వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020
మొలకల విస్తరణ ఋతువు 2020 అభివృద్ధి రికార్డు గురించి
[మార్చు]- చదువరి గారూ, వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టుకు అనుభంధంగా, "మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో అభివృద్ధి చేసిన మొలక వ్యాసాలు వివరాలు" అనే పేజీని సృష్టించి, ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు వారు అభివృద్ధి చేసిన మొలక వ్యాసం మూస తొలగించగానే, ఎవరి వ్యాసంవారే ఈ పేజీలో వెంటనే కూర్పు చేస్తే, ప్రతిరోజు పని ఎలా జరుగుతుంది, ఎవరు చురుకుగా పాల్గొంటున్నారో, మిగిలిన వాళ్లకు తెలుస్తుంది,ఒక రకంగా ఆదర్శంగా ఉంటుందని నాఅభిప్రాయం.అంతేగాదు ప్రాజెక్టుపని కాలం ముగిసినాక ఫలితం వెల్లడించటానికి తేలికగా ఉంటుంది.లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది.ఏప్రియల్ జరిగిన ప్రాజెక్టుపనిలో తయారుచేసిన ప్రాజెక్టుపనిపై గణాంకాల నివేదిక లాగా ఇప్పటినుండే రికార్డు చేస్తే బాగుంటదని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 16:57, 3 జూన్ 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, ఎంత పని జరిగిందో చూసేందుకు రెండు రకాల పద్ధతులు పెట్టానండి.
- ఒకటి ఒక్కో వర్గం లోనూ ఎన్ని వ్యాసాలు విస్తరించామో చెప్పే జాబితా. విస్తరించగా ఆయా వర్గంలో మిగిలిన వ్యాసాలను ఇది ఎప్పటికప్పుడు ఆటోమాటిగ్గా చూపిస్తూంటుంది.
- వాడుకరులు ఏయే వ్యాసాలను విస్తరించారో చూపించే పేజీ. ఒక్కో వాడుకరికి ఒక్కో పేజీ ఉంటుంది. ఈ పేజీని ఆయా వాడుకౌలే తాజాకరించాలి.
- __చదువరి (చర్చ • రచనలు) 12:09, 4 జూన్ 2020 (UTC)
- గమనించాను--యర్రా రామారావు (చర్చ) 13:32, 4 జూన్ 2020 (UTC)
శుభ పరిణామం
[మార్చు]ఈ పనిలో పాలుపంచుకోవడానికి ఇప్పటిదాకా 11 మంది వాడుకరులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఇది శుభపరిణామం. ఈ ప్రయత్నం ద్వారా కనీసం వెయ్యి మొలకలు, మొక్కలుగా అయినా అవుతాయని నా అంచనా. ప్రాజెక్టులో పనిచేస్తున్న అందరికీ ధన్యవాదాలు. - రవిచంద్ర (చర్చ) 05:57, 5 జూన్ 2020 (UTC)
చర్చ పేజీలో మూస
[మార్చు]మనం విస్తరిస్తున్న వ్యాసాల చర్చా పేజీలలో "వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020" భాగంగా మొలకను వృద్ధి చేసినట్లు తెలిపే ఒక మూసను చేర్చితే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో వృద్ధి చెందిన వ్యాసాలన్నీ ఒక వర్గంలోకి వెళ్ళేలా చూడండి. ఈ కార్యక్రమం భావితరాలకు ఆదర్శంగా ఉంటుంది. K.Venkataramana(talk) 16:07, 5 జూన్ 2020 (UTC)
గమనిక
[మార్చు]ప్రాజెక్టు పేజీ లోని మొలక వర్గాల పట్టిక లోని చివరి కాలములో అంకెలు మారడం లేదని గమనిస్తే, వాటిని తాజాకరించేందుకు పేజీకి పైన, కుడి చివర ఉండే సమయాన్ని నొక్కండి. దీంతో తాజా అంకెలు కనిపిస్తాయి. __చదువరి (చర్చ • రచనలు) 10:33, 9 జూన్ 2020 (UTC)
మైలురాళ్ళు
[మార్చు]1. 300: 16 వ తేదీ ఉదయం 6:15 కు చూస్తే 303 మొలకలు తగ్గాయి. 15 రోజులైంది మన ఈ ప్రాజెక్టు మొదలై (నిజానికి 11 రోజులే అయింది మనం పని మొదలెట్టి). దీన్ని మూణ్ణెల్లకు పొడిగిస్తే 1800 మొలకల విస్తరణ జరిగే అవకాశం ఉంది. దానిలో 80% మాత్రమే చెయ్యగలిగినా సుమారు 1500 అవుతాయి.__చదువరి (చర్చ • రచనలు) 02:12, 16 జూన్ 2020 (UTC)
- పై సంఖ్యలో నేను 48 పేజీలను విస్తరించాను. మూడు పేజీలను వేరే పేజీలో విలీనం చేసాను. పది పేజీల దాకా తొలగించాను.__చదువరి (చర్చ • రచనలు) 02:13, 16 జూన్ 2020 (UTC)
2. 500: 2020 జూన్ 22 ఉదయం 5 గంటలకు 522 మొలకలు తగ్గాయి. రోజుకు సగటున 24.8 తగ్గినట్టు. __చదువరి (చర్చ • రచనలు) 02:45, 22 జూన్ 2020 (UTC)
- చదువరి గారు, వాడుకరి:యర్రా రామారావు గారు, వెంకట రమణ గారు అప్పుడే శతకాలు పూర్తి చేసుకుని దూసుకుపోతున్నారు. మీ ముగ్గురికి నా మనఃపూర్వక అభినందనలు. - రవిచంద్ర (చర్చ) 18:05, 24 జూన్ 2020 (UTC)
- రవిచంద్ర గారూ, ధన్యవాదాలు. బహుశా కరోనా వైరస్ వ్యాసంలో "దీని వల్ల ఉపయోగాలు" అనే విభాగం కూడా ఒకటి పెట్టి, అందులో తెవికీలో మార్చి నుండి జరిగిన పనులను రాయొచ్చేమో నండి. :-) __చదువరి (చర్చ • రచనలు) 01:32, 25 జూన్ 2020 (UTC)
3. 600: జూన్ 25 ఉదయం 6 గంటలకు 613 మొలకలు తగ్గాయి. సగటున రోజుకు 25.5 చొప్పున తగ్గాయి. __చదువరి (చర్చ • రచనలు) 01:34, 25 జూన్ 2020 (UTC)
4. 10%: జూన్ 25 ఉదయం 6 గంటలకు మొత్తం మొలకల్లోంచి 10% తగ్గాయి. __చదువరి (చర్చ • రచనలు) 14:10, 26 జూన్ 2020 (UTC)
5. 700: జూన్ 28 ఉదయం 6 గంటలకు 734 మొలకలు తగ్గాయి. ఇందులో 44% గ్రామాల మొలకలు, వ్యక్తుల మొలక్కలు 23%, భౌగోళిక మొలకలు 13%, సినిమాల మొలకలు 6%, రాజకీయాల మొలకలు 4% ఉన్నాయి. తక్కినవన్నీ కలిపి మిగిలిపోయిన 10 శాతం. ఇకపై గ్రామాలు, భౌగోళికం, రాజకీయాల మొలకల శాతాలు తగ్గి ఇతరాలు పెరిగే అవకాశం ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 01:00, 28 జూన్ 2020 (UTC)
తొలగింపులు - తొలగింపు చర్చలు
[మార్చు]ఈ ప్రయత్నం ముందుకుపోవడానికి తొలగింపులు కూడా ముఖ్యమైనవే. ఐతే, తొలగింపు చర్చల్లో అభిప్రాయాలు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టు ఉంటే తొలగింపులు అలానే నిలిచిపోతాయి. దీని విషయంలో తొలగింపు చర్చలు అన్న వర్గం ఏర్పాటుచేశాను. మన ప్రాజెక్టు పేజీలో దీనిని, వర్గంలో ఉన్న పేజీలు సంఖ్య కనిపించేలా కోడ్‌నీ (నిర్వాహకుల నోటీసు బోర్డులో తొలగించవలసిన వ్యాసాల జాబితా తరహాలో) చేరిస్తే బావుంటుందని సూచిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:31, 18 జూన్ 2020 (UTC)
ఈ ఋతువులో మొదటి నెల ఇవ్వాళ్టితో ముగుస్తోంది
[మార్చు]ఇవ్వాళ్టితో మొదటి నెల పూర్తవుతోంది. ఈ నెలలో చేసిన పనిని సమీక్షించుకుని, రాబోయే రెండు నెలల్లో ఏమేం మార్పులు చేసుకోవాలో ఆలోచించుకునే సమయమొచ్చింది. ఈ నెలకు సంబంధించిన వివిధ గణాంకాలను రేపు, అంటే జూలై 1 న, ఉదయం 6 గంటలకు ముగిద్దాం. ఆ లోగా మీమీ కృషికి సంబంధించిన వివరాలను తాజాకరించవలసినదిగా ప్రాజెక్టులో పాల్గొంటున్న వారందరికీ విజ్ఞప్తి. ఉదయం 7 గంటలకల్లా గణాంకాలను క్రోడీకరించి సారాంశాన్ని మీముందుకు తెద్దామని నా ఉద్దేశం. __చదువరి (చర్చ • రచనలు) 02:31, 30 జూన్ 2020 (UTC)
- అలాగేనండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 02:45, 30 జూన్ 2020 (UTC)
జూనె నెల సమీక్ష - జూలై అగస్టుల మునుజూపు
[మార్చు]జూన్ నెలలో ప్రాజెక్టులో జరిగిన పనుల సమీక్షను చూసే ఉంటారు. దీనిపై మీ అభిప్రయాలు చెప్పండి. అలాగే ఈ నెలలో పని చేసేందుకు మనకున్న సౌకర్యాలు ఇకముందు తగ్గిపోయే అవకాశం ఉంది, అందుచేత పని కాస్త మందగించే అవకాశం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ విషయంపై మీమీ అభిప్రాయాలు చెప్పగలరు. మెజారిటీ వాడుకరుల అభిప్రాయం అలాగే ఉంటే, ఇకపై కూడా పని చురుగ్గానే సాగేందుకు ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 06:50, 1 జూలై 2020 (UTC)
జూలై మధ్యంతర సమీక్ష
[మార్చు]జూలై నెలలో 17 వ తేదీ వరకు మనం విస్తరించిన వ్యాసాల సంఖ్య 254. జూన్‌లో ఇదే కాలానికి 387 పేజీలను విస్తరించాం. అయితే జూన్ సంఖ్యలో 54 తొలగించిన పేజీలు కూడా కలిసి ఉన్నాయి. వాటిని తీసేస్తే జూన్‌లో ఇదే కాలానికి 333 పేజీలను విస్తరించినట్లు. సుమారు 80 పేజీల దాకా తగ్గాయి. జూన్లో ఇదే కాలంతో పోలిస్తే ఎక్కువమంది ఈ నెలలో ఎక్కువే చేసారు. రమణ గారు 30 ఎక్కువ చేసారు (64 - 94). ప్రణయ్ రాజ్ గారు 27 పేజీలు ఎక్కువ విస్తరించారు (8 - 35). నేను 8 పేజీలు ఎక్కువ చేసాను (51 - 59). మిగతావాళ్ళు తేదీలు వెయ్యలేదు. రవిచంద్ర గారు కూడా ఎక్కువే చేసి ఉండవచ్చు - ఎందుకంటే జూన్ నెలంతా కలిపి 46 చేస్తే ఈ నెలలో ఇప్పటికే 30 చేసారు. స్వరలాసిక గారు బహుశా వెనకబడి ఉండవచ్చు. గ్రామాల మొలకలు దాదాపుగా అన్నిటినీ జూన్ లోనే అవగొట్టేసి నందువలన రామారావు గారి సంఖ్య కూడా తగ్గి ఉండవచ్చు. ప్రస్తుత పోకడను బట్టి చూస్తే ఈ నెలలో 500 పేజీల విస్తరణ జరిగే అవకాశం కనబడుతోంది. __చదువరి (చర్చ • రచనలు) 08:05, 18 జూలై 2020 (UTC)
ఈ ప్రాజెక్టులో సంస్కరణకు నోచుకున్న పేజీల వర్గాలు
[మార్చు]ఈ ప్రాజెక్టులో భాగంగా విస్తరించిన పేజీల చర్చాపేజీను వర్గం:మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీలు అనే వర్గం లోకి, దారిమార్పులను వర్గం:మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా దారిమార్పుగా మార్చిన పేజీలు అనే వర్గం లోకీ చేర్చాను. పరిశీలించగలరు. గతంలో వెంకటరమణ గారు దీన్ని సూచించారు. నేను ఏమైనా పేజీలను మిస్సై ఉంటే వాటిని కూడా చేర్చండి. విస్తరించిన పేజీల కోసం {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} అనే మూసను, దారిమార్పు పేజీల కోసం {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా దారిమార్పుగా చేసిన పేజీ}} అనే మూసనూ చర్చాపేజీలో చేర్చాలి. (దారిమార్పు పేజీకి చెందిన చర్చపేజీలో మూసను చేర్చేటపుడు సరైన పేజీలోనే చేరుస్తున్నామా అనే విషయమై కొంత జాగ్రత్త వహించండి.)__చదువరి (చర్చ • రచనలు) 07:26, 19 జూలై 2020 (UTC)
రెండో నెల ముగియనుంది
[మార్చు]ఈ ఋతువులో రెండో నెల, ముగింపుకు దగ్గర పడింది. ప్రాజెక్టు సభ్యులు చివరి నిముషపు ఊపు కోసమని గుర్తు చేస్తున్నానంతే.
పోతే, ఆగస్టు నెల కోసం ఒక సూచన: దాదాపు 2500 వ్యాసాలతో సినిమా మొలకలు అతిపెద్ద మొలక వర్గం. మన లక్ష్యం 2000 కు చేరాలంటే ఈ పేజీలపై పని చెయ్యడం కీలకం అని నేను భావిస్తున్నాను. పాజెక్టుపై ఆసక్తి చూపిన వాడుకరులంతా పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు (ప్రస్తుతానికి 1200 దాటేసాం). దీనిపై వాడుకరులు శ్రద్ధ పెట్టేందుకు తగిన వనరులేంటో తెలిస్తే ఎంతో మేలు కలుగుతుంది. ఉదాహరణకు - సినిమాల సమాచారం దొరికే చోటు, మూలాల జాబితాలు వగైరాలను సూచిస్తే వీటి గురించి అంతగా తెలీని నాబోంట్లకు ప్రయోజనం కలుగుతుంది. సినిమా పేజీలపై పనిచేసే అనుభవజ్ఞులు రవిచంద్ర, స్వరలాసిక, ప్రణయ్‌రాజ్ లు ఈ విషయంలో సహాయపడాల్సిందిగా మనవి. __చదువరి (చర్చ • రచనలు) 07:26, 28 జూలై 2020 (UTC)
- చదువరి గారూ, అవును సినిమాలు మొలకలు కొండలాగా అనిపిస్తున్నాయి కాబట్టే వేరే వర్గాల కన్నా వీటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాను నేను. సినిమాల సమాచారం ఎలా సేకరిస్తానో కొన్ని వివరాలు కింద ఇస్తాను.
