Jump to content

తెప్పోత్సవం

వికీపీడియా నుండి
(తెప్పోత్సవాలు నుండి దారిమార్పు చెందింది)
తిరుపతిలో తెప్పోత్సవం

తెప్పను నదిపై ఒక గట్టు నుంచి మరొక వైపు ఉన్న అవతల గట్టుకు మనుషులను, వస్తువులను చేరవేయడానికి ఉపయోగించే పడవ వంటిది. అయితే పడవ ఆకారం రెండు చేతుల యొక్క దోసిలి ఆకారంలో ఉంటే తెప్ప ఆకారం బల్లపరుపుగా ఉంటుంది. ఈ బల్ల పరుపుగా ఉండే తెప్ప మోయ వలసిన బరువును బట్టి బల్ల పరుపు చెక్కల కింద గాలి నింప బడిన (ఖాళీగా ఉండే) డ్రమ్ములకు మూతలు బిగించి తాడుతో గట్టిగా బంధిస్తారు.

ఈ విధంగా తయారు చేసుకున్న తెప్పపై ఉత్సవాన్ని జరుపు కోవడాన్ని తెప్పోత్సవం అంటారు.

ప్రసిద్ధిచెందిన హిందూ దేవాలయాలలో పుష్కరిణిలో గాని లేదా దగ్గరలోనున్న కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు.


ఉత్సవ విగ్రహాలను వివిధ దివ్యాభరణాలు, రంగురంగుల పుష్పమాలికలతో ముస్తాబుచేసి వేద పండితుల మంత్రోచ్ఛాటనలు, భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల మధ్య దేవస్థానం నుండి స్వామి వారి జల విహార ప్రదేశం వరకు ఉత్సవంగా తీసుకుస్తారు.

అనంతరం మామిడితోరణాలు, పూలతోరణాలు, అరటి పిలకలు, వివిధ రంగుల పతాకాలతో ముస్తాబు చేసిన తెప్పపై ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు.

అనంతరం తెప్పలో స్వామికి వివిధ ఉపచారాలు, నివేదనలు, హారతులతో దేవస్థానం ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో వేదోక్తంగా, శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

అనంతరం స్వామిని మేళతాళాల మధ్య తెప్పలో జల విహారం చేయిస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]