Jump to content

వికీపీడియా:మార్గదర్శిని

వికీపీడియా నుండి

వికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమిష్టి కృషితో సులభంగా వెబ్ సైటు ను సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. దీనిని 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్ లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

వికీపీడియా ప్రస్థానం

[మార్చు]
1.చరిత్ర

వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియా లో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాసేవారు. వాటిని ఒక పద్దతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో మార్చి 9, 2000 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరు జిమ్మీ వేల్స్, మరియు దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పి రిచర్డ్ స్టాల్​మన్ కోరిక మేరకు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు.

లారీ సాంగర్ మరియు జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు. అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్స్ ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది.

వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005 లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతే కాకుండా కొన్ని ప్రపంచంలోని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో పని జనవరిలో ప్రారంభించింది.

2. ఫౌండేషన్ చరిత్ర

వికీమీడియా ఫౌండేషన్ [1]జూన్ 2003 లో ప్రారంభించబడినది. వికీపీడియా వ్యవస్థాపకులలో ఒకరైన జిమ్మీ వేల్స్, తన సంస్థ ద్వారా ప్రారంభించిన వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల నిర్వహణ భాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషలలో విజ్ఞాన సర్వస్వాలు మరియు సోదర ప్రణాళికల పెంపు, అభివృద్ధి మరియు వీటిలో సమాచారాన్ని ఉచిత పంపిణీ చేయటం దీని ముఖ్యోద్దేశం. దీని నిర్వహణకు ధర్మకర్తల (ట్రస్టీల) మండలి వుంది. ఇది మూడు చోట్ల కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే దాదాపు నెలసరిగా అరకోటి ప్రజలకు సేవలందిస్తున్నది. దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, మరియు ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజల నుండి మరియు సంస్థలనుండి ధన మరియు వనరుల సేకరణ మరియు ప్రాజెక్టులలో వాడబడే మీడియావికీ సాఫ్ట్వేర్ నిర్వహణ మరియు అభివృద్ధి చేస్తుంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, మొబైల్ మరియు జాలసంపర్కంలేని పద్దతులలో వికీ ప్రాజెక్టుల సమాచారాన్ని అందచేయటం, శిక్షణా వీడియోలు తయారి మరియు ప్రాజెక్టుల గణాంకాలలో మార్పులను విశ్లేషించి కొత్త తరహా ప్రాజెక్టులను చేపట్టటం, దీని ఇతర కార్యక్రమాలు. వికీమీడియా సంఘాలు., వికీమీడియా భారతదేశం చిహ్నం , వికీపీడియా అవగాహన సదస్సు

వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.

2.1 వికీమీడియా భారతదేశం

భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ [2]సంఘం జనవరి 3, 2011 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబర్ 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జులై 30 న నకలు హక్కులు మరియు స్వేచ్ఛా పంపక షరతులు అనబడే దానిపై సదస్సు ఆ తరువాత సెప్టెంబర్ 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా గ్రంథాలయాల శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు [3]ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేక అనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో వుంది. కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి మరియు విస్తరించటానికి, మరియు కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయం చేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార మరియు ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.

2.2వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు

వికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ,భారతీయ వికీ ప్రాజెక్టుల [5] అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించటం ప్రారంభించింది. సంవత్సరాంతానికి ఈ జట్టులో భారతీయ ప్రణాళికల సలహాదారు, ఆయనతో పాటు, భారతీయ భాషల సలహాదారు, విద్యా‌విషయక సలహాదారు, అవగాహన సదస్సుల సలహాదారు వున్నారు.

2.3. ఇతర భాషలు

ప్రస్తుతం వికీపీడియా 253 భాషల్లో లభిస్తోంది. వీటిలో 16 భాషల వికీపీడీయా 1,00,000 పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 145 వర్షన్లు 1000కి పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. డిసెంబర్ 2007 గణాంకాల ననుసరించి వ్యాసాల సంఖ్య పరంగా చూస్తే ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి, పోలిష్, జపనీస్ మొదటి ఐదు పెద్ద వర్షన్లు.

తెలుగు వికీపీడియా ఆవిర్భావం

[మార్చు]
వెన్న నాగార్జున

బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పని చేస్తున్న వెన్న నాగార్జున తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టాడు. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. ఇది క్రమంగా తెలుగు భాషాభిమానులను విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ (టపా) తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. దానిని సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించాడు. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబర్ 10న[2]ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియా మొదటి చిహ్నాన్ని (లోగోని) రూపొందించిన ఘనత ఆయనదే.

తెలుగు వికీపీడియా అభివృద్ధి

[మార్చు]

2003లో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్ట్ వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. తన తరువాతి ప్రయత్నాలలో ఒక భాగంగా నాగార్జున రచ్చబండ వంటి తెలుగు సమాచార గుంపులలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన ప్రయత్నం సక్రమ ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. రావ్ వేమూరి, మిచిగాన్ విశ్వ విద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతను నిర్వహిస్తున్న కట్టా మూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి గ్రంథం, శ్రీ కృష్ణదేవ రాయలుశ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన ఊరగాయ రుచులను ఆధారంగా వ్రాసిన ఊరగాయ వ్యాసం (నెట్) విహారకులను తెలుగు వికీపీడియా వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ తరువాత వాకా కిరణ్, వాడుకరి:Chavakiran/చావాకిరణ్, వాడుకరి:వైజాసత్య|వైజాసత్య, వాడుకరి:Mpradeep|మాకినేని ప్రదీపు, వాడుకరి:Chaduvari|చదువరి మొదలైన వారి విశేష కృషితో మరింత ముందుకు సాగింది. 2005 సెప్టెంబరులో విశేషవ్యాసం, మీకు తెలుసా , చరిత్రలో ఈ రోజు శీర్షికల మొదటిపేజ ప్రారంభమైంది. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక అక్టోబర్ లో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమైంది.

తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో వికీపీడియా:తెవికీ వార్త| తెవికీ వార్త జులై 1, 2010న ప్రారంభమైంది. 8 సంచికలు తరువాత ఆగిపోయింది. 2010 లో ప్రారంభమైన వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు|గూగుల్ అనువాద వ్యాసాలు 2011 లో దాదాపు 900 పైగా వ్యాసాలు చేర్చిన తరువాత వాటి నాణ్యత పెంచడానికి తెవికీ సభ్యుల సూచనలు అమలు చేయకుండానే ఆగిపోయాయి. వీటివలన సగటు వ్యాస పరిమాణం పెరిగింది. 2011 లో వికీపీడియా దశాబ్ది వుత్సవాలు హైదరాబాదులో జరిగాయి. తెలుగు వికీపీడియన్లు, భారత వికీ సమావేశం 2011 [1] లో పాల్గొన్నారు. వికీమీడియా భారతదేశం విశిష్ట వికీమీడియన్ గుర్తింపు రాజశేఖర్ మరియుటి.సుజాత లకు లభించింది.

వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013|తెలుగు వికీపీడియా మహోత్సవం ఏప్రిల్ 10,11, 2013న థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) ఆధ్వర్యంలో హైదరాబాదులోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగింది. దీనిలో భాగమైన వికీ సర్వసభ్యసమావేశం, వికీ అకాడమీ, వికీచైతన్యవేదికలలో వికీపీడియా సభ్యులు పాల్గొని వికీపీడియా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను చర్చించారు.

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో గత 10 సంవత్సరాలలో విశేష కృషి చేసిన చదువరి , మాకినేని ప్రదీపు, చావా కిరణ్, వీవెన్, పాలగిరి రామకృష్ణా రెడ్డి, రవిచంద్ర, అహ్మద్ నిసార్, వీర శశిధర్ జంగం, జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ మరియు ఎల్లంకి భాస్కర నాయుడు లకు కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీమీడియా పురస్కారము నకు ఎంపికయ్యారు.

వికీ విధానాలు

[మార్చు]

మౌలిక పరిశోధనలు నిషిద్ధం: వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. మీరు వ్రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం.. మీరు వ్రాసిన విషయానికి సంబంధించిన విశ్వసనీయ మూలం లేదా వనరులను ఉదహరించడమే! రచనలో తటస్థ దృక్కోణం ప్రతిఫలించాలి. దీన్నే ఇంగ్లీషు వికీలో NPOV (Neutral Point Of View) అంటారు. రచనలో తటస్థత ఉండాలి. వివాదాస్పద విషయాలలో ఏదో ఒక దృక్కోణం రాయక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు, వివాదంలో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసాన్ని వ్రాయాలి.

నిర్ధారత్వం: మీరు ఉదహరించిన వనరులును సంప్రదించి, విషయాన్ని నిర్ధారించుకునేందుకు వీలుగా ఉండాలి.

వికీ రచనా శైలి

వికీ ఒక విజ్ఞాన సర్వస్వం. పాఠకులకు ఇది ఒక పాఠ్య పుస్తకంలాగా ప్రామాణికంగా ఉండాలి. రచయిత ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తన అభిప్రాయాలు వ్రాయరాదు. కింది సూచనలను పాటించండి.

నేను భావిస్తున్నాను, నాకు తెలిసినంతవరకు, నా అనుభవంలో.. ఇలాంటి వాఖ్యాలు వ్రాయవద్దు.
వ్యాస విషయానికి సంబంధించి అవసరమైన చోట్ల దృష్టాంతాలను, రుజువులను ఉదహరించండి.
గౌరవ వాచకాలు వికీపీడియా శైలి కాదు. అంచేత గారు, శ్రీ వంటివి వ్రాయవద్దు. అలాగే చెప్పారు, వెళ్ళారు, చేసారు వంటి మాటలకు బదులుగా చెప్పాడు, వెళ్ళింది, చేసాడు వంటి పద ప్రయోగం ఉండాలి. ఈ విషయమై మీ అభిప్రాయాలను రచ్చబండలో వ్రాయండి. చర్చా పేజీలు ఇందుకు మినహాయింపు.
వికీపీడియా వ్యాసంలో తమ పేరు నమోదుచేయకూడదు. ఉదాహరణకు కూర్పు, సంగ్రహణ లేదా మూలం అని తమ స్వంతపేర్లు వ్రాయకూడదు.

సోదర ప్రాజెక్టులు

[మార్చు]
మెటా-వికీ , కామన్స్, విక్షనరీ, వికీబుక్స్, వికీకోట్, వికీసోర్స్ మొదలైనవి తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు.

తెలుగు వికీపీడియా

[మార్చు]

ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. ఇందులో ఏమేమి వ్రాయవచ్చు, ఎలా వ్రాయవచ్చు, వ్రాసేటప్పుడు కలిగే ఇబ్బందులు, వాటి నివారణ మొదలగు విషయాలు సందర్భాను సారంగా అక్కడక్కడా తెలుపబడినవి.

వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం

వికీపీడియా - ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కార్య సాధకుడవడం చేత ఆలోచన వచ్చాక ఇక ఊరుకోలేదు, జిమ్మీ. తన ఆలోచనకు ఆకారమిస్తూ వికీపీడియాకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే తాను రూపొందిస్తూ ఉన్న నుపీడియా అనే విజ్ఞాన సర్వస్వాన్ని పేరు మార్చి వికీపీడియాను మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టాడు. వికీపీడియా చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు.

తెలుగు వికీపీడియాలో 83,000 (2023 జూన్ నాటికి) వ్యాసాలకు పైగా ఉన్నాయి. .......వికీపీడియాని మొదలు పెట్టినప్పటి నుండి జరిగిన మార్పులు 38,74,441.(2023 జూన్ నాటికి) నమోదైన వాడుకరులు 1,21,620.(2023 జూన్ నాటికి) క్రియాశీల వాడుకరులు (గత 30 రోజులలో పని చేసిన వాడుకరులు) 192 (2023 జూన్ నాటికి) బాట్‌లు 50 మంది నిర్వాహకులు 13 మంది, అధికారులు 3 మంది. 2023 డిసెంబరు నెలాఖరకు వికీపీడియాలో 10,0,000 వ్యాసాలుండాలని ధ్యేయం.

2. మెటా-వికీ దీనిలో వికీ ప్రాజెక్టుల కు సంబంధించిన విషయాలు చర్చిస్తారు.

3. వికీసోర్స్‌లో సార్వజనీయమైన రచనలను మూలరూపంలో భద్రపరుస్తారు. (కాపీ రైట్ హక్కులు తీరిపోయిన గ్రంధాలు) ఉదాహరణగా శతకములు, పురాణములు, వేదములు మొదలైనవి. ఈ పనులు ప్రణాలికాబద్దంగా చేస్తారు.

4. వికీ కామన్స్ లో తెలుగు వికీపీడియాకు ఉపయోగపడే చిత్రాలు, ఛాయాచిత్రాలు, దృశ్య, శ్రవణ, మాధ్యమాలను భద్రపరుస్తారు. ఇవి ఏ వికీప్రాజెక్టులోనైనా వాడుకోవచ్చు. ప్రస్తుతము తెలుగు వికీపీడియాకు బొమ్మల కొరత చాల వున్నది. తెలుగు వికీపీడియాలోగాని, విక్షనరీలో గాని ఉపయోగించ డానికి కావలసిన బొమ్మలు ఎక్కువగా లభించడము లేదు. కనుక తెలుగు వికీ పీడియన్లు విరివిగా తాము స్వంతంగా తీసిన ఫోటోలను ఎక్కువగా ఎక్కించ వలసినది.

5. వికీబుక్స్ లో అందరూ కలిసి రూపొందించే పాఠ్యపుస్తకాలుంటాయి. ప్రస్తుతము ఇందులో కూడ ఆతి తక్కువ సమాచారమున్నది. కనుక ఇందులోకూడ తెలుగు వికీపీడియనులు ఎక్కువ కృషి చేయవలసి వున్నది.

6. విక్షనరీ లో తెలుగుపదాలకు అర్ధాలు, బహువచనాలు, ఇతర భాషానువాదాలు, వ్యాకరణ వివరాలు ఒక్కొక్క పదానికి ఉంటాయి.

7. వికీకోట్ లో ప్రముఖుల వాఖ్యలు ఉంటాయి. ఇందులోనూ ప్రస్తుతానికి తక్కువ సమాచారముంది. కనుక వికీపీడియనులు ఇందులో ఎక్కువ కృషి చేసి దీనిని కూడ అభివృద్ధి చేయవలసి యున్నది.

తెలుగు విక్షనరీ

[మార్చు]

2. తెలుగు విక్షనరీ. ..... విక్షనరీ అనగా ఏమి?..... విక్షనరీ సమిష్టి కృషితో రూపొందుతున్న బహుభాషా పదకోశం. వికీసోర్సు ఒక మూలాల (ఆధార రచనలు) భాండాగారం. ప్రస్తుతం తెలుగు విక్షనరీలో 97,616 పదములు ఉన్నాయి. విక్షనరీని మొదలుపెట్టినప్పటినుండి జరిగిన మార్పులు 5,27,064. నమోదైన వాడుకరులు 2,788. క్రియాశీల వాడుకరులు (సభ్యుల జాబితా) (గత 30 రోజులలో పని చేసిన వాడుకరులు) 11 .బాట్‌లు (సభ్యుల జాబితా) 9. నిర్వాహకులు 5. 2015 డిసెంబరు నెలాఖురకు విక్షనరీలో 1,15,000 పదాలు వుండాలని నిర్ణయం తీసుకుందాము. ఈ విభాగములో క్రియాశీలక వాడుకరులు చాల తక్కువగా యున్నది. ఆ క్రియశీలకమైన వాడుకరలలో కూడ కేవలము నాలుగైదు వాడుకరులు మాత్రమే 2014 లో విశేష కృషి చేసి ఈ విభాగాన్ని ఈ స్థాయికి తీసుకొని రాగలిగారు.

విక్షనరీ [1], వికీపీడియా యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం వికి, డిక్షనరి పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తం చేసే మాధ్యమము (నిఘంటువు). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు.

వికీపీడియాకు సోదర ప్రాజెక్టు ఐనటువంటి విక్షనరీలో ఎన్నో ఆంగ్ల పదాలకు మరియు తెలుగు పదాలకు అర్థాలు ఉన్నాయి. మీకు అనువాదంలో ఏదైనా పదాలకు అర్థాలు కావలంటే దీనిని ఉపయోగించవచ్చు. అంతేకాక మీకు తెలిసిన పదాలను దీనికి చేర్చి విస్తరించండి. ఇది బహుభాషా నిఘంటువు. ప్రపంచ భాషలలో అన్ని భాషలకు ఇందులో అర్థాలు చేరుతు వున్నాయి. విక్షనరీ అన్ని భాషలలో వున్నది కనుకు తెలుగు వాడుకరులకు తెలుగు ఇంగ్లీషు కాక మరేదైనా భారతీయ భాష తెలిసి వుంటే..... అనగా..... హిందీ, తమిళము, కన్నడము, మళయాలము మొదలగు భాషలు తెలిసి వుండే అవకాశముంది. వారు తెలుగు భాషా పదాలకు వారికి తెలిసిన ఇతర భాషల లో సంబందిత తెలుగు పదానికి ఆ యా భాషలలో అర్థము వ్రాయ వచ్చు.