- ముందుగా సినిమా మొలకకు ఆంగ్ల పేజీ ఉందో లేదో చూసి అందులోని సమాచారాన్ని, మూలాలను సేకరించడానికి ప్రయత్నిస్తాను.
- అది కుదరకపోతే గూగుల్ లో తెలుగు పేరుతో, ఆంగ్ల పేరుతో వెతుకుతాను. 2000 ఆ పైన సినిమాలైతే "XYZ Movie Review" అని కొడితే చాలావారకు కొన్ని పేజీలు కనిపించాయి. కానీ అంతకంటే పాత సినిమాలు ఇలా వెబ్ మూలాలు దొరకడం కష్టమైంది.
- ఉదాహరణకు సితార వారి వెబ్ సైటులో ఆణిముత్యాల పేరుతో కొన్ని వ్యాసాలు వస్తున్నాయి. లింకు
- ఈనాడు వారి వెబ్ సైటులో అడపా దడపా పాత సినిమాల వ్యాసాలు వేస్తుంటారు. ఉదాహరణ లింకు
- భారతీయ సినిమాలపై విశేష కృషి చేసిన ఈ వెబ్ సైటు కొన్ని సార్లు ఉపయోగపడింది
- ఇవి కాకుండా ఫిల్మీబీట్, ఇండియా గ్లిట్జ్, మల్లెమాల మారి 123తెలుగు ఉపయోగపడ్డాయి.
- సంగీత వివరాల్ని చేర్చడానికి మ్యూజిక్ వెబ్ సైట్లను వాడుకుంటున్నారు కొంతమంది.
- వెబ్ మూలాలు లేని సినిమాలకు యూట్యూబు వీడియోలు చాలావరకు కనిపిస్తున్నాయి. కొంతమంది మహానుభావులు సినిమా అంతా చూడనవసరం లేకుండా. సారాంశాన్ని వీడియో కింద ఇస్తున్నారు. లేకపోతే నేనే టైటిల్స్ చూసి సమాచారం గ్రహిస్తున్నాను. యూట్యూబును మనం మూలంగా స్వీకరించమని తెలుసు. కానీ టైటిల్స్ కంటే ఖచ్చితమైన సమాచారం ఇంకొకటి ఉండదు.
- ఆంగ్ల పేజీలో సినిమా కథలు ఉంటే అనువదిస్తాను. లేకపోతే నేనే యూట్యూబులోనో, టీవీలోనో ఆ సినిమా వచ్చినప్పుడు చూసి కథను టూకీగా బుర్రలో పెట్టుకుని సమయం వచ్చినప్పుడు చేరుస్తున్నాను. వీటికి మూలాలు ఏంటని కొంతమంది అడగవచ్చు. కానీ ఎక్కడా ప్రచురితం కాని పాత సినిమాలకు సంబంధించిన కథ చేర్చాలంటే అంతకు మించి నాకు మార్గం కనిపించలేదు.
- మురళీమోహన్ గారు appress academy archives ను మధించి అందులో పాత సినిమాల పరిచయాలని వెలికితీసి అందులో మూలాలను వాడుకుంటూన్నారు.
- పవన్ సంతోష్ గారు సురేష్ ప్రొడక్షన్స్ వారి చిత్రాల గురించి ఒక పుస్తకం లింకు ఇచ్చారు కానీ అది ఇప్పుడూ ఆన్లైన్ లో లభ్యం కావడం లేదు. పవన్ దగ్గర ఆ పుస్తకం పీడీఎఫ్ ఉందేమో కనుక్కోవాలి.
- మనం ఇటీవల ఆర్కైవ్ లో కొన్ని తెలుగు పుస్తకాలను మెటాడేటా చేర్చాము అందులో సినిమాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నట్లు గుర్తు. కానీ నేను ఇంకా శోధించలేదు.
ప్రస్తుతానికి గుర్తువచ్చినవి ఇవి. గుర్తు వచ్చినప్పుడు మరిన్ని మూలాలు దొరికేచోట్లు చేర్చగలను. -- రవిచంద్ర (చర్చ) 08:02, 28 జూలై 2020 (UTC)
- చదువరి గారూ, ఇదివరకు సినిమా పాటలకు సంబంధించి ఈ బ్లాగు కొంచెం ఉపయోగపడేది. కానీ ఇప్పుడు దానిని చూడటానికి కొంతమందికే పరిమితం చేయడవల్ల మనకు ఉపయోగపడటం లేదు. ప్రెస్ అకాడమీ వెబ్‌సైటులో 1977 వరకు దిన వారపత్రికలు లభిస్తున్నాయి. (ఆంధ్రపత్రిక వీక్లీ 1991 వరకు ఉంది.) వీటి సినిమా పేజీలలో కొంత సమాచారం లభిస్తుంది.--స్వరలాసిక (చర్చ) 08:12, 28 జూలై 2020 (UTC)
- చదువరి గారూ, సినిమా వ్యాసాలలో చాలావరకు ఆంగ్ల వికీపీడియాలో వ్యాసాలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని నేను తెవికీలో సినిమా వ్యాసాలు రాస్తున్నాను. ఇక రవిచంద్ర గారు చెప్పినట్టు, యూట్యూబులో సినిమా వీడియోలో చూసి నటవర్గం, సాంకేతికవర్గాల పేర్లు రాయొచ్చు. ఫిల్మీబీట్, ఇండియా గ్లిట్జ్, 123తెలుగు వంటి వెబ్సైట్లలో కూడా ఆయా సినిమాల సమాచారం ఉంటుంది. సమాచారం దొరికే సినిమాల గురించి రాసి, దొరకని వాటి గురించి తరువాత చూద్దాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 07:23, 29 జూలై 2020 (UTC)
- ప్రణయ్‌రాజ్ గారూ, ధన్యవాదాలు. అలాగే చేస్తాను. __08:44, 30 జూలై 2020 (UTC)
- చదువరి గారూ, సినిమా వ్యాసాలలో చాలావరకు ఆంగ్ల వికీపీడియాలో వ్యాసాలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని నేను తెవికీలో సినిమా వ్యాసాలు రాస్తున్నాను. ఇక రవిచంద్ర గారు చెప్పినట్టు, యూట్యూబులో సినిమా వీడియోలో చూసి నటవర్గం, సాంకేతికవర్గాల పేర్లు రాయొచ్చు. ఫిల్మీబీట్, ఇండియా గ్లిట్జ్, 123తెలుగు వంటి వెబ్సైట్లలో కూడా ఆయా సినిమాల సమాచారం ఉంటుంది. సమాచారం దొరికే సినిమాల గురించి రాసి, దొరకని వాటి గురించి తరువాత చూద్దాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 07:23, 29 జూలై 2020 (UTC)
తేదీ మొలక వ్యాసాలు వర్గం
[మార్చు]తేదీ మొలక వ్యాసాలు వర్గంలో ఇంకో 14 పేజీలు మిగిలాయి. వాటిని కూడా విస్తరించేస్తే ఆ వర్గం ఖాళీ అయిపోతుంది. ఖాళీ చేసిన మొట్టమొదటి వర్గం ఇది అవుతుంది. ప్రస్తుతం యర్రా రామారావు గారు, స్వరలాసిక గారు నేనూ పని చేస్తున్నాం. ప్రాజెక్టులో చురుగ్గా ఉన్న మిగతావారు - వెంకటరమణ, రవిచంద్ర, ప్రణయ్‌రాజ్ గార్లు కూడా ఒక చెయ్యి వేస్తే అందరం కలిసి ఈ వర్గం అంతు చూసినట్టు అవుతుంది. ఇవ్వాళ రేపట్లో వీటిని అవగొట్టొచ్చు కూడాను. తలా రెండు పేజీలు చేస్తే పనైపోతుంది. పరిశీలించండి. నేను 632, 762 చేస్తాను. మీరు కూడా ఎంచుకోవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 08:34, 30 జూలై 2020 (UTC)
- మరొక సూచన: ఆగస్టులో అందరం అన్ని వర్గాల్లోనూ పనిచేద్దాం. ఈ ఋతువు ముగిసే లోపు ప్రతీ వర్గం లోనూ కనీసం రెండు పేజీలను విస్తరించుదాం. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 08:38, 30 జూలై 2020 (UTC)
- నేను నవంబరు, సెప్టెంబరు, డిసెంబరు, ఈ మూడు వ్యాసాలు రేపటిలోగా విస్తరిస్తాను.--యర్రా రామారావు (చర్చ) 11:29, 30 జూలై 2020 (UTC)
- ఈ వర్గంలో 6 వ్యాసాలను పూర్తి చేసాను. K.Venkataramana(talk) 11:07, 31 జూలై 2020 (UTC)
- ఈ వర్గంలో 2 వ్యాసాలు (763, 973) విస్తరించి, మొలక మూస తొలగించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 13:18, 31 జూలై 2020 (UTC)
- సాధించేసాం. చప్పట్లు! __చదువరి (చర్చ • రచనలు) 05:49, 2 ఆగస్టు 2020 (UTC)
- ఈ వర్గంలో 2 వ్యాసాలు (763, 973) విస్తరించి, మొలక మూస తొలగించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 13:18, 31 జూలై 2020 (UTC)
- ఈ వర్గంలో 6 వ్యాసాలను పూర్తి చేసాను. K.Venkataramana(talk) 11:07, 31 జూలై 2020 (UTC)
- నేను నవంబరు, సెప్టెంబరు, డిసెంబరు, ఈ మూడు వ్యాసాలు రేపటిలోగా విస్తరిస్తాను.--యర్రా రామారావు (చర్చ) 11:29, 30 జూలై 2020 (UTC)
మరొక వర్గం కాగొట్టటానికి దగ్గరగా ఉన్నాం
[మార్చు]వర్గం:ఘటన మొలక వ్యాసాలు ఈ వర్గంలో నాలుగు మాత్రమే ఉన్నాయి.అందులో ఒకటి సంఘటన అయోమయనివత్తి. అయినా నేను దానిని మొలక దాటించాను. ఇక మూడే ఉంటాయి.టెడ్డీబేర్ దినోత్సవం నేను విస్తరిస్తాను.మిగిలిన రెండు విస్తరిస్తే ఇది సాధించినట్లే!గమనించగోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:15, 2 ఆగస్టు 2020 (UTC)
- అంబేద్కర్ మనుస్మృతి దహనం నేను చేస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 06:56, 2 ఆగస్టు 2020 (UTC)
- ఒక సంస్థ ఇచ్చే పురస్కారం గురించి 3 లైన్లతో ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం వ్యాసాన్ని రాశారు. అయితే ఆ సంస్థకు సంబంధించిన వివరాలు, సమాచారం ఎక్కడా దొరకడంలేదు. మరి ఆ వ్యాసాన్ని ఏంచేద్దాం?-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 10:12, 2 ఆగస్టు 2020 (UTC)
- నేను కూడా సమాచారం కొరకు ప్రయత్నం చేసాను. ఎక్కడా లభ్యం కాలేదు.ఆ సంస్థ వెబ్సైట్ కూడా దొరకలేదు.తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 10:25, 2 ఆగస్టు 2020 (UTC)
- అంబేద్కర్ మనుస్మృతి దహనం విస్తరించాను. ఇంకా విస్తరించ దలచిన వాళ్ళు చెయ్యవచ్చు. ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, సంస్థ గురించే సమాచారం దొరక్కపోతే ఇక వారిచ్చే పురస్కారం గురించి దొరకడం సందేహాస్పదమే. అంటే విషయ ప్రాధాన్యత సందేహాప్సదమే. మరింతగా వెతికి చూడండి, లేదంటే తగు కారణాలు చూపిస్తూ తొలగింపుకు ప్రతిపాదించండి. __చదువరి (చర్చ • రచనలు) 10:41, 2 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారు, అలాగేనండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 10:43, 2 ఆగస్టు 2020 (UTC)
- ఒక సంస్థ ఇచ్చే పురస్కారం గురించి 3 లైన్లతో ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం వ్యాసాన్ని రాశారు. అయితే ఆ సంస్థకు సంబంధించిన వివరాలు, సమాచారం ఎక్కడా దొరకడంలేదు. మరి ఆ వ్యాసాన్ని ఏంచేద్దాం?-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 10:12, 2 ఆగస్టు 2020 (UTC)
- వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు వర్గం కూడా దగ్గరపడింది. దాని సంగతి కూడా చూడాలి. వర్గం:కాలం మొలక వ్యాసాలు వర్గంలో వ్యాసాలను తాను విస్తరిస్తానని ప్రభాకర్ గౌడ్ నోముల గారు అన్నారు. అంటే ప్రస్తుతం మూడు వర్గాలు లైన్లో ఉన్నాయన్న మాట. __చదువరి (చర్చ • రచనలు) 11:24, 2 ఆగస్టు 2020 (UTC)
- మీరందరూ చాలా వేగంగా పనిచేస్తున్నారు. నేను మీ వేగాన్ని అందుకోలేకుండా ఉన్నాను. :-) - రవిచంద్ర (చర్చ) 08:55, 4 ఆగస్టు 2020 (UTC)
- రవిచంద్ర గారూ, నా వేగం సంగతి ఏంటంటే - దానికి రెండు కారణాలున్నై - 1. నేను చేసేవి దాదాపుగా అన్నీ అనువాదాలే. 2. యంత్రంతో అనువాదం చేస్తాను. నేను పెట్టే టైమంతా యంత్రానువాదాన్ని సరి చేసేందుకే, అందుకే ఆ వేగం. జై గూగుల్ అనువాద యంత్రం! __చదువరి (చర్చ • రచనలు) 00:16, 5 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారూ, ఈ పద్ధతి బాగుంది సర్. ఎప్పుడైనా మీరు అనువాద యంత్రాన్ని ఎలా వాడుతున్నారో పరిశీలించి చూడాలి. నేను మామూలుగా వాడేది translate.google.com మీరు వికీలో పరికరాలు కూడా వాడుతున్నట్లుంది. నేను కొంచెం శ్రద్ధ పెట్టి గమనించాలి. - రవిచంద్ర (చర్చ) 08:44, 5 ఆగస్టు 2020 (UTC)
- రవిచంద్ర గారూ, అనువాద పరికరం వాడడం వలన నా ఉత్పాదకత బాగా పెరిగిందండి. సైన్సు వ్యాసాల్లో ఈ పెరుగుదల తక్కువగా ఉంటుంది (పెరుగుదల ఖాయంగా ఉంటుంది కానీ తక్కువ) గానీ, చరిత్ర, జీవిత చరిత్ర, సినిమాలు,.. ఇలాంటి వ్యాసాల్లో నైతే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చెయాల్సిన పని అనువాద దోషాలను సరిచెయ్యడమే (ఖచ్చితంగా చేసి తీరాల్సిన పని ఇది. సవరణలు చెయ్యకుండా ప్రచురించనే కూడదు - మీకు తెలియందేమీ కాదనుకోండి). పరికరం అలవాటయ్యే కొద్దీ అది ఎక్కడెక్కడ తప్పులు చేస్తుందో, ఎలాంటి తప్పులు చేస్తుందో మనకు తెలిసిపోవడం వలన దోషాలను సవరించే వేగం కూడా పెరుగుతుందండి. రోజుకు అర లక్ష బైట్ల అనువాదం అవలీలగా చేసిపారెయ్యొచ్చు. కొద్దిగా ఎక్కువ సేపు పనిచేస్తే లక్ష చెయ్యడం ఒక లెక్కే కాదు. నేను ముందుగా అనువాదం చెయ్యాల్సిన సినిమా వ్యాసాలు ఓ పది పదిహేనింటిని ఎంచుకుని (వీటన్నిటికీ ఇంగ్లీషులో వ్యాసాలుంటాయన్నమాట) ముందే పరికరం లోకి ఎక్కించుకుంటున్నాను. ఇక ఆ తరువాత ఒక్కోటీ అనువదించడం, దోషాలను సవరించడం ప్రచురించడం (కాపీ చేసి పేస్టించడం) - అంతే. ఇవ్వాళ, నిన్నా, మొన్నా ఈ మూడు రోజుల్లోనూ 42 సినిమా వ్యాసాలను అనువదించాను, 3 లక్షల బైట్ల పైచిలుకు చేర్చాను. రోజుకు ఐదు గంటల చొప్పున పదిహేను గంటల పని. అందరం, మనందరం ఇలాగే పని చెయ్యాలని నా కోరిక. అందులో స్పీడుంది, వీలుంది, వికీకి మేలుంది. __చదువరి (చర్చ • రచనలు) 14:19, 5 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారూ, నేను అనువాద పరికరం వాడటం మొదలు పెట్టాను. చిలక్కొట్టుడు వ్యాసం ఇలానే రాశాను. ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలుంటే పని బాగా సులువవుతుంది. అలవాటు అయ్యేకొద్దీ పని సులువు అవుతుందనుకుంటాను. - రవిచంద్ర (చర్చ) 07:57, 6 ఆగస్టు 2020 (UTC)
- రవిచంద్ర గారూ, శుభం. అలవాటైతే దానితో పని నల్లేరుపై నడకే. మనం చేసే సవరణలన్నీ అక్కడే చెయ్యాలి. అప్పుడు సరిగ్గా ఎలా చెయ్యాలో అది నేర్చుకుంటుంది.
