Jump to content

తెప్ప

వికీపీడియా నుండి

తెప్ప అతి ప్రాచీనమైన చిన్న పడవ. దీన్ని కలప తో గానీ /దూలాలతో కానీ నిర్మిస్తారు.

తెప్ప నిర్వచనం -లక్షణాలు

[మార్చు]
thumb
సన్నటి పొడవయిన తెప్ప

తెప్ప అంటే తరలించేది లేదా దాటించేది అని అర్థం.[1] సామాన్యంగా తెప్పలని చిన్న ఛిన్న కాలువలు దాటటానికి, చెరువులో చేపలు పట్టుకోవడానికి వినియోగిస్తారు. ఇవి కేవలం మనుహులు నడిపేవే. సామాన్యంగా ఒక వ్యక్తే నడుపుతాడు. యంత్రాలతో నడిచే జల వాహనాలు ఈ కోవకు చెందవు. దీనికి ఇదమిద్ధమని ఆకృతి లేదు. సన్నగా పొడుగ్గా గానీ, గుండ్రంగా అర్థ గోళాకారంలో గానీ ఉండవచ్చు. సామాన్యంగా నలుగురు అయిదుగురు కంటే ఎక్కువ ప్రయాణం చేయలేరు. ఎక్కువ మంది, కార్లు, బస్సులు లాంటివి తరలించటానికి బల్లకట్టు ఉపయోగిస్తారు. అవి అనేక పరిమాణాలలో ఉండి ముఖ్యంగా యంత్రాల సాయంతో నడుస్తాయి.

రేఫ్ట్ కి ఉదాహరణ

తెప్ప/తిప్ప శబ్దం వాడుక

[మార్చు]

తెలుగులో తెప్ప శబ్దంతో కొన్ని సామేతలున్నాయి.[2] మైథిలి వేంకటేశ్వర రావు సంకలనం చేసిన తెలుగు సామెతల నుండి కొన్ని సామెతలు.

"ఏరు/ఏటు దాటి తెప్ప తగలబెట్టినట్లు "పేజీ 95
"చేయి అలసిన వేళ తెప్ప దొరకు రీతి "పేజీ 185
" మూల విరాట్టు తిరిపమెత్తుకుంటే ఉత్సవ విగ్రహాలకు తెప్ప తిరుణాళ్ళట" పేజీ 356

దైనందిక వాడుక భాషలో కుప్పలుతెప్పలుగా అన్న శబ్దం ఎక్కువగా, సమృద్దిగా అన్న అర్థంలో వాడుతాం. ఆంధ్ర ప్రదేశ్, తేలంగాణ రాష్ట్రాలలో అనేక ఊర్ల పేర్లు తిప్ప శబ్దంతో ఉన్నాయి. తిప్పర్తి , తిప్పన గుంట, తిప్పారం, తిప్పన్నపేట, తిప్పడంపల్లి, తిప్పపురం లాంటివి.

తెప్పోత్సవాలు

[మార్చు]

తెప్ప అనే శబ్దానికి దాటించుట అని అర్థం చెప్పుకున్నాం. భక్త జనులను ఈ భవ సాగరమయిన సంసార సాగరాన్ని దాటించి, ఆనంద తీరాలకు చేర్చేది. ఆ భగవంతుడు ఒక్కడే అన్న ప్రగాఢ నమ్మకంతో, అనేక దక్షిణ భారత దేశ రాష్ట్రాలలో ఉన్న దేవలయాలల్లో ఉత్సవ విగ్రహాలకు తెప్పోత్సవాలు జరిపించడం అనాదిగా ఉన్న సంప్రదాయం. ఆధునిక కాలంలో ఆ తెప్పలు యంత్రాలతో నడిచే పెద్ద బల్ల కట్టు లాంటి సాధనం గా మారి, ఉత్సవాలు వాటి పై జరుపుతున్నారు.

ఈ తెప్పోత్సవాలలో స్వామి, దేవేరుల ఉత్సవ విగ్రహాలను, దేవస్థానానికి దగ్గరగా ఉన్న పుష్కరిణి, కోనేరు, చెరువుల వద్దకు తీసుకు వెళతారు. మామిడి ఆకుల, పూల తోరణాలతో, రంగు రంగుల పతాకలతో అలంకరించి సిద్ధంగా ఉన్న తెప్పపై స్వామి, అమ్మవార్లను మేళతాళాల మధ్య జలవిహారం చేయిస్తారు. అనంతరం దేవస్థాన ప్రధాన అర్చకులు పర్యవేక్షణలో వేదోక్తంగా ఉపచారాలు , నివేదనలు, హారతులను నిర్వహిస్తారు.[3]

తెప్పోత్సవాలు జరిగే ప్రధాన దేవాలయాలు[4]:

  • తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి
  • మీనాక్షి అమ్మ దేవాలయం, మదురై
  • త్యాగరాజ దేవాలయం, తిరువయూర్
  • సింహాచల క్షేత్రం, విశాఖపట్నం
  • భ్రమరాంబా మల్లికార్జున దేవస్థానం, విజయవాడ
  • కోలారమ్మ దేవాలయం, కోలార్
  • కపాలేశ్వర దేవాలయం, చెన్నై
  • సత్యనారాయణ స్వామి దేవాలయం, అన్నవరం

మూలాలు

[మార్చు]
  1. https://www.eenadu.net/telugu-article/devotional/significance-and-uniqueness-ttd-teppotsavam/1503/123036317
  2. మైథిలి వెంకటేశ్వరరావు. తెలుగు సామెతలు (Telugu Sametalu, Telugu Proverbs).
  3. https://www.eenadu.net/telugu-article/devotional/significance-and-uniqueness-ttd-teppotsavam/1503/123036317
  4. https://en.wikipedia.org/wiki/Theppotsavam
"https://te.wikipedia.org/w/index.php?title=తెప్ప&oldid=4685078" నుండి వెలికితీశారు