విక్షనరీ ఎవరైనా పాల్గొనదగిన ఒక స్వేచ్ఛా బహు భాషా పదకోశం. ఇది మామూలు పదకోశాల వంటిది కాదు. ఇక్కడ పదాల సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని పదాల సమాచారాన్ని చేర్చవచ్చు కూడా. ఇది బహు భాషా నిఘంటువు. ప్రపంచ భాషలు అన్నింటిలో ఈ నిఘంటువు తయారవు తున్నది. వాడుకరులు విక్షనరీ లో వున్న తెలుగు పదానికి సరియగు ఇతర భాషా పదాలను ఇక్కడ వ్రాయవచ్చు. తమకు తెలిసిన తెలుగు వాడుకరులలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళము మొదలగు భాషలు కూడ కొందరికి తెలిసి వుండవచ్చు. ఆ భాషలలో ఇక్కడున్న తెలుగు పదానికి అర్థము వ్రాయవచ్చు. అదే విధంగా తెలుగు మాండలిక పదాలు మీకు తెలిసి వుంటే వాటిని కూడ ఇక్కడ వ్రాయవచ్చు. క్రొత్త వాడుకరులకు ఇక్కడ వ్రాయడము చాల సౌలభ్యంగా వుంటుంది. కనుక క్రొత్తవారు తమ రచనలను విక్షనరీలో ప్రారంబించండి.

విక్షనరీలో పనిచేసే విధానం

[మార్చు]
కొత్త పదము చేర్చటం

ముందుగా మొదటి పేజిలో మీకు కావలసిన పదం కోసం వెతకండి. ఆ పదం లేకపోతే సృష్టించాలా అన్న సందేశం వచ్చి ఆ పదం విషయంలో వున్నపేజీలేవైనా వుంటే వాటిని చూపిస్తుంది. సృష్టించాలా అనే దానిపై నొక్కితే, మీకు ఖాళీ పేజీ కనపడుతుంది. దానిలో మీరు తెలుగు పదం చేర్చబోతుంటే {{ subst: కొత్త తెలుగు పదం}}, ఆంగ్ల పదం చేర్చబోతుంటే {{subst: కొత్త ఆంగ్ల పదం}} అని రాసి దాచండి, ఆ తరువాత మార్పులు చేయండి. దీనిని సులభంగా చేయాలంటే మీరు పదాల మూస అనే పేజీకి వెళ్లి మీరు సృష్టించ తలచిన పదాన్ని అన్వేషించండి . ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగు లో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. తరువాత కొత్త తెలుగు పదం అనే మూసలో ఆ పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బటన్ నొక్కండి. మీరనుకున్న పదానికి ప్రారంభ మూసతో సహా పేజీ సిద్ధం అవుతుంది. మీరు తగినట్లుగా మార్పులు చేసి భద్ర పరచితే చాలు. ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వివరాన్ని క్రింద చూడండి. ఆంగ్ల పదాన్ని చేర్చేటప్పుడు వున్న తెలుగు పదానికి లింకు ఇస్తే చాలు. పరభాషా పదాల పూర్తి వివరాల కొరకు సంబంధిత విక్షనరీ చూడాలి.

వ్యాకరణ విశేషాలు

దీనిలో భాషా భాగం, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి లేక లింగము లేక నామవాచకమో విశేషణం లేక ఇలా ఆపదం ఏ వ్యాకరణ విభాగానికి చెందినదో వ్రాయాలి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం యొక్క మూల రూపము దాని మార్పులు ఇవ్వాలి. సాధారణంగా మాతృ భాషా పదాలకు మూలాలు భాషా పండితులు కానివారికి మూలాలు అంత సులభంగా తెలియవు. కనుక మీకు ఖచ్చితమైన విషయం తెలిసి వుంటే దానినే వ్రాయండి. తెలియని దానిని వదిలి పెట్టండి. దాన్ని తెలిసిన వారు వ్రాస్తారు. అ పుటలో అన్నీ పూర్తిచేయాలనే నియమము ఏమీ లేదు. సరైన వనరులు భాషా పుస్తకాలు సంప్రదించి రాయవచ్చు. బహువచనము లేక ఏక వచనము అనే విభాగంలో ఆ పదము యొక్క వచన రూపం వ్రాయాలి. ఆ యాప్రాంతంలో వాడుకలో వున్న మాండలిక పదాలను, వాటి అర్థాలను మీరు వ్రాయవచ్చు. వాటి వ్యాకరణ సంబంధిత వివరాలు మీకు తెలియకుంటే దాన్ని వదిలిపెట్టండి.

అర్ధ వివరణ

దీనిలో పదానికి తగిన అర్ధవివరణ వ్రాయాలి. ఉదాహరణకు: ..... హయము = వేగముగా పరుగెత్తునది. = గుర్రము అని వ్రాయవచ్చు. ఈ పదాన్ని జంతువులు అనే వర్గములో చేర్చవచ్చు. దీనికి వ్యతిరేక పదంగా గాడిద అని వ్రాయవచ్చు. ఇది నామవాచకము. ఆ విషయము ఆ విభాగములో వ్రాయవచ్చు. అదేవిధంగా 2. ఏనుగు అనే పదానికి గజము అని అర్థము వ్రాయవచ్చు. ఇది కూడ నామవాచకమే. అదే వ్రాయండి. ఇది కూడ జంతువుల వర్గంలో చేర్చ వచ్చు. నానార్థాలలో హస్తి /గజము /కరి /ఇభము/సింధువు/సారంగము/కుంజరము /దంతి/ కరేణువు /మాతంగము అని వ్రాయవచ్చు. బహువచనముగా ఏనుగులు అని వ్రాయవచ్చు. ఇలా వ్రాసినప్పుడు ఇక్కడ వున్న పదాలకు పైన కనబరచినప్పుడు ఆ పదానికిరువైపుల [[ ]] అని బ్రాకెట్లు పెట్టితే భద్రపరచిన తర్వాత ఆ యా పదాలు ఇదివరకే విక్షరీలో వుంటే గ్రీన్ కలర్ లో క్రింద గ్రీన్ కలర్లో కనబడతాయి. ఆ పదం విక్షరీలో లేకుంటే ఎర్రగా కనబడుతుంది. ఎర్రరంగులో వున్న అటు వంటి పదాలను తిరిగి దానిని కాపీ చేసుకొని (ముందుగానే వేరొక విండో ఓపన్ చేసుకొని వుండాలి) క్రొత్త విండోలో పద సృష్టి అనే గడిలో ఆ పదాన్ని అతికించి సృష్టించు అనే బటన్ ను నొక్కితే కొత్తపదానికి ఒక పుట తెరుచుకుంటుంది. అందులో కూడ ఆయా విభాగాలను పూరించి భద్ర పరచాలి. పద ప్రయోగము అనే విభాగంలో 1. ఒక సామెతలో పద ప్రయోగము.....ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే. 2.ఒక సామెతలో పద ప్రయోగము:...... ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు అని వ్రాయవచ్చు. అనువాదము అను విభాగములో ఆంగ్ల భాషకు elephant అని వ్రాయ వచ్చు. కన్నడము, తమిళము లలో అర్థము తెలిసి వుంటే....... ఆ పదాన్ని కూడ వ్రాయవచ్చు.

పదాలు

దీనిలో నానార్ధాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి. నానా అర్ధాలులో పదానికి ఉండే ఇతర అర్ధాలు సమాన అర్ధాలు వ్రాయాలి. సంబంధిత పదాలులో ఆ పదానికి సంబంధించిన పదాలు వ్రాయాలి. వ్యతిరేక పదానికి ఆ పదానికి ఉండే వ్యతిరేక పదం వ్రాయాలి. నానార్ధాలు ఉపవిభాగంలో ఇతర సమానార్ధాలు వ్రాయాలి. ఇందులో ప్రాంతీయ, మాండలికాల భిన్న రూప పదాలు వ్రాయ వచ్చు. కూడా వ్రాయవచ్చు. ఉదా;- కోస్తా ప్రాంతంలో ప్రాంతంలో చిన్న బిడ్డ, పసి బిడ్డ అనేది కొంచం పడమట తెలుగు ప్రదేశాలలో సన్న బిడ్డ అంటారు. అలాంటివి నానార్ధాలులో పేర్కొన వచ్చు. అలాగే పదానికి వివిధ విభక్తి రూపాలు, వివిధ విశేషణ రూపాలు పేర్కొన వచ్చు. ఉదా: రాముడు, రాముడితో, రాముని, రాముడి వలన, రాముడే, రాముడి వంటి, రామునిలా, రాముడేనా, రాముడా ఇలా ఒకే పదం విభక్తి కారణంగా వివిధ రూపాలు మారుతుంటాయి. వాటిని సంబంధిత పద విభాగంలో పేర్కొన వచ్చు. అలాగే విశేషణం వలన మారే రూపాలు.

పద ప్రయోగాలు

ఇక్కడ పదాన్ని వాక్యాలలో, పద్య పాదాలలో, పాదాలలో, జానపదాలతో, సామెతలలో /పాటలలో ప్రయోగిస్తూ ఉదహరించాలి. ఈ పదప్రయోగం వున్న వాఖ్యము ఎవరు వ్రాశారు లేదా ఏ గ్రంధంలోనిది...... తెలియడానికి ఆ గ్రంధ కర్త, గ్రంధం పేరు వ్రాయాలి. ఉదాహరణకు: చందమామ అనే పదానికి అర్థము: చంద్రుడు అని, సంబందిత పదాలలో వెన్నెల, .... అని, పద ప్రయోగములో మిస్సమ్మ సినిమా పాటలో పద ప్రయోగము అని వ్రాసి తర్వాత రావోయి చందమామ మా వింత గాధ వినుమా..... ... అని వ్రాయవచ్చు.

అనువాదాలు

ఇది సమగ్రంగా తయారైతే ఎక్కువ ఉపయోగంగా వుండే విభాగం. ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్ధాలు తెలిసిన వారు వాటిని చేర్చ వచ్చు. అర్ధాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్ఛారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ దిద్దుబాటులో ఆ భాషలకు లింకులు ముందే తయారుగా ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. అంతర వికీలు లింకులు బాట్లతో కూడా సృష్టించవచ్చి కాబట్టి ఈ విషయం చర్చ కొనసాగించాల్సి వుంది.

మూలాలు వనరులు

ఇక మూలాలు, వనరులు అనగా మీకు ఎక్కడ ఆ పదం అర్ధంతో తారసపడింది తెలపండి. ఉదా: నకలు హక్కులు తీరిపోయిన నిఘంటువులలో, లేక అనుమతి పొందిన తరువాత ఇతర నిఘంటువులలోని వివరాలు చేర్చేటప్పుడు ఆ నిఘంటువు వివరాలను వనరులలో వ్రాయండి.

తెలుగు వికీసోర్స్

[మార్చు]

(ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛా విజ్ఞాన మూలములు ) ఇందులో కాపీ రైట్ హక్కులు గడువు తీరిపోయిన అనేక గ్రంధాలు ఇక్కడ పొందు పరచబడి వున్నాయి. ఇందులో ప్రవేశిస్తే ప్రక్కప్రక్కన రెండు పుటలున్న ఒక పేజి కనబడుతుంది. కుడి ప్రక్కన వున్న పుటలో ఆ గ్రంధానికి సంబందించిన విషయమున్న ఒక పుట కనబడుతుంది. ఎడమ ప్రక్కన ఖాళీ పుట కనబడుతుంది. మీరు కుడిప్రక్కన వున్న పుటలోని విషయాన్ని యదాతదంగా (సవరించు టాబ్ ను నొక్కి) ఖాళీగా వున్న పుటలో వ్రాయవచ్చు. ఈ పుటలో వ్రాసేటప్పుడు అసలు పుటలో ఎలా వున్నదో అలాగే వ్రాయవలసి వుంటుంది. అక్షర దోషాలున్నా అదే విధంగా వ్రాయవలసి వుంటుండి. పద విభాగము అందులో వున్నట్టే వ్రాయాలి. వ్రాసిన తరువాత దానిని భద్రపరిస్తే సరి. తరువాత మరొక పుటకు వెళ్ళ వచ్చు. ఇందులో చాల గ్రంధాలు మీ సేవలకొరకు ఎదురు చూస్తున్నాయి. కొత్తగా చేరిన వారికి ఇందులో వ్రాయడము చాల తేలిక. ప్రయత్నించండి.

ఇప్పటికి ఇందులో 10,000 పైచిలుకు తెలుగు పాఠ్యపుపేజీలు, 8 అమోదించబడిన, 4 దిద్దబడిన, 11 టైపు పూర్తయిన మరియు 78 టైపు చేయబడుచున్న పుస్తకాలున్నాయి.

తెలుగు వికీబుక్స్

[మార్చు]

( ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి). ప్రస్తుతం ఇందులో 55 వ్యాసాలున్నాయి.

వికీకోట్ వ్యాఖ్యలు

[మార్చు]

వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి. అంతేకాదు వ్యాఖ్యలను చేసినవారి గురించి తెలుసుకోవడానికి తెలుగు వికీపీడియాకు లింకులు కూడా ఉంటాయి! తెలుగు వికీవ్యాఖ్యలో ఇప్పటివరకూ 333 పేజీలు తయారయ్యాయి. ఒక్కో పేజీలో ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యలు సామెతలు ఉంటాయి. సహాయ పేజీని సందర్శించో లేకపోతే మీరే స్వయంగా ప్రయోగశాలలో ప్రయోగాలు జరిపో, ఇక్కడ ఎలా మార్పులు చేర్పులు చేయాలో నేర్చుకోండి. అంతేకాదండోయ్ ఇక్కడున్న ఏ పేజీనయినా మీరు ఇప్పటికిప్పుడు మార్చేయవచ్చు; అలాగే మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకుని, మీకై మీరు ప్రత్యేకంగా ఒక సభ్య పేజీని కూడా సృష్టించుకోవచ్చు. (వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి) ఇందులో ప్రముఖ వ్యక్తులు చెప్పిన వ్యాఖ్యలు, గ్రంధాలలో ఇచ్చిన వ్యాఖ్యలు మొదలగు నవి వ్రాయవచ్చు. ఈ సోదర ప్రాజెక్టులో విషయము చాల స్వల్పముగా వున్నది. క్రొత్తగా చేరిన వారికి ఇది కూడ సులభమైన వనరు. ప్రయత్నించండి. ఇందులో ప్రవేశించగానే అందులో ఏమేమి వ్రాయాలో అవగాహన అవుతుంది. చొరవగా ప్రయత్నించండి.

ఏమిటి వికీపీడియా విశిష్టత?

[మార్చు]

వికీ అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల వెబ్సైటు అని అర్థం. వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు. అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా!! ఇంకా అయిపోలేదు, ఈ మొత్తం వికీపీడియాను ప్రింటు తీసేసి, పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది.. ఈ పుస్తకాలకు వెల కట్టి అమ్ముకోనూ వచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు.

భారతీయ భాషల్లో వికీపీడియా:

[మార్చు]

1. మొదటగా 2001 లో ఇంగ్లీషులో మొదలైందీ వికీపీడియా. నిదానంగా ఇతర భాషలకూ విస్తరించి, ఇప్పుడు 200 కు పైగా భాషల్లో తయారవుతోంది. అందులో తెలుగూ ఒకటి. హిందీ, సంస్కృతం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, తెలుగు ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. మనకు గర్వకారణమైన విషయమేమిటంటే, భారతీయభాషల వికీపీడియాలన్నిటిలోకీ తెలుగే ముందుంది. వ్యాసాల సంఖ్యలోగానీ, సభ్యుల సంఖ్యలో గానీ తెలుగు వికీపీడియాదే అగ్రస్థానం.

తెలుగు వికీపీడియా అంశాలు:

1.తెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు

తెలుగు వికీపీడియా వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. 13 వేలకు పైగా సభ్యులు 60 వేలకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల లోని అన్ని గ్రామాల గురించీ రాయాలనే సంకల్పంతో సభ్యులు రేయింబవళ్ళు పని చేస్తున్నారు. చాల వరకు పని పూర్తయింది. రేయింబవళ్ళు అనే మాట వాక్యంలో తూకం కోసం వాడింది కాదు.., భారత్, అమెరికా, కెనడా, బ్రిటను, ఫ్రాన్సు, కొరియా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచం నలుమూలలలోనూ ఉన్న తెలుగువారు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంచేతే ఎల్లవేళలా వికీపీడియాలో ఎవరో ఒకరు రాస్తూనే వుంటారు.

2.ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?

అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమిటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో ఆ పదాన్ని వెతుకు పెట్టెలో వ్రాసి వెతకండి. విజ్ఞానాన్ని అందరికి ఉచితంగా అందుబాటులో వుంచాలనేదే వికీపీడియా ఉద్దేశము గదా.......

3.ఇంతటి గొప్ప పనికి ఖర్చు కూడా గొప్ప గానే అవుతుంది కదా, మరి ఆ ఖర్చుకు డబ్బులెలా సమకూరుస్తున్నారు?===

సర్వర్లు, ఇతర మిషన్లు కొనడానికి, హోస్టింగుకు అవసరమైన ఖర్చుల కోసం పెద్ద మొత్తంలోనే డబ్బులు ఖర్చవుతాయి. దానికొరకు ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తారు. సాఫ్టువేరును అభివృద్ధి చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా చేస్తారు. ఇక వ్యాసాలు - ఇతరత్రా వ్యాసాలు రాసేవాళ్ళంతా మనబోటి వాళ్ళే. తమకు తెలిసిన విషయాలను ఉచితంగానే రాస్తున్నారు. ఎవరికి తెలిసిన విషయాలను వాళ్ళు రాస్తూ పోతే వికీపీడియాలో ఎంతటి విషయ సంపద పోగు పడుతుందో ఊహాతీతమే గదా......

