తిరుమల పూలంగి సేవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పూలంగి సేవ తిరుమల శ్రీనివాసునికి జరిగే సేవ. గురువారం నాడు సాయంకాల పూజానంతరం పానకం, వడపప్పు నైవేద్య సమర్పణానంతరం స్వామికి వెల్వెట్ గౌను వంటి వస్త్రాన్ని తొడుగుతారు. ఆపాద మస్తకం వివిధ రకాలైన పువ్వుల దండలతో అందంగా అలంకరిస్తారు. ఇలా పూలతో అలంకరించడం వలన ఈ సేవను పూలంగి సేవ అని అంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి ఏకాంత సేవను ప్రారంభిస్తారు.

ప్రాచీన తమిళ వాజ్మయానికి చెందిన శిలప్పదికారంలో 'పూవాడయిల్ పొలిందు తోన్ఱియ' అనే వాక్యం ఉంది. పూవడై అనే పదం తెలుగులో పూలంగి అనే పదానికి తమిళీకరణం. కాబట్టి ఎనిమిదవ శతాబ్దం నాటికే ఈ పూలంగి సేవ వ్యవహారంలో ఉన్నట్లు భావించవచ్చును.