Jump to content

తుంబుర తీర్థం

వికీపీడియా నుండి
తుంబురుడు

తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో 'తుంబుర తీర్థం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది.[1]

తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబురతీర్థం. తుంబురుడి పేరుమీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసానదశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికీ అక్కడ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబురతీర్థం ఏర్పడింధి[2]. ఫాల్గుణ పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతిస్తారు.

పూర్వం 'తుంబురుడు' అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్ధించాడట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానమాచరించమని వాళ్లు సెలవివ్వడంతో, అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడట. 'తుంబురుడు' మోక్షాన్ని పొందిన తీర్థం కనుక, ఈ తీర్థానికి 'తుంబుర తీర్థం' అనే పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్లిన భక్తులలో కొందరు, ఈ తీర్థానికి చేరుకుని అందులో స్నానమాచరిస్తుంటారు[3].  

మూలాలు

[మార్చు]
  1. "పాపాలను హరించే తుంబుర తీర్థం." ap7am.com. Retrieved 2020-05-10.[permanent dead link]
  2. ttdj. "తిరుమల తుంబుర తీర్థంలో శ్రీవారి సాక్షాత్కారం... 23న తుంబుర తీర్థ స్నానాలు... టిటిడి ఏర్పాట్లు". telugu.webdunia.com. Retrieved 2020-05-10.[permanent dead link]
  3. జె. "సర్వపాపహరణం తుంబుర తీర్థం.. ఎక్కడుంది?". telugu.webdunia.com. Retrieved 2020-05-10.[permanent dead link]