పాప వినాశనం (తిరుమల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాపవినాశనము వద్ద స్నానం చేస్తున్న భక్తులు

పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది . శ్రీ వెంకటేశ్వర స్వామీ వారు స్వయముగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు. ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పబడుతోంది. ఈ తీర్థం స్నానం వద్ద చేయుటవలన అత్యంత పుణ్యం లభిస్తుంది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాడ విశ్వాసం . ఆకాశ గంగలో స్నానం ఆచరిస్తే పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.[1]

ఉచిత బస్సు సౌకర్యం

[మార్చు]

పాప వినాశనము చూసేందుకు టి టి డి వారు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. టాక్సీలో వెళ్ళే సౌకర్యము కూడా ఉంది. CRO దగ్గర వున్న కళ్యాణి సత్రం (choultry ) నుండి APSRTC బస్సులు ప్రతి 2 ని. ఒకటి ఉన్నాయి.

చుట్టు ఉన్న పరిసరాలు

[మార్చు]

జాబాలి తీర్థం

తిరుమలలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఈ తీర్థం ఉంది. ఇక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం చూడవచ్చు. జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు దర్శనమిచ్చినట్టు చెబుతారు. శ్రీరాముడు వనవాసంలో భాగంగా సీతమ్మవారు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్లతో ఇక్కడ కొంత కాలం ఉన్నారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

శేషతీర్థం, పురాణ చరిత్ర

సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడు ఆదిశేషుడు (నాగేంద్రుడు) రూపంలో కొలువై ఉన్న తీర్థం ఇది. తిరుమల పాపవినాశనం డ్యామ్ నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో కొంతదూరం ప్రయాణించడం ద్వారా చేరుకోవచ్చు. ఈ తీర్థాన్ని చేరుకోవాలంటే నీటి ప్రవాహాలను దాటాల్సి ఉంటుంది. చివరిగా పది మీటర్ల వ్యాసార్థంతో కూడిన పెద్ద తీర్థం ఉంటుంది. ఈత బాగా వచ్చిన వారు ఇందులోకి దిగి కొంత మేర లోపలికి వెళ్లినట్టయితే అక్కడ ఆదిశేషుడి శిలారూపాన్ని దర్శించుకోవచ్చు. ఈత రాని వారు గాలి నింపిన వాహనాల ట్యూబులు, తాడును రక్షణగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. గైడ్ సహకారం తప్పనిసరి. ఎందుకంటే అటవీ ప్రాంతం... శేష తీర్థంలో పేరులో ఉన్నట్టుగానే నాగు పాములు ఈ తీర్థంలో, చుట్టు పక్కల సంచరిస్తుంటాయి. కనుక తెలియకుండా వెళ్లి అపాయాన్ని కొని తెచ్చుకోకుండా గైడ్ సాయం తీసుకుని వెళ్లడం మంచిది.

ఒకరోజు శ్రీ మహావిష్ణువుకు బాగా దాహం వేసింది. దాంతో జలాన్ని తీసుకురావాలని గరుత్మంతుడ్ని పురమాయించారు. కానీ ఆయన ఎంత సేపు అయినా నీరు తేకపోవడంతో అప్పుడు స్వామివారు ఆదిశేషుడ్ని కోరతారు. దీంతో ఆదిశేషుడు జలాన్ని తన తోక ద్వారా రప్పించి స్వామి వారి దాహం తీర్చారని, అందుకే ఇది శేష తీర్థం అయ్యిందని పురాణ చరిత్ర.

వ్యాసుడు పాప వినాశనము వైభవాన్ని

[మార్చు]

మహాభారతం రచించిన వ్యాసుడు ఇలా వర్ణించాడు.