4.ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా?

నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు. వికీపీడియా ఉద్దేశమే అది. విషయ పరిజ్ఞానమున్న వారు ఆ విషయాలలోని ఇదివరకు వున్న వ్యాసాలలోని విషయము తక్కువగా వుంటే అటువంటివారు తమ వద్ద వున్న అధిక సమాచారాన్ని జోడించ వచ్చు. ఏదైనా వ్యాసం అసలు లేకుంటే ఆ విషయమై కొత్త వ్యాసాన్ని తయారు చేయవచ్చు. ఆ వ్వాసంలో వారి వద్ద పూర్తి సమాచారము లేకున్న పరవాలేదు. వారి వద్ద వున్నకొద్ది పాటి విషయాన్ని పొందుపరచి వ్యాసాన్ని సృష్టించ వచ్చు. పూర్తి సమాచారముతో ఆ వ్యాసాన్ని మీలాగే మరొకరు పూరుస్తారు. భాషా పరమైన పరిజ్ఞానమున్నవారు వ్యాసాలలోని వ్యాకరణ/అక్షర దోషాలను సరిదిద్దవచ్చు. వ్యాసాలు వ్రాసేవారు గాని ఇదివరకే వున్న వ్యాసంలో కొత్త సమాచారము పొందు పరచే వారు గాని ఆ వ్యాసం గాని, వ్యాస భాగము గాని ఎక్కడినుండి సేకరించారో అనగా ఏదేని గ్రంధం, వార్తా పత్రిక మొదలగువాటి పేర్లను మూలం గా తప్పని సరిగా పేర్కొనాలి.

5.దేని గురించి రాయవచ్చు?

మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను. వికీపీడియా లోని విషయాన్ని సంకలన పరచి పుస్తకంగా ముద్రించి అమ్ముకోవచ్చు కూడ. అంతా ఉచితమే. కాని ఆ పుస్తకంలో 'ఈ సమాచారాన్ని వికీపీడియా నుండి గ్రహించ బడినది ' అని మాత్రము వ్రాస్తే చాలు.

6.పేపర్లో చదివే వార్తలు.

ఏదైనా ఊరి గురించి కాని, సినిమా గురించి కాని, వ్యక్తి గురించి కాని ఆసక్తికరమైన వార్త పేపర్లో చదవొచ్చు. లేదా టీవీలో చూడొచ్చు. తెలుగు వికీలో ఆ వూరు లేదా సినిమాకు సంబంధించిన పేజీ తెరిచి ఆ విషయాన్ని క్లుప్తంగా వ్రాసేయండి. ప్రతిరోజు వార్తా పత్రికలలో ఎన్నో విషయాలు వస్తుంటాయి. ఆ విషయాలకు సంబందించిన వ్యాసాలు వికీపీడియాలో ఇదివరకే వుండవచ్చు. ఉండినా అదనపు సమాచారము వుంటే అందులో చేర్చ వచ్చు. లేకుంటే క్రొత్తగా సృష్టించ వచ్చు. రిఫరెన్సుగా ఆ పేపరు, తేదీలను పేర్కోవడం మరచి పోకండి.

7. టీ.వీ.లో సినిమా చూశాను.

మీరు క్రొత్తది కాని, పాతదికాని సినిమా చూశారనుకోండి. మరిచిపోక ముందే ఆ సినిమా గురించి వికీలో ఆ సినిమా వ్యాసం వ్రాసెయ్యండి. ఆ సినిమా గురించి ఇప్పటికే ఒక పేజీ ఉండవచ్చును. వర్గం:తెలుగు సినిమాలు చూడండి. అందులో మరింత సమాచారం చేర్చవచ్చును. టైటిల్స్‌లో నటులు, నిపుణుల పేర్లు వ్రాస్తే మరీ మంచిది. "సినిమా బాగుంది. బాలేదు" వంటి అభిప్రాయాలు మాత్రం వ్రాయొద్దండి.

8. మీకు తెలియని వూరు గురించి వ్రాయండి.

ఎవరైనా పరిచయమున్న మిత్రులను వారి వూరి గురించి అడగండి. వూరెక్కడుంది? పంటలేంటి? గుళ్ళు, గోపురాలు, తిరణాలు, సంబరాలు, నీటి వనరులు - ఇలాంటి విషయాలు. వికీలో ఆ వూరి గురించి వ్యాసం కొద్దిగా వ్రాసేయవచ్చును. చర్చా పేజీలో "ఫలాని వారు ఇచ్చిన సమాచారం ప్రకారం" అని వ్రాస్తే మర్యాదగా ఉంటుంది. (వారికి అభ్యంతరం లేకపోతేనే).

9. మీ వూరి గురించి ఏం వ్రాయొచ్చు?

మాది చాలా చిన్న పల్లె. దాన్ని గురించి ఏం వ్రాయగలం? అనిపించవచ్చును. - అందుకు సూచనల కోసం ఈ సూచనపేజీ చూడండి. ఇంకా కొన్ని ఉదాహరణల కోసం బ్రాహ్మణగూడెం, చిమిర్యాల, పెదవేగి చూడండి. జనాల గురించి, పంటల గురించి, సౌకర్యాల గురించి వ్రాయొచ్చు. ఒకసారి రాయడం మొదలు పెడితే మీరే ఆశ్చర్యపోతారు - ఇంత వ్రాయొచ్చునా అని.

10. మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా?

ఏం పర్లేదు, తెలుగు వికీలో అప్రమేయం తెలుగు టైపింగ్ సహాయం ఉపకరణం వుంది. అదేకాక ప్రతి కంప్యూటర్ వ్యవస్థలో పని చేసే వివిధ రకాల కీ బోర్డులున్నాయి. వికీపీడియాలో ప్రవేశించగానే అంతా తెలుగులోనే మొదటి పుట కనబడుతుంది. అందులో ఏదేని వ్యాసంకొరకు వెతకండి. (వెతుకు పెట్టెలో వ్యాసం పేరు వ్రాసి వెతుకు. అనే పెట్టెను నొక్కితే ఆవ్యాసం ఇదివరకే వున్నట్లయితే ఆవ్యాసం కనబడుతుంది. లేకపోతే..... ఆ వ్యాసం పేరు ఎర్రని రంగులో కనబడుతుంది. అంటే ఆ వ్యాసం లేదని అర్థము. అక్షర దోషాలు లేకుండా వ్యాసం పేరు వ్రాయండి. ఆ ప్రక్కనే సృష్టించు అని కూడ కనబడుతుంది. దానిని నొక్కితే ఆ వ్యాసంపేరుతో ఖాళీ పుట తెరుచు కుంటుంది. ఇక మీరు వ్రాయవచ్చు. ఇంగ్లీషు కీ బోర్డునే వాడవచ్చు. ఒక వేళ తెలుగులో కనబడక పోతే ....... ctrs. + Capital M టాబ్ లను ఒక్కసారె నొక్కండి. తెలుగులోకి మారిపోతుంది. తిరిగి ఇంగ్లీషులోని మారాలనుకుంటే అవే బటన్ లను మరొక సారి నొక్కండి. ఇంగ్లీషులోనికి మారి పోతుంది. తెలుగులో టైప్ చేయడము రాదు అనేది సమస్యే కాదు. ఇంగ్లీషు కీ బోర్డునేవాడ వచ్చు. ఉదాహరణకు అమ్మ అని వ్రాయాలంటే amma = అమ్మ అనీ, anna = అన్న అని akka = అక్క అని nEnu = నేను అని nuvvu = నువ్వు అని mIru =మీరు eMduku = ఎందుకు eppuDu = ఎప్పుడు అని వ్రాస్తే తెలుగులో టైప్ అయి పోతుంటాయి. ద్విత్తాక్షరాలు, సంయుక్తాక్షరాల వ్రాయడానికి మాత్రము కొంత శ్రమ. అంతా ఒక పది రోజులలోనే అలవాటయి పోతుంది. దీనికి సహకారిగా మీరు వ్రాస్తున్న పుటలోనే టైప్ సహాయం కాలి అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద నొక్కితే తెలుగు + ఇంగ్లీషు అక్షరాలున్న కీ బోర్డు కనబడుతుంది. అందులో ఏ అక్షరానికి ఏ కీ నొక్కాలి అని తెలియజేసే కీ బోర్డు కనబడుతుంది. అందులో చూసి వ్రాయవచ్చు. ఒక పది రోజుల పాటు అప్పుడప్పుడు ఆ కీ బోర్డును చూసి వ్రాయవచ్చు తర్వాత దాని అవసరమే వుండదు. దాని అవసరము లేకుంటే ఆ కీబోర్డును మూసి వేయవచ్చు. ఇంతకీ ముందు మీకుండాల్సింది వ్రాయాలనే ఉత్సాహమే గాని...... విషయ పరిజ్ఞానము గాని, టైప్ చేయడం రాదనే విషయాలు అతి చిన్నవి. ఉత్సాహంతో ప్రయత్నించండి. నా కంప్యూటర్ లో తెలుగు లేదు.... ఎలా స్థాపించుకోవాలి? దీనికి జవాబు ఈ పుస్తకంలోనే మరొక చోట వున్నది చూడండి.

11. కానీ నా ఆఫీసు పనులు, ఇంటి పనులతో బిజీగా ఉంటాను కదా, వికీపీడియాలో రాస్తూ ఉంటే ఆ పనులేం గాను?

మీ పనులన్నీ వదిలేసి, అక్కడ రాయనవసరం లేదు. మీ తీరిక సమయంలోనే రాయండి. అక్కడ రాసే సభ్యులంతా అలా రాసేవాళ్ళే! మీ పనులు మానుకొని వ్రాయనవసరము లేదు. మీ తీరిక సమయంలో రోజుకు కనీసం ఒక గంట దీనికి కేటాయిస్తే చాలు. ఎంతో సమాచారము ప్రోగవుతుంది. ఇక్కడ వ్రాస్తున్న వారు అదే పనిగా ఏమీ వ్రాయడము లేదు. వారి వారి తీరిక సమయంలోనే వ్రాస్తున్నారు. రోజు కాకపోయినా అప్పుడప్పుడు మీకు విషయము దొరికినప్పుడు, ఉత్సాహం కలిగినప్పుడు ఇందులో ప్రవేశించి వ్రాయవచ్చు. ఇక్కడ అందరూ అలాగే వ్రాస్తారు. మీకు ఉత్సాహం వుంటే.... ఇందులో ప్రవేశించి ఎవరెవరు ఏమేమి వ్రాస్తున్నారో గమనించండి, చదవండి. నాలుగైదు రోజులు అలా చూస్తే మీకు అర్థం అయిపోతుంది.

12.కానీ నాకున్న భాషా పరిజ్ఞానం పరిమితం. తప్పులు దొర్లుతాయేమో!?

నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు. అంతే కాక ఇక్కడ వ్రాస్తున్న వారు మహా రచయితలో, భాషా పండితులో కాదు. అంతా మీలాంటి వారే.

13. సమాచార సేకరణ

వికీపీడియాలో చేర్చడానికి సమాచారం ఎక్కడనుంచి సేకరించాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో కేవలం ఆంగ్ల పుస్తకాలే కాక తెలుగు పుస్తకాలు కూడా బోలెడు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మంచి పేరున్న రచయితలు రాసినవి చదివి సేకరించవచ్చు. లేకపోతే అన్నింటికన్నా ఉత్తమమైన పద్దతి గ్రంథాలయాలకు వెళ్ళి సేకరించడం. అలా సేకరించిన సమాచారాన్ని యదాతథంగా రాసేయకుండా దాన్ని కొంత క్లుప్తీకరించి వ్రాయండి. ఆ మూల గ్రంథం పేరును మూలాలలో చేర్చడము మరచి పోవద్దు.

14. దేని గురించి రాయాలా అని ఆలోచిస్తున్నారా?

మీ స్నేహితులతో సంభాషిస్తున్నపుడు వారు మీరు చెప్పే విజ్ఞాన దాయకమైన విషయాలను ఆసక్తిగా వింటున్నారా? అయితే వాటి గురించి వికీపీడియాలో రాయండి. వికీపీడియాలో మీ రచనలను ఎక్కడ ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నారా?. మీరు కనుక గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే, మీ ఊరి గురించి వికీపీడియాలో లేకపోతే మీ ఊరి గురించి వ్రాయండి. లేదా ఈ వారము సమైక్య కృషి అన్న లింకుపై నొక్కి, ఇప్పుడు మార్పులు అవసరమైన పేజీలేవో తెలుసుకోండి. అక్కడ మీ పని ప్రారంబించండి.

15. మీ వీలును బట్టే వికీలో కృషి చేయండి.

వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వమని మీకందరికీ తెలిసిందే. ఇదే స్వేచ్చ వికీపీడియా కోసం పని చేసే సభ్యులకూ వర్తిస్తుంది. వికీ సభ్యులు తమకు ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన సమయాల్లో, ఇష్టం వచ్చిన వ్యాసాలలో మార్పులు చేయవచ్చు. ఒక వేళ వికీ సభ్యులు తాము తగినంత సమయం కేటాయించలేక పోతే అందుకు సదరు సభ్యులు భాద పడనక్కర లేదు. ఇతర సభ్యులు అందుకు ఆక్షేపించడం కూడా సరియైన పద్దతి కాదు. అది నిర్వాహకుల విషయంలో నైనా సరే. ఎవరికైనా వాళ్ళ స్వంత పనులు, అభిరుచులు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని గౌరవించడం ఉత్తమం.

ఎక్కువ సమయం దొరకడం లేదు. నాకు వికీపీడియాలో పని చేయడానికి ఎక్కువ సమయం దొరకడం లేదు కనుక పెద్ద వ్యాసాలు వ్రాయలేకపోతున్నాను.
వ్యాసం పొడవును బట్టి వికీ నాణ్యత గాని, మీ విలువ గాని పెరగవు. వికీలో ఎంత చిన్న దిద్దుబాటైనా స్వాగతించ బడుతుంది. ఉదాహరణకు అక్షర దోషాల సవరణ. "భాగవతం" బదులు "బాగవతము" అని మీకు ఎక్కడైనా కనిపించిందనుకోండి. వెంటనే దిద్దెయ్యండి. కాలిలో చిన్న ముల్లు ఉంటే ఉపేక్షిస్తామా?

2001 లో స్లాష్ డాట్ అనే వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసం కారణంగా ఇంగ్లీషు వికీపీడియాకు ప్రజల్లో మంచి ప్రచారం లభించింది. అలాగే 2006 నవంబరు 5 నాటి ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చిన వ్యాసం కారణంగా తెలుగు వికీపీడియాకు ఎంతో ప్రచారం లభించింది. ఆ వ్యాసం కారణంగా సభ్యుల సంఖ్య 12 రోజుల్లోనే రెట్టింపై ఒక్కసారిగా తెలుగు వికీపీడియా భారతీయ భాషల్లోకెల్లా మొదటి స్థానానికి దూసుకుపోయింది.

మీరూ వికీపీడియాలో చేరండి. వ్యాసాలను వ్రాయండి. మీ స్నేహితులనూ చేర్పించండి. వారిచేత కూడ వ్రాయించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. మీరు వ్రాసిన సమాచారము చిరకాలము మీపేరుతోనే వుంటాయి. మీరు సృష్టించిన వ్యాసము యొక్క సృష్టి కర్త గా మీపేరే నామోదవుతుంది. ఆ వ్యాస సృష్టికర్తగా మీపేరు శాస్వతముగా అక్కడ నామోదై వుంటుంది. ఆ తర్వాత ఆ వ్యాసంలో ఎవరెవరు ఎంత విషయాన్ని పొందు పరచినా సృష్టికర్తగా మీపేరే వుంటుంది. ఆ విధంగా మీకు శ్రేయస్సు ఆపాదించ బడుతుంది. ఇది మీకు గర్వ కారణం కాదా?

వికీపీడియా:మౌలిక అంశాలు:

[మార్చు]
1. వికీపీడియా
అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?

వికీపీడియా చదవడానికి, వ్యాసాలను ఎడిట్ చేయడానికి లాగిన్ కానవసరము లేనే లేదు. ఎవరైనా, ఎప్పుడైనా దాదాపుగా అన్ని వ్యాసాలను లాగిన్ అవకుండానే మార్చవచ్చు. కానీ, ఎకౌంటు సృష్టించుకోవడం ఎంతో సులభమైనది, క్షణాలలో చేయగలిగినది, ఉచితమైనదీను. ఇది చాలా చాలా మంచి ఆలోచన అని చెప్పడానికి అనేక రకాల కారణాలున్నాయి.

వికీపీడియా ఖాతా వలన పలు ప్రయోజనాలున్నాయి! మచ్చుకు, ఖాతాలున్న వాడుకరులు కొత్తపేజీని మొదలు పెట్టగలరు, పాక్షికంగా సంరక్షించబడిన పేజీలలో దిద్దుబాట్లు చెయ్యగలరు, పేజీల పేర్లను మార్చగలరు, బొమ్మలను అప్లోడు చెయ్యగలరు. ఇంకా స్వంత సభ్యుని పేజీ పెట్టుకోవచ్చు, వ్యక్తిగత వీక్షణ జాబితా పెట్టుకోవచ్చు, నిర్వాహకులు కావచ్చు!

మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక సభ్యనామాన్ని ఎంచుకోవచ్చు. మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) ఐ.పీ. చిరునామాకు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పులు-చేర్పులు" లింకును నొక్కి, మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే ఉంది.

మీకు మీ సొంత సభ్యుని పేజీ ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం ఏమైనా రాసుకోవచ్చు. వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత కాకపోయినా, మీరు కొన్ని బొమ్మలను ప్రదర్శించడం, మీ హాబీల గురించి రాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు. చాలామంది సభ్యులు తమ సభ్యపేజీని తాము చాలా గర్వపడే వ్యాసాల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారం సేకరించడానికి ఉపయోగిస్తారు.

మీరు ఇతర సభ్యులతో చర్చించేందుకు మీకు ఒక శాశ్వత సభ్యుని చర్చ పేజీ ఉంది. ఎవరైనా మీకు మీ చర్చాపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా గోపనీయమైనది. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి, మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశం లేదు.

2. సభ్యత్వం తీసుకోవడము తప్పని సరా?

వికీపీడియాలో వ్రాయాలంటే మీరు సభ్యత్వం తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. కాని, తీసుకుంటే మంచిది.

సభ్యత్వం లేకుండా, లాగిన్ అవకుండా వ్రాస్తే, మీ రచనలు మీ పేరిట ఉండవు. ఏదో ఐ.పి.అడ్రసు పేరిట చేరుతాయి. మీతో చర్చించడం ఇతరులకు సౌకర్యంగా ఉండదు. ఓ శంకరరావు గారితోటో, లక్ష్మి గారితోటో కలిసి పనిచెయ్యడానికి బాగుంటుందిగానీ, ఏ 66.221.78.112 తోటో ( ఈ నెంబరు I P address అనగా అజ్ఞాత వాడుకరి). కలిసి పని చెయ్యాలంటే కష్టమే కదండీ! చర్చలో పాల్గొన్నపుడు తాము ఎవరితో చర్చిస్తున్నామో మిగతా సభ్యులకు తెలుస్తుంది. అంచేత వారు మరింత చొరవగా చర్చలో పాల్గొనగలుగుతారు. అన్నిటికీ మించి, అజ్ఞాతంగా వ్రాస్తున్నపుడు, మీ పేరుకు బదులు మీ ఐ.పి.అడ్రసు నమోదవుతుంది. అదే అడ్రసుతో ఇతరులు కూడా వ్రాసే సంభావ్యత ఉంది. ఒకవేళ వారు తప్పుడు పనులు చేస్తే..దానిపై నిర్వాహకులు చర్య తీసుకుంటే.., దానికి మీరు అనవసరంగా బలవుతారు.. అన్యాపదేశంగా బాధ్యులూ అవుతారు. అంచేత మీరు సభ్యులుగా నమోదయి, లాగిన్ అయిన తర్వాతే రచనలు చేస్తే మంచిది. సభ్యులైన వారికి మాత్రమే నిర్వాహకుని హోదా లభించే అవకాశం ఉంది.

3. ప్రసిద్ధి, గోప్యత

మీరు మీ నిజ జీవితపు గుర్తింపును తెలియపరచనవసరం లేదు, కానీ ఇతర సభ్యులు గుర్తించే ఒక స్థిరమైన గుర్తింపును ఎకౌంటు మీకు ఇస్తుంది. లాగిన్ అవటం వలన మీరు చేసే మార్పు చేర్పులు మీపై విశ్వాసాన్నీ, గౌరవాన్నీ కలిగిస్తాయని తెలియజేస్తున్నాము. మీరెవరో మాకు తెలిస్తే (కనీసం మీ వికీపీడియా గుర్తింపు) మీతో సంభాషించటానికీ, కలిసి పనిచేయటానికి సులభంగా వుంటుంది. పైగా ఎకౌంటు ప్రారంభించే కొత్త సభ్యుల పట్ల పాతవారికి సులభంగా విశ్వాసం కలుగుతుంది. సభ్యునిగా చేరకపోతే మీకుండే స్వేచ్ఛ తగ్గుతుంది.

మీరు లాగిన్ కాకపోతే, మీరు చేసే మార్పుచేర్పులన్నీ, అప్పటి మీ ఐ పీ అడ్రసు కు చెందుతాయి. లాగిన్ అయివుంటే అవి బహిరంగంగా మీపేరుకు, అంతర్గతంగా మీ ఐ.పి.అడ్రసుకు చెందుతాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కొరకు వికీమీడియా గోప్యతా విధానము చూడండి.

మీ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ను బట్టీ, స్థానిక చట్టాలను బట్టీ, వికీపీడియాలో మీరు చేసే మార్పు చేర్పుల నాణ్యత, సంఖ్యను బట్టి ఈ విధానం యొక్క ప్రభావం ఉంటుంది. వికీపీడియా సాంకేతికాంశాలు, విధానాలు మారుతూ ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి.

4. మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు

నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే మీడియావికీ సాఫ్ట్‌వేర్‌ (వికీపీడియాకు శక్తి కేంద్రం అదే) కు సంబంధించిన విశేషాలు ఎన్నో వున్నాయి. ఉదాహరణకు, చేసిన మార్పుచేర్పులు 'చిన్న'వని గుర్తు పెట్టగలగడం. స్వల్ప మార్పులను "ఇటీవలి మార్పుల" జాబితా నుండి వడకట్టవచ్చు. చిన్న మార్పులు కానివాటిని కూడా చిన్నవిగా గుర్తు పెట్టడాన్ని దురుసుతనంగా భావిస్తాం. కాబట్టి, కేవలం వ్యాకరణదోషాల సవరణల వంటి వాటిని మాత్రమే చిన్న మార్పులుగా గుర్తించాలి. అనామక సభ్యులు ఐ.పి.అడ్రసు చాటుగా వుంటారు కనుక, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కనుకా చిన్నమార్పులను గుర్తు పెట్టే హక్కు వారికి వుండదు. తద్వారా విశ్వాస భావనను నెలకొల్పవచ్చు.

చురుకుగా వుండే సభ్యులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్య విశేషం వీక్షణ జాబితా. మీరు చూసే ప్రతి పేజీ లోను "వీక్షించు" అనే లంకె వుంటుంది. మీరా లంకెను నొక్కితే ఆ పేజీ వీక్షణ జాబితాలోకి చేరుతుంది. అసలీ జాబితా ఏమిటంటే - మీరు గమనిస్తున్న పేజీలలో "ఇటీవలి మార్పుల" వడపోత మాత్రమే. ఈ విధంగా ఆయా పేజీల్లో జరిగే అన్ని మార్పులనూ చూడకుండానే వాటిని గమనిస్తూ వుండవచ్చు.

నమోదైన సభ్యులు మాత్రమే పేజీల పేరు మార్పుచెయ్యగలరు. వికీపీడియా ఆకారాన్నీ, దాని ప్రామాణికతనూ చెక్కు చెదరకుండా వుంచటానికి ఇది చాలా ముఖ్యం. ఇంకా, బొమ్మలు అప్‌ లోడు చెయ్యాలంటే మీరు లాగిన్ అవ్వవలసిందే.

5. సభ్యుని అభిరుచులు ఎన్నో

పై విశేషాలతో పాటు, మీడియావికీ ఆకృతిని మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అసలు వెబ్‌ సైటు రూపురేఖలనే మార్చుకోవచ్చు. ఉదాహరణకు.., ఇప్పుడున్న "మోనోబ్లాక్‌" రూపు స్థానంలో ఇదివరకటి "స్టాండర్డ్" రూపును ఎంచుకోవచ్చు, గణిత సూత్రాలు ఎలా కనపడాలో ఎంచుకోవచ్చు, దిద్దుబాటు పెట్టె (ఎడిట్ బాక్స్) ఎంత పెద్దదిగా వుండాలి, "ఇటీవలి మార్పుల" పేజీలో ఎన్ని పేజీలు కనిపించాలి, ఇలా ఇంకా ఎన్నో.

6. ఎన్నికలు, ఎంపికలు, వోటింగు, సర్వేలు, సంప్రదింపులు..

వికీపీడియాలోని చాలా పోలింగులలో ఎవరైనా - లాగిన్ అయినా కాకున్నా - తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. కానీ అదే అభిప్రాయం ఒక చక్కని దిద్దుబాటు చరితం కలిగిన సభ్యునికి చెందినదైతే దానికి మరింత విలువ వుంటుంది. కొన్ని పోలుల లోనైతే, మీ వోటును పరిగణించాలంటే, మీరు నమోదైన సభ్యుడు అయి వుండాలనే నియమం ఉంది. నమోదు కాని వారు తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు.

వికీమీడియా బోర్డులో వాడుకరుల ప్రతినిధులు ఇద్దరు వుంటారు - ఒకరు "అందరు" వాడుకరులకు, మరొకరు సభ్యులైన వాడుకరులకు ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి, మీరు సభ్యులయి వుంటే, వివాదాలు వచ్చినప్పుడు, మీకు, బోర్డుకు మధ్యవర్తిత్వం కోసం మీరు (ఇద్దరిలో ఒకరిని) ఎంచుకొనటానికి అవకాశం వుంటుంది.

7. వికీపీడియా
సముదాయ పందిరి

వికీపీడియాకు మీ అవసరం ఉంది. అందరం కలిసి ఒక విజ్ఞాన సర్వస్వాన్నీ, ఒక వికీ సమాజాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికిప్పుడు మీరో వ్యాసాన్ని దిద్దుబాటు చెయ్యడం మరియు కొత్త వ్యాసాన్ని ప్రారంభించడం చెయ్యవచ్చు. మీ వ్యాసాలను ఎలా సమర్పించాలో పాఠం లో తెలుసుకోండి. (లేదా ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి). దయచేసి ఒక వాక్యంతో కొత్త వ్యాసాలు ప్రారంభించవద్దు. కనీసం ఆరేడు వాక్యాలు మరియు అంతకన్న తక్కువైతే బొమ్మ వున్న వ్యాసం ప్రారంభించండి. కొత్తగా చేరిన వారు అనుభవం వచ్చేదాక ఇప్పటికే వున్న వ్యాసాలలో దోషాల సవరణ, వ్యాసాల విస్తరణ చేపట్టటం మంచిది.

8. రచ్చబండ

వికీపీడియా మొదటి పుటలో ఎడమ ప్రక్కన మార్జిన్ లో మార్గదర్శిని క్రింద అనేక వివరాలుంటాయి. వాటిలో రచ్చబండ ఒకటి. రచ్చబండ వద్ద వార్తలు చూడండి ఇతరత్రా చర్చించండి, ఇంకా కావాలంటే సహాయము పేజీని మరియు మా విధానాలు పేజీని సంప్రదించండి. వికీపీడియాపై మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే ఈ పేజీ చూడండి. అంతర్జాల సమావేశాలు మరియు భౌతిక సమావేశాలు లో పాల్గొనండి. ఆ విషయాలు ఇక్కడే వ్రాస్తుంటారు. కనుక అప్పుడప్పుడు రచ్చబండ పుటను చూస్తూ వుండండి.

9. మీరు కొత్తగా చేరారా?

మీరు వికీపీడీయాలో కొత్తగా చేరారా? అంతా గజిబిజిగా ఉందా? మీరు సహాయం కోసం చూస్తున్నారా? మీకు సహాయం కావాలంటే ఎక్కడో ఎవర్నో అడగక్కరలేదు. మీ చర్చాపేజీలో సహాయం కావాలి. అని అడగండి. దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి అక్కడ రెండు మీసాల బ్రాకెట్ల [ {{ }} ఇవి మీసాల బ్రాకెట్లు] మధ్య సహాయం కావాలి అని వ్రాసి (ముూస చేర్చి) ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది. ఈ లోపల సహాయ సూచికను, సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత రెండు మీసాల బ్రాకెట్ల మద్య సహాయం కావాలి అని వ్రాయండి. ( మూసను మార్చవద్దు) సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు [మూసను] రెండు మీసాల బ్రాకెట్ల [{{ }} ఇవి మీసాల బ్రాకెట్లు] మద్య సహాయం చేయబడింది అని వ్రాయవలేను . వారం రోజులలోగా స్పందనలు లేకపోతే మళ్ళీ రెండు మీసాల బ్రాకెట్ల మద్య సహాయం కావాలి-విఫలం అని వ్రాయండి.

అని చేర్చండి. నిమిషాల్లో మీకు సహాయం చేయడానికి ఎవరో ఒక వికీ సభ్యుడు/సభ్యురాలు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఇతర వికీ సభ్యులతో చర్చించడానికి ఆ సభ్యుని చర్చాపేజీలో రాయవచ్చు. సభ్యుల పేజీలకు లింకులు సాధారణంగా వారి సంతకాల్లో గాని ఇటీవలి మార్పులు పేజీలో గాని, ఏదైనా వ్యాసం యొక్క చరితం పేజీలో గాని లేదా పూర్తి సభ్యుల జాబితాలోగాని ఉంటాయి. మీరు నిర్మొహమాటంగా సభ్యులను సహాయంకోసం అడగవచ్చు. సహాయంకోసం అన్నింటికంటే ఉత్తమమైన లింకు ఇటీవలి మార్పులు పేజీనే! ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతము తెలుగువికీ తెరచి మార్పులు చేస్తున్న సభ్యులను కలవవచ్చు.

10. వికీపీడియా
ప్రయోగశాల:

ఈవరుసతో పాటు మొదటి 6 బుల్లెట్ పేరాలు దయచేసి మార్చవద్దు ఇది ఒకే సమయంలో ఒక్కరు మాత్రమే వాడదగిన ప్రయోగశాల. మీరు ఇక్కడ టైపింగ్ నైపుణ్యం మెరుగు పరచుకొనడానికి, వికీపీడియా టాగ్లు పరీక్ష చేయడం చేయవచ్చు. ఇక్కడ ఇతరులకు ఇబ్బంది/నొప్పి కలిగించే విషయాలు రాయవద్దు. ఇక్కడ వ్రాసినది అవసరమనుకుంటే, మీ ప్రయోగం అయిన తరువాత మీ సభ్య పేజీలలో పదిలపరచుకోండి. అలాగే మీ సభ్యపేజీని లేక దాని ఉపపేజీలను ప్రయోగశాల వాడుకోవటం మరింత మంచిది. ప్రయోగం చేయటానికి "వికీపీడియా ప్రయోగశాల " పైవరుసలో నున్న "సవరించు" అన్న అదేశం బొత్తాము పై నొక్కండి.

11. వికీపీడియా
సహాయ కేంద్రం:

గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)

ప్రాపంచిక ప్రశ్నల కొరకు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?), ముందు తెవికీలో శోధన చేసి ఆతరువాత అవసరమైతే సంప్రదింపుల కేంద్రం ( Reference Desk) చూడండి. అడిగే ముందు, మీ ప్రశ్న తరచూ అడిగే ప్రశ్నలలో ఇప్పటికే సమాధానము ఉందేమే చూడండి. అలాగే సహాయం చేయబడిన పేజీలు మరియు సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలుకూడా ఉపయోగపడవచ్చు. సాంకేతిక విషయాలపై సమాచారం కొరకు రచ్చబండ చూడండి. సభ్యుల మధ్య వివాదాల పరిష్కారం కొరకు వివాద పరిష్కారం చూడండి.

సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.

12. ప్రశ్న ఎలా అడగాలి?

ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. మీరు అడిగిన ప్రశ్ననే ఇదివరకే మరొకరు అడిగి వుండ వచ్చు. దానికి సమాదానము వచ్చి వుండ వచ్చు. కనుక చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి. ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రశ్నను సూటిగా, వివరంగా అడగండి. ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే, ప్రశ్న రాసిన తర్వాత నాలుగు టెల్డేలు పెట్టండి. అదె వాడుకరి సంతకము. లేదా ఆ రోజు తేది వ్రాసి.... మీపేరు వ్రాయండి.

13. ప్రశ్న తెలుగులోనే అడగండి. ఎందుకు?

ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ కాదు. అంతే కాదు. ఇది తెలుగు వికీపీడియా కనుక మీరు తెలుగులోనే వ్రాయాలి.

14. సమాధానం ఎలా ఇవ్వాలి?

వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి. క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి. సమాధానం తెలుగులోనే ఇవ్వండి. వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది. వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, చర్చా పేజీ చూడండి.

15. మీ ఈ మెయిల్ ఇవ్వద్దు. ఎందుకు?

ప్రశ్నలకు ఈ-మెయిల్‌ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్‌ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్‌ కు గోప్యత ఉండదు. అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి. మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు. అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.

16. ఎవరీ నిర్వాహకులు?

వికీపీడియాలో ఉన్న కొద్దిపాటి నియమాలను కుటుంబపరమైన బాధ్యతలుగా అమలు చేసే సభ్యులు నిర్వాహకులు. నిర్వాహకులకు మిగిలినవారిపై పెత్తనం చెలాయించే హక్కు గాని, వివాదాలను పరిష్కరించే హోదా గాని లేవు. వారి అభిప్రాయాలకు ప్రత్యేకమైన విలువ లేదు. అయితే నిర్వాహకులకు ఇప్పటికే కొంత అనుభవం ఉన్నందున వారి సూచనలను బహుశా ఇతరులు గౌరవించవచ్చును. మరి కొన్ని వివరాలకు వికీపీడియా: నిర్వాహకులు చూడవచ్చును. వికీపీడియా:నిర్వాహకుల జాబితా కూడా చూడండి.

