పాండవ తీర్థం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్రౌపదితో పాండవులు - రాజా రవివర్మ చిత్రం.

పాండవ తీర్థం తిరుమలలో ఉంది. దీనికే గోగర్భ తీర్థమనీ పేరుంది. వేంకటేశ్వరాలయానికి ఈశాన్య దిశలో మైలు దూరంలో ఉన్న పాండవతీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాదికాలం నివసించారని ఐతిహ్యం. వైశాఖమాసంలో శుక్లపక్ష ద్వాదశిరోజు, అదీ ఆదివారం అయితే, పాండవతీర్థంలో స్నానం చేయటంకానీ లేదా కృష్ణపక్ష ద్వాదశీ మంగళవారం నాడు స్నానం చేయటంకానీ మంచిదని భక్తులు భావిస్తారు. ఆ రెండు రోజులూ స్నానం చేయటం సకల శ్రేష్ఠం.

  • తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ దూరంలో పాండవ తీర్ధం ఉంది. పాండవులు ఈ తీర్ధంలో స్నానం చేయడం వల్ల పాండవ తీర్ధం.ఈ స్నాన ఫలం వల్ల పాండవులకు సమర విజయం., రాజ్య ప్రాప్తి కలిగిందని వరహః పురాణం చెబుతుంది.

జ్ఞాతులయిన కౌరావులను చంపడం వల్ల కలిగిన పాపాన్ని పాండవులు ఈ తీర్ధస్నానంవల్ల పోగొట్టుకోన్నారని పద్మ పురాణం విశాదికరిస్తుంది 20 వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మ విద్యావ్యాపకుడుగా ప్రసిద్ధి వహించిన శ్రీ మలయాళ స్వాములవారు ఏర్పేడు ఆశ్రమం స్థాపించడానికి ముందు ఈ ప్రాంతంలోనే కఠనమయిన తపస్సు చేశారు.తిరుమల తిరుపతి దేవస్తానం వారు అనుమతించగా ఏర్పేడు వ్యాసాశ్రమంవారు అందమయిన భవన నిర్మాణం ఇక్కడ చేపట్టారు వృషభరాశిలో సూర్యుడు సంచరించే వేళా శుక్ల పక్షంలో గాని కృష్ణపక్షంలోగాని, ద్వాదశి తిదిలో ఆది, మంగళవారాలలో ఈ తీర్ధంలో స్నానం చేయడం పవిత్రమని, ప్రశస్తామని పెద్దలంటారు