శ్రీవారి కళ్యాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామికి ప్రతినిత్యం కల్యాణోత్సవం జరుగుతుంది. రెండవ అర్చన, గంట, నివేదన పూర్తయిన తర్వాత శ్రీవారి ఉత్సవమూర్తులు సకల రాజమర్యాదలతో తిరుచ్చిని అధిరోహించి, ఆనందనిలయం నుండి సంపంగి ప్రదక్షిణలో గల కల్యాణమండపానికి తరలివస్తారు. 15వ శతాబ్దంలో తాళ్లపాక వంశస్థులచే ఈ కల్యాణోత్సవం ఆరంభించబడినట్లు శాసనాలవల్ల తెలుస్తూంది. తాళ్లపాక వంశస్థులే నేటికీ కన్యాదాతలుగా వ్యవహరించటం గమనార్హం. సర్వజనులు క్షేమ స్థైర్య ధైర్యాదులతో ఉండాలనీ స్త్రీలు ఈ జన్మలోనూ రాబోవు జన్మలోను సువాసినులుగా ఉండాలనే మహాసంకల్పంతో ఏడు కొండలరాయనికి కళ్యాణోత్సవం చేయటం పరిపాటి. ఈ నిత్యకల్యాణం వల్ల్లనే శ్రీవారికి కల్యాణచక్రవర్తి అని, తిరుమల క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నదని ప్రశస్తి ఏర్పడింది.


శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్[మార్చు]

ప్రతిరోజు మధ్యాహ్నం 12గంటల నుండి 1గంట వరకు నిర్వహించే ఈ నిత్యకల్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతిరోజూ ప్రత్యక్షప్రసారం చేస్తోంది.