వేతాల వరదే తీర్థే నరః స్నాత్వాద్వి జోత్తమాః

తతఃశ నైః శ నైర్గచ్చేత్‌ గంధమాదన పర్వతం

యోంzబుధౌ సేతురూపేణ వర్తతే గంధమాదన ః

సమార్గో బ్రహ్మలోకస్య విశ్వకర్త్రా వినిర్మతః

లక్షకోటి సహస్రాణి సరాంసిసరితస్తథా

సముద్రాంశ్చ మహాపుణ్యావనాన్య ప్యాశ్రమానిచ

పుణ్యాక్షేత్ర జాతాని వేదారణ్యా దికానిచ

మునయశ్చవసిష్ఠాద్యాః సిద్ధచారణ కిన్నరా ః

లక్ష్య్మాసహాధరణ్యాచ భవాన్‌ మధుసూదన ః

సావిcత్యాచ సరస్వత్యా సహైవచతురానన

హెరంబః షణ్ముఖశ్చైవ దేవాశ్చేంద్ర పురోగమాః

అదిత్యాది గ్రహాశ్చైవ తథాష్టౌవసవోద్విజాః

పితరోలోక పాలాశ్చతథాన్యే దేవతాగణాః

మహాపాతక సంఘానాం నాశ నేలోకపావనే

దివానిశం వసంత్యత్ర పర్వతే గంధమాదనే

అత్రగౌరీ సదాతుష్టా హరేణ సహవర్తతే

అత్రకిన్నర కాంతానాం క్రీడా జాగర్తి నిత్యశః

త స్యదర్ర్శనమాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్

తన్మూర్థకృతావాసా ః సిద్ధ చారణయోషితః

పూజయంతి సదాకాలం శంకరం గిరిజాపతిం

కోటయో బ్రహ్మ హత్యానాం అగమ్యాగమ కోటయః

అంగలగ్నైఃవినశ్యంతి గంధమాదన మారుతైః

అసాపుల్లాలకల్లోలేతిష్ఠన్మథ్యే మహాంబుధౌ

ఆ సీన్ముని గణౖః సేవ్యః పురావై గంధమాదనః

తతోనలేన సేతౌత బద్ధే తన్మధ్యగోచర ః

రామాజ్ఞయాఖిలైఃసేవ్యో బభూవ మనుజైరపి

శ్రీసూతులిట్లనిరి -

ఓబ్రాహ్మణులారా ! వేతాల వరదతీర్థమందు నరులు స్నానంచేసి, పిదప మెల్లమెల్లగా గంధమాదన పర్వతమునకు వెళ్ళాలి. సముద్రమందు సేతురూపంగా గంధమాదనముంది. ఆ మార్గమును, బ్రాహ్మలోకమునకు విశ్వకర్తనిర్మించాడు .లక్షకోటి సహస్రముల సరస్సులు నదులు పుణ్యప్రథమైన సముద్రములు, వనములు, ఆశ్రమాలు పవిత్రమైన క్షేత్ర సముహములు, వేదారణ్యాదికములు, విసష్ఠాదిమునులు, సిద్ధచారణ కిన్నరులు లక్ష్య్మిభూదేవిలతో కూడిన విష్ణుమూర్తి, సావిత్రి సరస్వతులతో కూడిన బ్రహ్మ, గణపతి కుమారస్వామి ఇంద్రుడు మొదలుగా గల దేవతలు, అదిత్యాది గ్రహములు, ఎనిమిది మంది పుసువులు పితరులు, లోకపాలురు, ఇతర దేవతాగణములు, మహాపాతక సంఘములను నశింపచేసే, లోకపావనమైన గంధమాదన పర్వతమందు రాత్రింబవళ్ళు నివసిస్తున్నారు. ఇక్కడ గౌరీదేవి శివునితో కూడి ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడూ కిన్నర కాంతల క్రీడ జరుగుతూ ఉంటుంది . దానిని చూచినంత మాత్రంలోనే నరులకు బద్ధి సౌఖ్యం కల్గుతుంది దాని మూర్థమందు సిద్ధచారణ స్త్రీలు నివసిస్తూ గిరిజాపతియైన శంకరుని ఎల్లకాలము పూజిస్తూ ఉంటారు కోట్లకొలది బ్రహ్మహత్యలు, కోట్లకొలది చేయరాని అక్రమ సంబంధాలు వీటి పాపం, గంధమాదనపు గాలులు శరీరానికి తగిలినంతలో పోతుందిఇది అత్యధికంగా కల్లోలమైన సముద్రం మధ్యలో ఉండి, పూర్వం ఈ గంధమాదనము మునిగణములతో సేవింపబడుతుండేది పిదప నలుడు సేతువు నిర్మించాక దాని మధ్య కన్పిస్తూ రామాజ్ఞతో సమస్తమనుజులతో కూడా సేవించతగిందిగా ఐంది .