17. నిర్వాహకుడు కావడం ఎలా ?

ఏ సభ్యుడైనా/సభ్యురాలైనా నిర్వాహకుడు/నిర్వాహకురాలు కావచ్చు. వికీపీడియాలో ఉన్న సమాచారం మీద నిర్వాహకులకు ప్రత్యేక హక్కులేమీ లేవు; వాళ్ళు చిన్నపిల్లల బడిలో ఆయాల వంటి వారు. నిర్వాహకులు పేజీలను తొలగించగలరు (వికీపీడియా:తొలగింపు విధానం), సంరక్షించగలరు (వికీపీడియా:సంరక్షణ విధానం), నిరోధించగలరు (వికీపీడియా:నిరోధ విధానం). పై చర్యలన్నిటినీ మరో నిర్వాహకుడు/నిర్వాహకురాలు రద్దు చెయ్యవచ్చు. మీరు వికీపీడియాలో చురుగ్గా ఉంటే (కనీసం ఒక వెయ్యి దిద్దుబాట్లు చేసి ఉంటే), నిర్వాహకత్వం కోరవచ్చు.

18. నిర్వాహకుడి సహాయం కావాలా? నిర్వాహకుల సహాయం అవసరమైన సమస్స్యను ఎదుర్కొంటున్నారా?

నిర్వాహకుల దృష్టిని శీఘ్రంగా ఆకర్షించేందుకు నిర్వాహకుల నోటీసుబోర్డులో రాయండి. నిర్వాహకులు అక్కడకు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు; మీ సందేశాన్ని ఎవరో ఒకరు చూస్తారు, మీ సమస్యను పరిష్కరిస్తారు.

19. నిర్వాహకుడి హోదా

నిర్వాహకులు (ఇంగ్లీషు లో sysop అని అంటారు, System Operator కు సంక్షిప్త రూపం) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా సంరక్షించడం, సంరక్షించినవాటిని మార్చడం, విధానాలని అతిక్రమించే సభ్యులను నిషేధించడం మొదలైనవి చెయ్యగలరు. సాధారణంగా వాళ్ళు వికీపీడియా:తొలగింపు కొరకు వోట్లు వంటి పేజీల్లో వికీ అభిమతాన్ని అమలుచేస్తూ వుంటారు.

నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా కొన్నినెలల పాటు వికీపీడియాలో ఓ మాదిరి స్థాయిలో పని చేసి, ఎవరితోనూ గొడవలు పడకుండా వుండివుంటే నిర్వాహకుడు కావడానికి సరిపోతుంది.

20. మీరు సభ్యులై వుండీ, నిర్వాహకులు కాదలచుకుంటే, మరిన్ని వివరాల కొరకు వికీపీడియా
నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చూడండి.

వికీపీడియాలో చిట్కాలు: సూక్ష్మాలు

[మార్చు]
1. పేజీ చరిత్ర

వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎంత అభివృద్ధి చేశారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకులు నొక్కితే ఆ రచయిత ఆ స్టెప్పులో ఏరోజున ఏ సమయంలోఎవరెవరు ఏమి మార్చారో, కూర్చారో వివరంగా తెలుస్తుంది. 'చరిత్ర ' అనే అంశం వికీపీడియా మొదటి పుటలోనే పైన కనబడుతుంది. దానిని నొక్కి అందులో ప్రవేశించి దానికి సంబందించిన వివరాలు చూడ వచ్చు.

2. టెక్నికల్ ఇబ్బందులు
వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ, అంతర్వికీ లింకులూ, బాట్లూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.
3. ఏ మాత్రం సమస్య కాదు. వికీలో సరైన సమాచారంతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. మిగిలినవ్నీ తరువాయే. కనుక మీరు నాణ్యమైన వ్యాసం వ్రాయడంపై దృష్టిని కేంద్రీకరించండి. మిగిలిన విషయాలకు ఇతరులు సాయపడతారు. కొద్ది వారాల్లో మీకూ అలవాటు అవుతుంది.
4. అనువదించేటప్పుడు ఇబ్బంది అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు.

ఏమీ ఫరవాలేదు. ఆ పదాన్ని అలా ఇంగ్లీషులోనే వదిలెయ్యండి. ఎవరైనా సరైన పదాన్ని పెట్టవచ్చు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.

5. వికీలో వ్రాయడానికి చాలా సమయం పడుతున్నది. నాకు ఇంటర్నెట్‌లో అంత సమయం గడపడం కుదరదు

పరవాలేదు. లేఖినిని మీరు ఆఫ్‌లైన్ వినియోగం కోసం complete web page గా save చేసుకోండి. లేదా offline లో తెలుగు వ్రాయడానికి మరికొన్ని ఉపకరణాలున్నాయి. (ఉదా: http://www.kavya-nandanam.com/dload.htm లో పోతన ఫాంట్‌తో లభించే సాఫ్ట్‌వేర్.) వీటితో మీరు సమయం చిక్కినపుడు తెలుగులో వ్రాసుకొని M S Word లో గాని, మరొక wordprocessor లో గాని భద్రపరచుకోండి. సమయం చిక్కినపుడు ఇంటర్నెట్‌లో వికీ ఎడిట్‌బాక్స్ తెరిచి మీరు భద్రపరచిన విషయాన్ని పేస్ట్ చేయండి. ఇలాగైతే మీరు ఇంటర్నెట్ బిల్లు టెన్షన్ లేకుండా పనిచేయగలరు.

6. దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం, రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. అలాంటప్పుడు. ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయము అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు మిగతా రెండు పేర్లకు దారి మార్పు పేజీలను సృష్టించాలంటే మిగతా పేజీలలో #REDIRECT రామప్ప దేవాలయము అని ఉంచాలి. ఇలా దారి మార్పు పేజీలను తయారు చేయడం వలన కొత్త సందర్శకులకు మరింత సులభంగా సమాచారం దొరుకుతుంది.

7. పాఠం మధ్యలో రిఫరెన్సులు

వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.

"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం ఎక్కడ దొరికిందీ రిఫరెన్సు ఇలా ఇవ్వాలి - [1] అని వ్రాయొచ్చు. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్‌లో ఫలాని వెబ్ సైటులో ఆ సమాచారం లభించింది. అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.

8.భారతం" లేదా "భారతము, "గ్రామం" అని వ్రాయాలా?
లేక "గ్రామము" అని వ్రాయాలా? - దేశం? దేశము? - రామాయణం? రామాయణము?

తెలుగు వికీపీడియా వాడుక భాష వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. కాని ఇది నిర్బంధం కాదు. ఇందుకు మార్గ దర్శకాలు-

9.పేజీ హెడ్డింగు, సెక్షన్ హెడ్డింగులలో "గ్రామం", "రామాయణం", "ఆనందం" - ఇలాంటి పదాలు వాడండి.

వ్యాసం లోపల మీకు ఏది సబబు అనిపిస్తే ఆ పదాలను వాడండి.

10.వ్యాసం పేరు

వీలయినంత వరకు వ్యాసం పేరు వ్యాసం యొక్క మొదటి వాక్యం లోనే వచ్చేలా ఉండాలి. పేరు మొదటిసారి వ్యాసంలో కనిపించేటపుడు, దానిని బొద్దుగా చెయ్యండి. ఉదాహరణ చూడండి: వ్యాసం పేరు ఇది ఇలా కనిపిస్తుంది వ్యాసం పేరు. పేరులో లింకులు పెట్టరాదు. పేరును ఇటాలిక్స్‌ లో పెట్టదలిస్తే, పేరు మొత్తాన్ని పెట్టాలా లేక కొంత భాగాన్ని మాత్రమే పెట్టాలా అనే విషయమై ఇటాలిక్స్‌ నియమాలను పాటించండి.

11.భాష. ఎలా వుండాలి?

మందార మకరంద మాధుర్యమున దేలు అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి. వ్యావహారిక భాషలో రాయండి సరళ గ్రాంథికంలో రాయవద్దు. ఉదాహరణకు.. "వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" వంటి క్రియాప్రయోగాలు భాషలో ఉన్నాయి. మొదటి రెండు ప్రయోగాలు గతకాలపు రచనల్లో కనిపిస్తాయిగానీ, ఇప్పటి రచనల్లో వాడుకలో లేదు. వికీపీడియా వ్యాసాల్లో కూడా అలాంటి ప్రయోగాలు ఉండకూడదు.

12.ము, అనుస్వారాల (సున్నా) వాడుకలో వికీపీడియా విధానం

'ము 'తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో లు చేరుతుంది. విధానం అనే పదం యొక్క బహువచనరూపం విధానాలు అవుతుంది.

13.వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు కింది పద్ధతులను పాటించాలి.

బాగా ఎక్కువగా వాడుకలోనున్న పేరును వాడాలి. ఉదాహరణకు విజయవాడను బెజవాడ అని కూడా అంటారు. కానీ, విజయవాడ అనే పేరే ఎక్కువగా వాడుకలో ఉంది కనుక అదే వాడాలి. ఒక్కోసారి రెండు పేర్లు కూడా బాగా వ్యాప్తిలో ఉండవచ్చు; ఆ సందర్భాల్లో ఏది వాడాలనే విషయమై సందిగ్ధత రావచ్చు. ఉదాహరణకు, నందమూరి తారక రామారావు విషయంలో, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే రెండు పేర్లూ ; ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అప్పుడు ఒక పేరుతో పేజీ సృష్టించి, దానిని లక్ష్యంగా చేసుకుని రెండవ పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించాలి. పేర్ల చివర ఉండే సాంప్రదాయక/కుల సూచికలు అనగా పేర్లకు చివర ఉండే రావు, రెడ్డి, శాస్త్రి, మాదిగ, నాయుడు, చౌదరి పేర్లను వ్యక్తి పేరుతో కలిపి రాయాలా లేక విడిగా రాయాలా అనే విషయమై కింది విధానం పాటించాలి. వ్యక్తి పేరు, కులసూచికను కలిపి రాయాలి, ఉదాహరణకు రామారావు, సీతారామరాజు, చంద్రశేఖరశాస్త్రి, కృష్ణమాదిగ, రాజశేఖరరెడ్డి. ఇంటి పేర్లను ఎల్లప్పుడూ విడిగానే రాయాలి.

గమనిక: ఏ పేరు వాడాలనే విషయంలో సందిగ్ధత ఉంటే ఒక పేరుతో పేజీ సృష్టించి, రెండో దానితో దారిమార్పు పేజీని సృష్టించండి.

14.పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి

ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)

15.విరామ చిహ్నం తరువాత ఖాళీ , పదాల మధ్య ఖాళీ వుండాలి. పదాల మధ్య ఖాళీ లేక పోతే వికీలో ఎన్ని పదాల మధ్య ఖాళీ లేక పోతే అదంతా ఒక్క పదం క్రిందే లెక్క. ఇది గమనించ వలసిన విషయము.

వ్రాసేటప్పుడు చాలా మంది చేసే చిన్న పొరపాటు. ఫుల్‌స్టాప్, కామాల తరువాత ఖాళీ (space) ఉంచకపోవడం. దీనివలన వాక్య విభజన సరిగా రాదు. "రాముడు వచ్చాడు. బంతిని తన్నాడు" అని వ్రాస్తే "వచ్చాడు.బంతిని" అనేది ఒకే పదంగా పరిగణింపబడుతుంది. ఇది వ్యాకరణ పరంగా సరి కాదు. చూడడానికి కూడా బాగుండదు.

16.ప్రత్యేక పేజీలు

ఎడమ ప్రక్క ప్రత్యేక పేజీలు అని బాక్సు ఉంటుంది. వికీ విశ్లేషణకు అది చాలా ఉపయోగం.

పెద్ద పేజీలు, చిన్న పేజీలు, లింకులు లేని పేజీలు, అధికంగా లింకులున్న పేజీలు, వర్గాలు, మూసలు, వర్గాలలో చేరని పేజీలు - ఇలా ఎన్నో విధాలుగా వికీ విశ్లేషణ అందులో లభిస్తుంది. సమయం దొరికినప్పుడు ఒకో పేజీని తెరిచి పరిశీలించండి. వికీ అభివృద్ధికి మీకు ఎన్నో ఐడియాలు తడుతాయి.

17.నేను ఎలా తోడ్పడగలను?

ఈ ప్రశ్న అందరికీ వచ్చే సర్వసాధారణ ప్రశ్న. మీ అవసరం వికీపీడియాకు చాలా ఉంది. నేనేమి చేయగలనని మీరస్సలనుకో వద్దండి. మీకు ఏ విషయంపై ఆసక్తి ఉందో ఆ విషయం గురించి వెతకండి. మీకు ఆ విషయాలు లభిస్తే వాటిని మెరుగు పరచండి. లేకపోతే కొత్త వ్యాసాలు ప్రారంభించండి. మొహమాటం అస్సలు పడవద్దండి. ఇందులోని సభ్యులంతా చాలా సహాయకరంగానూ స్నేహాభావంతోనూ ఉన్నారు. మీరూ అలానే కొనసాగుతారని ఆశిస్తున్నాము.

18.తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము ఒక వేదిక నడపబడుతున్న సంగతి మీకు తెలుసా?===

వేదిక: వర్తమాన ఘటనలు చూడండి. అక్కడ ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతము జరుగుతున్న విషయాలను పొందుపరుస్తున్నారు. మీరు కూడా ఆ వేదికలో వార్తలు లేదా ఇతర సంబంధించిన విషయాలను చేర్చవచ్చు.

19.ప్రశ్నించండి!

వికీపీడియా అందరిచే నిర్మించబడుతున్న విజ్ఞాన సర్వస్వం. కాబట్టి ఆ ప్రయత్నంలో సమాచారంలో తప్పులు దొర్లవచ్చు. తప్పుడు సమాచారాన్ని చొప్పించవచ్చు. తటస్థ దృక్కోణంలో ఉండకపోవచ్చు. సమాచారం పాతబడి ఉండవచ్చు. అలాంటప్పుడు నిస్సందేహంగా మీ అనుమానాల్ని ఆ వ్యాసానికి సంబందించిన చర్చాపేజీలో రాయడమో లేక సరిదిద్దడమో చెయ్యండి.

20.విద్యార్థుల కోసం వికీపీడియా

ఆంగ్ల వికీపీడియాలో చాలా వ్యాసాలను చాలా దేశాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగించు కుంటున్నారు. మన తెవికీలో ఇటువంటి వ్యాసాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆసక్తి గల సభ్యులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఆచార్యులు ఎవరైనా ఉంటే, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివిధ విజ్ఞాన దాయకమైన వ్యాసాలు రాయవచ్చు.

21.మొలకలు అనగా ఏమిటి?

ఏదైనా ఒక ముఖ్యమైన వ్యాసం తెవికీలో లేదు. కానీ మీకు దాని గురించి చాలా కొద్ది సమాచారం మాత్రమే తెలుసు. మీకు తెలిసిన సమాచారం కేవలం రెండే లైన్లైనా సరే వ్యాసాన్ని రాసేయవచ్చు. కాకపోతే వ్యాసం మొదట్లో ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవిమొలకలను చూడండి. అని వ్రాయాలి. అలా వ్రాస్తే ఆవిషంలో అవగాహన వున్ంవారు

అనే మూస చేర్చండి. ఇలా చేర్చడం వలన అది మొలకల వర్గంలోకి చేరుతుంది. ఎంకెవరైనా వికీపీడియన్లు దానిని గురించి మరింత సమాచారం చేరుస్తారు.

22.వ్యాసాల తొలగింపు

వికీపీడీయాలో మీరు సంచరిస్తున్నపుడు మీకు కొన్ని అవసరం లేనివి అర్థం లేని వ్యాసాలు కనిపించ వచ్చు. అప్పుడు మీరు వాటికి వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: (కారణం వ్రాయాలి)

ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా: తొలగింపు కొరకు వ్యాసాలు/రచ్చబండ పేజీలో రాయండి. నిర్వాహకులూ, ఈ పేజీని తొలగించే ముందు ఇక్కడికి లింకున్న పేజీలు, ఈ పేజీ చరిత్ర (చివరి మార్పు) లను పరిశీలించడం మరచిపోకండి.

అని చేరిస్తే ఎవరైనా నిర్వాహకులు వాటిని చూసి తొలిగిస్తారు.

23. పరికరాల పెట్టె

మీరు వికీపీడియాలో ఎడమవైపునున్న పరికరాల పెట్టెను గమనించారా? అందులో ఫైలు అప్లోడు, ప్రత్యేక పేజీలు వంటి ఉపయోగకరమయిన లింకులు చాలా ఉంటాయి. ఏదైనా వ్యాసాన్ని ముద్రించాలి (ప్రింట్ చేయాలి) అనుకొన్నా ఆ వ్యాసం యొక్క ముద్రణా వర్షన్‌కు లింకు కూడా మనం అక్కడ పొందవచ్చు.

24.బాట్లు అంటే ఏమిటి?

