వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020
ఈ వికీప్రాజెక్టు కాలం విజయవంతంగా ముగిసింది. ఈ ప్రాజెక్టు తలపెట్టిన లక్ష్యాన్ని దాటేసి, మొత్తం 144% సాధించింది. ప్రాజెక్టుకు సంబంధించి ఇక ఇక్కడ చెయ్యడానికి పనేమీ లేదు. దీనికి మించి, మరిన్ని పనులు చెయ్యాలని మీరు భావిస్తే, అందుకు అనుగుణంగా ఇతర ప్రాజెక్టులేమైనా ఉన్నాయేమో పరిశీలించండి. లేదా సదరు లక్ష్యాలతో ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించండి. |
6400 పైచిలుకు మొలక వ్యాసాలు. చాలావరకు విస్తరణకు అవకాశం ఉన్నవే. కానీ, ఏళ్ళ తరబడి విస్తరణకు నోచుకోక మొలకలుగానే ఉండిపోయాయి.
ఇప్పుడు వాటిని పట్టించుకుందాం. అందరం కలిసి సమష్టి కృషి చేద్దాం. ఏళ్ళ తరబడి మనలను వెంటాడుతున్న సమస్య తీవ్రతను కొంత తగ్గించుకుందాం. రండి, మొలకలను విస్తరిద్దాం.
మొలకలు పెరిగేందుకు వర్షర్తువును మించిన కాలం ఏముంటుంది! ఈ జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మొలకలను విస్తరించుకుందాం రండి.
మొలకలను విస్తరించేందుకు ప్రత్యేకంగా తలపెట్టిన ప్రాజెక్టు ఇది. సాముదాయికంగా విశేషంగా కృషి చేస్తే తప్ప అవని పని ఇది. మొన్న ఏప్రిల్లో వ్యాసాల విస్తరణ ఉద్యమంలో సాధించిన విజయాలను మరింత ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు మొలకలను మాత్రమే పట్టించుకుందాం. వాటిని విస్తరించి మొలక స్థాయి దాటించుదాం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ప్రాథమిక కృషి, మొలకల వర్గీకరణ, పూర్తైంది. ఇక మనకు ఆసక్తి ఉన్న వర్గాల్లోంచి వ్యాసాలను ఎంచుకుని విస్తరించేందుకు కృషి చెయ్యడమే మిగిలి ఉంది.
"వర్షా కాలం - ఇది పంటల కాలం"
ప్రాజెక్టు లక్ష్యాలు
[మార్చు]- వర్గం:మొలక లోని ఉపవర్గాల్లో ఉన్న వ్యాసాలను విస్తరించి మొలక స్థాయిని దాటించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం
- ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి: మొత్తం 6400 వ్యాసాలు
- ప్రాజెక్టు కనీస లక్ష్యం: 2000 వ్యాసాలను విస్తరించాలి (విలీనాలు, తొలగింపులూ కాకుండా)
- ప్రాజెక్టు గడువు: 3 నెలలు. 2020 జూన్ 1 న మొదలై 2020 ఆగస్టు 31 న ముగుస్తుంది.
ఉపపేజీలు
[మార్చు]ప్రాజెక్టు ఉపపేజీలు
[మార్చు]- /మొలకల తొలి జాబితా
- /సినిమా వ్యాసాల మొలక పేజీలు జాబితా
- /గ్రామ, మండల మొలకవ్యాసాల జాబితా
- /జూన్ నెలలో తొలగించిన పేజీలు
- /జూన్ నెల ప్రాజెక్టు నివేదిక
ప్రాజెక్టు సభ్యులు చేసిన కృషిని తెలిపే ఉపపేజీలు
[మార్చు]- Ch Maheswara Raju కృషి
- Dollyrajupslp కృషి
- HarshithaNallani కృషి
- Katta Srinivasa Rao కృషి
- Prasharma681 కృషి
- Ramu ummadishetty కృషి
- కశ్యప్ కృషి
- చదువరి కృషి
- పవన్ సంతోష్ కృషి
- ప్రణయ్‌రాజ్ కృషి
- ప్రభాకర్ గౌడ్ నోముల
- యర్రా రామారావు కృషి
- రవిచంద్ర కృషి
- వెంకటరమణ కృషి
- సాయికిరణ్ కృషి
- స్వరలాసిక కృషి
వర్గాలు
[మార్చు]ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వర్గాల వర్గవృక్షం ఇది:
మొలక విస్తరణకు నిర్వచనం
[మార్చు]- వ్యాసాలను కనీసం 5120 బైట్ల స్థాయికి తీసుకు పోవాలి. ఈ స్థాయిలో వ్యాసం మూణ్ణాలుగు పేరాలుండి, పాఠకుడికి సంతృప్తికరమైన ప్రాథమిక స్థాయి సమాచారాన్ని అందిస్తుంది. ఇంకా పెద్దదిగా విస్తరించేందుకు అభ్యంతరమేమీ లేదు
- అవసరమైన చోట్ల మూలాలను చేర్చాలి.
