632

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సా.శ. 632 : గ్రెగోరియన్ కేలండరు యొక్క మామూలు సంవత్సరం.

సంఘటనలు

[మార్చు]
తాలిబన్లు పేల్చివేయక ముందు బమియాన్ లోని బుద్ధ విగ్రహం
  • జనవరి 27: సూర్య గ్రహణం సంభవించింది.[1]
  • మార్చి 18 (సుమారు) : ముహమ్మద్ ముస్లింలకు తన చివరి ఉపన్యాసం చేసాడు. ఇది, తన వారసుడిగా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ నియామించడమేనని షియాలు నమ్ముతారు.
  • జూన్ 8: అనారోగ్యంతో జ్వరంతో ముహమ్మద్ 63 సంవత్సరాల వయసులో మదీనాలో మరణించాడు. అతని వారసుడు షియాలు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ అని, సున్నీలు అబూ బకర్ అనీ భావిస్తారు.
  • జూన్ 16: ఎనిమిదేళ్ళ వయసులో యాజ్డెగర్డ్ III, పర్షియన్ సామ్రాజ్యానికి రాజు (షా) గా సింహాసనం అధిరోహించాడు. అతను సస్సానిడ్ వంశపు చివరి పాలకుడు అవుతాడు.
  • ఉమ్మా యొక్క మత, ఆధ్యాత్మిక, రాజకీయ నాయకత్వం కోసం అలీ ఇబ్న్ అబీ తాలిబ్ యొక్క ఇమామా (షియా సిద్ధాంతం) ప్రారంభమవుతుంది.
  • రిడ్డా వార్స్ : అరేబియా తిరుగుబాటు గిరిజనులపై అబూ బకర్ సైనిక దాడులను ప్రారంభించాడు. సరైన మార్గనిర్దేశం చేసిన ఖలీఫాల శక్తిని తిరిగి స్థాపించడానికీ, ముహమ్మద్ వారసత్వాన్ని స్థాపించడానికీ అతడు ఈ పని మొదలుపెట్టాడు.
  • సెప్టెంబరు: భుజాఖా యుద్ధం : ఖలీద్ ఇబ్న్ అల్-వలీద్ నేతృత్వంలోని ఇస్లామిక్ సైన్యం (6,000 మంది) హైల్ ( సౌదీ అరేబియా ) సమీపంలో తులైహా నాయకత్వం లోని మతభ్రష్ట తిరుగుబాటుదారులను ఓడించారు .
  • డిసెంబరు: అక్రాబా యుద్ధం: అబూ బకర్ నేతృత్వం లోని ముస్లిం సేనలు, ముసేలిమాహ్ నాయకత్వం లోని మతభ్రష్ట తిరుగుబాటుదారులను (40,000 మంది) అక్రాబా మైదానంలో ఓడించాయి
  • చైనా యాత్రికుడు జువాన్జాంగ్, బమియాన్ లోయ ( ఆఫ్ఘనిస్తాన్ ) లోని ఒక పర్వత ప్రాంతంలో చెక్కిన రెండు భారీ బుద్ధ విగ్రహాల గురించి వ్రాశాడు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Espenak, F. "NASA - Solar Eclipses of History".
"https://te.wikipedia.org/w/index.php?title=632&oldid=3496072" నుండి వెలికితీశారు