పెద్ద సంఖ్యలో ఫైళ్ళను ఎగుమతి చేయడం, వందలాది పేజీల్లో ఒకే రకమైన దిద్దుబాట్లు చెయ్యాల్సి రావడం కష్టం మరియు విసుగుతో కూడుకున్న పని. ఇలాంటి అవసరాలను తీర్చడానికి బాట్లను తయారు చేస్తారు. సాధారణంగా వీటిని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో అనుభవమున్న సభ్యులు రాస్తారు. ప్రస్తుతం పైథాన్, పెర్ల్, పీహెచ్‌పీ, జావా మొదలైన భాషల్లో బాట్లను రాయవచ్చు. ఆసక్తి గలవారు ఆంగ్ల వికీపీడియాలోని ఈ లింకును సందర్శించగలరూ

25.దిద్దుబాటు పెట్టె

మీరు ఎక్కడైనా నీలం రంగులో ఉన్న మార్చు అనే లింకును నొక్కితే దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది. వ్యాసంపైన ఉన్న టాబ్‌ను నొక్కితే మొత్తం వ్యాసం దిద్దుబాటు పెట్టెలో తెరచుకుంటుంది. అదే వ్యాసంలోని ఒక విభాగంపైన కుడివైపునున్న లింకును నొక్కితే ఆ విభాగం మాత్రం దిద్దుబాటు పెట్టెలోకి మారుతుంది. ఆ తరవాత మీరు చేయదలచిన మార్పులను చేసి దిద్దుబాటు పెట్టె క్రింద ఉన్న పేజీభద్రపరచు అనే బటన్‌పై నొక్కినట్లయితే మీరు చేసిన మార్పులు వ్యాసంలో చేర్చబడతాయి.

26. అచ్చుతప్పులను సరిదిద్దండి

వికీపీడియాలో చాలా అక్షరదోషాలున్నాయి. సమయం చిక్కినపుడు ఆ దోషాలను సరిదిద్దడానికి సహకరించండి. మీ సభ్య పేజీలో Telugu template.jpg ఈ వాడుకరి అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు. అన్న బ్యాడ్జిని ప్రదర్శించండి. అప్పుడు మీ పేరు వర్గం:అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు అన్న వర్గంలో చేరుతుంది. కొత్త వాడుకరులకు ఇదొక మంచి అవకాశము మరియు అనుభవము వస్తుంది. అంతేగాక వ్యాసములో అక్షర దోషాలు నివారించ బడుతాయి. వ్యాసము సుద్ధి అవుతుంది. మరెందుకు ఆలస్యం ప్రారంబించండి.

27. వికీపీడియాలో పదాల రంగులు

మీరు ఏ వ్యాసాన్ని చూసినా అందులో నలుపు, నీలం మరియు ఎరుపు రంగుల్లో కొన్ని లింకులు ఉంటాయి. ఇవి కాకుండా ఇతర రంగుల్లో కూడా అక్షరాలు కొన్ని సార్లు కనిపించవచ్చు. ఆ రంగులెందుకో కింద చూడండి.

నలుపు - ఈ రంగు పదాలు వికీపీడియాలో ఎటువంటి లింకులూ లేని పదాలకు ఉంటాయి. (కావాలని నలుపు రంగు లింకులు ఉంచితే తప్ప) నీలం - నీలం రంగు పదాలు తెలుగు వికీపీడియాలోని ఇతర వ్యాసాలకు లింకులు, వాటిపై నొక్కి పదం లింకుకు చేరుకోవచ్చు. ఇలాంటి నీలం లింకులు వ్యాసాన్ని మార్చడానికి కూడా వాడబడతాయి. ఏ వ్యాసం పైనైనా మీరు 'మార్చు' మరియు 'చరితం' వంటి లింకులను చూడవచ్చు. లేత నీలం- ఇతర వికీమీడియా ప్రాజెక్టులలోని లింకులు, ఉదా
ఆంగ్ల వికీ, విక్షనరీ వంటివి ఎరుపు- ఈ రంగులో ఉండే పదాల లింకులు తొలగిపోవడం గానీ ఇంకా సృష్టించబడిగానీ లేవని అర్థం. మీరు వాటిపై నొక్కి ఆ వ్యాసాన్ని ప్రారంభించవచ్చు. ఇతర రంగులు - ఇవి సాధారణంగా వ్యాసం పేజీల్లో ఉండవు. చర్చా పేజీల్లో, సంతకాలల్లో సభ్యులు వాడుతుంటారు.
28.వ్యాసాన్ని ఫలానా వర్గంలో ఎలా చేర్చాలి?

వికీపీడియాలో వర్గాలు అని పిలిచే సూచికా వ్యవస్థ ఉంది. దీని వలన వ్యాసాలలో చేర్చిన కొన్ని ట్యాగుల వలన, వాటంతటవే వర్గీకరించబడతాయి.

ఒక వ్యాసాన్ని ఫలానా వర్గంలో చేర్చటానికి, ను వ్యాసంలో ఎక్కడో ఒక చోట చేర్చండి (సాధారణంగా వ్యాసం చివర చేరుస్తారు). అలా వ్యాసంలో వర్గం చేర్చేసిన తరువాత, వ్యాసంలో చేర్చిన వర్గాలన్నీ వ్యాసం అడుగు భాగాన కనపడతాయి, వాటికి అనుభందంగా ఉన్న లింకును నొక్కితే అదే వర్గంలోకి చేర్చిన మిగితా అన్ని పేజీలనూ చూపించే వర్గపు పేజీకి తీసుకుని వెళ్తుంది. క్రొత్తవారు ఒక వ్యాసము వ్రాసిన తరువాత దానిని ఏ వర్గంలో చేర్చాలి అని అలోసించి/ప్రయత్నించడం కన్నా.... దాన్ని అలా వదిలేయడమే మంచిది. సీనియర్ వికీపీడియనులు ఆ పని చేసేస్తారు.

29.కొత్త పేజీలు

తెవికీలో ఇటీవల ప్రారంభించిన కొత్త వ్యాసాలు తెలుసుకోవాలనుకుంటే పేజీకి ఎడమవైపున ఉన్న మార్గదర్శకములో |కొత్త పేజీలు అన్న లింకును నొక్కండి. అప్పటివరకు ఎక్కించిన క్రొత్తవ్యాసాలు ఆయా వాడుకరుల పేరుబరితో బాటు కనిపిస్తాయి. ఆ వ్యాసం ఎవరు ఏరోజున, ఏసమయంలో ఎక్కించారో అనే సమాచారం కూడ అండులో నామోదై వుంటుంది.

30.ఒక పేజీ చరిత్ర

మీరు ఒక పేజీని లేదా ఒక వ్యాసాన్ని సృష్టించారనుకోండి దాన్ని ప్రారంభించినప్పటినుంచీ దాన్ని ఎవరెవరు ఏ మార్పులు చేశారో తేది, సమయం తో సహా తెలుసుకోవడానికి చరితం ట్యాబ్ ను నొక్కండి. దీనిని మీరు బాగా గమనిస్తే ఒక వికీపీడియా లో ఒక గొప్ప విషయం అర్థమౌతుంది. మీరు చేసిన మార్పులను వేరెవ్వరూ మేము చేశామని చెప్పుకోలేరు(నిర్వాహకులతో సహా). అంతేకాదు, ఒక వేళ ఆపేజీని మీరు సృష్టించి వుంటే మరెవరైనా ఎప్పుడైనా అందులో అనవసర మార్పులు చేసి ఉంటే ఆ పేజీని మీరు యథాస్థానంలోకి అనగా మీరు వ్రాసిన తీరులోనికి తీసుకొని వెళ్ళవచ్చు కూడా ఒక్క క్లిక్కుతో.

31.సంతకాన్ని మార్చుకోవడం ఎలా

సంతకం ఎలా ఉండాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు. అభిరుచులలో "సభ్యుని వివరాలు" ట్యాబులో "ముద్దుపేరు" ఒక దాన్ని ఎంచుకుని మీ సంతకాన్ని మార్చుకోవచ్చు. చర్చాపేజీల్లో ఏదైనా రాసినపుడు తప్పక సంతకం చెయ్యాలి. "సంతకం మాత్రమే (లింకు లేకుండా)" పెట్టెను చెక్ చెయ్యకపోతే, సంతకంలో మీ ముద్దుపేరుకు ముందు "" నూ, వెనక "" ను సాఫ్టువేరు చేరుస్తుంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:కస్టమైజేషన్ చూడండి.

వికీపీడియాలో సంతకాలు చర్చాపేజీలో మీరు వ్యాఖ్యానించిన తర్వాత వాడతారు. దానివల్ల ఆ వ్యాఖ్య చేసిందెవరో ఇతర సభ్యులకు సులువుగా అర్థమవుతుంది. సంతకం చేయడానికి ఎల్లంకి (చర్చ) 11:47, 29 డిసెంబరు 2014 (UTC) అని టైపు చేస్తే సరిపోతుంది. సంతకాలను కావాలనుకుంటే రంగులతో నింపుకోవచ్చు. మీ సంతకానికి రంగులు అద్దడానికి, "నా అభిరుచులు" అనే లింకు (పేజీ పై భాగంలో కుడి వైపున) క్లిక్ చేయండి. మీ సభ్యనామం అని ముద్దుపేరు అని ఉన్న పెట్టెలో రాయండి. "మీకు నచ్చిన రంగు"ను "red" లేదా "green" వంటి మీకు నచ్చిన రంగులతో మార్చండి. మీ సభ్యనామంను మీ సభ్యనామంతో మార్చండి. తరవాత, "సంతకం మాత్రమే" అని రాసి ఉన్న పెట్టెలో టిక్ పెట్టండి. ఇప్పుడు మీరు ఎల్లంకి (చర్చ) 11:47, 29 డిసెంబరు 2014 (UTC) ఇలా సంతకం చేస్తే మీ కొత్త సంతకం కనబడుతుంది.

32.వికీపీడియాలో సంతకం చెయ్యడం ఎలా

వికీపీడియాలో సభ్యులు చర్చాపేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాశాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట. సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు. సభ్యనామం రాయడం సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా రాయడం తేదీ, సమయం మాత్రమే రాయడం సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా - "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను - 3 సార్లు నొక్కితే - సభ్యనామం, 4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం, 5 సార్లు నొక్కితే - తేదీ, సమయం ముద్రితమౌతాయి.

33.సంతకం చేయడం మర్చిపోకండి.

ఒక చర్చా పేజీలో మీరు ఏదైనా వ్రాసినపుడు సంతకం చేయడం మరవకండి. సంతకం చేయడానికి నాలుగు టెల్డేలను వాడండి. (టెల్డే అంటే ~) ఇవి నాలుగు పెడితే మీ సంతకం ఐపోతుంది. అనగా మీ వాడుకరి పేరు తేది, సమయం అన్ని నామోదయిపోతాయి. ఇలా సంతకాలను వికీపీడియా వ్యాసాలలో చేయకూడదు . కేవలం చర్చా పేజీలలోనే చేయాలి.

34.తెలుగువికీలో ఆంగ్ల వ్యాసాలా?

సభ్యులు గమనించవలసిన విషమేమిటంటే ఈ మన తెలుగు వికీపీడియాలో ఆంగ్ల వాక్యాలకు స్థానం లేదు. మీరు ఏ రచన చేయాలనుకున్నా తెలుగులోనే చేయండి. కొన్ని వ్యాసాలను సభ్యులు అనువాదం కొరకు ఆంగ్లభాషలోని వ్యాసాలను కాపీ చేసి మన తెలుగువికీలో అంటించారు. వారి ఉద్దేశ్యం సరైనదే కాని అవి చాలా కాలం నుండి అలాగే ఉండి పోయాయి. మీరు వాటిని తెలుగులోకి అనువదించాలనుకుంటే వర్గం:అనువాదము కోరబడిన పేజీలు సందర్శించండి. అక్కడ వున్న ఆంగ్ల వ్యాసాలను అక్కడికక్కడే తెలుగు లోనికి అనువదించండి.

35.నేను వ్రాసిన పేజీలో ఇతరులు మార్పులు చేస్తే నాకు ఎలాతెలుస్తుంది?.

ఒక వ్యాసాన్ని ఎవరైనా మార్పులు చేసినప్పుడల్లా మీకు తెలియాలంటే , ఆ పేజీ యొక్క ఈ పేజీ మీద కన్నేసి ఉంచు అనే చెక్ బాక్సు ను ఎంచుకోండి. ఎన్నుకోవడమంటే.... ఆ గడిలో టిక్ మార్కు పెట్టడమే. ఆ వ్యాసాన్ని మార్పులు చేసినప్పుడల్లా మీకు తెలియజేయ బడుతుంది. ఇటీవల మార్పులులో ఆ పేజీలో జరిగిన మార్పులు బొద్దుగా కనిపిస్తాయి మరియు నా వీక్షణ జాబితాలో చేర్చబడతాయి.

36.నా కంప్యూటర్ లో తెలుగు లేదు.... ఎలా స్థాపివుకో వాలి?

వికీపీడియా మొదటి పుటలోనే తెలుగు టైపు చేయుట అనే పదాలు కనిపిస్తాయి. దాన్ని నొక్కితే ఈ క్రింది సమాచారము కనబడుతుంది. అదేవిదంగా దీన్ని ఎలా కంప్యూటర్లో ఎక్కించుకోవాలో దృశ్య రూపకంగా కనబడుతుంది. దాన్ని అనుసరించి తెలుగును మీ కంప్యూటర్లో స్థాపించుకోవచ్చు.

లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల కీ బోర్డు) లేక ప్రామాణిక ఇన్‌స్క్రిప్ట్ కొరకు వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము. ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే నరయం అనే మీడియావికీ పొడిగింత వాడబడింది. 11 జూన్ 2013 న యూనివర్సల్ లాంగ్వేజ్ సెలెక్టర్ (ULS) అనే సాఫ్ట్ వేర్ వాడుకలోనికి వచ్చింది. దీని ద్వారా భాషల ఎంపిక సులభమైంది. మరియు వ్యాసాలను చూపించేటప్పుడు ఇతర భాషల వ్యాసాల లింకులను భౌగోళికంగా దగ్గరి భాషలను ప్రారంభంలో చూపెట్టటం వీలైంది. వికీలో టైపు చేసేటప్పుడు కుడివైపు భాష ఎంపికల బొమ్మ కనబడుతుంది. దాని ద్వారా భాష అమరికలను ఎంచుకోవచ్చు. శాశ్వత అమర్పులకొరకు ప్రవేశించిన వాడుకరులు అభిరుచులు విభాగంలో నా అభిరుచులు వాడాలి. వాడుకరి వివరాలు టేబ్ లో అంతార్జాతీయకరణ విభాగంలో More language settings ద్వారా భాష ప్రదర్శన మరియు ప్రవేశపెట్టు పద్ధతులు చేతన స్థితి మరియు అమర్పులు చేయవచ్చు. ప్రవేశపద్ధతులలో లిప్యంతరీకరణ మరియు ఇన్స్క్రిప్ట్ పద్ధతులు కలవు. అప్రమేయంగా వ్యవస్థ కీబోర్డు పద్దతి చేతనం చేయబడి వుంటుంది. CTRL+M కీ వాడడం ద్వారా ఎంపిక చేసిన కీబోర్డుని అచేతనం చేసి వ్యవస్థ కీ బోర్డు కి మారవచ్చు అలాగే మరల ఎంపిక చేసిన కీబోర్డుకి మారవచ్చు.

37.మీ బ్రౌజరులో తెలుగు సరిగా కనిపించడం లేదా?

మీరు ఇప్పటి వరకూ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 6 వాడుతుంటే ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 7 కు మారండి. లేదా మీకు ఫెడోరా లైనక్సు గురించి తెలిసి ఉంటే దానిలో ఇంకా అందమైన తెలుగు లిపిని వీక్షించ వచ్చు. ఇందుకు మీరు చేయవలసిందల్లా లైనక్సును ఇన్స్టాల్ చేసుకొనేటప్పుడు భాషను సెలెక్టు ను చేసుకొనేటపుడు తెలుగును కూడా ఎంచుకోవడమే. ఇవి గాక ఇంకా చాల మార్గాలున్నాయి. అనుభవము మీద మీకే తెలుస్తాయి.

38.వికీపీడియాలో వెతకడం ఎలా?

వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

39.వికీపీడియా ఎంత ప్రజాదరణ పొందింది?

ఆంగ్ల వికీ ప్రజాదరణ గురించి చెప్పనవసరమే లేదు. ప్రపంచంలో ప్రస్తుతము ఉన్న ఇంటర్నెట్ సైట్లలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన 9 వ సైటు వికీపీడియా. ఇక తెలుగు వికీపీడియా సంగతి చూస్తే ప్రస్తుతము ఉన్న అన్ని భారతీయ భాషా వికీలకంటే కొంత మంచి స్థానంలో ఉంది. కానీ, తెలుగు వికీపీడియాలో చాలా కొద్ది వ్యాసాలు విశేషవ్యాసాలుగా అభివృద్ది చెందాయి. ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము ఇంకా అభివృద్ది చెందాలంటే తెలుగు వికీపీడియాలో సభ్యులుగా చేరేవారి సంఖ్యను పెంచాలి. ఈ పని చేయగలిగిన వారు ప్రస్తుతము ఉన్న సభ్యులే! మరియు ఉన్న సభ్యులు మొహమాట పడకుండా, జంకకుండా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ది పరచాలి.

