జన్నారం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


జన్నారం
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటములో జన్నారం మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో జన్నారం మండలం యొక్క స్థానము
జన్నారం is located in Telangana
జన్నారం
తెలంగాణ పటములో జన్నారం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°07′08″N 78°59′56″E / 19.1188949°N 78.9989734°E / 19.1188949; 78.9989734
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రము జన్నారం
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,883
 - పురుషులు 26,235
 - స్త్రీలు 26,648
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.09%
 - పురుషులు 60.50%
 - స్త్రీలు 33.71%
పిన్ కోడ్ 504205
{{{official_name}}}
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

జన్నారం, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. జన్నారం గ్రామము మండల కేంద్రము. పిన్ కోడ్ నం. 504205. ఇది లక్సెట్టిపేట నుండి నిర్మల్ వెళ్ళే రహదారిలో దట్టమైన అడవిలో లక్సెట్టిపేట నుండి 35 కి.మి. దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు బోధన చేస్తారు. ఇంటర్, డిగ్రీ వంటి ఉన్నత విద్యల కోసం ఇక్కడి నుండి లక్సెట్టిపేట లేదా ఖానాపూర్ పట్టణాలకు వెళ్తారు. ఈ గ్రామ సరిహద్దులో జిల్లాపరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలను ఆనుకునే ఒక వాగు ప్రవహిస్తుంది, మరొక ప్రక్కన దట్టమైన అడవి ఉంటుంది. ఈ అడవిని కవ్వాల్ అభయారణ్యము అని పిలుస్తారు. ఈ అడవిలో జింకలు, కుందేలు, పులి, చిరుత, ఎలుగుబంటు, నక్కలు, తోడేలు వంటి వన్య ప్రాణులు కనపడతాయి ఈ అడవిలో జారుడు బండ, పావురాల మొరి, ముర్కీస్ వంటివి చూడదగిన ప్రదేశాలు. ఈ గ్రామ సరిహద్దులో జింకల మనుగడకై ఏర్పాటు చేసిన జింకల పునరావాస కేంద్రం సందర్శకులకు వినోదాన్ని కలిగిస్తుంది. వారి ప్రయాణ బడలికను తగ్గిస్తుంది.

వ్యవసాయం, పంటలు[మార్చు]

జన్నారం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 3995 హెక్టార్లు మరియు రబీలో 1717 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[1]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంక వివరాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 52,883 - పురుషులు 26,235 - స్త్రీలు 26,648

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 243"https://te.wikipedia.org/w/index.php?title=జన్నారం&oldid=1985095" నుండి వెలికితీశారు