- ఈ పరికరాన్ని మనం మాలిమి చేసుకోవాలి, తరువాత దాని చేత సేవ చేయించుకోవాలి. చివరికి బానిస చేసుకోవాలి. ఫ్లై బై నైట్ అనువాదగాళ్ళ చేత 2000 వ్యాసాలు రాయించి మన మొహాన పారేయించిన పాపం ఈ పరికరానిదే. అది చేసిన పాడుపనికి గాను అంతకు వందింతలు వెయ్యింతలు దానిచేత మంచిపనులు చేయించి మనందరం కసి తీర్చుకోవాలి, తీర్చుకుందాం. __చదువరి (చర్చ • రచనలు) 08:55, 6 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారూ, నేను అనువాద పరికరం వాడటం మొదలు పెట్టాను. చిలక్కొట్టుడు వ్యాసం ఇలానే రాశాను. ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలుంటే పని బాగా సులువవుతుంది. అలవాటు అయ్యేకొద్దీ పని సులువు అవుతుందనుకుంటాను. - రవిచంద్ర (చర్చ) 07:57, 6 ఆగస్టు 2020 (UTC)
- రవిచంద్ర గారూ, అనువాద పరికరం వాడడం వలన నా ఉత్పాదకత బాగా పెరిగిందండి. సైన్సు వ్యాసాల్లో ఈ పెరుగుదల తక్కువగా ఉంటుంది (పెరుగుదల ఖాయంగా ఉంటుంది కానీ తక్కువ) గానీ, చరిత్ర, జీవిత చరిత్ర, సినిమాలు,.. ఇలాంటి వ్యాసాల్లో నైతే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చెయాల్సిన పని అనువాద దోషాలను సరిచెయ్యడమే (ఖచ్చితంగా చేసి తీరాల్సిన పని ఇది. సవరణలు చెయ్యకుండా ప్రచురించనే కూడదు - మీకు తెలియందేమీ కాదనుకోండి). పరికరం అలవాటయ్యే కొద్దీ అది ఎక్కడెక్కడ తప్పులు చేస్తుందో, ఎలాంటి తప్పులు చేస్తుందో మనకు తెలిసిపోవడం వలన దోషాలను సవరించే వేగం కూడా పెరుగుతుందండి. రోజుకు అర లక్ష బైట్ల అనువాదం అవలీలగా చేసిపారెయ్యొచ్చు. కొద్దిగా ఎక్కువ సేపు పనిచేస్తే లక్ష చెయ్యడం ఒక లెక్కే కాదు. నేను ముందుగా అనువాదం చెయ్యాల్సిన సినిమా వ్యాసాలు ఓ పది పదిహేనింటిని ఎంచుకుని (వీటన్నిటికీ ఇంగ్లీషులో వ్యాసాలుంటాయన్నమాట) ముందే పరికరం లోకి ఎక్కించుకుంటున్నాను. ఇక ఆ తరువాత ఒక్కోటీ అనువదించడం, దోషాలను సవరించడం ప్రచురించడం (కాపీ చేసి పేస్టించడం) - అంతే. ఇవ్వాళ, నిన్నా, మొన్నా ఈ మూడు రోజుల్లోనూ 42 సినిమా వ్యాసాలను అనువదించాను, 3 లక్షల బైట్ల పైచిలుకు చేర్చాను. రోజుకు ఐదు గంటల చొప్పున పదిహేను గంటల పని. అందరం, మనందరం ఇలాగే పని చెయ్యాలని నా కోరిక. అందులో స్పీడుంది, వీలుంది, వికీకి మేలుంది. __చదువరి (చర్చ • రచనలు) 14:19, 5 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారూ, ఈ పద్ధతి బాగుంది సర్. ఎప్పుడైనా మీరు అనువాద యంత్రాన్ని ఎలా వాడుతున్నారో పరిశీలించి చూడాలి. నేను మామూలుగా వాడేది translate.google.com మీరు వికీలో పరికరాలు కూడా వాడుతున్నట్లుంది. నేను కొంచెం శ్రద్ధ పెట్టి గమనించాలి. - రవిచంద్ర (చర్చ) 08:44, 5 ఆగస్టు 2020 (UTC)
- రవిచంద్ర గారూ, నా వేగం సంగతి ఏంటంటే - దానికి రెండు కారణాలున్నై - 1. నేను చేసేవి దాదాపుగా అన్నీ అనువాదాలే. 2. యంత్రంతో అనువాదం చేస్తాను. నేను పెట్టే టైమంతా యంత్రానువాదాన్ని సరి చేసేందుకే, అందుకే ఆ వేగం. జై గూగుల్ అనువాద యంత్రం! __చదువరి (చర్చ • రచనలు) 00:16, 5 ఆగస్టు 2020 (UTC)
- మీరందరూ చాలా వేగంగా పనిచేస్తున్నారు. నేను మీ వేగాన్ని అందుకోలేకుండా ఉన్నాను. :-) - రవిచంద్ర (చర్చ) 08:55, 4 ఆగస్టు 2020 (UTC)
లింకులు లభించడం లేదు
[మార్చు]వర్గం:కాలం మొలక వ్యాసాలు లో మరో మూడు మిగిలి ఉన్నాయి వాటికి లింకులు లభించడంలేదు, వాటికి లింకులు ఇతర భాషల్లో లభించడంలేదు. కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృతం అన్ని భాషల్లోనూ వెతికిన తెలుగు చాలా నయం అన్ని భాషల్లోనూ, చాలా వ్యాసాలు మొలకలు గానే ఉన్నాయి. ఈ వ్యాసం గురించి కాదు, చాలా వ్యాసాలు వెతికాను తెలుగులో ఉన్నంత సమాచారం, ఇతర భాషల్లో ఉండదు, తెలుగులో చాలా సమాచారం ఉంటుంది. వర్గం:కాలం మొలక వ్యాసాలు లో మూడు వ్యాసాలు మిగిలి ఉండగా మరెవరైనా వాటిని విస్తరించాలని మనవి. ఇందులో కాలములు వ్యాసమును విస్తరించగా ఋతువులు దారిలో చర్చ:కాలములు వెళ్ళింది... దాన్ని సరి చేయగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 16:13, 4 ఆగస్టు 2020 (UTC)
- రచ్చబంండలో ప్రభాకర్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన విభాగం ఇక్కడ చేర్చటమైనది.--యర్రా రామారావు (చర్చ) 17:16, 4 ఆగస్టు 2020 (UTC)
- ఈ వర్గంలో మిగిలిన మూడు మొలక వ్యాసాలు నేను విస్తరించాను.ఈ వర్గం పూర్తిగా ఖాళీ చేయబడింది.ఇది పూరైన రెండవ ఖాళీ వర్గం.--యర్రా రామారావు (చర్చ) 10:11, 5 ఆగస్టు 2020 (UTC)
- మళ్ళీ చప్పట్లు! __చదువరి (చర్చ • రచనలు) 14:06, 5 ఆగస్టు 2020 (UTC)
- ఈ వర్గంలో మిగిలిన మూడు మొలక వ్యాసాలు నేను విస్తరించాను.ఈ వర్గం పూర్తిగా ఖాళీ చేయబడింది.ఇది పూరైన రెండవ ఖాళీ వర్గం.--యర్రా రామారావు (చర్చ) 10:11, 5 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారు 2 వ మొలక వ్యాసాలు వర్గం పూర్తిగా ఖాళీ చేయబడింది. చప్పట్లు! మీకు ధన్యవాదాలు ... ప్రభాకర్ గౌడ్ నోముల 19:29, 5 ఆగస్టు 2020 (UTC)
వ్యాసాలు పరిశీలన
[మార్చు]చదువరి గారూ తదనుగుణంగా ప్రాజెక్టు పేజీలో సవరణలు కొరకు ఈ వ్యాసాలు పరిశీలించిండి.
- చర్చ:అప్సరసలు (జాబితా)
- చర్చ:సంఘటన
- జాజి
- బంతిపువ్వు
- షోరియా
- అమరాంథేసి
- అలంకార మొక్క
- మల్బరీ
- ఆస్పరాగేసి
- ఊట మొక్క
- ఎక్లిప్టా
- రాళ్లమొక్క
- ఎడారి టేకు
- సరస్వతి కాలువ
- పరశురామ జయంతి
ఇందులో పై రెండు చర్చా పేజీలు అందులో మొదటిది జాబితాలుకు చెందినది.రెండవది మొలక స్థాయి నుండి విస్తరించాను.అయినా ఇది అయోమయనివృత్తిగా మార్చవచ్చు.3 నుండి 11 వరకు Prasharma681 గారు విస్తరించారు.మొలక మూసలు తొలగించలేదు. చివరి రెండు ముందుగానే మొలక స్థాయి దాటిన వ్యాసాలు.పరిశీలించిగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:01, 5 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, గతంలో వీటి గురించి మీరు నాకు చెప్పిన తరువాత వీటీని చూసాను. కొన్నిటి పరిమాణం సరిగ్గా మొలక స్థాయిని దాటి ఉంది. కొన్నిటిలో ఇతర పరిశీలనలున్నాయి. వాటి గురించి Prasharma681 గారితో మాట్లాడదామనుకుని ఆగాను (నేను అంతకు ముందే ఆయనతో వేరే విషయంలో మాట్లడుతూ ఉన్నాను లెండి). ఇవి అయ్యాక వాటిని లెక్క లోకి తిసుకుందామను కున్నాను. అయితే ఆయనతో మాట్టాడ్డం నాకు కుదరలేదు. ఆ పని అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మీరు చేసారు. సరే ఇక వీటిని లెక్క లోకి తీసుకుంటాను. వాడుకరి:Prasharma681 గారూ, మీరు చేసిన పనులను ఒకచో చేరుస్తూ మీ కృషి పేజీని సృష్టించుకోగలరు. నమూనా కోసం చదువరి కృషి పేజీ చూడవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 05:27, 6 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారూ పై వాటిలో మొదటి రెండు వ్యాసాలు చర్చా పేజీలు అభిప్రాయం తెలపండి. , చివరి రెండు వ్యాసాలు వీటిని కూడా పరిశీలించండి.--యర్రా రామారావు (చర్చ) 05:37, 6 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారూ..
- పరశురామ జయంతి పేజీలోని సమాచారం.. ఉన్నంతవరకూ ఆ సమాచారం ఓకే.
- సరస్వతి కాలువ పేజీలో స్సరస్వై కాలువ గురించిన సమాచారం తక్కువగా ఉంది. ఇతర సమాచారం ఎక్కువగా ఉందై అని నాకు అనిపించింది. మరింత సమాచారం చేర్చాలనుకుంటాను. ఈ లింకు పనికొస్తుందేమో చూడండి.
- పై రెండు పేజీలపై నా అభిప్రాయం అక్కడే రాసాను.
- __చదువరి (చర్చ • రచనలు) 08:48, 6 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారూ..