40.వర్గాలు., వర్గం అంటే?

వికీపీడీయాలో వ్యాసాలు రాయడం ఎంత ముఖ్యమో వాటిని వర్గీకరించడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు మీరు రామాయణానికి సంభందించిన వ్యాసాన్ని రాస్తున్నట్లయితే వ్యాసం చివరలో అని చేర్చవచ్చు. అయితే ఇలా చేర్చేముందు ఆ వర్గం ఇదివరకే ఉందో లేదో కూడా నిర్ధారించుకోవాలి. వర్గం కోసం వెతకాలంటే వర్గం:రామాయణం అనే పేరుతో వెతుకు పెట్టెలో ఇవ్వాలి. ఇలా వర్గాలు చేర్చడం వలన ఈ వ్యాసం దానంతట అదే వర్గంలో చేర్చబడుతుంది. దీనివలన సందర్శకులకు ఈ వ్యాసాన్ని కనుగొనడం సుళువౌతుంది.

ఒకే విధమైన లక్షణాలు కలిగిన పేజీలను ఒక సమూహంగా చేర్చడమే వర్గీకరణ. ఈ సమూహాలే వర్గాలు. ఒక ఉదాహరణ: నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అల్లూరి సీతారామ రాజు, పింగళి వెంకయ్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పొట్టి శ్రీరాములు, బాపు, బి.నాగిరెడ్డి మొదలైన వారంతా సుప్రసిద్ధ ఆంధ్రులు. ఈ వ్యాసాలన్నిటినీ సుప్రసిద్ధ ఆంధ్రులు వర్గానికి చేర్చవచ్చు. అలాగే, అల్లూరి సీతారామ రాజు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు స్వాతంత్ర్య సమర యోధులు. ఈ వ్యాసాలను స్వాతంత్ర్య సమర యోధులు వర్గంలో కూడా చేర్చవచ్చు. ఒక్కో పేజీని ఎన్ని వర్గాలలోకైనా చేర్చవచ్చు; అవి తార్కికంగా ఉంటే చాలు. వర్గాల కారణంగా పేజీల శోధన సులువవుతుంది. వికీపీడియాకు ఒక చక్కటి ఆకృతి ఏర్పడుతుంది కూడా. వర్గాల గురించి మరింత సమాచారం కోసం వికీపీడియా:వర్గీకరణ చూడండి. ఒక పేజీని ఏదైనా వర్గంలోకి చేర్చడమంటే ఆ పేజీలో సదరు వర్గం పేరును చేర్చడమే! ఆ పేజీలో అన్నిటికంటే చివరన, ఇతర భాషా లింకులకు పైన అని వ్రాయాలి. దాంతో ఆ పేజీ సదరు వర్గంలోకి చేరిపోతుంది.

వికీపీడియాలో వ్యాసాలను అనేక వర్గాలుగా విభజించవచ్చు. ఉదాహరణకు ప్రముఖ వ్యక్తులు, దేశాలు, పుణ్యక్షేత్రాలు మొదలైనవి. కొన్ని వర్గాలను మొదటి పేజీలోని మార్గదర్శిని లో పేర్కొనడం జరిగింది. అన్ని వర్గాలనూ చూడాలంటే వర్గం:వర్గాలు లను సందర్శించండి.

41.విశేష వ్యాసాలను అనువదించండి.

ఒకమారు ఆంగ్ల వికీలో విశేష వ్యాసాలను en:Wikipedia:Featured articles చూడండి. ఇవి అధికంగా మంచి ప్రమాణాలతో వ్రాయబడ్డ వ్యాసాలు. వీటిలో మీకు ఆసక్తి ఉన్న ఒక్క వ్యాసాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించండి.

42.మంచి వ్యాసం లక్షణాలు ఎలా వుండాలి

వికీపీడియాలో ఉన్నదేదయినా తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే మూడు ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలనుకోండి. అంతే కాకుండా మంచి వ్యాసానికి ఆశించే కొన్ని లక్షణాలు.

ముందుగా వ్యాసానికి అనువైన ఉపోద్ఘాతం ఉండాలి. చదువరులకు తేలికగా అర్ధం కావాలి. ఆసక్తి కలిగించాలి. వేరే వ్యాసాల జోలికి వెళ్ళకుండా ఈ వ్యాసం చదివితే ఆ వ్యాసం శీర్షికకు తగిన సమగ్ర సమాచారం ఉండాలి. ఇతర వ్యాసాలకు లింకులు, వీలయినంతలో ఇతర వికీల లింకులు ఉండాలి. ఇతర సంబంధిత వ్యాసాలలో ఈ వ్యాసానికి లింకు ఉండాలి. మీ భావాలు కాకుండా ఆ విషయం నిపుణులు చెప్పిన విషయాలుండాలి. "అలాగని అంటారు", "చాలా ముఖ్యమైన ఘటన" వంటి పదాలు అనుచితం. ఆ విషయంపై సమాచారం ఎక్కడి నుండి తీసుకొన్నారో "in text citations" ద్వారా తెలపాలి అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.

43.వివాదాలు వస్తే.... పరిష్కారం ఎలా?

ప్రపంచంలో ఏ ఇద్దరి అబిప్రాయాలు ఒకలా ఉండవు. కాబట్టి వ్యాసాలు రాసేటప్పుడు సభ్యుల మద్య అభిప్రాయ బేధాలు రావడం సహజం. అలాంటప్పుడు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ఉత్తమమైన పద్దతి. వీలైతే ఇతర సభ్యుల అభిప్రాయాలను ఆహ్వానించండి. చర్చా పేజీలలో పరుష పదజాలను వాడకండి. ఎందుకంటే తాము పని చేసే సమయంలో కొంత వెసులుబాటును కల్పించుకుని వికీపీడియాలో రచనలు చేస్తున్న సభ్యులు మనస్థాపానికి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు తటస్థ దృక్కోణంతో వ్యాసాలు రాయండి. ఇలాంటి వివాదాస్పద విషయాలు చర్చించేటపుడు మీ సభ్యనామంతో చర్చిస్తే బాగంటుంది. మీకు వాదనకు దిగే ఆలోచన లేక పొతే వేరే వ్యాసాల వైపు దృష్టి సారించండి.

44.కాల్పనిక సాహిత్యం గురించి. ఏమి వ్రాయవచ్చు

కాల్పనిక సాహిత్యం (నవలలు, సినిమాలు వంటివి) గురించి వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు [1] --

విజ్ఞాన సర్వస్వం ప్రధానం లక్ష్యం యదార్ధాలు. కల్పనలు కాదు. కనుక ఆ వ్యాసాలు యదార్ధాలను దృష్టిలో ఉంచుకొని వ్రాయాలి. ఒక సినిమా గురించి వ్రాసేటప్పుడు - సినిమా నటులు, సాంకేతిక నిపుణులు, జయాపజయాలు, ఆ సినిమా ప్రభావం - ఇవన్నీ యదార్ధాలు. "సినిమా కధ" కల్పన. కనుక కధను క్లుప్తంగా ఇక్కడ వ్రాయవచ్చును. అతిగా వ్రాయ తగదు.

45.అందమైన ఫోటోలు ఎలా తయారు చేయాలి?

వికీపీడియాలో చాలా వ్యాసాలకు ఫోటోలు అవసరం. ఈ ఫోటోలు తీయడానికి మీరు ఫోటోగ్రఫీ నిపుణుడు కానవసరం లేదు. కాకపోతే మీరు తీసిన ఫోటో సరిగా రాకపోతే, ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్లైన పికాసా (Picasa), జింప్ (GIMP) మొదలైన వాటిని వాడి ప్రాసెస్ చేయవచ్చు. ఇంకా మీ ఫోటోలను ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఆన్‌లైన్ టూల్స్] కూడా లభ్యమౌతున్నాయి. వీటిలో ఏదైనా ఉపయోగించి, మీఫోటోలను, క్రాప్(crop), పరిమాణం మార్పు(resize), చీకటిగా ఉన్న బొమ్మలను ప్రకాశవంతం చేయడం వంటి మార్పులు చేసి తరువాత వాటిని ఇక్కడ అప్‌లోడ్ చెయ్యండి.

46.వికీపీడియా ఒక అధికార వ్యవస్థ కాదు.

వికీపీడియా ఒక "బ్యూరోక్రసీ" కాదు. అధికారులు ఇతరులపై పెత్తనం చెలాయించే స్థలం కాదు. అందరికీ పాఠాలు చెప్పే వేదికా కాదు. నమూనా కోర్టు కాదు. ఇది నియమాలకోసం ఏర్పరచిన వ్యవస్థ కాదు. అధికంగా నియమాలను పెంచితే "నియమాల బంక"(Instruction creep) పెరుగుతుంది కాని వికీపీడియా ఆశయం నెరవేరదు. స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం తయారు చేసే లక్ష్యానికి అడ్డం వచ్చే నియమాలను పక్కన పెట్టండి. విభేదాలను సంయమనంతో పరిష్కరించుకుందాం రండి.

47.మీకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్నదా?

వికీపీడియాలో తెలుగు సాహిత్యం గురించిన వ్యాసాలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని వేరే చెప్పనక్కరలేదు. తెలుగు సాహిత్యం వ్యాసాలకు కేంద్ర వ్యాసాలుగా ప్రారంభించిన క్రింది వ్యాసాలు చూడండి-. తెలుగు వ్యాసాలకు అతి పెద్ద వనరు తెలుగు సాహిత్యము.

తెలుగు సాహిత్యము/తెలుగు సాహితీకారుల జాబితాలు/ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

వీటిలో ఎర్రలింకులు అనేక ఇతర వ్యాసాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. విజృంభించండి.

48. ప్రత్యేక పేజీలు

వికీపీడియాలోని పేజీలు దాదాపుగా అన్నీ సభ్యులు దిద్దుబాటు చెయ్యగలిగేవే. కొన్ని పేజీలు మాత్రం సభ్యుల దిద్దుబాట్లకు అందుబాటులో ఉండవు. అలాంటి పేజీలను ప్రత్యేక పేజీలు అంటారు. పరికరాల పెట్టె లోని "ప్రత్యేక పేజీలు" లింకుకు వెళ్ళి ప్రత్యేక పేజీల జాబితాలను చూడవచ్చు.

49.సమిష్టి కృషి

సభ్యులు కొంతమంది కలిసి ఒక ప్రాజెక్టు (యజ్ఞము)ను వృద్ధి చేస్తుంటారు. సభ్యులంతా తమ తమ అభిరుచులకి తగ్గట్టుగా ఏదో ఒక ప్రాజెక్టును వృద్ది చేయవచ్చు. దీనికి ఎవరి ఆహ్వానము అవసరం లేదు. ఇలాంటి ప్రాజెక్టులు ఒక విషయం అని కాకుండా విభిన్న విషయాలపై నడుస్తూ ఉంటాయి. కావున సభ్యులు సంకోచించకుండా ఏ వ్యాసంలోనైనా రచనలు లేదా దిద్దుబాట్లు చేయవచ్చు.

50.కొత్త పేజీని సృష్టించడం ఎలా?

మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, వెళ్లు గానీ వెతుకు గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఎర్రలింకు వస్తే ఆ వ్యాసం లేనట్టు. దాని ప్రక్కనే సృస్టించు అని కూడ వస్తుంది. దానిని నొక్కితే ఆ వ్యాసంపేరుతో ఖాలీ పుట తెరుచుకుంటుంది. మీరు వ్యాసం ప్రారంబించ వచ్చు. వ్యాసం వుంటే ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి.

51. కొత్త పేజీ కి మార్గదర్శకాలు

కొత్త పేజీ మరీ ఒక వాక్యంతో వుంటే ఉపయోగంగా వుండదు. కనీసం ఆరేడు వాక్యాలు రాయగలిగినప్పుడే కొత్త పేజీ ప్రారంభించండి. అంతకన్న తక్కువైతే దానికి తగిన బొమ్మను చేర్చగలిగినప్పుడు ప్రారంభించండి. ఖాతా లో ప్రవేశించకుండా ఒక వాక్యసమాచారంతో కొత్త పేజీలు సృష్టించవద్దు. ఒకవేళ సృష్టించినా అవి తొలగింపబడతాయని గమనించండి ఎందుకంటే అలా ప్రారంభించిన వారిని సంప్రదించటం వీలవదుకాబట్టి. కొత్త సంపాదకులు అనుభవం కోసం ఇప్పటికే వున్న వ్యాసాల దోషాల సవరణ, చిన్న వ్యాసాల విస్తరణ చేయటం మంచిది.

.52.పేజీ సృష్టించుట

పేజీకీ, కొత్త పేజీకి తేడా ఒకటే - పేజీకి పేజీ చరిత్ర ఉంటుంది, కొత్తపేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే! ఒక్కోసారి కొత్తపేజీ ఖాళీగా కాక, ముందే నిర్ధారించిన కొన్ని వాక్యాలు ఉండవచ్చు. మీతో సహా ఎవరైనా, వికీపీడియాలో రాయవచ్చు! కింద ఉన్న పెట్టెలో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి. ఇక్కడ ఏమి రాస్తారో అదే ఆ పేజీపేరు అవుతుంది. పేరు పెట్టే పద్ధతుల గురించి వికీపీడియా:నామకరణ పధ్ధతులు చూడండి.

52.లింకుల కిటుకులు. లింకులు ఎలా చేయాలి?

ఒక వ్యాసం వ్రాస్తున్నప్పుడు అందులో వచ్చే పదాలను తెవికిలోని ఇంకో వ్యాసానికి లింకు చేయాలంటే దాని కిరుప్రక్కలా రెండు [[ ]] స్క్వేర్ బ్రాకెట్లను పెట్టండి . ఉదాహరణకు మీరు తెలుగు వ్యాసాన్ని లింకు చేయాలనుకుంటే, తెలుగు అని వ్రాయండి. తెలుగు అని చూపబడుతుంది.

అదే ఆంగ్ల వికీలో వ్యాసానికి లింకు చేయాలనుకుంటే, వ్యాసం పేరుకి ముందు :en: అని వ్రాయాలి. ఉదాహరణకు మీరు ఆంగ్ల వికీలో ని తెలుగు వ్యాసనికి లింకు చేయాలునుకుంటే, en:Telugu అని వ్రాయండి. en:Telugu అని చూపబడుతుంది.

1. పైపు కిటుకు: వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు వేరే వ్యాసపు పాఠ్యం నుండి లింకు ఇచ్చేటపుడు, లింకు ఇస్తున్న పదం పేరు లక్ష్య వ్యాసం పేరు ఒకటి కాకపోవచ్చు. ఉదాహరణకు, ఏదైనా వ్యాసంలో ఒంగోలు ఎద్దుల గురించి రాస్తూ సంబంధిత వ్యాసానికి లింకు ఇవ్వదలచారనుకోండి.. ఒంగోలు ఎద్దు పేరుతో వికీలో వ్యాసం లేదు గానీ, ఒంగోలు జాతి పశువులు అనే వ్యాసం ఉంది. ఆ పదం నుండి ఆ వ్యాసానికి లింకు ఇలా ఇవ్వాలి: ఒంగోలు ఎద్దులు). ఇలా రాసినపుడు వ్యాసంలో ఇలా కనిపిస్తుంది.. ఒంగోలు ఎద్దులు).

2. బహువచన కిటుకు లేదా పొర్లింత కిటుకు: వ్యాసాల్లో ఇతర వ్యాసాల పేర్లను ఉదహరించేటపుడు ఆ వ్యాసం పేరును ఖచ్చితంగా అలాగే రాసే వ్లు ఉండక పోవచ్చు. ఉదాహరణకు,

కన్నెగంటి హనుమంతు వలెనే అల్లూరి సీతారామరాజును కూడా తెల్లవారు కాల్చి చంపారు. అనే వాక్యంలో అల్లూరి సీతారామరాజును అనే పదానికి లింకు ఇలా ఇవ్వవచ్చు: అల్లూరి సీతారామరాజును. వ్యాసంలో ఇది కన్నెగంటి హనుమంతు వలెనే అల్లూరి సీతారామరాజును కూడా తెల్లవారు కాల్చి చంపారు.అని కనిపిస్తుంది. ఈ కిటుకును బహువచన పదాలకు కూడా వాడవచ్చు.

53. ఒక సభ్యుడు/సభ్యురాలు ఏమేం రచనలు చేసారో చూడడం. ఎలా?

ఫలానా సభ్యుడు/సభ్యురాలు ఏమేం రచనలు చేసారో చూడాలంటే.. ముందు ఆ సభ్యుని "సభ్యుని పేజీ"కి వెళ్ళండి. పేజీకి ఎడమ వైపున ఉన్న పరికరాల పెట్టెలో ఉన్న సభ్యుని రచనలు అన్న లింకును నొక్కండి. సదరు సభ్యుడు/సభ్యురాలు చేసిన రచనల జాబితా కనిపిస్తుంది.

మీరు చేసిన రచనలు చూసేందుకు, పేజీకి పైన, కుడి మూలన ఉన్న నా మార్పులు-చేర్పులు లింకును నొక్కండి. ఇప్పటివరకు మీరు చేసిన మార్పులు చేర్పులు కనిపిస్తాయి. ఈ మార్పులు చేర్పులు ఎంత పాతవైనా సరే అన్నీ అలా పోగవుతూనే వుంటాయి.

