ఎక్కా యాదగిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎక్కా యాదగిరిరావు
ఎక్కా యాదగిరిరావు
జననంఅలియాబాద్‌, హైదరాబాద్‌ పాత బస్తీ, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్
ప్రసిద్ధిచిత్రకారులు, శిల్పి
తండ్రినారాయణస్వామి
తల్లినాగమ్మ

ఎక్కా యాదగిరిరావు తెలంగాణ రాష్ట్ర ప్రముఖ చిత్రకారులు, తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత.

జననం

[మార్చు]

ఎక్కా యాదగిరిరావు హైదరాబాద్‌ పాత బస్తీ లోని అలియాబాద్‌లో జన్మించారు. వీరి తండ్రి ఎక్కా నారాయణస్వామి (ఉపాధ్యాయులు), తల్లి నాగమ్మ.

జీవిత విశేషాలు

[మార్చు]

నాగమ్మ జానపద గీతాలను అద్భుతంగా పాడేది. అలా చిన్నతనం నుండే యాదగిరిరావుకి కళలపై ఆసక్తి కలిగింది. హెచ్‌.ఎస్‌.సి చదివే సమయంలోనే చిత్రలేఖనంలో ప్రతిభ కనబరచారు. 1957లో నా ఇంటర్‌ పూర్తిచేసి, ఎ.ఎం.ఐ.ఇ.లో చేరారు. కానీ అది నచ్చక 1957లో కింగ్‌ కోఠిలోని కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరారు.[1]

శిల్పకళారంగం

[మార్చు]

కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌లో శిల్పకళ వైపు ఆకర్షితుడై, ఎస్‌.కె.పాటిల్‌ అనే మహారాష్ట్ర టీచర్‌ దగ్గర చాలా మెలకువలు నేర్చుకున్నారు. అక్కడ ఉస్మాన్‌ సిద్ధిక్‌ అనే టీచర్‌ వద్ద ఆధునిక శిల్పకళ తెలుసుకొని, మోడ్రన్‌ ఆర్ట్‌లో కృషిచేయడం ప్రారంభించారు. భారతీయ శిల్పకళను పరిశోధించి లోహ ‘మిథున’ శిల్పాన్ని రూపొందించారు. ఈ శిల్పాన్ని ఢిల్లీలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌వారు కొనుగోలు చేసి ప్రదర్శించారు. ‘మిథున’ శిల్పం యాదగిరిరావు యొక్క శిల్పకళ కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమితమైన గుర్తింపును తీసుకొచ్చింది.[1]

తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం నిర్మాణం

[మార్చు]

1969లో తెలంగాణ సాయుధ పోరాటం ఊపందుకుంది. అలియాబాద్‌లో కర్ఫ్యూ విధించిన సమయంలో పోలీసుల తుపాకీ తూటాకు యాదగిరిరావు మిత్రుడైన వెంకటేశ్వరరావు చనిపోయాడు. అది చూసి యాదగిరిరావు గుండె చలించింది. ఈ సంఘటన జరిగిన మూడేళ్ల తరువాత తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం ఏర్పాటు కోసం పురపాలక శాఖ డిజైన్స్‌ను ఆహ్వానించినపుడు యాదగిరిరావు తను ఒక డిజైన్ చేసి పంపించారు. ఆ డిజైన్‌ను అప్పటి తెలంగాణ మంత్రులైన అంజయ్య, మదన్‌మోహన్‌, మాణిక్‌ రావు, ఎం.ఎం. హర్ష ల కమిటీ ఎంపిక చేసింది. అలా ఎక్కా యాదగిరిరావు తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం రూపశిల్పి అయ్యారు.[1]

ఇతర నిర్మాణాలు

[మార్చు]

యాదగిరిరావు చెక్కిన చాలా శిల్పాలు దేశ విదేశాల్లోని మ్యూజియాల్లో, రష్యాలోని ఇండియన్‌ ఎంబసీ, యు.కె., జర్మనీ, యు.ఎస్‌.ఎలలో ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నగరపాలక సంస్థ కోసం యాదగిరిరావు రూపొందించిన నెహ్రూ విగ్రహం లాల్‌దర్వాజాలో ఉంది. గాంధీ విగ్రహాన్ని న్యూఢిల్లీలో పెట్టారు. టాంక్‌ బండ్‌పై సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం, విశాఖ బీచ్‌ లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ విగ్రహం యాదగిరిరావు చెక్కినవే.[1]

అవార్డులు[2]

[మార్చు]

గుర్తింపులు

[మార్చు]
 • 1975లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో హభారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడం
 • లలిత కళా అకాడమీ 1984లో యాదగిరిరావు మోనోగ్రాఫ్‌ పుస్తకాన్ని ప్రింట్‌ చేయడం[1]

ప్రదర్శనలు[4]

[మార్చు]

1965 నుండి వివిధ జాతీయ, రాష్ట్ర ఆర్ట్ ప్రదర్శనలలో పాల్గొన్నారు.

 • 2010 - ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్, డెన్మార్క్
 • 2006 - ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్, సింగపూర్
 • 2004 - నేషనల్ స్కల్ప్టర్స్ క్యాంప్, చంఢీఘడ్, పంజాబ్
 • 2003 - మాజ్దేనిక్, డబ్లిన్, పోలాండ్
 • 2002 - నేషనల్ స్కల్ప్టర్స్ క్యాంప్, హైదరాబాద్
 • 2002 - హబిరత్ ఫౌండేషన్, న్యూఢిల్లీ
 • 2001 - కాన్ టెంపరరీ ఇండియన్ ఆర్ట్, ఫుల్డా, జర్మనీ
 • 1997 - ఇండో - పాక్ జూబిలీ కల్చరల్ సమరోహ్, హైదరాబాద్
 • 1996 - వరల్డ్ తెలుగు ఫెడరేషన్, హైదరాబాద్
 • 1986- సార్క్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్స్, బెంగుళూర్
 • 1975 - III అంతర్జాతీయ ట్రెన్నియల్, న్యూఢిల్లీ
 • 1974 - నేషనల్ స్కల్ప్టర్స్ క్యాంప్, బెంగుళూర్

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 1.3 1.4 తెలంగాణ ఉత్సవ్ వర్డ్ ప్రెస్. "Ekka Yadagiri Rao – Sculpture in History". /telanganautsav.wordpress.com. Retrieved 29 January 2017.
 2. నవతెలంగాణ. "'ఎక్కా' ఎక్కని అంతస్తుల్లేవు". Retrieved 28 January 2017.
 3. నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్. "అమరులకు అంకితం ఎక్కా యాదగిరిరావు". Archived from the original on 27 జనవరి 2017. Retrieved 29 January 2017.
 4. ఎక్కా యాదగిరిరావు వెబ్ సైట్. "About Aekka Yadagiri". aekkayadagirirao.com. Archived from the original on 25 ఫిబ్రవరి 2017. Retrieved 29 January 2017.

ఇతర లంకెలు

[మార్చు]