- చదువరి గారూ పై వాటిలో మొదటి రెండు వ్యాసాలు చర్చా పేజీలు అభిప్రాయం తెలపండి. , చివరి రెండు వ్యాసాలు వీటిని కూడా పరిశీలించండి.--యర్రా రామారావు (చర్చ) 05:37, 6 ఆగస్టు 2020 (UTC)
ప్రత్యేక పేజీలలోని చిన్నపేజీలలో ఈ రోజుకు మొలక వ్యాసాల (2048 బైట్లు) స్థానం
[మార్చు]ఈ ప్రాజెక్టు పేజీలోని అన్ని మొలక వ్యాసాలు ప్రాజెక్టు మొదలుపెట్టేముందు, ప్రత్యేక పేజీలులోని చిన్న పేజీలు నుండి 2048 బైట్లులోపు 6560 వ.సంఖ్య వరకు తీసుకొనబడినవి.ఈ రోజు అదే ప్రత్యేక పేజీలులోని చిన్న పేజీలు పరిశీలించగా 2048 బైట్లులోపు మొలక వ్యాసాల సంఖ్య 2020 ఆగష్టు 05 రాత్రి 10.30.ని.కు (చరితం) దేశాల జాబితా – వైశాల్యం ప్రకారం – చిత్రపటం రూపంలో [2,048 బైట్లు] అనే వ్యాసం 4963 వ.సంఖ్య గా ఉంది.అంటే తేడా 6653 - 4963 =1690 మొలక వ్యాసాలకు పరిష్కారం లభించింది. గమనించగోరుచున్నాం.--యర్రా రామారావు (చర్చ) 17:09, 5 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావుగారూ, మనం విస్తరించినవి 1400. తొలగించినవి సుమారు 125. పొరపాటున మొలకలనుకుని, ఆ తరువాత మొలకల జాబితా నుండి తీసివేసినవి మరో పాతిక ఉండవచ్చు. అన్నీ కలిపి 1550. ఇంకా 150 దాకా తేడా వస్తోంది. మీరు 2048 బైట్ల లోపు పేజీలనే చూసారు. అయితే మనం పెట్టిన మొలక మూస వలన ఈ సైజు మరో 18 -20 బైట్లు పెరుగుతుంది. అంచేత ~2070 వరకూ కూడా చూడాలి. ఆ సైజు వరకూ ఉండేవాటిలో అన్నీ కాదుగానీ కొన్ని మొలకల జాబితాలో చేరే అవకాశం ఉంది. ఉదాహరణకు పకోడీ (2064 బైట్లు), అటుకులు (2065 బైట్లు) కూడా మొలకలే. వాటిని కలుపుకున్నా మరో 50 కి మించకపోవచ్చు. అంటే ఇంకో 100 తేడా ఎక్కడొచ్చిందో తేలాలి. చూద్దాం.. __చదువరి (చర్చ • రచనలు) 05:46, 6 ఆగస్టు 2020 (UTC)
- మళ్లీ ఒకసారి పరిశీలిస్తాను.--యర్రా రామారావు (చర్చ) 06:02, 6 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారూ సినిమా వ్యాసాల్లోనైతే ఈ మొలక మూస 56 బైట్లుంది. అంటే 2047+56 = 2103 బైట్ల వరకూ కూడా మొలకలుండొచ్చన్నమాట. కాబట్టి లెక్క సుమారుగా సరిపోవచ్చులెండి. అంత సీరియస్సు సంగతేమీ కాదిది. దానిపై పెద్దగా టైం పెట్టక్కర్లేదనుకుంటాను. __చదువరి (చర్చ • రచనలు) 09:42, 7 ఆగస్టు 2020 (UTC)
- మళ్లీ ఒకసారి పరిశీలిస్తాను.--యర్రా రామారావు (చర్చ) 06:02, 6 ఆగస్టు 2020 (UTC)
ఖాళీ అయిన ఘటనలు వర్గం
[మార్చు]- వర్గం:ఘటన మొలక వ్యాసాలు వర్గంలో ఉన్న మొలక వ్యాసాలన్నిటినీ విస్తరించబడినవి.ఇది ఖాళీ అయిన మూడవ వర్గం.--యర్రా రామారావు (చర్చ) 08:04, 7 ఆగస్టు 2020 (UTC)
- మూడోసారి చప్పట్లు! __చదువరి (చర్చ • రచనలు) 09:14, 7 ఆగస్టు 2020 (UTC)
నాలుగవ వర్గం ఖాళీకి అవకాశం
[మార్చు]వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు ఈ వర్గంలో చివరిగా 9 వ్యాసాలు ఉండగా వరుసగా 5 వ్యాసాలు విస్తరించాను.మిగిలిన వ్యాసాలు విస్తరించటానికి నా నాలెడ్జ్ చాలదనిపిస్తుంది.కావున మిగిలిన నాలుగు అవకాశం ఉంటే వెంకటరమణ గారు, చదువరి గారు విస్తరించగోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:25, 10 ఆగస్టు 2020 (UTC)
- అలాగే సార్. __చదువరి (చర్చ • రచనలు) 05:41, 11 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, అయిపోయింది. వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు కూడా ఖాళీ. ఇంకోసారి చప్పట్లు కొట్టొచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 10:49, 11 ఆగస్టు 2020 (UTC)
- చప్పట్లు.ఇంకొకటి ఖాళీ చేయటానికి ప్రయత్నిద్దాం.--యర్రా రామారావు (చర్చ) 10:52, 11 ఆగస్టు 2020 (UTC)
1600 దాటేసాం
[మార్చు]ఆగస్టు 12 ముగిసే నాటికి 1650 వ్యాసాల దాకా మొలకలను విస్తరించాం. ఈ 12 రోజుల్లోనూ 350 పైగానే విస్తరించాం. ప్రాజెక్టు గడువు ముగిసేందుకు ఇంకో 19 రోజులున్నై, లక్ష్యం చేరేందుకు ఇంకో 350 చెయ్యాలి. ఈ వేగంతో చేస్తే లక్ష్యాన్ని కొట్టడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. __చదువరి (చర్చ • రచనలు) 02:41, 13 ఆగస్టు 2020 (UTC)
1700 దాటేసాం
[మార్చు]ఆగస్టు 15 నాటికి 1700 వ్యాసాల సంఖ్యను దాటేసాం. విస్తరించినవి 1681, విలీనాలు దారిమార్పులు 50 - వెరసి 1731 (ఇవి ఆ రెండు వర్గాల్లోని సంఖ్యలు). వాడుకరుల జాబితాల్లోకి ఎక్కాల్సినవి (పవన్ సంతోష్ గారు, రామారావు గారు చేసినవి) మరో 20 దాకా ఉంటాయనుకుంటున్నాను. అవి కూడా కలిపితే 1750 అవుతాయి. ఈ నెలలో అయిపోయిన 15 రోజుల్లో 500 వ్యాసాలను విస్తరించాం. గత 6 రోజుల్లోను ఒక్కోరోజున విస్తరించిన వ్యాసాల సంఖ్య ఏనాడూ 40 కి తగ్గలేదు.
పైన చూపినవి వర్గాల్లో చేరిన వ్యాసాల గణాంకాలు -ఖచ్చితంగా లెక్కతేలిన వన్నమాట. ఆయా వర్గాల్లో మిగిలిన వ్యాసాల సంఖ్య చూస్తే అది 1781 అని చూపిస్తోంది. ఈ తేడాకు రకరకాల కారణాలున్నాయి. వాడుకరులు తమ కృషి పేజీని ఇంకా తాజాకరించచకపోవడం, కొన్ని తొలగింపులూ, మొలక కానందదున మూసల తొలగింపులూ పూర్తిగా నమోదు కాకపోవడం వంటివి కారణాలు. ఆ తేడాను సరిచేదిద్దే ప్రయత్నంలో నిన్న సగం రోజంతా గడిచింది నాకు. కొన్ని తేడాలను సరిచెయ్యగలిగాను. ఈ క్రమంలో వాడుకరి:Rajasekhar1961 గారు 6 వ్యాసాలను విస్తరించినట్లు గమనించాను. అయితే ఆయన తన కృషి పేజీని సృష్టించనందున ఈ సంగతి నాకు నిన్నటి దాకా తెలియలేదు, అవి నమోదు కాలేదు. అలా ఇంకా ఎవరైనా ఉన్నారేమో తెలియదు. అలాంటి విస్తరణలేవైనా మీ దృష్టిలో ఉంటే ఇక్కడ రాయండి. వాటిని కూడా చేర్చుతాను.
ఎన్ని మొలకలను విస్తరించామన్నది ముఖ్యమే.., అయితే, అసలు చేసామా లేదా అన్నది దాని కంటే ముఖ్యమైనది. చేసిన కృషిని వెల్లడి చెయ్యాలి. ఏ ఒక్కరి కృషినైనా ప్రాజెక్టు గుర్తించకపోతే ప్రాజెక్టు ఆ మేరకు సఫలం కానట్టే. 100% సఫలం కావాలంటే 100% కృషి నమోదు కావాల్సిందే. కాబట్టి క్రింది వాడుకరులను తమ కృషి పేజీలని సృష్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
- వాడుకరి:Rajasekhar1961 (నాకు తెలిసినవి 6 పేజీలు)
- వాడుకరి:B.K.Viswanadh (నాకు తెలిసినవి 2 పేజీలు)
- వాడుకరి:Naidugari Jayanna (నాకు తెలిసినది ఒక పేజీ)
- వాడుకరి:దేవుడు (నాకు తెలిసినది ఒక పేజీ)
- వాడుకరి:Prasharma681 (నాకు తెలిసినవి 10 పేజీలు)
- వాడుకరి:Dollyrajupslp (నాకు తెలిసినది ఒక పేజీ)
- వాడుకరి:సాయికిరణ్ (16.08.2020 నాటికి ఒక పేజీ)
ధన్యవాదాలతో__చదువరి (చర్చ • రచనలు) 05:24, 16 ఆగస్టు 2020 (UTC)
పై వాడుకరులు విస్తరించిన పేజీల జాబితా ఇది:
1 | దేవుడు | చిన్మయారణ్యం | వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు |
1 | Visvanadh BK | మకర తోరణం | వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు |
2 | Visvanadh BK | శకుని | వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు |
1 | Naidugari Jayanna | వల్లభాపురం జనార్ధన | వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు |
1 | Prasharma681 | మల్బరీ | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
2 | Prasharma681 | బంతిపువ్వు | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
3 | Prasharma681 | షోరియా | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
4 | Prasharma681 | ఆస్పరాగేసి | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
5 | Prasharma681 | జాజి | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
6 | Prasharma681 | ఎక్లిప్టా | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
7 | Prasharma681 | ఎడారి టేకు | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
8 | Prasharma681 | హరిద్ర | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
9 | Prasharma681 | అలంకార మొక్క | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
10 | Prasharma681 | ఊట మొక్క | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
11 | Prasharma681 | అమరాంథేసి | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు |
1 | Rajasekhar1961 | స్మృతికాలపు స్త్రీలు | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు |
2 | Rajasekhar1961 | నీతి చంద్రిక | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు |
3 | Rajasekhar1961 | హరవిలాసము | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు |
4 | Rajasekhar1961 | బొబ్బిలియుద్ధనాటకము | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు |
5 | Rajasekhar1961 | వ్రతకథలు | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు |
6 | Rajasekhar1961 | పూర్వగాథాలహరి | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు |
1 | సాయికిరణ్ | సరస్వతి కాలువ | వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు |
మరో 3 వర్గాలు ఖాళీ చేసాం
[మార్చు]ఈ మూడు వర్గాలుతో కలిపి మొత్తం 40 వర్గాలుకు, ఏడు వర్గాలు ఖాళీ అయినవి.ఆశించిన టార్గెట్ పూర్తి కావటానికి ఈ ప్రాజెక్టు పనిలో సహకరించుచున్న గౌరవ వికీపీడియన్లు అందరికి ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 03:13, 17 ఆగస్టు 2020 (UTC)
- ఆర్థిక వర్గంలో ఇంకో రెండున్నై. దాన్ని అవగొట్టేద్దాం. ఆ తరవాత 15 మొలకలతో వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు, 16 మొలకలతో వర్గం:ఆటల మొలక వ్యాసాలు ఉన్నాయి. వాటి సంగతి కూడా పరిశీలించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 06:33, 18 ఆగస్టు 2020 (UTC)
1800 వెనక్కి పోయింది
[మార్చు]విస్తరణ వాన మామూలుగా కురవడంలా.. ముసురు, జడివాన, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ అన్నీ జరుగుతున్నై. 45, 45, 40, 44, 40, 43, 47, 47 - ఇదీ గత 8 రోజుల్లో విస్తరించిన వ్యాసాల వరస. మొత్తం 351.
1800 దాటేసాం. 1767 విస్తరణలు, 50 దారిమార్పులతో (ఈ రెండు వర్గాల్లోని పేజీల సంఖ్యలు) కలిపి ప్రస్తుతం మొత్తం 1817. యర్రా రామారావుగారు, పవన్ సంతోష్ గారు తమ కృషిలో చేర్చాల్సిన వాటిని కూడా కలిపితే 1850 దాటేస్తాం. అలాగే మొలక స్థాఅయి దాటినా మూస తీసెయ్యనివి నిన్న 55 పేజీల దాకా గమనించాను. వాటిలో ఒక పదింటిపై పని ఐపోయిందనుకున్నా ఇంకో 45 ఉంటాయి. అన్నీ కలిపితే 1900 చేరినట్టనుకోవచ్చు. లక్ష్యపు పొలిమేర దాకా వచ్చేసాం. ఇంకో రెండు రోజుల్లో కొట్టేస్తాం. లక్ష్యాన్ని చేరినా, నెలాఖరు దాకా సమయముంది కాబట్టి ఇదే వేగాన్ని కొనసాగిద్దాం. వీలైనంత బోనసు కొడదాం. ఇకనుండి ప్రతీరోజూ గణాంకాలు చెప్పుకుందాం. __చదువరి (చర్చ • రచనలు) 03:11, 18 ఆగస్టు 2020 (UTC)
- చదువరి గారూ నేను నా కృషి జాబితా పొందుపర్చాను.అందులో నిన్న విస్తరించిన మూడు వ్యాసాలు మాత్రమే కలపాలి.గమనించగలరు. అనుకున్న గమనాన్ని దాటటానికి ఎంతో సమయం పట్టదులాగా ఉంది.మీ పరిశీలన ఎప్పటికప్పుడు అమోఘం.--యర్రా రామారావు (చర్చ) 03:24, 18 ఆగస్టు 2020 (UTC)
- మీ కృషిని కూడా వర్గం లోకి చేర్చేసాను సార్. __చదువరి (చర్చ • రచనలు) 04:07, 18 ఆగస్టు 2020 (UTC)
మొలక సరిహద్దు దగ్గర ఉన్న పేజీలు
[మార్చు]కింది జాబితా లోని పేజీలు మొలక స్థాయిని కొద్దిగా దాటి ఉన్నాయి. మొలక మూసను తీసేస్తే 2 కెబి లోపుకు పడిపోతాయన్నమాట. వీటికి కొంత సమాచారం చేరిస్తే నిరాక్షేపణీయంగా మొలక తీసెయ్యవచ్చు. ఈ జాబితా మీద ఖచ్చితంగా పనిచెయ్యాలనేమీ లేదు. ప్రాజెక్టు సభ్యుల గమనింపు కోసం ఇక్కడ జాబితా చేస్తున్నానంతే. (వీటిలో మనం సృష్టించినవేమైనా ఉంటే మనమే విస్తరించుకోవచ్చు. - అదొక ఉపయోగం).
