సరస్వతి కాలువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరస్వతి కాలువ

సరస్వతి కాలువ, నిర్మల్ జిల్లాలోని[1] నిర్మల్ మండలం పాకపట్ట శివారు గ్రామం గాంధీనగర్ వద్ద ఈ కాలువ ప్రారంభమవుతుంది. ఆయకట్టు 35,735 ఎకరాలు. నిర్మల్, లక్ష్మణ్‌చాందా, ఖానాపూర్, కడెం మండలాల్లోని 64 గ్రామాలకు సాగునీరు అందుతుంది.[2] శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కింద 18 డిస్ర్టిబ్యూటరీలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీరు అందించే సరస్వతి కాలువ కింద ఒక డిస్ర్టిబ్యూటరీ ఉండగా, నిజామాబాద్‌ జిల్లాకు నీరందించే లక్ష్మీ కాలువ కింద ఒక డిస్ర్టిబ్యూటరీ ఉంది. మిగిలిన 16 డిస్ర్టిబ్యూటరీల ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతులకు సాగునీరు అందుతుంది. ఇందులో జగిత్యాల జిల్లాలో 7, పెద్దపల్లి జిల్లాలో 6, కరీంనగర్‌ జిల్లాలో 3 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. సగటున ఒక్కో డిస్ర్టిబ్యూటరీ కింద 20 వేల ఎకరాల నుంచి 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. జగిత్యాల జిల్లాలో ఉన్న ఏడు డిస్ర్టిబ్యూటరీల కింద 2 లక్షల 10 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఆరు డిస్ర్టిబ్యూటరీల కింద లక్షా 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కరీంనగర్‌ జిల్లా పరిధిలోని మూడు డిస్ర్టిబ్యూటరీల కింద దాదాపు 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది.

సరస్వతి కాలువ పొడవు

[మార్చు]

నిర్మల్ జిల్లాలోని శ్రీ రామ్ సాగర్ రిజర్వాయర్ నుండి నీరు అందించే సరస్వతి కాలువ కడెం నారాయణపూర్ 144 కి.మీ.పొడవు కలిగి ఉంది.దీని ద్వారా వరకు 79,000 ఎకరాల నీరు అందుతుంది.[3]

శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ I:సరస్వతి కాలువ (47 కి.మీ) లో 14,151 హెక్టార్లు (34,967 ఎకరాలు) అయకట్టుకు 42.47 క్యూమెక్స్ (1500 క్యూసెక్స్) తల ఉత్సర్గతో నీటిపారుదలవలన 1,41,151 హెక్టార్లుకు సాగునీరు అందుతుంది.[4]

శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ II:కడెం కాలువను కి.మీ 0.00 నుండి కి.మీ 77.00 వరకు ఆధునీకరించడంతో కి.మీ 77 నుండి 144 వరకు సరస్వతి కాలువ ద్వారా 79,000 ఎకరాల మొత్తం అయకట్టుకు లబ్ది చేకూరింది.ఇది కడెం కాలువ 6.5 కిమీ నుండి కిమీ 77 వరకు 10 టిఎంసి అడుగుల నీటిని యల్లంపల్లి బరాజ్ నుండి పంపింగ్ చేయడం ద్వారా 79000 ఎకరాల అయకట్టుకు సాగునీరు ఇస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) డిపార్ట్ మెంట్, తేదీ: 11-10-2016.
  2. సరస్వతి కాలువ. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  3. 3.0 3.1 "SRSP Saraswati Canal". Telangana Tourism, Travel, History, Culture and People. Retrieved 2020-08-03.
  4. https://irrigation.telangana.gov.in/img/projectspdf/srsp1.pdf

వెలుపలి లంకెలు

[మార్చు]