Jump to content

తిరుమల తెప్పోత్సవం

వికీపీడియా నుండి
వార్షిక తెప్పోత్సవం పండుగ సందర్భంగా, స్వామి పుష్కరణిలో (ఆలయానికి ఉత్తరాన) మధ్యలో ఉన్న మండపానికి భగవంతుడును, శ్రీదేవి, భూదేవిలకు తీసుకొనివచ్చి పూజలు చేస్తపన్న దృశ్యచిత్రం

తిరుమల తెప్పోత్సవం తిరుమలలోని వేంకటేశ్వర స్వామివారి పుష్కరణిలో ప్రతి ఏటా వైభవంగా ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఇది ప్రతి యేటా చైత్రమాసంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే ఉత్సవం.[1] తిరుమల శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి నాడు ముగిసేలా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. తెప్ప అంటే ఓడ. ఓడలో ఆశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారింపజేయడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాళ్‌ అని, తెలుగులో తెప్ప తిరునాళ్లు అనిఅంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నట్టు ఆధారాలు వెల్లడిస్తున్నాయి.

చరిత్ర

[మార్చు]

సాళువ నరసింహరాయలు సా.శ 1468లో పుష్కరిణి మధ్యలో ‘నీరాళి మండపాన్ని’ నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దాడు. సా.శ.15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను ఘనతను కీర్తించాడు.

విశేషాలు

[మార్చు]

ఐదు రోజులు జరిగే ఈకార్యక్రమంలో మొదటి రోజు సీతారాములతో పాటు లక్ష్మణుడుని కూడా పూజిస్తారు. రెండవ రోజు శ్రీకృష్ణుడు, రుక్మిణి పూజిస్తారు. మూడు,నాలుగు, ఐదు రోజులు పూజలు త్రయోదశితో మొదలయ్యి పౌర్ణమితో ముగుస్తాయి. ఈ మూడు రోజుల్లో ఉత్సవ విగ్రమైన మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి పూజింపబడతారు. ఈ ఉత్సవ మూర్తుల్ని అద్భుతంగా అలంకరించి పుష్కరిణి పై ఉన్న ప్రత్యేక తెప్పలపై ఉంచి పూజిస్తారు.[1]

ముందుగా ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు వేంపు చేస్తారు. అనంతరం అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు. మూడో రోజు శ్రీభూసమేతంగా సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలో తెప్పపై ఆశీనులై మూడుసార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. నాలుగో రోజు ఐదుసార్లు, చివరి రోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారని భక్తుల విశ్వాసం.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Tirumala Tirupati Devasthanams (Official Website)". www.tirumala.org. Retrieved 2020-06-30.
  2. "వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. వీటి ప్రత్యేకత ఏంటి?". Samayam Telugu. Retrieved 2020-06-30.

బాహ్య లంకెలు

[మార్చు]