- ఇతర పేజీల నుండి వ్యాసానికి ఇన్‌కమింగు లింకులు చేర్చాలి. కనీసం ఒక్కటైనా చేర్చాలి, మూడుంటే మంచిది
- పేజీని కనీసం ఒక వర్గంలో నైనా చేర్చాలి (మొలక-వర్గం నిర్వహణ సంబంధ వర్గం మాత్రమే. పైగా అది తాత్కాలికమే. మొలక మూసను తీసెయ్యగానే అది పోతుంది.)
- అంతర్వికీ లింకులు చేర్చాలి.
- పైవన్నీ అయ్యాక, పేజీకి అడుగున ఉన్న మొలక మూసను తీసెయ్యాలి. మరచిపోకండి, చాలా ముఖ్యమైన పని ఇది.
ఎలా చెయ్యడం
[మార్చు]మొలకల వర్గీకరణ పూర్తైంది. మొలక వ్యాసాల నన్నిటినీ 40 వర్గాలుగా చేసుకున్నాం. మనకు ఆసక్తి ఉన్న వర్గం లోని మొలక వ్యాసాలను తేలిగ్గా ఎంచుకునే అవకాశం ఉందిప్పుడు. మొలకలపై మనం కింది పనుల్లో ఏదైనా చేపట్టవచ్చు:
- విస్తరణ: మొలకకు చేసే పోషణలో అన్నిటి కంటే ఉత్తమమైన పని ఇదేనని చెప్పనక్కర్లేదు
- విలీనం: ఒకే తరహాకు చెందిన చిన్నచిన్న మొలకలను (వాటిని విస్తరించలేని పక్షంలో) విలీనం చేసి ఒకే వ్యాసంగా చెయ్యవచ్చు. ఈ పాత పేజీలను దారి మార్పుగా చెయ్యవచ్చు. ఉదాహరణకు గృహోపకరణాల వర్గంలో ఉన్న బాన, మూకుడు, చెంచా, చట్టి వంటి కొన్ని వ్యాసాలను విలీనం చేసి, ఒకే పేజీగా చెయ్యవచ్చు. ఇది రెండో అత్యుత్తమ పద్ధతి.
- అలాగే ఉంచెయ్యడం: ఏమీ చెయ్యకుండా అలాగే ఉంచెయ్యడం. విస్తరించలేని, విలీనం చెయ్యలేని, తొలగించనూ లేని వ్యాసం కోసం ఈ పద్ధతి. అసలు అలాంటి వ్యాసాలుంటాయా అనేది ఆలోచించాల్సిన సంగతి
- తొలగించడం: మొదటి రెండు పద్ధతులూ వీలు కానపుడు, ఇప్పుడున్న పరిస్థితిలోనే ఉంచేందుకూ వీలు లేనపుడు తొలగించేందుకు ప్రతిపాదించాలి. మొదటి రెండు పద్ధతులూ ఎందుకు వీలు కావంటే..
