Jump to content

బెస్త

వికీపీడియా నుండి
బలిజ వధూవరులు - 1900 ల నాటి ఫొటో

సాంప్రదాయ మత్స్యకారులైన బెస్త, గూండ్ల వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర,పాలూరు,గూండ్ల, నెయ్యల, పట్టపు అనే పేర్లతో కూడా ఈ కులస్తులు పిలువబడతారు.గోదావరి పరీవాహక ప్రాంత్తల్లో చేపలు పట్టుకునే బెస్తలను ఆదిమతెగలకు చెందినవారిగా వ్యాఖ్యానించి బెస్త (తెగ) గా పిలువబడతారు. బెస్తవారు చేపలు పట్టుకొని అమ్ముకుంటారు. చెరువు, కుంటల్లో నీరు ఉంటేనే వీరి పంట పండినట్లు. లేకుంటే కరువొచ్చినట్టే. వరుణుడు కరుణిస్తేనే వీరి బతుకు బాగుంటుంది. గోదావరి పరివాహక ప్రాంతానికి చెందిన బెస్తలు గోదావరిని నమ్ముకొని గోదావరిలో చేపలవేట చేస్తున్నారు.ఎండకాలం గోదావరిలో ఇసుక మెటలు వస్తే చేపల వేట ఆగినట్టే.ఎక్కువగ బెస్త వాళ్లే మత్స్య వృత్తిని చేపడుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో విత్తనాలు వేసి మార్చి నుంచి మే వరకు చేపలను పడతారు. దళారీలు చెరువులను గుత్తకు మాట్లాడుకొని ఆదాయాన్ని గడించటంవల్ల మత్స్యకారులు నష్టపోతున్నారు. చెరువులో విత్తనాలు చల్లే సదరు కాంట్రాక్టర్‌ చేపలు పట్టే సమయానికి మత్స్యకారుల వద్ద కొనుగోలు చేస్తాడు. వాటిని ఆ వ్యక్తి మార్కెట్‌లో ఎక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. దళారి వ్యవస్థ లేనిపక్షంలో మత్స్యకారులు నేరుగా చేపలను మార్కెట్‌కు తరలించి విక్రయించి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సొసైటీలకు విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఫలితంగా వృత్తిదారులు స్వయంగా విత్తనాలు వేసి చేపలు పట్టుకొని మార్కెట్‌కు తరలించి విక్రయించడం ద్వారా లాభాన్ని గడించే అవకాశం లభించింది. వాగులలో ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. 105 రూపాయల ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు చేపలు పట్టుకొనే వీలు కల్పించింది. కట్ల, రౌ, బంగారు తీగ చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. చేపల మార్కెటింగ్‌కు గాను ఈ మధ్య మహిళలకు సబ్సిడీపై బైక్‌లను అందించారు. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో చిత్తూరు, పశ్చిమ గోదావరి, మెదక్‌ జిల్లా ల్లోగురుకుల పాఠశాలలున్నాయి.వృత్తిదారులు చనిపోతే రెండు లక్షలు బీమా ఇస్తున్నారు. మహిళా మత్స్యకారులు కూడా మత్స్య మిత్ర గ్రూపుల నుంచి రుణాలు, నైలాన్‌ వలలు, ఐస్‌ బాక్స్ లు తదితర పరికరాల కోసం రుణాలు పొందారు. మహిళా మత్స్య ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి వారికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. తక్కువ నీటిలో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేసే మెళకువలు నేర్పించాలని, కేరళలో చేపడుతున్నట్లుగా ఇక్కడ కూడా చేపల పచ్చళ్లు, ఫ్రై తదితర వెరైటీ వంటకాలు తయారు చేసి విక్రయించేలా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మండల కేంద్రాల్లో స్టాళ్లను ఏర్పాటుచేయాలని ప్రతి మండలంలో ఓ కమ్యూనిటీ హాలు నిర్మించి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఎవరికైనా చేపలు అవసరమైతే డోర్‌ డెలివరీ చేసే స్థాయికి ఎదగాలని వృత్తి దారులు భావిస్తున్నారు.

జాలరి గురించి

[మార్చు]

చందురుడు వాడె యదె బృహస్పతి పురంధ్రి
జాలరియు నదె శ్రీపరాశరుడు వాడె
కుశికజుడు వాడె యదె యింద్రు కొలువు లేము
చిత్తజుని శౌర్య మెరిగించె చిత్రశాల ....... ....... వినుకొండ వల్లభరాయడు - క్రీడాభిరామము

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బెస్త&oldid=4091748" నుండి వెలికితీశారు