ఉగ్ర శ్రీనివాసుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఉగ్ర శ్రీనివాసుడు స్వామి వారి ఆగ్రహదశను సూచిస్తుంది. మూలబేరం తరువాత ప్రాచీనకాలానికి చెందిన తొలి విగ్రహం ఇదియే అయి ఉంటుంది. ఈ విగ్రహాన్నే స్నపన బేరం అని కూడా అంటారు. ఈ విగ్రహం దాదాపు 18 అంగుళాల ఎత్తు కలిగి రమారమి 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలువబడి ఉంటుంది. ధృవబేర, కౌతుకబేర, బలిబేరాలకు భిన్నంగా ఈ విగ్రహం నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి, భూదేవుల ప్రతిమలతో కలసి ఉంటుంది.

తమిళ పర్యాయపదమైన 'వెంకట తురైవార్' అన్న పేరును బట్టి భోగ శ్రీనివాసుడు ప్రతిష్ఠ జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉండేదని తెలుస్తుంది. 14వ శతాబ్దానికి ముందు ఉత్సవ విగ్రహంగా ఉపయోగించేవారు. ఒకసారి ఈ విగ్రహం ఊరేగింపుగా వెళ్ళినప్పుడు అగ్నిప్రమాదం జరగడం వల్ల అప్పట్నుంచీ ఈ విగ్రహంపై సూర్యకిరణాలు పడనివ్వరు. ఏడాదికి ఒక్కసారి సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసుని అన్ని అలంకారాలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి, గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోతారు.[1] ఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్రశ్రీనివాసుని ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణేతిహాసం తెలుపుతోంది.

మూలాలు[మార్చు]

  1. పి.వి.ఆర్.కె, ప్రసాద్. సర్వసంభవామ్ (10 ed.). ఎమెస్కో. p. 62.
  • తిరుమల ఆలయము (ధారావాహికం-41), ఆంగ్లమూలం: డా.రమేశన్, తెలుగు అనువాదం: డా.కోరాడ రామకృష్ణ, సప్తగిరి మాసపత్రిక ఏప్రిల్ 2006 లో ప్రచురించిన వ్యాసం నుండి.