Jump to content

చర్చ:గోగర్భం డ్యాం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గోగర్భం ఆనకట్ట పేరుతో ఆగస్టు 19, 2016 న నేను ఈ వ్యాసమును 2048 బైట్లతో సృష్టించడం జరిగింది. అయితే వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 పేరుతో ఈ వ్యాసాన్ని తొలగించడం జరిగింది. ఈ వ్యాసాన్ని తొలగించడానికి గల కారణాన్ని ఈ చర్చ:గోగర్భం ఆనకట్ట లో వ్రాయడం జరిగింది. మొలకల విస్తరణ పేరుతో వ్యాసాల తొలగింపు కార్యక్రమం చేపట్టిన ఇటువంటి కార్యక్రమాన్ని ఇతర వికీపీడియాలో కాదు కదా ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి కార్యక్రమాన్ని చూసి వుండరు, చూడబోరు.

గోగర్భం ఆనకట్ట పేరుతో ఆగస్టు 19, 2016 న YVSREDDY 2048 బైట్లతో సృష్టించిన వ్యాసములోని సమాచారం
గోగర్భం ఆనకట్ట (Gogarbham dam) అనేది తిరుమల నివాసితులకు నీరు సరఫరా చేసే జలాశయాల యొక్క ఒకటి. ఈ జలాశయం దేశంలో అత్యంత పుణ్యకేత్రమైన శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైవున్న తిరుమలలోని కొండ పైభాగాన పాప వినాశనము వద్ద ఉంది. ఈ జలాశయ జలపాతం పచ్చని పర్వతాల మధ్యనున్నది, ఈ ప్రదేశానికి చేరుకున్న యాత్రికులు ఇక్కడి సౌందర్యానికి ముగ్ధులవుతారు. ఈ ప్రదేశం వద్ద నీటిని ఆపటం వలన తిరుమలకు మంచి నీటి వనరు సమకూరింది. గాలిమరల జంట అక్కడి అందమైన సెట్టింగులు, అందమైన చెట్లు, కొండలు ఫోటోగ్రాఫర్లకు మంచి కనువిందునిస్తున్నాయి. ఉదయం మరియు సాయంత్రం ఇక్కడి ప్రశాంత అందాన్ని చూడడానికి ఉత్తమ సమయం. శ్రీవారి ఆలయ ప్రదేశానికి ఎక్కువ దూరంలో ఉన్నందున ఇక్కడకు నడవటం కష్టం, కావున అందుబాటులో ఉన్న బస్సులను లేదా టాక్సీలను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు.

2016 సంవత్సరంలో నేను తెలుగు వికీపీడియాలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు రోజుకో విజ్ఞాన వ్యాసమును సృష్టించడం జరిగింది. ఈ వ్యాసం ఆగస్టు 19, 2016 న నేను 2048 బైట్లతో సృష్టించాను. మొలక వ్యాసమని తొలగించడానికి ఇది మొలక వ్యాసం కూడా కాదు. ఈ వ్యాసం తొలగింపు YVSREDDY వ్రాసిన వ్యాసాల తొలగింపు కుట్రలో ఒక భాగం. YVSREDDY (చర్చ) 06:43, 10 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల విస్తరణ ప్రాజెక్టు గురించి వైవియెస్ రెడ్డి గారి ఆరోపణలు

[మార్చు]

"మొలకల విస్తరణ పేరుతో వ్యాసాల తొలగింపు కార్యక్రమం చేపట్టిన ఇటువంటి కార్యక్రమాన్ని ఇతర వికీపీడియాలో కాదు కదా ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి కార్యక్రమాన్ని చూసి వుండరు, చూడబోరు." అని పైన చర్చలో YVSREDDY గారు రాసారు. అది చదివిన వాళ్ళలో ఆ ప్రాజెక్టు గురించి తెలిసినవాళ్ళు బహుశా ఆయన ఆరోపణను పట్టించుకోకపోవచ్చు గానీ, ఆ ప్రాజెక్టు గురించి తెలియనివాళ్ళు ప్రాజెక్టు గురించి అపార్థం చేసుకునే ప్రమాదం ఉందని భావించి ఇది రాస్తున్నాను. వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు గురించిన కొన్ని విశేషాలివి:

  • జరిగిన కాలం: 3 నెలలు. (2020 జూన్ 1 నుండి 2020 ఆగస్టు 31 వరకు)
  • పాల్గొన్న వాడుకరుల సంఖ్య: 19
  • ప్రాజెక్టు మొదలుపెట్టేనాటికి తెవికీలో ఉన్న మొత్తం మొలకల సంఖ్య: 6,400
  • ప్రాజెక్టు ముగిసేనాటికి ఉన్న మొలకల సంఖ్య: 3,492
  • ప్రాజెక్టులో విస్తరించిన మొలకల సంఖ్య: 2,782 (లక్ష్యంగా పెట్టుకున్నది 2,000) అంటే 43% పైగా మొలకలను విస్తరించారు. ఇందులో విలీనాలు దారిమార్పులను కలపలేదు.
  • విస్తరించాక వ్యాసానికి ఉన్న సగటు పరిమాణం: లక్ష్యం 5,120 బైట్లు కాగా సాధించినది 5,687 బైట్లు
  • మరొక్క సంగతి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టే ముందు ఆ 6,400 మొలకలన్నీ ఒకే వర్గంలో ఉండేవి. వాటిని వ్యాస విషయం వారీగా 40 వేరువేరు వర్గాల్లోకి విభజించి, ప్రాజెక్టు పని కోసం సానుకూల పరచారు.
  • ఇంకో విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వాడుకరులు తమ పని పట్ల సంతృప్తి చెందడంతో ఊరుకోలేదు. ప్రాజెక్టు అమలులో జరిగిన లోపాలు, చేసిన లోటుపాట్ల గురించి కూడా మాట్లాడుకున్నారు. అవి వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/సమీక్ష పేజీలో చూడవచ్చు.

ఈ ప్రాజెక్టు సాధించినదేంటో మరింత వివరంగా తెలుసుకోవాలంటే ప్రాజెక్టు తుది నివేదిక చూడవచ్చు.

ఈ ప్రాజెక్టు పెట్టుకున్న లక్ష్యాలను సమధికంగా అధిగమించింది. మొత్తం వికీలో ఉన్న 6400 మొలకల్లో 43% పైగా మొలకలను విస్తరించిన ప్రాజెక్టు అది. వివిధ కారణాల వలన విలీనం/దారిమార్పు/తొలగింపులు చేసినవి మరొక 200 వరకు ఉండవచ్చు. వాటిలో అనుచితం అనుకున్నవాటి పట్ల అభిప్రాయం చెప్పవచ్చు, తొలగింపును వ్యతిరేకించవచ్చు. అంతేగానీ అసలు ఆ ప్రాజెక్టునే వ్యాసాల తొలగింపు కార్యక్రమం అని చెప్పడం సముచితంగా లేదు, నేను ఆ అభిప్రాయాన్ని ఖండిస్తున్నాను. పోతే, ప్రపంచంలో మరే వికీలోనైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా, అందులో 43% పైగా మొలకలను విస్తరించారా అనేది నాకు తెలవదు, రెడ్డి గారికి తెలుసనుకుంటాను. ఆయనే చెప్పాలి మరి. __చదువరి (చర్చరచనలు) 10:06, 10 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టుపై వైవీయస్ రెడ్డి గారి అభిప్రాయాన్ని ఖండిస్తూ, చదువరి గారు పైన ప్రస్తావించిన వాటితో ఏకీభవిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:22, 10 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]