సం. | పేజీ పేరు | బైట్లు |
---|---|---|
1 | అమ్మమ్మ చదువు (పుస్తకం) | 2188 |
2 | శ్రీనివాస కళ్యాణం (2018 సినిమా) | 2183 |
3 | గౌరవము (సినిమా) | 2176 |
4 | పుణ్యభూమి కళ్ళు తెరిచింది | 2169 |
5 | ఉపమాలంకారం | 2154 |
6 | హేవిలంబి | 2154 |
7 | జిమ్పి జిమ్పి చెట్టు | 2140 |
8 | గోళం | 2136 |
9 | మాయామశ్చీంద్ర | 2132 |
10 | ఘట్టమనేని హనుమంతరావు | 2129 |
11 | ఆండ్రాయిడ్ (రోబోట్) | 2127 |
12 | పద్మవ్యూహం (1973 సినిమా) | 2122 |
13 | ఒలంపస్ మోన్స్ | 2121 |
14 | వధూవరులు | 2120 |
15 | ధ్రువోపాఖ్యానము (పుస్తకం) | 2119 |
16 | పార్వతి మళ్ళీ పుట్టింది | 2115 |
17 | చింతామణి (పత్రిక) | 2111 |
18 | భలేకాపురం | 2109 |
19 | గొప్పింటి అమ్మాయి | 2109 |
20 | ఆలమట్టి ప్రాజెక్టు | 2108 |
21 | ఐక్య జీహాద్ సంఘం | 2108 |
22 | మనసు - మమత | 2103 |
23 | ఆక్వా కల్చర్ | 2101 |
24 | సతీ అనసూయ (1971 సినిమా) | 2098 |
25 | మహాలక్ష్మి మహిమ | 2096 |
26 | గుళ్లో పెళ్లి | 2095 |
27 | సంసారం (1975 సినిమా) | 2095 |
28 | మాల్వేలిస్ | 2095 |
29 | గోగర్భం ఆనకట్ట | 2095 |
30 | సెంటీమీటరు | 2095 |
31 | ఉదరవితానము | 2092 |
32 | రోవర్ (అంతరిక్ష అన్వేషణ) | 2091 |
33 | నా పేరే భగవాన్ | 2090 |
34 | కాంచనమాల | 2090 |
35 | కోడెనాగు | 2089 |
36 | గ్రీబ్ పక్షి | 2087 |
37 | ఉత్సవమూర్తి | 2087 |
38 | ప్రియతమా తమా సంగీతం | 2087 |
39 | ఒక తల్లి పిల్లలు | 2087 |
40 | లంగోటి | 2086 |
41 | జాతీయ | 2086 |
42 | చిలిపి మొగుడు | 2085 |
43 | దూరప్రసారం | 2085 |
44 | సావిత్రీ చరిత్రము (హరికథ) | 2085 |
45 | మగమహారాజు | 2085 |
46 | విజయోస్తు | 2084 |
47 | సాఫ్టువేరు వ్రాయు భాషలు | 2083 |
48 | పెంచికలపాడు (బేస్తవారిపేట) | 2083 |
49 | గుండమ్మగారి కృష్ణులు | 2083 |
50 | నాంచారెడ్డిపాలెం | 2083 |
51 | పెద్దిల్లు చిన్నిల్లు | 2082 |
52 | ముల్లంగి వేపుడు | 2081 |
53 | ఏనుగు సీల్ | 2080 |
54 | ఓపెన్ సోర్స్ ఫర్ యు | 2080 |
55 | సౌభాగ్యవతి | 2080 |
56 | ఇంటర్నెట్ చరిత్ర | 2078 |
57 | లొకట పండు | 2078 |
58 | ఉపజిహ్వ | 2077 |
59 | పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ | 2076 |
60 | బహిర్గత పరిహారం | 2076 |
61 | చిత్రకేతుఁడు | 2076 |
62 | కుమారీకంకణన్యాయం | 2076 |
63 | చత్వారము | 2075 |
64 | నాగ తుమ్మ | 2075 |
65 | విపుల | 2075 |
66 | సిగ | 2075 |
67 | చిమట మ్యూజిక్ | 2074 |
68 | పుట్టింటి గౌరవం (1975 సినిమా) | 2074 |
69 | పక్షిరాజా స్టుడియోస్ | 2074 |
70 | సాహసమే జీవితం | 2073 |
71 | మహేశా పాపవినాశా | 2073 |
72 | గుత్తావారిపాలెం (చందర్లపాడు) | 2072 |
73 | పరీధావి | 2072 |
74 | రాయల్ పామ్ | 2072 |
75 | సప్త చిరంజీవులు | 2072 |
76 | ప్రాణహిత (జాల పత్రిక) | 2071 |
77 | సీ ఫోర్ట్, మాస్ట్రో | 2071 |
78 | పూర్ణమ్మ కథ | 2071 |
79 | బహుమతి (ప్రైజ్) | 2071 |
80 | ఖుంగ్ | 2071 |
81 | డయోనియా | 2069 |
82 | అంకిరెడ్డిపల్లె (గిద్దలూరు మండలం) | 2068 |
83 | లైత్రేసి | 2067 |
84 | గురుగోవింద చరిత్ర | 2067 |
85 | హక్కు | 2066 |
86 | అటుకులు | 2065 |
87 | డాకస్ | 2065 |
88 | పకోడీ | 2064 |
89 | శ్వాస | 2063 |
90 | సాంకేతిక విద్యా మండలి | 2062 |
91 | నార్త్ జోన్ క్రికెట్ జట్టు | 2062 |
92 | మై సీక్రెట్ గార్డెన్ | 2062 |
93 | కామసూత్ర (సినిమా) | 2062 |
94 | రాధాకృష్ణ సంవాదము | 2061 |
95 | మృదులాస్థి | 2060 |
96 | రంగులకల | 2060 |
97 | కోర | 2060 |
98 | అష్టావింశతి-వ్యాసులు | 2060 |
99 | నవ్య | 2059 |
100 | కుల పురాణాలు | 2058 |
101 | శెలవు | 2058 |
కట్టెదురా వైకుంఠము..
[మార్చు]- 1857 + 50 = 1907 - వర్గాల్లో చేరిపోయిన విస్తరణలు
- మరో 40 దాకా - విస్తరణ/విలీనం పూర్తై కూడా ఇంకా రికార్డుల్లోకి ఎక్కనివి
- వెరసి 1947 - సుమారుగా ఇప్పటిదాకా అయినవి
ఇవీ ఇవ్వాళ ఉదయం 6 గంటలకు ఉన్న లెక్కలు. లక్ష్యానికి ఎదురుగా నిలబడ్డాం. సొరంగం తవ్వేవాడు చిట్టచివరి పొర దగ్గర ఉన్న క్షణం లాంటిది. ఆ కొద్దిపాటి మట్టినీ తవ్వేస్తే ఇక భళ్ళున వెలుతురు దూసుకొచ్చే క్షణమిది.
ఇక నిన్నటి రోజున జరిగిన పని చూస్తే కళ్ళు చెదిరే అంకెలు కనిపిస్తాయి.
- మొత్తం విస్తరణలు: 71. ఇది ప్రాజెక్టు రికార్డు. మామూలు రికార్డు కాదు, ఇప్పటి వరకూ ఉన్న రికార్డును (48) బదాబదలు చేసిన రికార్డిది. దానికంటే ఏకంగా 50% ఎక్కువ జరిగాయి నిన్న.
- మొత్తం చేర్చిన పాఠ్యం: 3 లక్షల బైట్ల పైచిలుకు. ఈ ప్రాజెక్టుకు ఇది రికార్డు
- నిన్న వ్యక్తిగత రికార్డులు కూడా బద్దలయ్యాయి
- వెంకటరమణ గారు 29 పేజీలను విస్తరించి, ఒక్కరోజున ఒక వ్యక్తి చేసిన విస్తరణల్లో ప్రాజెక్టు ఆల్ టైం రికార్డు స్థాపించారు.
- చదువరి 25 పేజీలు విస్తరించి తన వ్యక్తిగత రికార్డు నెలకొల్పారు.
- ప్రణయ్‌రాజ్ 12 పేజీలు విస్తరించి కొత్త వ్యక్తిగత రికార్డు నెలకొల్పారు.
మన తక్షణ కర్తవ్యం..
1. కింది జాబితా లోని పేజీలను విస్తరించారు గానీ మూస తిసెయ్యలేదు. ఆయ వాడుకరులకు చెప్పాను. కొందరు తీసేసారు. మరో ముప్పై దాకా తీసెయ్యలేదు. వాటిని మనమే తీసేద్దాం.
పేజీ | పరిమాణం (బైట్లు) | వాడుకరిపేరు |
ఆల్టర్నేటర్ | 9528 | Kasyap |
చెన్నకేశవస్వామి | 8416 | Katta Srinivasa Rao |
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ | 8361 | యర్రా రామారావు |
ఉత్పరివర్తనము | 8275 | Kasyap |
ఇన్‌ఫ్రాసౌండ్ | 8188 | Kasyap |
110 ఫిల్మ్ | 7811 | Kasyap |
ఆహారపు గొలుసు | 7703 | Kasyap |
అలోహం | 7544 | Kasyap |
ఉపరితలం | 6788 | Kasyap |
ఆప్టికల్ ఫిజిక్స్ | 6568 | Kasyap |
ఎలక్ట్రిక్ జనరేటర్ | 6479 | Kasyap |
ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ | 5807 | Kasyap |
కణుపు | 5795 | Prasharma681 |
ఒరైజా | 5783 | Prasharma681 |
అతిధ్వనులు | 5660 | Kasyap |
కనకాంబరాలు | 5625 | Prasharma681 |
ఒపర్కులినా | 5454 | Prasharma681 |
ఆగ్ఫా ఫోటో | 5442 | Kasyap |
కసింద | 5424 | Prasharma681 |
220 ఫిల్మ్ | 5415 | Kasyap |
ఏగిస | 5287 | Prasharma681 |
సతీ సుమతి | 5166 | స్వరలాసిక |
ఎర్ర జిల్లేడు | 5155 | Prasharma681 |
కనప | 5104 | Prasharma681 |
ఇష్క్ | 4765 | Pranayraj1985 |
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి | 4712 | Kasyap |
వజ్రం (సినిమా) | 4687 | Chaduvari |
కాకిచెరకు | 4609 | Prasharma681 |
పాత ముడివేముల | 4573 | Srinivasaprasad thurimella |
ముడివేముల | 4563 | Srinivasaprasad thurimella |
రాళ్లమొక్క | 4376 | Prasharma681 |
కాక్సీనియా | 4098 | Prasharma681 |
టచ్‌స్క్రీన్ | 4035 | HarshithaNallani |
అవుట్పుట్ డివైస్ | 3609 | Kasyap |
ఎర్ర వండ పూలు | 3258 | Prasharma681 |
పద్మాసనము | 3094 | Kasyap |
వదినగారి గాజులు (1955 సినిమా) | 3006 | స్వరలాసిక |
శ్రీ వేమన చరిత్ర | 2965 | స్వరలాసిక |
సన్నాయి అప్పన్న | 2849 | స్వరలాసిక |
తోడల్లుడు | 2584 | Katta Srinivasa Rao |
బైస దేవదాస్ | 2423 | K.Venkataramana |
పందిరి | 2418 | B.K.Viswanadh |
మహానంద | 2401 | స్వరలాసిక |
ప్రేమ యుద్ధం | 2381 | స్వరలాసిక |
ఇల్లే స్వర్గం | 2378 | స్వరలాసిక |
చెన్నకేశవుల రంగారావు | 2339 | K.Venkataramana |
పేద రైతు | 2328 | స్వరలాసిక |
వంశోద్ధారకుడు (1972 సినిమా) | 2301 | స్వరలాసిక |
మాధవయ్యగారి మనవడు | 2273 | రవిచంద్ర |
విశాలి | 2260 | స్వరలాసిక |
ఛాయా దేవి | 2249 | Pranayraj1985 |
దార్ల నరసింహాచార్యులు | 2224 | K.Venkataramana |
డాక్టర్ బాబు | 2216 | స్వరలాసిక |
ముహూర్త బలం | 2211 | స్వరలాసిక |
దేవుని గెలిచిన మానవుడు | 2188 | స్వరలాసిక |
2. అందరం మన కృషిని తాజాకరించాలి.
3. అందరం.. అందరం ఇవ్వాళ మనకు సాధ్యమైనన్ని పేజీలను విస్తరిద్దాం. సుమారుగా మరో యాభై పేజీలు చేస్తే ఇవ్వాళ కొట్టెయ్యొచ్చు.
