గొల్ల మండపం

వికీపీడియా నుండి
(గొల్ల భక్తురాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో మండపాన్ని నిర్మించింది.

తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో వున్న చిన్న మండపాన్ని కట్టించినది ఒక గొల్లపడుచు. తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలూ, పెరుగూ ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది. ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా, ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా పై నుండి వచ్చిన (బెజవాడ దుర్గమ్మ పంపిన) సొమ్మంతా అయ్యిపోయింది అన్నారట. అప్పుడు ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బుతో కడితే నిలుస్తుంది కానీ, మా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూ, పెరుగూ అమ్మాను ఆ డబ్బును మూడు కొండ రాళ్ళను ఒక దగ్గరకు చేర్చి ఆమధ్యలో దాసుకొన్నాను ఆ డబ్బుతో కట్టండని చెప్పి ఆ డబ్బు వారికిచ్చిందట ఒక మండపము కట్టమని. అలా కట్టినదే తిరుమలేశుని ఆలయము ముందున్న నాలుగు స్థంబాల మండపము. నేటి గొల్ల మండపం.