బేగరి లక్ష్మమ్మ
స్వరూపం
బేగరి లక్ష్మమ్మ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | మహిళా రైతు |
బేగరి లక్ష్మమ్మ తెలంగాణ రాష్ట్రంకు చెందిన మహిళా రైతు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ మహిళా రైతుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]లక్ష్మమ్మ స్వస్థలం సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, హుమ్నాపూర్ గ్రామం.
వ్యవసాయరంగం
[మార్చు]మూడు దశాబ్దాలుగా విత్తన సేకరణ చేపడుతున్న లక్ష్మమ్మ, దాదాపు 50 నుంచి 80 విత్తన రకాల్ని నిల్వవుంచి రైతులకు అందిస్తోంది. మట్టిలో సాంద్రతను పెంచడం, సేంద్రియ వ్యవసాయం గురించి చుట్టూప్రక్కల గ్రామాల మహిళా రైతులకు అవగాహన కల్పిస్తోంది. దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీలో పనిచేస్తూ స్వయంగా విత్తనాలు తయారు చేసుకోవడమేకాకుండా, గ్రామీణ మహిళలతో కూడా తయారు చేయిస్తోంది.[2]
పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[3]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 20 March 2020.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 20 March 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్ సేఫ్టీ స్టేట్ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 20 March 2020.