ వాటర్‌ 5 కిలోమీటర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించింది.
 • 2020 ఫిబ్రవరి 15న స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కర్నాటకలోని శివమొగ్గలో ఓపెన్‌ వాటర్‌ ఒకటిన్నర కిలోమీటర్లు కృష్ణ రివర్‌ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది.
 • 2020 పిబ్రవరి 2న ఆక్వా డెవిల్స్‌ వెల్‌ఫేర్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణ రివర్‌ క్రాసింగ్‌లో మొదటి స్థానంలో సాధించింది.[3]
 • 2021లో భారత్, శ్రీలంకల మధ్యనున్నపాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించింది.[4]

మూలాలు[మార్చు]

 1. Sakshi (20 March 2022). "శభాష్‌.. శ్యామల! సముద్రంపై సాహ'షి'". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
 2. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 March 2020. Retrieved 8 March 2020.
 3. Sakshi (24 February 2020). "అవకాశం వస్తే ఇంగ్లీష్‌ చానల్‌ ఈదేస్తా :శ్యామల". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
 4. HMTV (20 March 2021). "47 ఏళ్ల వయసులో పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన మహిళ". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.