Jump to content

కడం పెద్దూర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°05′22″N 78°48′32″E / 19.089373°N 78.808823°E / 19.089373; 78.808823
వికీపీడియా నుండి
(కడెం నుండి దారిమార్పు చెందింది)
కడెం పెద్దూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కడెం పెద్దూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కడెం పెద్దూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కడెం పెద్దూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°05′22″N 78°48′32″E / 19.089373°N 78.808823°E / 19.089373; 78.808823
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం పెద్దూర్ (కడెం పెద్దూర్)
గ్రామాలు 37
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,703
 - పురుషులు 25,937
 - స్త్రీలు 26,766
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.26%
 - పురుషులు 56.99%
 - స్త్రీలు 29.23%
పిన్‌కోడ్ 504202

కడెం పెద్దూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] పెద్దూర్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  29  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్మల్ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలలో కడెం ఒకటి. కడెం నది ప్రవహించడం వల్ల కడెంనది పైన ఆనకట్ట కట్టడం వలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది.అంతకు మునుపు ఈ వూరిని పెద్దూర్ గా పిలిచేవారు. ప్రస్తుతం దీనిని పెద్దూర్ కడంగా పిలుస్తున్నారు.

గణాంక వివరాలు

[మార్చు]
కడెం ఆనకట్ట
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 52,703 - పురుషులు 25,937 - స్త్రీలు 26,766. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 467 చ.కి.మీ. కాగా, జనాభా 36,889. జనాభాలో పురుషులు 18,151 కాగా, స్త్రీల సంఖ్య 18,738. మండలంలో 9,020 గృహాలున్నాయి.[3]

ప్రభుత్వ కార్యాలయాలు:

  • తహశీల్దార్ కార్యాలయం
  • రక్షక భట నిలయం
  • ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం
  • అటవీశాఖ కార్యాలయం
  • పశు వైద్యశాల
  • మండల విద్య శాఖ
  • మండల ప్రజా పరిషత్ కార్యాలయం
  • మండల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం
  • మండల ఐ.కె.పి. కార్యాలయం
  • అంగన్వాడి సెంటర్

వ్యవసాయం, పంటలు

[మార్చు]

కడెం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4642 హెక్టార్లు, రబీలో 602 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 250