ఇవ్వాళ కొట్టెయ్యాలి, ఇవ్వాళే కొట్టేద్దాం. రేపు తెల్లారి 6 గంటల దాకా గడువు మనకు. __చదువరి (చర్చ • రచనలు) 03:00, 19 ఆగస్టు 2020 (UTC)
- వెంకటరమణ గారు ప్రాజెక్టు రికార్డు, వ్యక్తిగత రికార్డు సాధించినందుకు, చదువరి , ప్రణయరాజ్ గారలు వ్యక్తిగత రికార్డులు సాధించినందుకు ప్రత్యేక అభినందనలు.--యర్రా రామారావు (చర్చ) 03:47, 19 ఆగస్టు 2020 (UTC)
- మీరందరు మంచి ఉత్సాహంతో పని చేస్తున్నారు. అందరికీ అభినందనలు. దురదృష్టవశాత్తూ మా వ్యక్తిగత పనులు మామూలు రోజుల్లో కన్నా ఎక్కువ అయిపోవడం వల్ల నేను అనుకున్నన్ని వ్యాసాలు విస్తరించలేకపోయాను. ఆఖరి రోజు వరకు కుదిరినప్పుడల్లా ఒకటో రెండో చేస్తుంటాను. కానీ నేను సెంచురీ చేయాలనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరింది. - రవిచంద్ర (చర్చ) 06:28, 19 ఆగస్టు 2020 (UTC)
- వెంకటరమణ గారు ప్రాజెక్టు రికార్డు, వ్యక్తిగత రికార్డు సాధించినందుకు, చదువరి , ప్రణయరాజ్ గారలు వ్యక్తిగత రికార్డులు సాధించినందుకు ప్రత్యేక అభినందనలు.--యర్రా రామారావు (చర్చ) 03:47, 19 ఆగస్టు 2020 (UTC)
విస్తరణల వరద మట్టాల నివేదిక
[మార్చు]సమయం | విస్తరణ వర్గంలో వ్యాసాల సంఖ్య (క) | దారిమార్పుల వర్గంలో వ్యాసాల సంఖ్య (గ) | క + గ | 40 మొలక వర్గాల ద్వారా సేకరించిన సంఖ్య |
---|---|---|---|---|
మ. 12:00 | 1887 | 60 | 1947 | 1978 |
మ. 1:00 | 1897 | 60 | 1957 | 1980 |
మ. 2:00 | 1902 | 60 | 1962 | 1986 |
మ. 3:00 | 1911 | 61 | 1972 | 1995 |
సా. 4:00 | 1913 | 61 | 1974 | 1997 |
సా. 5:00 | 1916 | 61 | 1977 | 2000 |
సా. 6:25 | 1920 | 61 | 1981 | 2004 |
సా. 7:05 | 1922 | 61 | 1983 | 2007 |
సా. 8:00 | 1927 | 61 | 1988 | 2012 |
రా. 9:00 | 1932 | 61 | 1993 | 2016 |
రా. 10:00 | 1939 | 61 | 2000 | 2023 |
లక్ష్యాన్ని సాధింఛేసాం. చప్పట్లు!!
- చదువరి
- ప్రణయ్‌రాజ్ వంగరి
- K.Venkataramana
- రవిచంద్ర
- యర్రా రామారావు
- స్వరలాసిక
- Ch Maheswara Raju
- పవన్ సంతోష్
- ప్రభాకర్ గౌడ్ నోముల
- కశ్యప్
- Rajasekhar1961
- B.K.Viswanadh
- వికి వాసు
- రాధిక
- Ramu
- Harshitha
- Dollyrajupslp
- Newwikiwave
- సాయికిరణ్
- దేవుడు
- నాయుడుగారి జయన్న
- Prasharma681
- Katta Srinivasa Rao
- 2000 వ్యాసాల విస్తరణను సాధించాం. అందరికీ అభినందనలు. __చదువరి (చర్చ • రచనలు) 16:44, 19 ఆగస్టు 2020 (UTC)
- అందరికీ అభినందనలు.--యర్రా రామారావు (చర్చ) 09:03, 20 ఆగస్టు 2020 (UTC)
- అందరికీ అభినందనలు , .. ఇంకా పది రోజులే :( Kasyap (చర్చ) 14:31, 20 ఆగస్టు 2020 (UTC)
- కష్టపడి వికీని నాణ్యత వైపు ఉరకలెత్తిస్తున్న అందరికీ అభినందనలు..B.K.Viswanadh (చర్చ)
చివరి ఘట్టంగా ఒకరోజు 24 గంటలు ఏకబిగిన విస్తరణ కార్యక్రమానికి ప్రతిపాదన
[మార్చు]మొలకల నియంత్రణకు ఒక నియంత్రణ విధానం 2013 ఏప్రిల్ 1 నుండి అమలులోకి తీసుకువస్తూ సముదాయం ఒక నిర్ణయం తీసుకుంది.దాని ప్రకారం మొలక వ్యాసాలును నియంత్రించటం, విస్తరించటంపై చాలా చర్చలు మాత్రమే జరిగాయి.ఆచరణాత్మకంగా ఎటువంటి పనులు జరుగలేదు.దానిని దృష్టిలో పెట్టుకుని మొలకలే కాకుండా,కొన్ని విస్తరించవలసిన వ్యాసాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ అనే ఒక మాదిరి ప్రాజెక్టు మొదటిసారిగా నొకదానిని నిర్వహించుకున్నాం.ఆ ప్రాజెక్టులో 263 వ్యాసాలు విస్తరించుట జరిగిందని అందరికి తెలుసు.ఇప్పుడు నిర్వహించే ఈ భారీ ప్రాజెక్టు వికీపీడియాకే తలమానికంలాంటిది.అలాంటి ఈ ప్రాజెక్టులో ముగింపు చివరలో అనగా జులై 30 ఆగస్టు 30 వతేదీ ఆదివారం ఉదయం గం.6.00 నుండి 31 వ తేదీ ఉదయం గం.6.00 లవరకు 24 గంటలు ఏకబిగిన విస్తరణ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుదనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదన చేస్తున్నాను.గౌరవ వికీపీడియన్లు దీనిమీద మీ అభిప్రాయాలు, స్పందనలు తెలియపర్చగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:30, 20 ఆగస్టు 2020 (UTC)
- చాలా బాగుంది ఈ ప్రతిపాదన యర్రా రామారావు గారు అయితే ఇది ఆగస్టు కదా :) ఈ నెల 30 వతేదీ ఆదివారం ఉదయం గం.6.00 నుండి 31 వ తేదీ ఉదయం గం.6.00 లవరకు 24 గంటలు వరకు ఎడిట్ థాన్ చెస్తే బాగుంటుంది , మీరు ఇచ్చిన స్పూర్థి తొ ఈ పది రొజులలో కనీసం వంద మొలకను అభివృద్ది చెస్తాను ! Kasyap (చర్చ) 14:38, 20 ఆగస్టు 2020 (UTC)
- కశ్యప్ గారూ మీ టార్గెట్ ప్రకటించి, స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు. --యర్రా రామారావు (చర్చ) 15:01, 20 ఆగస్టు 2020 (UTC)
- ఈ ప్రతిపాదన బాగుంది. ఇప్పటికే 2000 లక్ష్యం దాటేశాం. ఇంకా మరిన్ని వ్యాసాలు విస్తరించవలసి ఉంది. అలాగే చేద్దా. K.Venkataramana(talk) 02:41, 21 ఆగస్టు 2020 (UTC)
- నేన్రెడీ. __చదువరి (చర్చ • రచనలు) 10:17, 21 ఆగస్టు 2020 (UTC)
- నేను కూడా సిద్ధమే.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 16:34, 24 ఆగస్టు 2020 (UTC)
- కార్యక్రమం మొదలు అయింది --యర్రా రామారావు (చర్చ) 00:30, 30 ఆగస్టు 2020 (UTC)
- నేను చేరాను. __చదువరి (చర్చ • రచనలు) 00:43, 30 ఆగస్టు 2020 (UTC)
- కార్యక్రమం మొదలు అయింది --యర్రా రామారావు (చర్చ) 00:30, 30 ఆగస్టు 2020 (UTC)
ఆగస్టు 25 ఉదయానికి
[మార్చు]ఆగస్టు 25 ఉదయం సుమారు 6 గంటలకు ప్రాజెక్టు పురోగతి ఇలా ఉంది:
- విస్తరణ వర్గం లోకి చేరిన వ్యాసాల సంఖ్య: 2241
- విలీనం/దారిమార్పు చేసి సంబంధిత వర్గం లోకి చేరిన వ్యాసాల సంఖ్య: 62
- మొత్తం: 2303
లక్ష్యాన్ని దాటి 15% ముందుకెళ్ళాం. ఇంకో పది శాతం అవడం కష్టమేమీ కాదనిపిస్తోంది. చూద్దాం ఎక్కడి దాకా పోతామో.. __చదువరి (చర్చ • రచనలు) 02:51, 25 ఆగస్టు 2020 (UTC)
సినిమా మొలకలు + ఎన్వికీ లింకు --> ఓ జాబితా
[మార్చు]ప్రస్తుతం సినిమా మొలక వర్గంలో మిగిలిన 1600 చిల్లర పేజీల్లో 280 పేజీలకు మాత్రమే ఎన్వికీ లింకులున్నై. ప్రస్తుతం అలాంటి పేజీలను వెతుక్కోడం కష్టమై పోయింది, టైం పడుతోంది. అంచేత వీటన్నిటి జాబితా ఒకదాన్ని తయారుచేసి ఇక్కడ పెట్టాను. ఇక పేజీని ఎంచుకోవడానికి శ్రమ, టైమూ వృథా కాదు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 04:16, 25 ఆగస్టు 2020 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 08:18, 25 ఆగస్టు 2020 (UTC)
మన అనుభవాలు, స్పందనలు
[మార్చు]ఈ బృహత్తరమైన ప్రాజెక్టు ముగింపుకు చేరువ అవుతోంది. దిగ్విజయంగా ముగియబోతోంది. ఖచ్చితంగా అది పండుగ రోజే. అయితే అది లోచూపు సమయం. సమీక్షా సమయం. కొత్త ఆలోచనలను కలబోసుకునే సమయం కూడా. అంచేత, కింది మూడు అంశాలపై మన ఆలోచనలను ఇక్కడ పరుద్దాం. అయితే ఈ పని ఇప్పుడు కాదు, సెప్టెంబరు 1 - 5 తేదీల మధ్య చేద్దాం. (ఇది ప్రాజెక్టులో పాలుపంచుకున్న వాడుకరులకు మాత్రమే పరిమితం)
- ఈ మూడు నెలల్లోనూ ఏం చేసాం, ఎలా చేసాం, ఏ కష్టాలు పడ్డాం, ఎక్కడ తప్పులు చేసాం, ఎలా ఉంటే బాగుండేది, ఎలా ఉండకపోతే బాగుండేది.. వగైరాలపై మన ఆలోచనలను కలబోసుకుని మనం నేర్చుకున్న పాఠాలు అంటూ ఒక జాబితా తయారు చేసుకుందాం. తెవికీలో ఇక ముందు చేపట్టబోయే ప్రాజెక్టులకు అది కొంత ఉపయోగపడవచ్చు.
- ఇక ముందు సాముదాయికంగా ఏం చేద్దాం? కొత్త ప్రాజెక్టుల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? (చేస్తామా లేదా అనేది పక్కన పెట్టి అసలు పనులు ఏమేం ఉన్నాయో కలబోసుకుందాం)
- ఇక ముందు వ్యక్తిగతంగా తెవికీలో ఏయే పనులు చేద్దామని మీరు అనుకుంటున్నారు?
ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఆలోచనలుంటే ఇక్కడ రాయండి. __చదువరి (చర్చ • రచనలు) 04:30, 25 ఆగస్టు 2020 (UTC)
ఆగస్టు 26
[మార్చు]ఆగస్టు 26 ఉదయం సుమారు 6 గంటలకు ప్రాజెక్టు పురోగతి ఇలా ఉంది:
- విస్తరణ వర్గం లోకి చేరిన వ్యాసాల సంఖ్య: 2305
- విలీనం/దారిమార్పు చేసి సంబంధిత వర్గం లోకి చేరిన వ్యాసాల సంఖ్య: 62
- మొత్తం: 2367 వివిధ మొలక వర్గాల్లో ఉన్న పేజీల లెక్కతో సరిచూస్తే మాత్రం ఈ సంఖ్య 2436 ఉంది. గతంలో సుమారు 25, 30 దాకా ఉండే ఈ తేడా అకస్మాత్తుగా పెరిగి, 70 దాకా అయింది. ఎందుకో చూడాలి. రామారావు గారు ఓ ఇరవై దాకా పేజీలను విలీనం చేసి దారిమార్పులుగా చేసారు. అవి ఇంకా ఈ లెక్కలోకి రాలేదు. అవి కూడా కలిపితే తేడా కొంత తగ్గుతుంది.
లక్ష్యాన్ని దాటి 18% పైగా ముందుకెళ్ళాం. __చదువరి (చర్చ • రచనలు) 03:31, 26 ఆగస్టు 2020 (UTC)
- ఇవ్వాళ్టి విశేషాలు
- సినిమా మొలకల వర్గంలో వెయ్యి పేజీలను విస్తరించాం. ప్రస్తుతం ఆ సంఖ్య 1017.
- ఆగస్టు 25 న చేసిన మొత్తం విస్తరణలు+విలీనాల సంఖ్య: 89. ఇదొక కొత్త రికార్డు __చదువరి (చర్చ • రచనలు) 03:42, 26 ఆగస్టు 2020 (UTC)
- మాస్ వంటి వ్యాసాలు ఎటువంటి ప్రాధమిక సమాచారం లేకుండానే మొలక స్థాయి దాటిపోతున్నాయి. మూస, వర్గాలతో మొలక స్థాయి దాటిపోతున్నాయి. గమనించగలరు. K.Venkataramana(talk) 05:06, 26 ఆగస్టు 2020 (UTC)
- నిజమే, అలాంటి పేజీలున్నాయి. కానీ అవి ప్రస్తుతం మన ప్రాజెక్టు స్కోపులో భాగం కాదు. ఒకవేళ అలాంటి వాటిని కూడా చేర్చాలంటే పేజీ పరిమాణాన్ని 2048 కు పరిమితం చెయ్యకుండా మరింత ఎక్కువ సైజు ఉన్న పేజీలను కూడా చేర్చాల్సి ఉంటుంది. అది వేరే ప్రాజెక్టులో చేద్దాం. __చదువరి (చర్చ • రచనలు) 11:12, 26 ఆగస్టు 2020 (UTC)
- 2048 బైట్సు దాటిన అలాంటి వాటిని విస్తరణ ప్రాజెక్టు కింద చేపట్టవలసి ఉంది.ఈ ప్రాజెక్టు పూర్తైన తదుపరి ఆ ప్రాజెక్టు చేపడదాం.--యర్రా రామారావు (చర్చ) 11:23, 26 ఆగస్టు 2020 (UTC)
- అవును, అలాగే చేద్దాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 04:26, 27 ఆగస్టు 2020 (UTC)
- 2048 బైట్సు దాటిన అలాంటి వాటిని విస్తరణ ప్రాజెక్టు కింద చేపట్టవలసి ఉంది.ఈ ప్రాజెక్టు పూర్తైన తదుపరి ఆ ప్రాజెక్టు చేపడదాం.--యర్రా రామారావు (చర్చ) 11:23, 26 ఆగస్టు 2020 (UTC)
- నిజమే, అలాంటి పేజీలున్నాయి. కానీ అవి ప్రస్తుతం మన ప్రాజెక్టు స్కోపులో భాగం కాదు. ఒకవేళ అలాంటి వాటిని కూడా చేర్చాలంటే పేజీ పరిమాణాన్ని 2048 కు పరిమితం చెయ్యకుండా మరింత ఎక్కువ సైజు ఉన్న పేజీలను కూడా చేర్చాల్సి ఉంటుంది. అది వేరే ప్రాజెక్టులో చేద్దాం. __చదువరి (చర్చ • రచనలు) 11:12, 26 ఆగస్టు 2020 (UTC)
- మాస్ వంటి వ్యాసాలు ఎటువంటి ప్రాధమిక సమాచారం లేకుండానే మొలక స్థాయి దాటిపోతున్నాయి. మూస, వర్గాలతో మొలక స్థాయి దాటిపోతున్నాయి. గమనించగలరు. K.Venkataramana(talk) 05:06, 26 ఆగస్టు 2020 (UTC)
ఆగస్టు 27 ఉదయానికి
[మార్చు]ఆగస్టు 27 ఉదయం సుమారు 7:30 గంటలకు ప్రాజెక్టు పురోగతి ఇలా ఉంది:
- విస్తరణ వర్గం లోకి చేరిన వ్యాసాల సంఖ్య: 2371
- విలీనం/దారిమార్పు చేసి సంబంధిత వర్గం లోకి చేరిన వ్యాసాల సంఖ్య: 87
- -వెరసి 2458. వివిధ మొలక వర్గాల్లో ఉన్న పేజీల లెక్కతో సరిచూస్తే విస్తరణల సంఖ్య సరిగ్గా 2500 ఉంది. ఈ రెంటి మధ్య తేడా ప్రస్తుతం 42. మనం వివిధ వాడుకరులు నిర్ధారించిన కృషిని మాత్రమే అంతిమంగా లెక్క లోకి తీసుకుంటాం కాబట్టి ఇవ్వాళ్టి సంఖ్య: 2458. అందులోనూ విలీనాలు తొలగింపులూ కాకుండా 2000 చెయ్యాలనేది మన లక్ష్యం. ఆ ప్రకారం ఇవ్వాళ్టి లెక్క: 2371. (విలీనాలు చెయ్యకూడదని కాదు, అవసరమైన చోట్ల చెయ్యాల్సిందే, వాటిని మన కృషిలో పరిగణిస్తాం కూడా. కాకపోతే వాటిని విడిగా, వేరే వర్గంలో చూపిస్తాం.)
