వీరనరసింహ దేవ గజపతి
వీరనరసింహ దేవ గజపతి, ఒడిషా కేంద్రంగా పాలించిన గజపతి వంశపు పూర్వీకులలో ఒకడు.
తిరుమల
[మార్చు]వీరనరసింహ దేవ గజపతి తిరుమలలో నేడున్న మహాద్వారానికి పునాది వేయించాడు. ఈయన రామేశ్వర యాత్రకు వెళ్తూ తిరుమలలో స్వామిని దర్శించుకొని ఏదైనా కైంకర్యం చేయాలని తలచి, పండితుల సలహా మేరకు రాజగోపురాన్ని నిర్మించడానికి అవసరమయ్యే ధనాన్ని, మనుషులను సమకూర్చి రామేశ్వరం వెళ్ళి, తిరిగివచ్చి దగ్గరుండి నిర్మాణం పనులు చూసుకొంటుండగా ఒక రోజు రాత్రి ఆదిశేషుడు "ఓ వీరనరసింహా! నీవు కట్టిస్తున్న ఈ గోపురము నాకు మిక్కిలి భారమై వుంది. నాకు కలిగిన ఈ బాధను శేషాద్రి శిఖర వాసుడైన శ్రీ వేంకటేశ్వరుడు తీర్ఛవలసిందే కానీ వేరెవరివల్లా కాదు" అని గర్బాలయంలోకి వెళ్ళి స్వామి వారి ఎడమ చేతికి చుట్టుకొన్నట్లు కల వచ్చింది. దానితో ఆదిశేషునికి అపరాధం చేసినట్లు భావించిన గజపతి ఆ నిర్మాణాన్ని అంతటితో ఆపివేసి ఆదిశేషునికి గుర్తుగా ఒక బంగారు నాగాభరణాన్ని చేయించి స్వామివారి ఎడమ భుజానికి అలంకరింపచేసాడు. అలా వేంకటేశ్వరుడు పన్నగభూషణుడు అయినాడు. ఆ తరువాత రామానుజుల వారు రెండవ భుజానికి వేరొక నాగాభరణాన్ని చేయించి అమర్చారు. వీరనరసింహ దేవుడు గోడలవరకూ కట్టించి ఆపివేసిన ఆ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు పూర్తిచేయించాడు.[1]