- విస్తరించేందుకు అవసరమైన సమాచారం లభ్యం కానపుడు
- విస్తరించేందుకు వీలు కాని నిర్వచనాలైనపుడు (విక్షనరీలో ఉండాల్సిన వ్యాసమైతే)
- విలీనాలకు కూడా వీలు కానప్పుడు
- ప్రస్తుతమున్న స్థితిలోనే పేజీని ఉంచే వీలు లేనపుడు: ఉన్న కొద్ది సమాచారం మూలాలేమీ లేని ఊకదంపుడు లేదా రొడ్డకొట్టుడు సమాచారమైనపుడు గానీ, తప్పుడు సమాచారమైనపుడు గానీ దాన్ని ఉంచలేం. ఉదాహరణకు అనవసరం వ్యాసం చూడండి. ఇందులో ఒకే విషయాన్ని తిప్పితిప్పి రెండు మూడు సార్లు చెప్పారు. సమాచారంలో స్పష్టత లేదు. ఈ రొడ్దకొట్టుడే కాక, మూలం ఇవ్వకపోతే ఉంచకూడని/నిలబడని పాఠ్యం కూడా ఈ పేజీలో ఉంది. తొలగింపుకు అర్హతలున్న వ్యాసం ఇది.
సృష్టి, స్థితి, లయల్లో స్థితి ఈ ప్రాజెక్టు ఉద్దేశం. మొలక వ్యాసాన్ని పెంచి పోషించి పెద్దది చెయ్యడం దీని ఉద్దేశం. కానీ అసలు మొలకే సరైనది కానపుడు, దానికి ఉండే అర్హతే లేనపుడు మూడో కన్ను తెరిచి లయం చేసేందుకు కూడా వెనకాడ కూడదనేది మన నీతి.
మొలక వర్గాల పట్టిక
[మార్చు]క్ర.సం | మొలక వర్గం పేరు | వివరం | మూస పేరు | జూన్ 1 న వ్యాసాల సంఖ్య | ఇప్పుడు వ్యాసాల సంఖ్య |
---|---|---|---|---|---|
1 | వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు | అధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-ఆధ్యాత్మికం}} | 76 | 23 |
2 | వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు | పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, అక్కడి విశేషాలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-పుణ్యక్షేత్రాలు}} | 35 | 6 |
3 | వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు | పౌరాణిక వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలు. చారిత్రిక వ్యక్తుల వ్యాసాలు ఇందులో చేరవు | {{మొలక-పౌరాణిక వ్యక్తులు}} | 97 | 17 |
4 | వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు | చారిత్రిక వ్యక్తుల వ్యాసాలతో సహా అన్ని జీవిత చరిత్ర వ్యాసాలు. పౌరాణిక వ్యక్తులు పాత్రలు ఇందులో చేరవు | {{మొలక-వ్యక్తులు}} | 415 | 55 |
5 | వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు | చరిత్రకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-చరిత్ర}} | 31 | 12 |
6 | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు | వృక్షజాతులు, ప్రజాతులు వగైరా వ్యాసాలు | {{మొలక-వృక్షశాస్త్రం}} | 155 | 56 |
7 | వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు | మానవుడు కాకుండా ఇతర జంతువులు, పక్షులు, కీటకాలు, సూక్ష్మ జీవులు | {{మొలక-జంతుశాస్త్రం}} | 89 | 68 |
8 | వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు | మానవ శరీరానికి సంబంధించిన వ్యాసాలు | {{మొలక-మానవ దేహం}} | 63 | 16 |
9 | వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు | స్థలాలు, నదులు, పర్వతాలు వంటి భౌగోళిక విశేషాలు | {{మొలక-భౌగోళికం}} | 114 | 7 |
10 | వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు | ఇతర శాస్త్ర సాంకేతికాంశాలన్నిటికీ సంబంధించిన వ్యాసాలు | {{మొలక-శాస్త్ర సాంకేతికాలు}} | 133 | 49 |
11 | వర్గం:సంస్థల మొలక వ్యాసాలు | సంస్థలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-సంస్థ}} | 69 | 11 |
12 | వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు | తెలుగు సినిమాల వ్యాసాలు | {{మొలక-తెలుగు సినిమా}} | 2594 | 499 |
13 | వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు | ఆంధ్ర, తెలంగాణ గ్రామాల వ్యాసాలు | {{మొలక-గ్రామం}} | 560 | 340 |
14 | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు | పుస్తకాలు, పుస్తక ప్రచురణ సంస్థలు | {{మొలక-పుస్తకాలు}} | 133 | 22 |
15 | వర్గం:మీడియా మొలక వ్యాసాలు | పత్రికలు, టీవీలు, సీరియళ్ళు, సామాజికమాధ్యమాలు | {{మొలక-మీడియా}} | 67 | 16 |