- పోతే, ఇంకా ఎవరైనా తమ కృషిని తాజాకరించాల్సి ఉందేమో పరిశీలించగలరు. గడువు తేదీకి దగ్గర పడుతున్నాం కాబట్టి వాడుకరులంతా తమతమ కృషిని ఎప్పటికప్పుడూ తాజాకరిస్తూ ఉండాలని వినతి.
__చదువరి (చర్చ • రచనలు) 03:25, 27 ఆగస్టు 2020 (UTC)
- ఈ లెక్కన చూస్తే 3000 వ్యాసాలు కూడా దాటేస్తాం అనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 04:28, 27 ఆగస్టు 2020 (UTC)
- :) __చదువరి (చర్చ • రచనలు) 09:42, 27 ఆగస్టు 2020 (UTC)
- ఈ లెక్కన చూస్తే 3000 వ్యాసాలు కూడా దాటేస్తాం అనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 04:28, 27 ఆగస్టు 2020 (UTC)
తుపాను వెలిసింది
[మార్చు]తుపాను వెలిసి, లెక్క తేలేసరికి ఈ వరైంది. వాడుకరి:యర్రా రామారావు గారు ఏమంటూ ఈ ఏకాహం పెట్టారో గానీ, ధణుతెగిరి పోయింది. నిన్న ఉదయం 6 గంటల నుండి ఇవ్వాళ ఉదయం 6 గంటల వరకూ 157 విస్తరణలు జరిగాయి. ఈ 24 గంటల్లో 7,70,000 పైచిలుకు బైట్లను చేర్చాం.
కశ్యప్ గారు 52 విస్తరణలు చేసి కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ 24 గంటల్లో ఆయన 4,24,000 పైచిలుకు బైట్లు చేర్చారు ఇది ఇంకో రికార్డు. అయితే ఆయన తన కృషి పేజీని తాజాకరించలేదు. నేను ఆయన రచనల పేజీ నుండి ఈ లెక్కలను తీసుకున్నాను. ఇందులో అంకెలు కొద్దిగా అటూ ఇటూ కావచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 05:18, 31 ఆగస్టు 2020 (UTC) ,
ధన్యవాదములు , యర్రా రామారావు గారు , చదువరి గారు ఈ రోజు మరికొన్ని మార్పులు చేసి తాజాకరించగలను Kasyap (చర్చ) 05:36, 31 ఆగస్టు 2020 (UTC)
ప్రాజెక్టులో విస్తరించిన వ్యాసాల్లో నాణ్యత
[మార్చు]ప్రాజెక్టు లక్ష్యాల్లో భాగంగా నాణ్యత గురించి మనం మాట్లాడుకోక పోయినా నాణ్యతా ప్రమాణాలను అనుసరించాలనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. చాలా వ్యాసాలు నాణ్యతా పరంగా బాగానే ఉన్నప్పటికీ (కొన్ని దోషాలు ఉండవచ్చు అది సహజం.) కొన్ని వ్యాసాల్లో ఈ లోపాలు బాగా ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించింది. అనువాద పరికరం చేసిన అనువాదాలను పెద్దగా మార్పులు చెయ్యకుండా తెచ్చి పేజీల్లో పెట్టారనిపిస్తోంది. భాష గురించి గతంలో అనేక చర్చలు జరిగాయి. వాటిని అతిక్రమించిన వ్యాసాలు కూడా మన ప్రాజెక్టులో కొన్ని ఉన్నాయి. అయితే అవి చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నాయి కాబట్టి కొంత ఊరట. మనం విస్తరించిన పేజీలన్నిటినీ రాబోయే రోజుల్లో మరొక్కసారి చదివి భాషా దోషాలను, ఇతర లోపాలనూ సవరించుకుందామని నా ప్రతిపాదన. నేను విస్తరించిన వ్యాసాలన్నిటినీ రాబోయే నెల రోజుల్లో మళ్ళీ చదివి భాషా దోషాలను సవరించుకోవాలని నేను ఈసరికే నిర్ణయించుకున్నాను. ఈ ప్రాజెక్టులో విస్తరించిన వ్యాసాల నాణ్యత బాగుండాలనే విషయం పట్ల ఇది నా నిశ్చయం. __చదువరి (చర్చ • రచనలు) 05:55, 31 ఆగస్టు 2020 (UTC)
- ఎంత ప్రాజెక్టు టార్గెట్ అయినా రాసి కన్నా వాసి ముఖ్యం. నేను విస్తరించిన వ్యాసాలను కూడా పునఃసమీక్షించుకుంటాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 07:01, 31 ఆగస్టు 2020 (UTC)
- మంచి సూచన, అభిప్రాయం.నేను విస్తరించిన ప్రతి వ్యాసాలను కూడా పునఃసమీక్షించుకుంటాను.--యర్రా రామారావు (చర్చ) 08:55, 31 ఆగస్టు 2020 (UTC)
చాలా సాంకేతిక వ్యాసాలలో భాషా పరమైన ఇబ్బందులు , సరైన వ్యాకరణం, ఇంకా కొన్ని వ్యాసాలు విస్తరించటానికి అవకాశం ఉన్నది , నేను రాసున్నపుడు గమనించాను కొన్ని ఇంగ్లిష్ వ్యాసాలలో కూడా కొత్త సమాచారం లేదు ముఖ్యంగా మీడియా , కొత్త సాంకేతిక అంశాలలో చాలా సమాచారం చేర్చాలి , తెలుగు వికీపీడియా ఆధారంగా ఇతర వికీపీడియాలో సమాచారం చేరాలని నా అభిలాష దీనికై ఇవన్నీ రోజూ పునఃసమీక్షించుకుంటాను. Kasyap (చర్చ) 14:05, 31 ఆగస్టు 2020 (UTC)
ప్రాజెక్టు ముగింపు
[మార్చు]ఈ ప్రాజెక్టు కాలపరిమితి రేపు ఉదయం, (2020 సెప్టెంబరు 1 ఉదయం గం.6.00 ల) కు ముగియనుంది.ఆలోపు విస్తరించిన వ్యాసాలు మాత్రమే ప్రాజెక్టు గణాంకాలకు సేకరించబడతాయి.ఆతర్వాత విస్తరించవద్దుఅని కాదు. విస్తరించాలకూడా.గత మూడు నెలలకాలం నుండి అవిరామకృషితో సుమారు 2800 పైచిలుకు మొలక వ్యాసాలను ఈ ప్రాజెక్టు పనిలో భాగస్వామ్యం వహించి, విస్తరించి ఒక రూపకల్పన తెచ్చిన గౌరవ వికీపీడియన్లు అందరికి ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 13:42, 31 ఆగస్టు 2020 (UTC)
కశ్యప్ గారి కృషి
[మార్చు]కశ్యప్ మీ కృషి పేజీలో పట్టిక పూర్తిగా లేదు. ఉత్త పేజీ పేరు మాత్రమే ఉంది. దాని మొలక వర్గం, ముందు తరువాతి ప్రిమాణాలు, చేర్చిన బైట్లు వగైరా సమాచారాన్ని చేర్చగలరు. వెంటనే చేస్తే రేపటి గణాంకాలను వీలైనంత సమగ్రంగా తయారు చెయ్యవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 18:12, 31 ఆగస్టు 2020 (UTC)
ముగిసింది
[మార్చు]ప్రాజెక్టు గడువు ముగిసింది. __చదువరి (చర్చ • రచనలు) 00:32, 1 సెప్టెంబరు 2020 (UTC)
తుది లెక్కలు
[మార్చు]ప్రాజెక్టు గడువు ముగిసాక తేలిన లెక్కలు ఇలా ఉన్నాయి:
- విస్తరణ వర్గం లోకి చేరిన వ్యాసాల సంఖ్య: 2783
- విలీనం/దారిమార్పు చేసి సంబంధిత వర్గం లోకి చేరిన వ్యాసాల సంఖ్య: 99
- మొత్తం: 2882
పై అంకెలో చూపిన 2882 పేజీలనూ ఈ రెండు వర్గాల్లో చూడవచ్చు. వాడుకరులు తమ కృషిని ఇంకా చూపించకపోవడం, చూపించినా నేను మిస్సవడం వంటి తేడాలను సరిదిద్దితే ఈ లెక్క మరికాస్త పెరిగే అవకాశం ఉంది.
ఇకపోతే మొత్తం మొలక వర్గాలు నలభయ్యింటిలోనూ ప్రస్తుతం మిగిలి ఉన్న పేజీల సంఖ్యను ప్రాజెక్టు మొదలైన నాటి సంఖ్యలతో పోల్చి చూస్తే 2940 పేజీలను విస్తరణ, విలీనం చేసినట్లు లెక్క. ప్రాజెక్టు మొదలు పెట్టక ముందు ఈ వర్గాల్లోని వ్యాసాల సంఖ్య: 6392 ఇప్పుడున్న వ్యాసాల సంఖ్య: 3452 -వెరసి 2940 పేజీలను విస్తరించినట్టు. పూర్తి గణాంకాలు తయారయ్యేసరికి కొంత సమయం పడుతుంది. ఇవ్వాళ మధ్యాహ్నానికి సమర్పిస్తాను. ప్రాజెక్టులో పాల్గొన్నవారందరికీ అభినందనలతో __చదువరి (చర్చ • రచనలు) 00:54, 1 సెప్టెంబరు 2020 (UTC)
తుది నివేదిక
[మార్చు]ప్రాజెక్టు తుది నివేదికను వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/ప్రాజెక్టు తుది నివేదిక పేజీలో ఉంచాను. పరిశీలించండి. అలాగే ప్రాజెక్టు గురించి మన అభిప్రాయాల కలబోతకు ఒక సమీక్ష పేజీ - వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/సమీక్ష ని తయారు చేసాను. అక్కడ మీ అభిప్రాయాలు రాయండి. __చదువరి (చర్చ • రచనలు) 08:04, 1 సెప్టెంబరు 2020 (UTC)
అయ్‌బాబోయ్ మూణ్ణెల్లా !!
[మార్చు]మూణ్ణెల్లు గడిచాయ్. వికీలో చేరాక నాకు ఈ మూణ్ణెల్ల కాలం కంటే సంతృప్తికరమైనదీ, ఇంతకంటే ఆనందకరమైనదీ లేదు. ఈ మూణ్ణెల్ల కంటే కష్టపెట్టిన కాలం కూడా లేదు. హమ్మయ్య అయిపోయింది అనిపించింది.
ఒక పని చేద్దామని అనుకోవడం సులువే. ఫలానా గడువు లోపల చేద్దామని అనుకోవడం లోనే ఉంటది తంటా అంతా. మూణ్ణెలల్లో 2000 పేజీలు చేసేద్దాం అని అనుకున్నాక వెంటనే మనం పరుగెత్తలా. వెంకటరమణ గారు వెంటనే పరిగెత్తడం మొదలెట్టి మొత్తం జనాన్నందరినీ ముందుకు లాక్కెళ్ళారు. రామారావు గారు పెద్దగా హడావుడి చెయ్యకుండా మొదటి నెల లోనే 245 చేసి మిగతా వాళ్లకంటే నాలుగంగలు ముందుకెళ్ళారు. జూన్ అయిపోయే సరికి లక్ష్యం చేరే దారిలోనే ఉన్నామనిపించింది. కానీ మిగతా లక్ష్యాన్ని సాధించేందుకు తరువాతి రెణ్ణెల్లకూ సరిపడా వనరులు మనకున్నాయా అనే సందేహం కలిగింది. అనుకున్నట్టే జూలైలో కొంత వెనకబడ్డాం. కానీ గురి మన చెయ్యిదాటిపోలే దనిపించింది. మూడో నెల పని కోసం అవసరమైన వనరుల విషయంలో రవిచంద్ర, స్వరలాసిక, ప్రణయ్‌రాజ్ లు మంచి కిటుకులిచ్చి ప్రాజెక్టును ఆదుకున్నారు. వాళ్ళిచ్చిన ఉపాయాలను అందుకుని ముందుకు పోయాం, 10 రోజులు ముందే సాధించేసాం. అక్కడితో హమ్మయ్య ఇక ఐపోయిందని అనుకోలా, ఎవరూ అనుకోలా.. అదీ గొప్ప విశేషం. ఆ తరవాత పది రోజుల్లోనూ ఊహించనంత పని చేసాం. సగటున రోజుకు 70 పేజీల పైచిలుకు పేజీలను విస్తరించాం. అందరం కలిసి గొప్ప పని చేసాం. అందరికీ మనసారా అభినందనలు. ఒక మొలకను విస్తరించామా వంద మొలకలను విస్తరించామా అనేది ద్వితీయం, అసలు విస్తరించామా లేదా అనేది ప్రథమం. అద్వితీయం కూడా.
