శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
శంకరమంచి రామకృష్ణ శాస్త్రి (ఏప్రిల్ 24, 1969) ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు. ఈయన శంకరమంచిగా పిలువబడుతున్నాడు. ఈయన వైదిక జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు. ఈయన జ్యోతిష శాస్త్రంలో 18 సంవత్సరాల అనుభవం గలవాడు. యాజుష స్మార్తము చదివి, పురోహితునిగా 25 సంవత్సరముల అనుభవం కలవాడు. ఖగోళ శాస్త్రంలో 13 సంవత్సరాల అనుభవజ్ఞుడు, పంచాంగకర్త.
పైన తెలిపిన రంగాలలో అనేక మంది నిష్ణాతులు ఉన్నప్పటికీ, అన్ని రంగాలలోను పరిచయమున్న వ్యక్తి ఆయన. ఆయన ఎం.ఎ. పట్టాలను సంస్కృతం, జ్యోతిషం, తెలుగు లలో పొందాడు. ఆయన "ఉన్నత పదవి - రాజయోగం" అనే అంశంపై పరిశోధనలు చేసి, డాక్టరేటు పట్టా పొందాడు. ఆయన 37000 మంది ప్రముఖ వ్యక్తుల జాతక చక్రాలను పరిశీలించి, పరిశోధనలు చేశాడు. ఆయన చేసిన కృషికి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని పొందాడు[1] జ్యోతిష వేత్తలుగా, పురోహితులుగా, పంచాంగకర్తలుగా చాలామంది ఉన్నా, జ్యోతిషంలో శాస్త్రీయంగా పరిశోధనలు చేసి, పి.హెచ్ డి పట్టాను పొందిన వారు తెలుగువారిలో అరుదు. ఇతడు అటువంటి అరుదైన వ్యక్తి.
- దైవజ్ఞ రత్న
- దైవజ్ఞ శిరోమణి
- పురోహిత సార్వభౌమ
- స్వర్ణ కంకణ సన్మానిత
- సరస్వతీ పుత్ర
- విద్యా వాచస్పతి
- జ్యోతిష సార్వభౌమ
- జ్యోతిష మార్తాండ
- ఉత్తమ పంచాంగకర్త
గండపెండేర సత్కారం
బ్రహ్మశ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి లభించిన గౌరవాలలో గండపెండేర సత్కారం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లో దర్శనం మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిసెంబర్ 28.2025 న రవీంద్రభారతిలో ఆయనకు విశిష్ట సేవా పురస్కారంతో పాటు గండపెండేర సత్కారం ప్రదానం చేయబడింది.[3]
ఈ సభలో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు , బండారు దత్తాత్రేయ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, డా. కె.వి. రమణాచారి, జ్వాలా నరసింహారావు, ఆచార్య సాగి కమలాకరశర్మ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మరుమాముల వెంకటరమణ శర్మ నిర్వహించారు.[4]
- తే.ది. 26.10.2020న శార్వరి నామ సంవత్సర విజయదశమి నాడు శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు ఆదిశంకరాచార్యులు స్థాపించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం ఆస్థాన జ్యోతిర్విద్వాంసులుగా నియమితులయ్యారు.
- రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పండిత పురస్కారాలను మూడుసార్లు (1999, 2000, 2001) అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ద్వారా పొందాడు.
- మాజీ అసెంబ్లీ స్పీకరు డి.శ్రీపాదరావు నుండి 8.7.98 న "విద్యా వాచస్పతి" అవార్డును అందుకున్నారు.
- కేంద్ర మంత్రి టి సుబ్బిరామిరెడ్డి నుండి పండిత పురస్కారాన్ని అందుకున్నాడు.
- తే.11.2.2010ది. న రమణాచారి (ఐ.ఎ.ఎస్) నుండి కౌముది ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాడు.
- తే,6.4.2000 ది. న అవధాన సరస్వతి మాడుగుల నాగఫణిశర్మ నుండి స్వర్ణ సింహతలాట కంకణం పొందాడు.
- రాష్ట్ర మాజీ మంత్రులైన టి.సీతారాం, మురళీమోహన్ నుండి సరస్వతీ పుత్ర పురస్కారాన్ని అందుకున్నాడు.
- వేద పాఠశాల, శంకర విద్యాలయం, బాపట్ల నుండి "జయపత్రిక" అనే సర్టిఫికెట్టును పొందాడు.
సూచికలు
[మార్చు]- ↑ పొందిన సత్కారాలు,
- ↑ పొందిన బిరుదులు,
- ↑ "ఆస్థాన విద్వాంసులకు గండపెండేర ప్రదానోత్సవం". EENADU. Retrieved 2026-04-24.
- ↑ "ఆస్థాన విద్వాంసులకు గండపెండేర ప్రదానోత్సవం". EENADU. Retrieved 2026-04-24.
- ↑ అవార్డులు,