కడెం డ్యామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడెం డ్యామ్
Kaddam Dam.jpg
కడెం డ్యామ్
కడెం డ్యామ్ is located in Telangana
కడెం డ్యామ్
కడెం డ్యామ్ is located in India
కడెం డ్యామ్
Location of కడెం డ్యామ్
అధికార నామంకడెం డ్యామ్
ప్రదేశంకడెం, అదిలాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు19°6′29″N 78°47′27″E / 19.10806°N 78.79083°E / 19.10806; 78.79083Coordinates: 19°6′29″N 78°47′27″E / 19.10806°N 78.79083°E / 19.10806; 78.79083
ప్రారంభ తేదీ1958
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకడెం నది
ఎత్తు31 metres (102 ft) from river level
పొడవు2,051 metres (6,729 ft)
జలాశయం
సృష్టించేదికడెం రిజర్వాయర్
మొత్తం సామర్థ్యం215,800,000 m3 (174,952 acre⋅ft)
క్రియాశీల సామర్థ్యం137,100,000 m3 (111,149 acre⋅ft)
పరీవాహక ప్రాంతం2,590 చద�kilo��పు మీటరుs (2.79×1010 చ .అ)
ఉపరితల వైశాల్యం24.7 kమీ2 (266,000,000 చ .అ)

కడెం డ్యామ్ ఆదిలాబాద్ జిల్లా లో గోదావరి నది యొక్క ఉపనది అయిన కడెం నది గోదావరి నదిలో కలిసే ప్రదేశంలో ఉంది.[1] డ్యామ్ ప్రధాన ప్రయోజనం ఆదిలాబాద్ జిల్లాలోని 25000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందించడం ఈ డ్యాం యెక్క ప్రధాన ఉద్ధేశ్యం. దీనిని గోదావరి ఉత్తర కెనాల్ ప్రాజెక్ట్ గా కూడా పిలుస్తారు. దీనిని 1949 మరియు 1965 మధ్యకాలంలో నిర్మించారు.[2]

ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన వాతావరణంలో చూట్టూ పచ్చదనంతో నిండిఉన్న సుందరమైన గుట్టల మధ్యలో ఈ డ్యాం నిర్మించారు. సికింద్రాబాద్-మన్మాడ్ రైల్వే లైన్ మీదుగా వెళ్లే పర్యాటకులకు కడెం డ్యామ్ అందుబాటులో ఉంటుంది.

చరిత్ర ప్రకారం, మొదటగా దీనిని ఈ ప్రాంతంలో యాగాలు చేసిన కండవ రుషి పేరుతో పిలిచేవారు. ఆ తరువాత, ఈ ప్రాంత ప్రముఖ నాయకుడు కదం నారాయణరెడ్డికి నివాళిగా కదం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ (KNRP) గా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసింది.

ఎడమ మరియు కుడి కాలువల ద్వారా అనేక మండలాలకు నీరును అందిస్తుంది. ఎడమ కాలువ ద్వారా పెద్ద బెల్లాల్, చిన్న బెల్లాల్, చిట్యాల్, కొండుకూర్, కన్నాపూర్, మోరిగూడెం, పాత కొండుకూర్, ఉప్పరగూడెం, చిన్నా శిబిరం, పెర్కపల్లి మరియు కడెం మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది. కుడి కాలువ ద్వారా జన్నారం, దండేపల్లి, తాళ్లపల్లి, మ్యాదార్ పేట్ మరియు లక్సెట్టిపేట మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది.

ప్రస్తుతం ఈ డ్యామ్ 68000 హెక్టార్ల వ్యవసాయానికి సాగునీటి అవసరాలను తీరుస్తుంది. డ్యాం పక్కన పర్యాటకులకోసం అందమైన గార్డెన్ ఉంది. వర్షాకాల సమయంలో వచ్చే వరదలకు డ్యాం గేట్లనుండి నీటిని వదులుతారు. హైదరాబాదునుండి అదిలాబాద్ కి వెళ్లే దారిలో నిర్మల్ వద్ద ఈ డ్యామ్ ఉంది. ఈ డ్యాంకు ఆదిలాబాద్ సమీప రైల్వే స్టేషన్.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". మూలం నుండి 27 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 28 July 2018. Cite news requires |newspaper= (help)
  2. తెలంగాణ టూరిజం వెబ్ సైట్. "Kadam Dam". www.telanganatourism.gov.in. మూలం నుండి 10 అక్టోబర్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 18 October 2016.