Jump to content

పూల బావి

వికీపీడియా నుండి
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావినే పూలబావి అంటారు.

స్వామి వారు ఏకాంతంలో వుండగా తొండమాన్ చక్రవర్తి రావడంతో సిగ్గుపడిన దేవేరులు హడావుడిపడి శ్రీదేవి (లక్షీ దేవి) శ్రీవారి వక్షస్థలం చేరుకోగా, భూదేవి దగ్గరలో వున్న భావి లోనికి వెళ్ళి అంతర్దానమయ్యిందట. ఈ కథను విన్న రామానుజులవారు స్వామివారికి సమర్పించి తీసివేసిన పూలమాలల్ని (మాలిన్యాన్ని) ఈ భావిలో సమర్పించాలని కట్టడి చేసారు. తీసివేసిన పూలను వేసేవారు కాబట్టి ఈ భావిని పూలబావి అనడం వాడుకలోనికి వచ్చింది. ఆనాటినుండి ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే సేవల్లోను విశేషంగా పుష్పాలంకరణ జరుగుతతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవటం జరుగుతోంది.

ఈ పూలబావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది. ఆ తరువాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురుబావి వలె పునర్నిరమింపబడింది. ఇటీవల ఈ బావిపై ఇనుపకడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ttdj. "తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!". telugu.webdunia.com. Retrieved 2020-08-28.
"https://te.wikipedia.org/w/index.php?title=పూల_బావి&oldid=3279619" నుండి వెలికితీశారు