ఈ సంతోష సమయంలో, ఈ విజయోత్సవ వేళ ప్రాజెక్టు సభ్యులంతా మౌనంగా ఉన్నారెందుకో!!?? మనల్ని మనం అభినందించుకుంటే తప్పేం కాదు. అభినందించుకోవాలి కూడా. నిజానికిది మన ప్రాజెక్టు బృందమంతా ఒకచో చేరాల్సిన హడిల్ క్షణం.
గరికిపాటి నరసింహారావు గారు సాగరఘోష పద్యకావ్యం రాసాక, - 1100 పద్యాలు రాసాక కూడా అలుపు రాలేదేంటా అని అనుకున్నారంట. మహానుభావుడు, ఎలా అనుకున్నాడో గానీ నాకు మాత్రం చమట్లు కారిపోయాయ్. మరి మీకో? __చదువరి (చర్చ • రచనలు) 08:35, 1 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ ప్రాజెక్టు విజయానికి ప్రధాన కారణమైన ఒకానొక అదృశ్య శక్తికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. అదే కరోనా వైరస్! అదే లేకపోతే ఏప్రిల్ విస్తరణ ఉద్యమం గానీ, ఈ విస్తరణ ఋతువు గానీ ఇంతలా విజయవంతమయ్యేవి కావు, బహుశా. :) __చదువరి (చర్చ • రచనలు) 09:32, 1 సెప్టెంబరు 2020 (UTC)
- యర్రా రామారావు:మూణ్ణెల్లు సమయం మనకు పెద్దదిగా అనిపించవచ్చుగానీ,ఇంతపెద్ద ప్రాజెక్టుకు అంత పెద్ద సమయం కాదనిపిస్తుంది.ఇంతకాలం లేకపోతే ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్న 2000 వ్యాసాలు విస్తరణకు అందుకోలేకపోవచ్చు. గ్రామ వ్యాసాల డేటా నాదగ్గర ఉన్నందున నేను మాత్రమే మొదటినెల 245 గ్రామ వ్యాసాలు విస్తరణచేసే అవకాశం కలిగింది.అందులో నాగొప్పతనం ఏమీలేదు.ఒకరకంగా అది మిగతా వాడుకరులకు స్పూర్తి కలిగించిందని నేను అనుకుంటున్నాను. డేటా ఉన్నందున మొదటి నెల చాలా హుషారుగానే సాగింది.రెండవ నెలలో మిగిలినవర్గాలలోని వ్యాసాల విస్తరణ కేవలం 54 మాత్రమే చేసాను.ఒకరకంగా చెప్పాలంటే విస్తరణ కార్యక్రమంలో నేను ట్రైనీ కోవకు చెందినవాడను.ఎప్పుడు అయిపోయిందా అనుకున్న సందర్బాలు లేకపోలేదు.కానీ ఇది ఒకరకంగా రెండు ఉపయోగాలు కల్పించింది.ఒకటి మొలకలు విస్తరించుకున్నవి.రెండవది కరోనా కాలంలో కాలక్షేపం కలింగించిందని చెప్పవచ్చు.మూడవ నెలలో చదువరి గారూ, వెంకటరమణ గారూ మూడవ కన్ను తెరచి విస్తరణమీద విశ్వరూపం చూపించారు.రవిచంద్ర,స్వరలాసిక, ప్రణయ్‌రాజ్ గారలు సినిమా వ్యాసాలు మీద మొదటి నుండి ఒకే స్థాయిలో దృష్టిపెట్టి అవకాశం మేరకు విస్తరించారు.సినిమా వ్యాసాలు విస్తరించటానికి కిటుకుచెప్పి మరిన్ని విస్తరించటానికి అవకాశం కల్పించారు.ఇంకా ప్రభాకర్ గౌడ్, మహేశ్వర రాజులాంటి మరికొంత మంది వాడుకరులు వారికి అవకాశం ఉన్నంతవరకు విస్తరించుట చాలా సంతోషం. చివరలోకశ్యప్ గారు ఆగష్టు 30న తలపెట్టిన 24 గంటలు ఏకబిగిన విస్తరణ కార్యక్రమంలో 52 వ్యాసాలు విస్తరించి నేను లేస్తే మనిషికాదనిపించారు.(అంటే యంత్రం అని అర్థం).ప్రాజెక్టులో పాల్గొన్న అందరికీ అభినందనలతో--యర్రా రామారావు (చర్చ) 12:58, 1 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రణయ్‌రాజ్: నాక్కూడా ఈ మూణ్ణెళ్ళకాలం చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇలా నేను పెద్ద మొత్తంలో మొలక వ్యాసాలను విస్తరణ చేయడం నా వికీ ప్రయాణంలో మరొక మైలురాయి అని చెప్పగలను. సమిష్టి కృషితో ఏదైనా సాధ్యమే అని నిరూపించడానికి చక్కని ఉదాహరణ ఈ ప్రాజెక్టు. నాకున్న పరిమితుల్లో ఎంత ప్రయత్నించినా 100 నుండి 120 వ్యాసాల వరకు విస్తరణ చేయగలనేమో అనుకున్నాను. కానీ, "మొలకల విస్తరణలో చదువరి, వెంకటరమణ గారలు చూపిన ఉత్సాహం౼యర్రా రామారావు గారి ప్రోత్సాహం" నాతో 254 వ్యాసాలను విస్తరణ చేయించాయి. వికీపీడియాలో వ్యాసాలను తొలగించడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అనుకుంటున్న అభిప్రాయానికి ఈ ప్రాజెక్టు ఒక సమాధానం అని నేను భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న అందరికీ అభినందనలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(Talk2Me|Contribs) 05:57, 2 సెప్టెంబరు 2020 (UTC)
లేక్కల్లో తేడాలేమైనా ఉంటే..
[మార్చు]ప్రాజెక్టులో పనిచేసిన వాడుకరులందరి గణాంకాలను ఎప్పటికప్పుడూ సేకరించి ఒక ఎక్సెల్ షీటులో పెట్టుకుంటూ పని చేసాను. దాన్నుండి అవసరమైన రిపోర్టులు తయారు చేసాను. డేటా సేకరణలో ఏమైనా లోపాలు దొర్లి ఉంటే ఈ రిపోర్టుల్లో కూడా లోపాలు కనబదతాయి. అలాంటి లోపాలు కనిపిస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాను. __చదువరి (చర్చ • రచనలు) 08:49, 1 సెప్టెంబరు 2020 (UTC)
కృషి పేజీ తాజాకరణ
[మార్చు]కొందరు వాడుకరులు తమ కృషిని వీలుగా ఉంటుందని తమ వాడుకరి పేజీకి అనుబంధంగా ఉన్న పేజీలో రాసారు. వారు ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న తమ కృషి పేజీని కూడా తాజాకరించాల్సినదిగా కోరుతున్నాను. వీరి కృషి పూర్తిగా గణన లోకి వచ్చింది. అలాగే కొందరు తమ కృషిని అసలు ఎక్కడా తాజాకరించలేదు. అలాంటి వారి కృషిని నాకు తెలిసినంతవరకూ గణన లోకి తీసుకున్నాను. వారు తమ కృషి పేజీని తాజాకరించాక గణాంకాలను సవరించాల్సి ఉంటే సవరిస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 08:54, 1 సెప్టెంబరు 2020 (UTC)
మరిన్ని రిపోర్టులు కావాలంటే
[మార్చు]ఫలానా రిపోర్టులు తయారు చేస్తే సరిపోతుందని భావించి తయారు చేసి వాటిని "తుది నివేదిక" పేజీలో పెట్టాను. అవి చాలవు ఫలానావి కూడా కావాలని మీరు భావిస్తే చెప్పండి. నేను చెయ్యగలిగిన వాటిని తయారు చేసి పెడతాను.__చదువరి (చర్చ • రచనలు) 09:08, 1 సెప్టెంబరు 2020 (UTC)
అనువాద పరికరం
[మార్చు]అనువాద పరికరాన్ని గనక వాడకపోయి ఉంటే ఈ ప్రాజెక్టులో నేను చేసిన పనిలో మూడో వంతు చెయ్యగలిగే వాణ్ణా అనేది సందేహాస్పదం. చాలా వేగంగా పని చెయ్యగలిగాను. నాణ్యత గొప్పగ ఉందా అని అంటే చెప్పలేను గానీ , నసి రకంగా మాత్రం లేదని నేను చెప్పగలను. అనువాద దోషాలను సవరించి ప్రచురించేందుకు నాకు చేతనైనంతలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసాను. నేను చేసిన పేజీలన్నిటినీ మళ్ళీ ఓ సారి సమీక్షించి భాషా షాలేమైనా ఉంటే సవరిస్తాను.
నేను ఈ ప్రాజెక్టులో 900 పేజీలు విస్తరించి, 53 లక్షల బైట్లు చేర్చాను. అందులో సుమారు 800 పేజీలు, ఓ 45 లక్షల బైట్లూ అనువాద పరికరం ద్వారా చేసినవే అని చెప్పగలను. ఏప్రిల్ నెల విస్తరణ ఉద్యమంలో ఓ యాభై పైచిలుకు పేజీల్లో 30 లక్షల బైట్లు చేర్చాను. అదంతా అనువాద పరికరం చలవే. అనువాద పరికరంలో ఇప్పుడు ఈ 800 పేజీలు ఉన్నాయా అంటే లేవు, ఉండవు. నేను ఎప్పటికప్పుడూ తీసేస్తూ ఉంటాను. ఎందుకంటే అవి యీసెయ్యకపోతే, మరెవరైనా ఆ పేజీలను మరింతగా అనువదించాలనుకుంటే వీలవదు. అంచేత తీసేస్తూంటాను. అందరూ అలాగే తీసెయ్యాలి. జై అనువాద పరికరం!
అనువాద పరికరం చేసే తప్పులు ఎంత భయంకరంగా ఉంటాయో, ఆ తప్పులను సవరించుకుంటే అది అంత ఉపయోగకరంగా ఉంటుంది. విషాన్ని అమృతంగా మార్చుకున్నట్టే. దాని వేగాన్ని వాడుకోవాలి, మన తెలుగుతేటల్ని వాడుకోవాలి. రెంటినీ కలిపితే అనువాద పరికరం నిరంతరం వెలుగునిచ్చే అణు విద్యుత్కేంద్రం లాంటి దవుతుంది. ఆ రెండోది వాడకుండా మొదటిది మాత్రమే వాడితే వేగం మాత్రమే ఉంటుంది, తెలుగు ఉండదు. అప్పుడది మందు పాతర లాంటి దవుతుంది. వికీ ఒక మైన్‌ఫీల్డు అవుతుంది. ఏ పేజీని తెరిస్తే ఎలాంటి భాష ఉంటుందో తెలియదు. (అలాంటి మందుపాతరలు దాదాపు 1800 ను ఫిబ్రవరిలో తొలగించుకున్నాం.) __చదువరి (చర్చ • రచనలు) 09:49, 1 సెప్టెంబరు 2020 (UTC) అనువాద పరికరాలకు, జే జే లు నేను ఎక్కువగా అవసరం అనుపించిన ఇంగ్లీష్ వికీ వ్యాసాలను , ముఖ్యంగా సంస్థలు , టెక్నాలజీ వ్యాసాలలో ఆయా సంస్థల, పేజీలు, google news వంటి పేజీలకు లకు వెళ్లి అందులోని టెక్స్ట్ ఫైళ్లను Bing Translator , Google Translator , చాలా తక్కువ సార్లు yandex telugu translation ఉపకరణం వాడాను , చాలా సార్లు https://imtranslator.net/compare/english/to-telugu/translation/ వాడి అందులో బాగున్న వాక్యాలను మొలక వ్యాసాలలో చేర్చాను, అయితే ఈ సందర్బముగా నేను ఎక్కువ శాతం ఇంగ్లీషు వికీ వ్యాసాన్ని ప్రామాణికింగా తీసుకోలేదు, అయితే సంస్థలు , టెక్నాలజీ వ్యాసాలను నవీకరణం చేస్తూ ఇంగ్లీషు వికీ ప్రామాణికింగా తీసుకొంటూనే దానిని తెలుగులో రాసేటప్పుడు మరింత మెరుగు పరచవలసిన అవసరం ఉన్నది అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా రాబోవు కాలంలో వికీ వ్యాస నిర్మాణ విషయంలో వికీ డేటాచాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇందులో కూడా చాలా తెలుగు పదాల డేటాను చేర్చాలి , దయచేసి వికీ డేటా ఋతువు కూడా జరుప విన్నపం Kasyap (చర్చ) 09:15, 2 సెప్టెంబరు 2020 (UTC)
ప్రాజెక్టు సభ్యులు
[మార్చు]ఈ మొలకల విస్తరణ ప్రాజెక్టు ఉద్దేశించిన పని గానీ, తలపెట్టిన లక్ష్యం గానీ, లక్ష్య సాధనలో సాధించిన విజయం గానీ చాలా విశిష్టమైనవి. ఇందులో పాల్గొన్న సభ్యులందరూ ఈ విశిష్టతకు కారకులే. నేను ఈ ప్రాజెక్టులో పని చేసానని గర్వంగా చెప్పుకోవాల్సిన పని చేసాం మనందరం కలిసి. దీన్ని మనం మన వాడుకరి పేజీలో స్పష్టంగా ప్రదర్శించుకోవచ్చు. ప్రదర్శించుకోవాలి కూడా. అందుకు గాను కింది రెండు వాడుకరి అంశాలను మన వాడుకరి పేజీల్లో పెట్టుకోవచ్చు:
{{మొలకల విస్తరణ ఋతువు 2020-ప్రాజెక్టు సభ్యులు}}
ఇది వాడుకరి పేజీలో పెట్టుకునే వాడుకరి పెట్టె{{ఋతువు 2020 topicon}}
ఇది వాడుకరి పేజీలో పెట్టుకునే టాప్ ఐకన్. ఈ కోడ్‌ను పేజీలో ఎక్కడైనా పెట్టవచ్చు. దాని వలన ఒక చిన్న "పెరుగుతున్న మొక్క" జిఫ్ పేజీకి పైన కుడి వైపున కనిపిస్తుంది.
- ఈ రెంటినీ పెట్టుకోవచ్చు. రెంటిలో ఏ ఒక్కదాన్నైనా పెట్టుకోవచ్చు. పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 05:08, 4 సెప్టెంబరు 2020 (UTC)