మట్టి ముద్ర (64 మంది కవుల కవిత్వం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మట్టిముద్ర పుస్తకం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన నాలుగవ పుస్తకం. తెలంగాణ రాష్ట్రంలోని 64 మంది కవుల కవితలను ఇందులో పొందుపరచడం జరిగింది.[1] సమకాలీన 62 మంది కవుల కవిత్వంతో రూపొందించిన ’మట్టిముద్ర’ను కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా 2016, సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతిలో ఆవిష్కరించింది.[2][3]

సంపాదకులు - సలహా మండలి

[మార్చు]
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు

2016 శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఉగాది రోజున తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ 9మంది సాహితీవేత్తలతో కమిటీని వేసి, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉగాది కవి సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించింది. మామిడి హరికృష్ణ సంపాదకులుగా ఉండగా... డా. ఎస్వీ సత్యనారాయణ డా. రావికంటి వసునందన్, డా. వఝల శివకుమార్, కాసుల ప్రతాపరెడ్డి, అనిశెట్టి రజిత, గోగు శ్యామల, డా. బెల్లి యాదయ్య, డా. కాంచనపల్లి, అన్వర్ వంటివారు సలహా మండలి కమిటీలో ఉన్నారు.

మట్టి ముద్రలో రాసిన కవులు - వారి కవితలు

[మార్చు]
కవి కవిత
అన్వర్ బహిరంగోపన్యాసం
అనిశెట్టి రజిత పండగొచ్చిందని
డా. అమ్మంగి వేణుగోపాల్ అజ్ఞాతంలో నుండి
ఉదారి నారాయణ ఒక్క ఈ రోజైనా
డా. యస్. చెల్లప్ప కొత్త చిగుళ్ళు
డా. ఎస్వీ సత్యనారాయణ జ్ఞాపక చిత్రం
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ఉత్సవం
అంకం మనోహర్ ఉగాది జ్ఞాపకం
అందోజు పరమాత్మ నువ్వో సువర్ణ ముఖివి
కాసుల ప్రతాపరెడ్డి స్వరాగం
డా. కాసుల లింగారెడ్డి దుర్ముఖి
జ్యోత్నప్రభ స్వాగత గీతం
కే.వి.ఎల్. జీవితం షడ్రుచుల క్రీడ
కోట్ల వనజాత ఈ ఉగాది ఒకనాటి అతిథి కాదు
కందుకూరి శ్రీరాములు రాకపోకలు
డా. కాంచనపల్లి సాయంత్రపు పార్కులు
కాంచనపల్లి రాజేంద్రరాజు మనం మళ్లీ కొత్తగా వెలుగుదారులమై
గద్వాల కిరణ్ కుమారి గజల్
గోగు శ్యామల నిర్భయంగా రా
డాక్టర్ గండ్ర లక్ష్మణరావు ఆనందమాధవుడు
డాక్టర్ చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ విశ్వమానవ హృదయాంజలి
డాక్టర్ చవ్వా వెంకటరెడ్డి దుర్ముఖి - నవజీవన ఆకృతి,
చందుపట్ల అంబదాసు నేను - నా చెరువు,
చింతల యూదగిరి అమ్మ ఏడ్చింది
జూపాక సుభద్ర దిక్కులన్నీ నా పక్కలకొచ్చిన పండగ
జూలూరు గౌరీశంకర్ సర్కారుబడి సహజ సంపద
తమ్మనబోయిన వాసు అడుగులు కొత్తగా
డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ‘దుర్ముఖి’తో కవితాముఖి
తుమ్మూరి రాంమోహన్ రావు దుర్ముఖి ఉగాది
తైదల అంజయ్య ఫేస్ బుక్
డాక్టర్ దేవరాజు మహారాజు ఉగాది పచ్చడ
దెంచనాల శ్రీనివాస్ నాద అమూర్తం
నరేష్కుమార్ ఒక కాస్మోపాలిటన్ జానపదం
నందిని సిధారెడ్డి నగరంలో కోయిల
డాక్టర్ నాళేశ్వరం శంకరం పుర పురాణం!
డాక్టర్ పగడాల నాగేందర్ పరాయి స్పర్శ
అచార్య ఫణీంద్ర దుర్ముఖి ఉగాది కవి
పొట్టపల్లి శ్రీనివాసరావు వసంతమూ పలుకరించు
పోతన జ్యోతి రా! దుర్ముఖీ రా!
డాక్టర్ బన్న అయిలయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్
డాక్టర్ బాణాల శ్రీనివాసరావు ఎండగాలి
డాక్టర్ బుక్కా బాలస్వామి దుర్ముఖీ! స్వాగతం
బైరెడ్డి కృష్ణారెడ్డి పాసంగం
బెల్లంకొండ సంపత్ కుమార్ మనిషితనం
భూతం ముత్యాలు దుగిలి
మదునూరి సూర్యనారాయణ శర్మ కాకతీయ వైభవం -మిషన్ కాకతీయ
మామిడి హరికృష్ణ పచ్చడిబచ్చం.. మాబంగ్లా
మాస్టార్జీ మావూరి కోకిల
మేడిచర్ల ప్రభాకరరావు ప్రతి నిత్యం ఉగాది పండుగే
డాక్టర్ రాపోలు సుదర్శన్ ఓ! దుర్మిఖీ
రమా చంద్రమౌళి కొత్త చరిత్ర
ఆచార్య రావికంటి వసునందన్ దుర్మిఖీ
వఝల శివకుమార్ కాలందేమున్నది
వనపట్ల సుబ్బయ్య ఓ గంగంమ్మా
వల్లభాపురం జనార్ధన కాలం ప్రవహిస్తే
వేణు సుంకోజు తారాజువ్వలు
వేల్పుల నారాయణ కావాలి ఇక ఉగాది - ప్రగతి కొరకు పునాది
సుంకర రమేశ్ చేదబావి
డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి యుగకర్త
సిద్ధార్థ జలపోత
డాక్టర్ సీతారాం దుర్ముఖి ముంగట మానవీయ ముఖం కోసం...
షాజహానా ఊరు
శ్రీనివాస్ సాహి విధ్వంసం
హిమజ ఉగాది ఆశలు కొన్ని..

మూలాలు

[మార్చు]
  1. వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, ఎడిట్ పేజి వ్యాసాలు (16 April 2018). "కొత్తరాష్ట్రంలో కొత్తసాలు". అయినంపూడి శ్రీలక్ష్మి. Archived from the original on 16 ఏప్రిల్ 2018. Retrieved 16 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  2. epaper.namasthetelangaana.com (10 September 2016). "60 కోట్లతో కాళోజి కళాక్షేత్రం". Retrieved 17 November 2016.[permanent dead link]
  3. www.namasthetelangaana.com (9 September 2016). "పలుకుబడుల భాష తెలంగాణ". Archived from the original on 15 అక్టోబరు 2016. Retrieved 17 November 2016.