మిషన్ కాకతీయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిషన్ కాకతీయ
Mission Kakatiya official logo.png
మన ఊరు మన చెరువు
తేదీ మొదటి దశ (మార్చి 12- జూలై 11, 2015)
ప్రదేశం తెలంగాణ, భారతదేశం
నిర్వహణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
హాజరయ్యేవారు తెలంగాణ ప్రజలు
జాలస్థలం అధికారిక వెబ్ సైట్

మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్ యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపో యిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం.[1]

మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థా పన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు

ప్రారంభం[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్‌ లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి శంకుస్థాపన చేసారు.[2] తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో ఎన్నో కాలువలు తవ్వించారు. వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు.

ఈ కార్యక్రమాన్ని 2015 డిసెంబరు మూడవ వారంలో ప్రారంభించారు. ఐదేళ్లలో 2,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించనున్నారు. అన్ని ట్యాంకులను 250 ~ 270 టిఎంసిల కన్నా ఎక్కువ నీటి సామర్థ్యన్ని కలిగివుండేలా పునరుద్ధరించడం ద్వారా వ్యవసాయం, నీటిపారుదల, పశువులు మరియు మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తేనున్నారు.

మూలాలు[మార్చు]