Jump to content

జాబాలి తీర్థం

వికీపీడియా నుండి
తిరుమల కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

జాబాలి మహర్షి కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన పరమ పవిత్ర దివ్య క్షేత్రం జాబాలి.[1] జాబాలి మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి, తపస్సు సాధన చేశాడు. ప్రస్తుతంతిరుపతి సమీపంలోని ప్రదేశానికి "జాబాలి తీర్థం" [2] అని పిలుస్తారు.

విశేషాలు

[మార్చు]

ఇది చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. స్కందపురాణంలో, వేంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. ఇది తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే దారిలో కొలువై ఉంది. ఇది పాప వినాశం నకు పోవు మార్గం లో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో కనిపిస్తుంది. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడ హనుమంతుడు వెలసి ఉన్నాడు. ఈ ఆలయం సమీపమునక వెళ్లే కొద్ది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి.

పురాణ గాథ

[మార్చు]

ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ ఒకటి ప్రాశస్త్యంలో ఉంది. జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయనారంభిస్తాడు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జాబాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరతయి కనుక జాబాలి తీర్థంగా పేరొందింది.

అయోధ్య కాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్‌ దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాక్‌ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి.

హనుమంతుని ఆలయం

[మార్చు]

అక్కడ వెలసిన హనుమంతుని ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో ఉంటాడు. సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి వారి శిరస్సు పై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "జాబాలి తీర్థం". m.eenadu.net. Retrieved 2020-06-30.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-22. Retrieved 2013-12-28.