టిఎంసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగార్జునసాగర్ యొక్క నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 408 టిఎంసిలు
మేట్టుర్ డ్యామ్ సామర్థ్యం: 93.4 టిఎంసిలు
దస్త్రం:SrisailamDam01-India.jpg
శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం: 216 టిఎంసిలు

వేయి మిలియన్ల ఘనపుటడుగులు లేదా టిఎంసి అనే పదాన్ని సాధారణంగా జలాశయం[1] లేదా నది ప్రవాహం[2] లో నీటి పరిమాణాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. అయితే టిఎంసి పదాన్ని ఎక్కువగా రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటిని సూచించేందుకే ఉపయోగిస్తారు. టిఎంసిఫీట్ (Tmcft) అనగా థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ (1,000,000,000 = 109 = 1 బిలియన్), టిఎంసిఫీట్ ను సింపుల్ గా టిఎంసి అంటారు. ఒక టిఎంసి నీరు మూడు నుంచి పది వేల ఎకరాలలో పంటలను పండించేందుకు సరిపోవచ్చు.
వందకోట్ల ఘనపుటడుగులు = ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు లోతు ఉండే పరిమాణం యొక్క వందకోట్ల రెట్లు
అనగా
వందకోట్ల ఘనపుటడుగుల నీరు = ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు లోతు ఉండే నీటి పరిమాణం యొక్క వందకోట్ల రెట్లు

మార్పిడి

[మార్చు]

1 టిఎంసి కి సమానమైనవి:

  • 1,000,000,000 ఘనపు అడుగులు (28,000,000 మీ3)
  • 28,316,846,592 లీటర్లు
  • 2.83168466×107 క్యూబిక్ మీటర్లు
  • 22,956.841139 ఎకరా అడుగు (acre feet)
  • 7.48051945×109 యు.ఎస్. గ్యాలన్లు

ప్రత్యామ్నాయంగా, 35.32 టిఎంసిఫీట్ = 1 క్యూబిక్ Km (క్యూబిక్ Km అనగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్- NRLD లో భారతదేశంలో ఆనకట్టల యొక్క స్థూల, సమర్థవంతమైన నిల్వ సామర్థ్యాన్ని నివేదించే భారత ప్రభుత్వ కేంద్ర జల కమిషన్ చే ఉపయోగించబడుతున్న ప్రామాణిక యూనిట్)

మూలాలు

[మార్చు]
  1. Reservoir example: K. Lakshmi (2010-09-24), "Krishna water release soon", The Hindu, Chennai: Kasturi & Sons Ltd, retrieved 2011-01-30
  2. Jain, Mahendra (Apr 2007), "Cauvery Water Disputes Tribunal Announces Final Verdict", Pratiyogita Darpan Magazine, Agra: Pratiyogita Darpan, retrieved 2011-01-30
"https://te.wikipedia.org/w/index.php?title=టిఎంసి&oldid=3844147" నుండి వెలికితీశారు