సేతురూ పంగిరింతంతు ప్రార్థయేత్‌ గంధమాదనం

క్షమా దరమహాపుణ్య సర్వదేవ సమస్కృత

విష్ణ్వాదయోపి యందేవాః సేవంతే శ్రద్ధయాసహ

తం భవంతమహం వద్య్భాం ఆక్రమామినగోత్తమ

క్షమస్వపాదఘాతం మేదయయాపాపచేతన ః

త్వస్మూర్థనికృతా వాసంశంకరం దర్శయస్వమే

ప్రార్‌ థయిత్వాసరస్త్వే వంసేతురూపంనగోత్తమం

తతోమృదుపదంగచ్చేత్‌ పావనంగంధమాదనం

అబ్ధౌతత్రనరః స్నాత పర్వతే గంధమాదనే

పిండదానంతతః కుర్యాత్‌ అపి సర్షపమాత్రకం

తృప్తిం ప్రయాంతి పితర ః తస్యయావద్యుగక్షయః

శమదల సమానాన్వాదద్యాత్‌ పిండాన్‌ పితృన్‌ ప్రతి

స్వర్గస్థామోక్షమాయాంతి స్వర్గం నరకవాసిన ః

తతస్తస్యో పరిమాహాతీర్థంలోకేషు విశ్రుతం

సర్వతీర్థోత్తమంపుణ్యం నామ్నాపాపవినాశనం

అస్తిపుణ్యతమం విప్రాః పవిత్రేగంధమాదనే

యస్య సంస్మరణాదేవ గర్భవాసోన విద్యతే

తత్ర్పాప్యతునర ః స్నాయాత్‌ స్వదేహ మలనాశనం

తత్రస్నానాన్నరోయాతి వైకుంఠం నాత్ర సంశయంః

తాll సేతురూపైన ఆగంధమానద పర్వతాన్ని ప్రార్థించాలి..."

ఓ క్షమాధర ! మహాపుణ్య ! సర్వదేవతలచే నమస్కరింపబడేదాన ! విష్ణ్వాది దేవతలు కూడా శ్రద్ధతో సేవించే నిన్ను నేను పాదములతో ఆక్రమిస్తున్నాను. ఓ పర్వత శ్రేష్ఠమో ! పాప చేతస్కుడనైన నా పాదఘాతాన్ని దయతో క్షమించు. నీ శిరమందు నివాసమున్న శంకరుని నాకు చూపంచు ఈ విధముగా సేతురూపమైన పర్వతశ్రేష్ఠమును నరుడు ప్రార్థించి, పిదప అడుగులు మెల్లగా వేస్తూ పవిత్రమైన గంధమాదనంపై వెళ్ళాలి, గంధమాదన పర్వతమందలి సముద్రపు నీటిలో నరుడు స్నానం చేసి అవగింజమాత్రమైనా పిడదానం చేయాలి. యుగాంతమువరకు పితరులు తృప్తినందుతారు, శమీదలంతో సమానమైన వానినైనా పిండములను పితరుల గూర్చి ఇవ్వాలి స్వర్గమందున్న వారు మోక్షానికి వెళ్తారు. నరకమందున్న వారు స్వర్గానికి వెళ్తారు. పిదప దానిపైన లోకంలో ప్రసిద్ధమైన గొప్ప తీర్థము సర్వ తీర్థములలో ఉత్తమమైనది పుణ్యప్రథమైనది పాపనాశనము పేరుగలది పుణ్యతమమైనది పవిత్రమైన గంధమాదనంలో ఉంది దానిని స్మరించిన మాత్రం చేతనే గర్భవాసము (జన్మ) ఉండదు. తమదేహమలాన్ని నశింపచేసే అక్కడికివెళ్లి నరుడు స్నానమాచరించాలి. అక్కడ స్నానం చేసి నరుడు వైకుంఠాన్ని పొందుతాడు అనుమానం లేదు మూll ఋషయ ఊ చుః-

