వాడుకరి చర్చ:YVSREDDY
తోటి వాడుకరులపై మీరు చేసిన నిందలు[మార్చు]
వాడుకరి:YVSREDDY గారూ, గత రెండూ వారాల్లో మీరు రెండుసార్లు సాటి వాడుకరులను నిందించారు.
- జనవరి 27 న చర్చ:నిజాయితీ పేజీలో "YVSREDDY సృష్టించిన వ్యాసాన్ని ఎవరో దుర్మార్గంగా తొలగించారు." అని రాసారు.
- ఫిబ్రవరి 10 న చర్చ:గోగర్భం డ్యాం పేజీలో "ఈ వ్యాసం తొలగింపు YVSREDDY వ్రాసిన వ్యాసాల తొలగింపు కుట్రలో ఒక భాగం." అని రాసారు.
సాటి వాడుకరులు కూడా మీలాగే సదాశయం, సద్భావనల తోనే ఉన్నారని భావించడమనేది సముదాయంలో సాటి వాడుకరులతో వ్యవహరించడంలో పాటించవలసిన ప్రధానమైన మర్యాదాంశం. వికీపీడియా తోటి సభ్యులతో మీరు ఏకీభవించకపోయినా వారిని గౌరవించమని మూలసూత్రాలు చెబుతున్నాయి. గానీ మీరు ఇతరులకు ఈ గౌరవాన్ని ఇవ్వలేదు. దుర్మార్గంగా చేసారని, కుట్రలు చేసారని నిందించారు. ఇతరులు చేసిన దిద్దుబాటు తోనో, తొలగింపు తోటో మీరు ఎంతైనా విభేదించవచ్చు. ఆ అంశంపై తీవ్రంగా చర్చించనూ వచ్చు. ఆ విషయంలో మీ వాదనే సరైనదైనా కావచ్చు. కానీ ఆ వాడుకరులను నిందించరాదు. అలా నిందించడం వికీ మర్యాద అతిక్రమణే.
ఇది మొదటిసారి కూడా కాదు. గతంలో అనేకమార్లు ఈ మర్యాదను మీరు అతిక్రమించారు. మీపై ఇప్పటికి 4 సార్లు నిరోధం విధించగా, అందులో 3 సార్లు ఇతరులను నిందించినందుకే. అయినప్పటికీ మీరు మళ్ళీ అదే ధోరణిలో రాసారు. వాడుకరి:యర్రా రామారావు గారు చర్చ:నిజాయితీ పేజీలో జనవరి 27 న ఈ విషయంపై అభ్యంతరం చెప్పినప్పటికీ మీరు దానికి స్పందించలేదు. మీ స్పందన కోసం చూస్తూ, మీ ప్రవర్తనలో సానుకూలమైన మార్పు వస్తుందని ఆశిస్తూ ఉండగానే, మళ్ళీ చర్చ:గోగర్భం డ్యాం పేజీలో అలాంటి ఆరోపణలే చేసారు. మీ ప్రవర్తన మార్చుకున్నట్లు కనిపించనందున ఒక్క రోజు పాటు మీపై నిరోధం విధిస్తున్నాను. ఇకనైనా దయచేసి చర్చల్లో సాటి సముదాయ సభ్యుల పట్ల మర్యాదగా వ్యవహరించమని కోరుతున్నాను.
పోతే, మీ వాడుకరి చర్చ పేజీని వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 3 పేజీకి దారిమార్పు చేసారు. తాజా చర్చల పేజీని ఆర్కైవుల్లోకి తరలించాక, బహుశా ఆ దారిమార్పును తీసెయ్యడం మరచిపోయి ఉంటారు. పాత చర్చల ఆర్కైవు పేజీలకు దారిమార్పు చెయ్యడం వలన కింది సమస్యలు వస్తాయి/వచ్చాయి.
- ఆ పేజీలో మొదలుపెట్టిన తాజా చర్చలు - మీరు దారిమార్పును తీసేసినపుడు మరుగున పడీపోతాయి. చర్చ ఎక్కడ జరిగిందో తెలీని అయోమయం ఏర్పడూతుంది.
- మీరు ఈ సరికే సృష్టించిన ఇతర ఆర్కైవు పేజీల లింకులు చెడిపోయి, ఆ పేజీలు అనాథలుగా మిగిలి పోయాయి.
