గోగర్భం డ్యాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోగర్భం డ్యాం (గోగర్భం ఆనకట్ట) (Gogarbham dam) అనేది తిరుమల నివాసితులకు నీరు సరఫరా చేసే జలాశయాల యొక్క ఒకటి. ఈ జలాశయం దేశంలో అత్యంత పుణ్యకేత్రమైన శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైవున్న తిరుమలలోని కొండ పైభాగాన పాప వినాశనము వద్ద ఉంది. ఈ జలాశయ జలపాతం పచ్చని పర్వతాల మధ్యనున్నది, ఈ ప్రదేశానికి చేరుకున్న యాత్రికులు ఇక్కడి సౌందర్యానికి ముగ్ధులవుతారు. ఈ ప్రదేశం వద్ద నీటిని ఆపటం వలన తిరుమలకు మంచి నీటి వనరు సమకూరింది. గాలిమరల జంట అక్కడి అందమైన సెట్టింగులు, అందమైన చెట్లు, కొండలు ఫోటోగ్రాఫర్లకు మంచి కనువిందునిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం ఇక్కడి ప్రశాంత అందాన్ని చూడడానికి ఉత్తమ సమయం. శ్రీవారి ఆలయ ప్రదేశానికి ఎక్కువ దూరంలో ఉన్నందున ఇక్కడకు నడవటం కష్టం, కావున అందుబాటులో ఉన్న బస్సులను లేదా టాక్సీలను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు.

మూలాలు

[మార్చు]