సూతపాపవినాశాఖ్యతీర్థస్య బ్రూహివైభవంlవ్యాసేన బోధితస్త్వంహి వేత్సిసర్వం మహామునే

శ్రీసూత ఉవాచ-

బ్రహ్మాశ్రమపదే వృత్తాం పార్శ్వే హిమవతఃశుభే

వక్ష్యమిబ్రాహ్మణశ్రేష్ఠాః యుష్మాకంతుకథాంశుభాం

అస్యాశ్రమపదం పుణ్యం బ్రహ్మశ్రమపదే శుభే

నానా వృక్ష్యణాకీర్ణం పార్వ్యే హి మవత ః శుభే

బహుగుల్మలతాకీర్ణం మృగ ద్విపనిషేవితం

సిద్ధచారణ సంఘుష్టం రమ్యం పుష్పితకాననం

వృతిభి ః బహుభిః కీర్ణం తాపసైరుప శోభితం

బ్రాహ్మణౖశ్చమహాభాగై ః సూర్యజ్వలన సంనిభైః

నియమవత్రనంపన్నైః సమాకీర్ణం తపస్విభిః

దీక్షితైః యాగహె తోశ్చయ తాహారై ఃకృతాత్మభిః

వేదాధ్యయన సంపన్నైః వైదికైః పరివేష్టతం

వర్ణిభిశ్చ గృహస్థైశ్చ వానప్రస్థైశ్చభిక్షుభిః

స్వాశ్రమాచారనిరతైః స్వపర్ణోక్తవిధాయిభి ః

వాలఖిల్యైశ్చమునిభిః సంప్రాపైశ్చమరీచిభిః

తత్రాశ్రమే పురాకశ్చిత్‌ శూద్రో దృఢమతిర్ద్విజాః

సాహపీ బ్రాహ్మణాభ్యాశం ఆజగామముదాన్వితః

అగతోహ్యాశ్రమపదం పూజితశ్చతవస్విభి ః

నామ్నాదృఢమతిః శూద్రః సాష్టాంగం ప్రణనామవై

తాన్సదృష్ట్యామునిగణాన్‌ దేవకల్పాన్‌ మహౌజసః

కుర్వతో వివిధాన్‌ యజ్ఞాన్‌ సంప్రహృష్యచశూద్రకః

అథాస్యబుద్ధి రభవత్‌ తపః కర్తుమసుత్తమం

తతోzబ్రవీత్‌ కులపతిం మునిమాగత్యతాపనం

తాll ఋషులిట్లనిరి -..

ఓసూత! పాపవినాశమనే పేరు గల తీర్థముయొక్క వైభవాన్ని చెప్పండి. మీకు వ్యాసుడు అన్ని బోధించారు. ఓముని మీకంతా తెలుసు .అని శ్రీసూతులిట్లన్నారు - హిమవత్‌ పర్వతం యొక్క పార్శ్వ భాగంలో బ్రహ్మ ఆశ్రమపదంలో జరిగిన శుభ మైన కథను మీకు చెబుతున్నాను ఓబ్రాహ్మణ శ్రేష్ఠులారా! వినండి హిమవంతుని పార్శ్వ భాగంలో బ్రహ్మ అశ్రమ పదంలో ఈతని అశ్రమమపవిత్రమైంది అనేక వృక్షముల సమూహంతో నిండింది అనేక పొదలతో తీగలతో నిండింది . మృగములతో ఏనుగులతో సేవింపబడేది సిద్ధులతో చారణులతోకూడింది. అందమైనది పూలతోనిండిన అడవి కలది ఎన్న తగినవారెందరితోనో కూడింది . తాపనులతో శోభిస్తుంది . సూర్యుని వెలుగులా ఉండే మహానుభావులైన బ్రాహ్మణులతో నిండింది నియమవ్రతములు గల తపస్వులతో నిండింది . యాగకారణంగా దీక్షితులైన వారితో స్థిరమైన ఆత్మకలవారితో నియతమైన ఆహారం కలవారితో నిండింది. వేదాధ్యయనముతో కూడిన వైదికులతో చుట్టబడింది. బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు, భిక్షులు తమతమ ఆశ్రమములకు తగిన ఆచారములందు ఆసక్తి గలవారు, తమ వర్ణములకు చెప్పిన దానిని ఆచరించేవారు, వాల ఖిల్యమునులు, మరీచులు వీరందరితో కూడింది ఈ ఆశ్రమ పదము.

మూలాలు

[మార్చు]

ఇది కూడ చూడు

[మార్చు]