ఈ కారణాల వలన ఆ దారిమార్పును తీసేస్తున్నాను. గమనించవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 08:17, 10 ఫిబ్రవరి 2023 (UTC)
నాకు చెందిన ఇతర వీకీ ఖాతాలు[మార్చు]
కంప్యూటర్ డేటా స్టోరేజ్ పేజీ గురించి[మార్చు]
@YVSREDDY గారూ, గతంలో తొలగింపు చర్చ జరిపి ఆ పై తొలగించిన కంప్యూటర్ డేటా స్టోరేజ్ అనే పేఝీని మీరు అదే కంటెంటుతో మళ్ళీ సృష్టించారు. ఈ పేజీని గతంలో రెండు సార్లు తొలగించి ఉన్నారు. మూడు సార్లూ మీరే సృష్టించారు. ఒకసారి తొలగించిన పేజీని మళ్ళీ సృష్టించేటపుడు తొలగించిన పేజీలో ఉన్న లోపాలను ఇప్పుడు లేకుండా చూసుకుంటూ సృష్టించాలి. లేదంటే అది సత్వర తొలగింపు (CSD) G4 నిబంధన కింద సత్వర తొలగింపుకు గురౌతుంది. ఆ నిబంధన కింద మీరు సృష్టించిన పేజీని తొలగించాను. దయచేసి, ఇకపై అదే లోపాలతో ఆ పేజీని మళ్ళీ సృష్టించకండి. అలాగే తొలగించిన ఇతర పేజీలను కూడా అవే లోపాలతో మళ్ళీ సృష్టించకండి. అదే కాకుండా కొత్త సృష్టించే పేజీల విషయంలో "గేమింగ్ ది సిస్టం" కూడా లేకుండా చూసుకోవల్సినదిగా అభ్యర్థిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 11:56, 12 ఫిబ్రవరి 2023 (UTC)
పాత చర్చా పేజీల లింకులు గురించి[మార్చు]
వైవిఎస్ఆర్ గారూ సాధారణంగా ప్రస్తుత చర్చాపేజీలో పాత చర్చాపేజీలు లింకులు ఇవ్వాలి.కానీ మీరు వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 1 , వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 2 , వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 3 అనే మీ పాత చర్చాపేజీల లింకులు ప్రస్తుత చర్చాపేజీలో ఇవ్వకుండా మరుగున పెట్టారు.ఎందుకు మరుగున పెట్టారో కారణం వివరించగలరు.ఒక వేళ మీరు మర్చిపోయినట్లయితే ఇవ్వగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:29, 13 ఫిబ్రవరి 2023 (UTC)

విలీనం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- మూలాలు లేని వ్యాసం. ఇందులో సరైన మూలాలు లేకుండా తన స్వంత అభిప్రాయాలను చేర్చినందున తొలగించాలి. వికీపీడియాలో విలీన పద్ధతులను తనకు తోచిన రీతిలో రాసినందున తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విలీనం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:29, 14 ఫిబ్రవరి 2023 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:29, 14 ఫిబ్రవరి 2023 (UTC)
గతంలో తొలగించిన పేజీలను మళ్ళీ సృష్టిస్తున్నారు[మార్చు]
వైవియెస్ రెడ్డి గారూ, గతంలో తొలగింపు చర్చల ద్వారా నిర్ణయం తీసుకుని తొలగించిన మీరు మళ్ళీ దాదాపుగా అదే కంటెంటుతో మళ్ళీ సృష్టిస్తున్నారు. కంకర, హృదయం (చిహ్నం), త్రుగణ సేన్, డేవిడ్ (మైఖేలాంజెలో) వంటి పేఝీలను అలాగే సృష్టించారు. అలా సృష్టించరాదు. వాటిని CSD లోని G4 నిబంధన కింద వెంటనే తొలగిస్తారు. నేణు వాటిని అలాగే తొలగించాను. తొలగించిన పేజీలను అదే కంటెంటుతో మళ్ళీ సృష్టించవద్దని నేణు గతంలో మీకు చెప్పి ఉన్నాను. అయినా మీరు అలాగే సృష్టిస్తున్నారు. దయచేసి అలా చెయ్యకండి. వికీ పద్దతులను పాటించండి. లేదంటే మీపై చర్య తీసుకునే అవకాశం ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 04:54, 15 ఫిబ్రవరి 2023 (UTC)
మీ ఆరోపణకు ఆధారం చూపించలేదు[మార్చు]
వై వియెస్ రెడ్డి గారూ, చర్చ:ప్రపంచ రక్త దాతల దినోత్సవం పేజీలో "చర్చల ఫలితాన్ని ముందే నిర్ణయించుకొని చేసిన చర్చలు అవి." అని ఆరోపించారు. దానికి ఆధారాలు చూపించమని అక్కడే అడిగాను. అడిగి ఇప్పటికి వారమైంది. ఇంతవరకూ సమాధానం చెప్పలేదు. మరొక్క రోజులో మీరు ఈ ఆరోపణను నిరూపించే ఆధారాలు ఇవ్వని పక్షంలో - తోటి వాడుకరులపై వరసగా చేస్తున్న నిరాధారమైన నిందల విషయంలో మీ వైఖరిలో మార్పేమీ రాలేదని భావించి, మీలో ఆ మార్పు రావడం కోసం తగు చర్య తీసుకుంటాను. గమనించవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 00:34, 18 ఫిబ్రవరి 2023 (UTC)
- వైవిఎస్ రెడ్డి గారి పంథాలో ఏమి మార్పులేదు.ఎంత సేపటికి నిర్వాహకులపై నిందలు వేయటం, నిరాధారఆరోపణలు చేయటం పనిగాపెట్టుకున్నట్లుఉంది.సానుకూల ధోరణి ఏ మాత్రం లేదు.నిర్వాహకులను దరుద్దేశంతో టీం అనే మాటను వాడటం ఏ మాత్రం బాగాలేదు.నిరూపించే ఆధారాలు ఇవ్వని పక్షంలో దానికి తగిన చర్యలు తీసుకోవటంలో ఏ మాత్రం తప్పులేదు.ఆ స్థితికి రాకూడదని వైవిఎస్ రెడ్డి గారిని కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:13, 18 ఫిబ్రవరి 2023 (UTC)
- రెడ్డి గారూ, ఈ విషయంలో మీ నుండి స్పందన లేదు. తోటి వాడుకరులను నిందించే విషయంలో మీలో మార్పు రాలేదనడానికి ఇది గుర్తు. ఇదే కారణంగా ఫిబ్ర 10 వ తేదీన విధించిన ఒక రోజు నిరోధం ముగియగానే మళ్ళీ 12 న పైన నేను చెప్పిన నింద వేసారు. దానిపై వివరణ కోరినా 10 రోజులుగా వివరణేమీ ఇవ్వలేదు, నిరాధారమైన ఆ నిందను వెనక్కి తీసుకోలేదు. మీలో మార్పు తీసుకురావడం కోసం మీపై మళ్ళీ నిరోధం విధించక తప్పడం లేదు. వారం పాటు మీపై నిరోధం విధిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 00:38, 22 ఫిబ్రవరి 2023 (UTC)