16 | వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు | రోడ్లు, రైలు మార్గాలు, ఆనకట్టలు వంటి మౌలిక సదుపాయాలు | {{మొలక-మౌలిక సదుపాయాలు}} | 32 | 0 |
17 | వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు | రాజకీయాలు, పరిపాలనలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-రాజకీయాలు}} | 39 | 4 |
18 | వర్గం:ఆహార మొలక వ్యాసాలు | ఆహారం, వంటలు | {{మొలక-ఆహారం}} | 41 | 16 |
19 | వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు | ఆరోగ్యం, వైద్యం | {{మొలక-ఆరోగ్యం}} | 41 | 1 |
20 | వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు | కంప్యూటరు, సాఫ్టువేరు | {{మొలక-కంప్యూటరు}} | 73 | 0 |
21 | వర్గం:సంగీత మొలక వ్యాసాలు | సంగీతం, సంగీత పరికరాలు | {{మొలక-సంగీతం}} | 73 | 11 |
22 | వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు | హిందూ పంచాంగానికి సంబంధించిన వ్యాసాలు | {{మొలక-హిందూ పంచాంగం}} | 395 | 365 |
23 | వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు | సంఖ్యాయుత వ్యాసాలు | {{మొలక-సంఖ్య}} | 98 | 60 |
24 | వర్గం:పేర్ల మొలక వ్యాసాలు | పేర్లు, ఇంటిపేర్ల వ్యాసాలు | {{మొలక-పేరు}} | 62 | 41 |
25 | వర్గం:ఘటన మొలక వ్యాసాలు | ఘటనలు, వార్షిక దినోత్సవాలకు చెందిన వ్యాసాలు | {{మొలక-ఘటన}} | 27 | 0 |
26 | వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు | విద్య, విద్యాలయాల వ్యాసాలు | {{మొలక-విద్యాలయం}} | 23 | 1 |
27 | వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు | వ్యవసాయానికి సంబంధించిన వ్యాసాలు | {{మొలక-వ్యవసాయం}} | 24 | 7 |
28 | వర్గం:తేదీ మొలక వ్యాసాలు | తేదీ, వారం, నెల, సంవత్సరాల వ్యాసాలు | {{మొలక-తేదీ}} | 209 | 0 |
29 | వర్గం:పరికరాల మొలక వ్యాసాలు | పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-పరికరం}} | 35 | 18 |
30 | వర్గం:కళల మొలక వ్యాసాలు | కళల వ్యాసాలు | {{మొలక-కళ}} | 28 | 14 |
31 | వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు | సాహిత్యం, భాషా సంబంధ వ్యాసాలు | {{మొలక-సాహిత్యం}} | 113 | 50 |
32 | వర్గం:ఆటల మొలక వ్యాసాలు | ఆటలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-ఆట}} | 16 | 2 |
33 | వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు | గృహ వస్తువులకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-గృహం}} | 44 | 14 |
34 | వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు | భారతీయ సాంప్రదాయిక విజ్ఞాన వ్యాసాలు (జ్యోతిష్యం, క్షుద్ర పూజలు వగైరా) | {{మొలక-సాంప్రదాయిక విజ్ఞానం}} | 17 | 4 |
35 | వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు | జీవన విధాన సంబంధ వ్యాసాలు | {{మొలక-జీవన విధానం}} | 78 | 30 |
36 | వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు | అక్షరాల వ్యాసాలు | {{మొలక-అక్షరం}} | 60 | 47 |
37 | వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు | ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంబంధ వ్యాసాలు | {{మొలక-ఆర్థికం}} | 14 | 0 |
38 | వర్గం:సామాజిక మొలక వ్యాసాలు | సమాజ సంబంధ వ్యాసాలు | {{మొలక-సమాజం}} | 88 | 35 |
39 | వర్గం:కాలం మొలక వ్యాసాలు | కాలం, ఋతువులు, దిక్కులు.. తత్సంబంధ వ్యాసాలు | {{మొలక-కాలం}} | 14 | 0 |
40 | వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | {{మొలక-ఇతరత్రా}} | 117 | 37 |
మొలక వ్యాసాల మొత్తం | 6560 |
పాల్గొనేవారు
[మార్చు]ప్రస్తుతం వికీలో చురుగ్గా రాస్తున్న వాడుకరులంతా ఈ ప్రాజెక్టులో పాల్గొని తెవికీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి. తాము విస్తరించిన వ్యాసాల వివరాలను "కృషి వివరం" అనే పేజీలో చేర్చితే చేసిన పనిని మదింపు చేసేందుకు వీలుగా ఉంటుంది.
