చర్చ:టిఎంసి
స్వరూపం
వై.వి.యస్.రెడ్డి గారికి, ఈ వ్యాస శీర్షిక వందకోట్ల ఘనపుటడుగులు అని ఉంచారు. అనగా thousand crores cubic feet (tccf) అవుతుంది. కానీ దీనిని tmcft అని సూచిస్తారు. అనగా thousand million cubic feet (టి.ఎం.సి) అని సూచిస్తారు. కనుక ఈ వ్యాస శీర్షికను వేయి మిలియన్ల ఘనపుటడుగులు అని మార్చితే బాగుంటుందని భావిస్తున్నాను. మీ అభిప్రాయం తెలుపగలరు. వంద కోట్లు అనగా 100,00,00,000. వేయి మిలియన్లు అనగా 1000,000,000. సంఖ్య ఒకటే అయినా వాడుక నామాన్ని శీర్షికగా ఉంచడం సరియైనదని భావిస్తున్నాను. ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 03:03, 11 డిసెంబరు 2015 (UTC)
- నమస్కారం
- వందకోట్ల ఘనపుటడుగులు అంటే మన తెలుగు వారికి సులభంగా అర్థమవుతుంది, వేయి మిలియన్ల ఘనపుటడుగులు అంటే సరిగా అర్థం కాదు, ఎందువలనంటే మనం ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, పదిలక్షలు, కోటి, పదికోట్లు, వందకోట్లు అని చిన్నప్పటినుంచే నేర్పిస్తాము కనుక, పేరు మార్పు ఖచ్చితమనుకుంటే మార్పు చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. YVSREDDY (చర్చ) 08:16, 11 డిసెంబరు 2015 (UTC)
- వాడుకలో టి.ఎం.సి అని ఉపయోగిస్తున్నందున వ్యాస శీర్షికను మార్పు చేసితిని. --కె.వెంకటరమణ⇒చర్చ 16:02, 11 డిసెంబరు 2015 (UTC)