బమియాన్ బుద్ధ విగ్రహాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బమియాన్ బుద్ధ విగ్రహాల నలుపు తెలుపుల వర్ణ చిత్రం

బమియాన్ బుద్ధ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్ లోని ఆరవ శతాబ్దానికి చెందిన పెద్ద బుద్ధ విగ్రహాలు. ఈ విగ్రహాలు మధ్య ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన హజరాజత్ అనే ప్రాంతంలో బమియాన్ లోయ దగ్గర పర్వతానికి చెక్కబడ్డాయి.ఈ ప్రదేశం కాబూల్ కు 213 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శిల్పాలు గాంధార శిల్పకళను అనుసరించి ఏర్పరచబడ్డాయి.

శిథిలమైన బమియాన్ బుద్ధ విగ్రహం

బమియాన్‌ అనేది హిందుకుష్ పర్వత ప్రాంతంలో ఓ అందమైన లోయ. ఇక్కడ ఎన్నో బుద్ధవిగ్రహాలున్నాయి. అందమైన గుహలున్నాయి. ఈ శిల్పాలు కుషాణుల కాలం నాటివి. ఇక్కడి శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై పాడయ్యాయి.

చరిత్ర[మార్చు]

దాడులు[మార్చు]

పునరుద్ధరణ[మార్చు]

అఫ్గాన్‌ ప్రభుత్వ కోరిక మేరకు 1969లో భారత ప్రభుత్వం ఆర్‌.సేన్‌గుప్తా నాయకత్వంలో ఈ గుహలను పునరుద్ధరించింది. ప్రస్తుతం ఇక్కడున్న రెండు బుద్ధ విగ్రహాలు చూడదగ్గవి. ఒక విగ్రహం ఎత్తు 125 అడుగులు. దీన్ని ముందుగా రాయితో చెక్కి... దానిపై మట్టీ గోధుమ గడ్డితో చేసిన మిశ్రమాన్ని పూశారు. దానిపై జిప్సమ్‌ ప్లాస్టర్‌ వేశారు. ఆపై రంగులూ వస్త్రాలతో అలంకరణలున్నాయి. ఈ విగ్రహం చుట్టూ ఉన్న గోడలపైనా అందమైన చిత్రాలున్నాయి. బంగారు రథంపై దూసుకెళ్తున్న సూర్యభగవానుడూ అతడి చుట్టూ ఎగిరే పక్షులూ అప్సరసలూ ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ గుహ వెనక ఓ పెద్ద సభామంటపం కూడా ఉంది. ఇక్కడున్న మరో బుద్ధ విగ్రహం ఎత్తు 180 అడుగులు. ఇది చాలావరకూ ధ్వంసమైంది. తాలిబన్ల యుద్ధాలలో ఫిరంగులు తగిలి ఛిద్రమైపోయింది. దీని పక్కనున్న గుహలో ఒకప్పుడు బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఈ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఉన్న కక్రక్‌ వ్యాలీలోని బుద్ధవిగ్రహమూ తాలిబన్ల దాడుల్లో రూపు కోల్పోయింది. ఈ ప్రాంతంలో గుహలన్నింటినీ మహ్మద్‌ గజనీ కొల్లకొట్టాడు. ఆ తరువాతే ఇక్కడ బౌద్ధం నెమ్మదిగా క్షీణించింది. ఇస్లాం విస్తరణ ఊపందుకుంది.[1]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు ఆదివారం మార్చి 14, 2010 సంచిక