Jump to content

వకుళా దేవి

వికీపీడియా నుండి
(వకుళామాత దేవాలయం నుండి దారిమార్పు చెందింది)

వకుళా దేవి, కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వేంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి. ఈమె యశోద అవతారంగా చెప్పబడుతున్నది.

తిరుమల గిరులలో వకుళమాత దేవాలయాలు

[మార్చు]

తిరుమల గిరులలో రెండు వకుళమాత దేవాలయాలు ఉన్నాయి.

  1. మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర వున్న మాలాడిగుండం దగ్గర ఉంది.
  2. రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో వున్న పోటు (వంటగది) లో ఉంది. పోటులో వున్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుకుకి కావలసిన తినుభండారాలను శుచిగా, శుభ్రంగా వండిస్తుంది అంటారు.
  • వకుళ మాతే బంగారు తులసీపత్ర హారం (వకుళ మాల) గా మారి శ్రీవారి మెడలో చేరిందని ఒక ఇహిత్యం.

తిరుపతిలో వకుళమాత దేవాలయాలు

[మార్చు]

17వ శతాబ్దానికి చెందిన వకుళమాత ఆలయం తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు గ్రామపంచాయితీ పరిధిలోని పేరూరు కొండపై ఉంది.[1] ఇది తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. శిధిలావస్థలో ఉన్న దేవాలయం స్థానంలో ఇప్పుడు వకుళమాత ఆల‌యాన్ని నిర్మించారు. ఈ నూతన వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్షణ కార్యక్రమాలు 2022 జూన్ 18 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతున్నాయి. 2022 జూన్ 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ ఆవాహన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొని అమ్మవారి తొలిదర్శనం అందుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. Quarry endangers temple[permanent dead link] - Deccan chronicle October 23rd, 2009

భాహ్యా లంకెలు

[మార్చు]