Jump to content

తిరుమల శాసనాలు

వికీపీడియా నుండి
తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

తిరుమల శాసనాలలో క్రీస్తుశకం 830 వ సంవత్సరంలో పల్లవ రాజైన విజయదంతివర్మన్‌ శాసనం అతి ప్రాచీన మైనదిగా గుర్తింపు పొందింది.

అందులో పల్లవరాజు సామంతుడైన ఉళగప్పేదుమానార్‌ అనే వ్యక్తి తిరుమల నిత్య దూపదీప నైవేద్యాల కోసం 30 కళంజముల బంగారం చెల్లించినట్లు తెలుస్తున్నది.

తిరుమలేశుని దివ్య చరిత్ర ఆధునీకులకు తెలియచేయడంతో శాసనాలు నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనది.

పుస్తక రూపం

[మార్చు]

తరతరాలుగా ఆలయ ప్రాకారాల పైన స్తంభాల పైన, గోపురాల పైన కనిపించిన శాసనాలకు పుస్తక రూపం కల్పించే ప్రయత్నం 1920 వ సంవత్సరంలో మొదలైంది.

తిరుమలేశుని ఆలయ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన మహంతు ప్రయాగదాసు శాసనాలకు అక్షర రూపం కల్పించడానికి శ్రీకారం చుట్టారు.

ఆయన హయాంలో స్వర్గీయ సాధుసుబ్రమణ్యం శాస్త్రి 1922 నుంచి 1933 వరకు విశేష కృషి చేసి శాసనాలలోని అంశాలను ఆంగ్లభాషలో తర్జమా చేశారు.

ఆ అంశాలకు మహంతుప్రయాగదాసు పుస్తక రూపం కల్పించడానికి తొలిసారిగా కృషి చేశారు.


శాసనాల సంఖ్య

[మార్చు]

తిరుమలలో లభించిన 640 శాసనాలు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో లభించిన 340 శాసనాలు, వివిధ ఆలయాలలో లభించిన 170 శాసనాల చొప్పున మొత్తం 1150 శిలాశాసనాలను టీటీడీ భద్ర పరిచింది.

ఆ శాసనాలలో పల్లవులు, చోళులు, పాండ్యుల కాలానికి 236 శాసనాలు శాళువనరసింహరాయలు కాలం నాటి 169 శాసనాలు, అచ్యుతరాయలు కాలం నాటి 251 శాసనాలు,

సదాశివరాయల కాలం నాటి 130 శాసనాలు, అరవీడు రాజవంశానికి చెందిన కాలంనాటి 135 శాసనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు తమిళంలో, కొన్ని తెలుగు, కన్నడ భాషలలో ఉన్నాయి.

ఆలయ ప్రాకార నిర్మాణంలో తెలుగు శిల్పులే కీలక పాత్ర వహించారన్నది కూడా శాసనాల ద్వారా తెలిసింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]