Jump to content

కుమారధారాతీర్థం

వికీపీడియా నుండి
తిరుమల కొండల్లో కుమారధారాతీర్థం వెళ్లుటకు మార్గం

కుమారధారాతీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో, సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాఘ పౌర్ణమినాడు ఈ తీర్థంలో పవిత్రస్నానం పరమ పుణ్యప్రథమంటారు. ఆనాడు అక్కడ, స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచటం మరో విశేషం. కుమారస్వామి ఇక్కడే శ్రీవారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధారాతీర్థమన్న పేరు వచ్చింది.

తారకాసురుడు అనే రాక్షసుడిని చంపిన తరువాత విష్ణువు తపస్సు చేసిన ప్రదేశం కుమారధార తీర్థం అని నమ్ముతారు. తనకు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి ఈ తీర్థంలో స్నానమాచరించాడని కథనం.

విష్ణు భక్తుడు కొండలలో దారి తప్పి ధ్యానం చేయడం ప్రారంభించాడని కూడా నమ్ముతారు. విష్ణువు తన ముందు ప్రత్యక్షమై ఈ చెరువులో స్నానం చేయమని కోరాడు. ఈ పవిత్ర తీర్థంలో స్నానంచేసిన మనిషిని పదహారేళ్ళ బాలుడిగా మార్చింది కనుక దీనిని కుమార తీర్థం అని పిలువబడింది.[1]

మూలాలు

[మార్చు]
  1. "kumaradhara theertham Tirumala - History, Location, Direction". Tirupati Tirumala information (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-10.