- చదువరి (చర్చ • రచనలు) - కృషి వివరం
- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ ● రచనలు) 07:10, 3 జూన్ 2020 (UTC) - కృషి వివరం
- K.Venkataramana(talk) 07:26, 3 జూన్ 2020 (UTC) - కృషి వివరం
- రవిచంద్ర (చర్చ) 08:30, 3 జూన్ 2020 (UTC) - కృషి వివరం
- యర్రా రామారావు (చర్చ) 11:45, 3 జూన్ 2020 (UTC) - కృషి వివరం
- స్వరలాసిక (చర్చ) 06:28, 4 జూన్ 2020 (UTC)- కృషి వివరం
- Ch Maheswara Raju (చర్చ) 12:27, 4 జూన్ 2020 (UTC)-కృషి వివరం
- పవన్ సంతోష్ (చర్చ) - కృషి వివరం
- ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) - కృషి వివరం
- కశ్యప్ (చర్చ • రచనలు) - కృషి వివరం
- --Rajasekhar1961 (చర్చ) 04:52, 5 జూన్ 2020 (UTC)
- .B.K.Viswanadh (చర్చ) 06:07, 5 జూన్ 2020 (UTC)
- వికి వాసు (చర్చ) • రచనలు) - కృషి వివరం
- రాధిక (చర్చ) రచనలు) కృషి వివరం
- Ramu (చర్చ • రచనలు) - కృషి వివరం
- Harshitha (చర్చ • రచనలు) - కృషి వివరం
- Dollyrajupslp (చర్చ) రచనలు) - కృషి వివరం
- Newwikiwave (చర్చ) 12:23, 8 జూన్ 2020 (UTC)
- సాయికిరణ్ (చర్చ • రచనలు) - కృషి వివరం
ఉత్తమ వాడుకరులు
[మార్చు]ప్రమాణాలకు అనుగుణంగా అత్యధిక వ్యాసాలను విస్తరించిన వాడుకరులను సన్మానించుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. అత్యధిక విస్తరణలను చేసిన మొదటి ముగ్గురిని
- మహారాజ పోషకులు
- రాజ పోషకులు
- పోషకులు
అని గానీ మరో విధంగా గానీ సత్కరించుకోవాలని నా ప్రతిపాదన. పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇవ్వవలసినదిగా వినతి.
ప్రాజెక్టు నివేదికలు
[మార్చు]- జూన్ నెలలో ఈ ప్రాజెక్టు సాధించిన ప్రగతి కోసం జూన్ నెల నివేదిక చూడండి.
- జూలై నెలలో ఈ ప్రాజెక్టు సాధించిన ప్రగతి కోసం జూలై నెల నివేదిక చూడండి.
- ప్రాజెక్టు తుది నీవేదిక చూడండి.
- ప్రాజెక్టు గురించి వాడుకరుల అభిప్రాయాలను /సమీక్ష పేజీలో చూడండి
- ఈ ప్రాజెక్టులో విస్తరించిన పేజీల పేజ్‌పైల్ (Pagepile) ఐడీ: 31508.ఇది 2020 సెప్టెంబరు 1 న ఉదయం 11 గంటలకు తయారుచేసినది. ఆ తరువాత మార్పు చేర్పులు ఉన్నా బహు స్వల్పం, గణనీయం కాదు. దీన్ని అవసరమైన చోట వాడుకుని కావలసిన రిపోర్టులు పొందవచ్చు.