తిరుమల సహస్ర దీపాలంకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామివారు, సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేస్తారు. అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్రదీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై, భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో వేదపండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తారు. నాదస్వరవిద్వాంసులు సుస్వరంగా నాదస్వరాన్ని వినిపిస్తారు. అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతోను, పురందర కీర్తనలతోనూ శ్రీవారికి స్వరార్చన చేస్తారు. వేద, నాద, గానాలను ఆలకిస్తూ, మలయప్పస్వామి మెల్లమెల్లగా ఉయ్యాలలూగుతూ భక్తులకు దర్శనమిస్తారు.


శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్[మార్చు]

సహస్ర దీపాలంకరణ సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతిరోజూ సాయంత్రం గం.5.30ని.లకు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.