54.మీరు చేసిన దిద్దుబాటు గురించి క్లుప్తంగా దిద్దుబాటు సారాంశం పెట్టెలో రాయండి

మీరు చేసిన మార్పుల గురించి దిద్దుబాటు సారాంశంలో రాస్తే ఆ పేజీని గమనిస్తూ ఉన్న ఇతర సభ్యులకు, పేజీలో ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయో సులభంగా తెలుస్తుంది. చిన్న మార్పులకు తప్పించి మిగతా అన్ని దిద్దుబాట్లకు ఈ సారాంశం రాయడమనేది వికీ సాంప్రదాయం. దిద్దుబాటు సారాంశాలు పేజీ చరితం లోను, వీక్షణ జాబితాలలోను, ఇటీవలి మార్పులు లోను కనిపిస్తాయి. వాటి ద్వారా ఓ పేజీలో ఏమేం దిద్దుబాట్లు జరుగుతోందనే విషయాన్ని సభ్యులు తెలిసికోగలుగుతారు. మీరు విభాగంలో దిద్దుబాటు చేస్తూ ఉంటే, సారాంశం పెట్టెలో ముందుగానే ఆ విభాగం పేరు కనిపిస్తుంది. దాని తరువాత మీ సారాంశం రాయాలి. సారాంశంలో వ్యాసాలకు లింకులు ఇవ్వవచ్చు. సారాంశం 200 కారెక్టర్ల లోపు ఉండాలి. ఇక్కడ అందరికీ అర్థమయ్యే రీతిలో పొడిపదాలను కూడా వాడవచ్చు.

.ఒకే సభ్యనామాన్ని అన్ని సోదర ప్రాజెక్టులలో కూడా వాడేందుకు గాను జాగ్రత్త చేసుకోండి.

వికీమీడియా ఫౌండేషను వారి ప్రాజెక్టులన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటాయి. వికీపీడియాలో పని చేస్తున్నారంటే, ఏదో ఒకనాటికి సోదర ప్రాజెక్టుల్లో కూడా మీరు లాగిన్ అవ్వవలసి రావచ్చు. అలా జరిగినపుడు, సహజంగానే ఇదే సభ్యనామం కావాలని కోరుకుంటారు. చాలామంది వికీపీడీయనులు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఒకే సభ్యనామాన్ని వాడుతూ ఉంటారు. ఒకే సభ్యనామం వివిధ ప్రాజెక్టుల్లో వివిధ సభ్యులకు ఉంటే అయోమయం నెలకొనే అవకాశం ఉంది. ఇతర ప్రాజెక్టుల్లో మీరు ఎప్పుడూ పనిచెయ్యకపోయినా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అయోమయాన్ని నివారించేందుకు, ఆయా ప్రాజెక్టుల్లో మీ సభ్యనామాన్ని సృష్టించుకుని ఉంచండి.

ఒక ప్రాజెక్టులో సృష్టించుకునే సభ్యనామం ఇక మిగతా అన్ని ప్రాజెక్టులలోనూ రిజర్వు అయ్యేలా చేసే అంశం, మీడియావికీ సాఫ్టువేరు యొక్క రాబోవు కూర్పుల్లో ఉండబోతోంది.

55. మీరు అనువాదం బాగా చేయగలరా?.... ఇతర భాషలనుండి వ్యాసాలను తెలుగులోకి అనువదించండి.

మీరు సొంతంగా వ్యాసాన్ని రాయలేక పోయినా తెలుగు వికీపీడియాలో ఎన్నో అనువదించని వ్యాసాలు ఉన్నాయి. వాటిని ఒక పట్టు పట్టండి. ఇక్కడ లేని వ్యాసాలు కొన్ని ఆంగ్ల వికీపీడియాలో ఉండి, అవి తెలుగులో ఉంటే బాగుంటుందని మీకనిపిస్తే ఒక మీరు ఒక కొత్త వ్యాసాన్ని ప్రారంభించవచ్చు. అదే విధంగా అనువాదం కోరబడిన వ్యాసాలు అనే ఒక జాబితా కూడ కనిపిస్తుంది. అక్కడి కెళ్ళి మీ కిష్టమైన వ్యాసాన్ని ఎన్నుకొని అనువదించండి.

ఇంగ్లీషువికీలో మీరు చూసిన వ్యాసాలు తెలుగులోకి అనువదించి, తెలుగు వికీ ఎదుగుదలకు తోడ్పడండి. మీకు ఇంగ్లీషుతోపాటు ఇంకా ఏమైనా ఇతర భాషలు వస్తే వాటినుంచి తెలుగులోకి అనువదించి తెలుగువికీ అభివృద్దికి తోడ్పడండి. అనువదించేటప్పుడు ఇతర భాషా లింకులు ఇవ్వడం మర్చిపోకండి!

56.చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి

వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే. మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.

57.మీ సభ్య పేజీ./ మీ వాడుకరి పేజీ అంటే ఏమిటి?

ప్రతీ సభ్యునికి వికీపీడియాలో ఒక సభ్యపేజీ కేటాయించ బడుతుంది. వికీపీడియాలో మీరు సభ్యులైతే మీ గురించి కొంత సంక్షిప్త సమాచారాన్ని రాసుకోవచ్చు. ఉదాహరణకు మీ పేరు, మీ జన్మస్థలం, మీ వృత్తి, వికీపీడియాలో మీరు చేస్తున్న పనులు, మీకు ఇష్టమైన వ్యాసాలు, మొదలైనవి. దీని ద్వారా వికీపీడీయాలోని ఇతర సభ్యులు మీ గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది.

వికీపీడియాలో సభ్యులైన ప్రతి ఒక్కరికీ "సభ్యులు " నేమ్‌స్పేస్‌తో ఒక పేజీ ఉంటుంది.

ఇది మీ స్వంత బ్లాగు లేదా వెబ్‌సైటు కాదనుకోండి. కాని మీ సభ్య పేజీయే వికీలో మీ ముఖచిత్రం. మీ పరిచయాన్ని, ఇంకా ఇతర సభ్యులకు మీ గురించి, మీ కృషి గురించి మీకు ఇష్టమున్నంతవరకు వ్రాయవచ్చును. మీరు పాల్గొంటున్న ప్రాజెక్టులు, మీ అభిరుచులు తెలపడానికి కూడా ఇది మంచి స్థలం. అవుసరమైతే ఈ పేజీకి ఉప పేజీలు సృష్టించుకోవచ్చును. ఉప పేజీలలో మీ కిష్టమైన సమాచారాన్ని విభజింపవచ్చును. ప్రయోగాలు చేసుకోవచ్చును.

అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.

58.క్రొత్తగా చేరిన వారికి స్వాగతం చెప్పడం ఎలా?

కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారికి స్వాగతం చెప్పడము తెవికీలో మంచి సాంప్రదాయం. దీనికి గాను కొత్తవాడుకరుల చిట్టా అని ఒక జాబితా వుంతుంది. అందులో వాడుకరి పేరు ఎర్రగా కనబడితే ఆ వాడుకరి ఇంకా వాడుకరి పుటను వ్రాయలేదని అర్థం. దాని ప్రక్కనే బ్రాకెట్ లో చర్చ అని మరియు రచనలు అని కూడ కనబడుతుంది. ఇందులో చర్చ ఎర్రగా కనబడితే ఆ వాడుకరికి ఇంతవరకు ఎవ్వరు స్వాగతం చెప్పలేదని అర్థము. దానిమీద నొక్కితే (wel) = welcome) ట్యాబు నొక్కితే ఆ వాడుకరికి స్వాగత సందేశం వెళ్ళిపోతుందు. వెళ్ళినట్లు సందేశం కూడ కనబడుతుంది. వెంటనే బాక్ బటన్ నొక్కితే తిరిగి కొత్తవారి జాబితా వస్తుంది. మరొకరికి స్వాగతం అదే విధంగా చెప్పవచ్చి . చర్చ అనేది బ్లూ రంగులో వుంటే ఆ వాడుకరికి ఎదివరకే ఎవరో స్వాగతం చెప్పారని అర్థము.

59.మొదటి పుట లోనిఈ వారపు బొమ్మ సంగతేమిటి?

తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు బొమ్మ" లక్ష్యము. ఉదాహరణకు ఈ బొమ్మలలో మొదటి బొమ్మ ఈ క్రింద చూడండి.

60ఈ వారపు బొమ్మగా పరిగణించటానికి బొమ్మలను ఎంపిక చేయటం ఎలా?

తెలుగు వికీపీడియాలో ఏవయినాబొమ్మలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను ఈ వారం బొమ్మ పరిగణనలు అనే వర్గంలో చూసుకోవచ్చు. ఆ వర్గములో మొదటి పేజీలోని ఈ వారంబొమ్మ శీర్షికలో మున్ముందు ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్నబొమ్మలు. వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు అక్కడ పొందు పరచిన నిబంధనలను పాటించండి.

61.విధానాలను ఎలా అమలు పరుస్తారు?

మీరు ఒక వికీపీడియా రచయిత. రోజూ జరిగే వివిధ సమర్పణలు, ఇతర పనులను పర్యవేక్షించడానికి సంపాదకుడు కానీ, ఒక అధికారిక యంత్రాంగం కాని వికీపీడియాలో లేవు. దాని బదులు, సమర్పణలకూ ఆకృతికీ సంబంధించిన సమస్యలు ఏమైనా గమనిస్తే చురుగ్గా ఉండే సభ్యులు అవసరమైన మార్పులు చేస్తారు. కాబట్టి సభ్యులే రచయితలు, వారే సంపాదకులూను.

కాబట్టి సభ్యులే తమలో తాము చర్చించుకుంటూ విధానాలను అమలు చేస్తారు. కొన్ని విధానాలను నిర్వాహకులు తాత్కాలిక నిరోధాల ద్వారా (ముఖ్యంగా దుశ్చర్యలతో వ్యవహరించడం) అమలు చేస్తారు. మరీ తీవ్రమైన కేసుల్లో మధ్యవర్తిత్వ సంఘం జోక్యం చేసుకుని వివాద పరిష్కారం పధ్ధతికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వవచ్చు.

62. వికీపీడియాలో ఏదేని వ్యాసాన్ని, బొమ్మలను తొలగించే పద్ధతి ఎలా వుంది?

ఒక వ్యాసాన్ని గానీ, బొమ్మను గానీ, దారిమార్పును గానీ, ఇతరాలను గానీ తొలగించే పద్ధతిలో ఉండే మెట్లు ఇవి:

  1. తొలగించాలని మీరు భావించిన పేజీలో సదరు నేముస్పేసుకు సంబంధించిన మూసను పేజీ పై భాగాన ఉంచాలి.
  2. ఆ తరువాత ఆ పేజీని తొలగించాలో లేదో తేల్చేందుకు చర్చ జరగాలి. ఈ చర్చ కోసం ప్రతిపాదించిన వ్యాసం కోసం ఒక ఉపపేజీ తయారుచెయ్యాలి.
  3. వ్యాసం పేజీలో పెట్టిన తొలగింపు మూస నుండి ఈ పేజీకి లింకు ఉంటుంది. ఇక్కడ తొలగింపు విషయమై సభ్యులు తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తారు.
  4. తరువాత ఈ పేజీని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి. ఇలా: వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం
  5. సభ్యుల అభిప్రాయాల కోసం తగు సమయం ఇచ్చిన తరువాత, ఆ అభిప్రాయాలను క్రోడీకరించి, చర్చను ముగిస్తారు. ఈ ముగింపులోనే చర్చ పర్యవసానాన్ని కూడా నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం తొలగించు, ఉంచు, దారిమార్చు, విలీనం చెయ్యి వగైరా నిర్ణయాల్లో ఏదైనా కావచ్చు. చర్చ ముగింపును నిర్వాహకులు గానీ, అనుభవజ్ఞులైన సీనియరు సభ్యులు గానీ చేస్తారు. చర్చ ముగిసిన విషయం స్పష్టంగా తెలిసేలా రెండు మూసలను చేర్చి, పేజీ నేపథ్యం రంగును మారుస్తారు. #ఒకసారి చర్చను ముగించాక, ఇక అక్కడ సభ్యులు ఏమీ రాయరాదు.
  6. చర్చ నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యను తీసుకుంటారు. నిర్ణయం తొలగించడమే అయితే, దాన్ని నిర్వాహకులు అమలు చేస్తారు; తొలగించే అనుమతులు వారికే ఉంటాయి మరి.
63. వికీపీడియాలో
ఈ వారపు వ్యాసం ఏలా పెడతారు?

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం. ఇలా ప్రతి వారం ఒక్క వ్యాసం ప్రదర్శితమౌతుంది. వికీపీడియా ఉద్దేశము అందరికి ఉచిత విజ్ఞానము అందించడమే .... అందులో భాగంగానే ఈవారం వ్యాసము, ఈవారం బొమ్మలు.

64.వికీపీడియాలో ఈ వారం వ్యాసాన్ని ప్రతిపాదించడం ఎలా?

క్రింద ఇవ్వబడిన సూచనలు గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న వ్యాస చర్చాపేజీలో ఈ వారం వ్యాసం పరిగణనా' అన్న మూసను ఉంచండి. వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.

  1. వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  2. వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసం యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసలుబాటు ఇవ్వవచ్చు).
  3. వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదము చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  4. వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.
65. వికీపీడియా ఒక వెబ్ సైట్ అని అంటున్నారు. కాని వెబ్ సైట్లలో వ్యాపార ప్రకటనలు చీకాకు పరుస్తాయి. మరి ఎలా?

మీరన్నది నిజమే ...... వెబ్ సైట్ల నిండా వ్యాపార ప్రకటనలుంటాయి. కాని వికీపీడియాలో ఎలాంటి వ్యాపార ప్రకటలకు అవకాసము లేదు. ప్రకటనలతో చీకాకు లేకుండా మన పని మనము ప్రశాంతంగా చేసుకొని పోవచ్చు.

వ్యక్తులకు గౌరవ వాచకాలు వ్రాయాలా?

[మార్చు]

వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. వచ్చారు, అన్నారు, చెప్పారు వంటి పదాలను కాక వచ్చాడు, అన్నాడు, చెప్పాడు అని రాయాలి.

ఏకవచన ప్రయోగం/ఏకవచనం ఎందుకు?

సాధారణంగా వ్యవహారాలలో, వార్తాపత్రికలలో సమకాలీన వ్యక్తులను ఉద్దేశించేటపుడు గారు, విచ్చేశారు, ఆవిడ గారు వచ్చేశారు వంటి గౌరవార్ధక బహువచనం ప్రయోగించడం చూస్తూ ఉంటాం. కానీ వెనుకటి తరాలవారి గురించి రాసేటపుడు మాత్రం ఏకవచన ప్రయోగమే జరుగుతూ ఉంటుంది. రాము'డు' రావణుని చంపి సీతను తెచ్చా'డు' . పోతన భాగవతం రాశాడు అని వ్యహరిస్తారు గాని, రాముడు గారు రావణుని చంపి సీత గారిని తెచ్చారు అని, పోతన గారు భాగవతం రాశారు అనే ప్రయోగాలు కనిపించవు.

నిన్నటి వారైన శ్రీశ్రీ, చలం, ఆరుద్ర, ఎన్టీ రామారావు వంటి వారిని కూడా ఏకపచన ప్రయోగంతోనే ఉదహరిస్తాం. కేవలం జీవించి ఉన్న వ్యక్తులకే ఈ గౌరవ వాచకాలను ప్రయోగిస్తున్నట్టు గమనించగలం. సజీవ వ్యక్తుల గురించి రాసేటప్పుడు బహువచన ప్రయోగం చేయాలని కొందరు సూచించారు. ఉదాహరణకు ఒక ప్రముఖ వ్యక్తి గురించి నేడు వ్యాసంలో బహువచన ప్రయోగం ఉపయోగించి రాస్తాం. ఆ తరువాత వారానికి ఆ వ్యక్తి గతించాడనుకుంటే అప్పుడు వ్యాసంలోని బహువచన ప్రయోగాలను ఏకవచనాలుగా మార్చాలా? మార్చితే ఎంతకాలం తర్వాత మార్చాలి. ఇలా కొన్ని వ్యాసాలలో బహువచన ప్రయోగం, కొన్ని వ్యాసాల్లో ఏకవచన ప్రయోగం విజ్ఞాన సర్వస్వం యొక్క ప్రామాణికతను దెబ్బతీస్తుంది. విజ్ఞాన సర్వస్వాలు కాలాతీతాలు. శైలికి సంబంధించినంత వరకు వీటికి ప్రాచీన, ఆధునిక, మధ్య యుగ భేదాలు లేవు. కాబట్టి వికీపీడియాలో బహువచన ప్రయోగం తగదు.

తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేసిన కొమర్రాజు లక్ష్మణరావు అందులో ఏకవచన ప్రయోగాన్నే వాడాడు.

స్త్రీలను ఏకవచనంలో ఉదహరిస్తే అమర్యాదగా ధ్వనిస్తుంది కదా

వికీపీడియా వ్యాసాల్లో ఒక సారూప్యత ఉండాలి. ఏకవచనం పురుషులకెంత మర్యాదగా ఉంటుందో స్త్రీలకూ అంతే మర్యాదగా ఉంటుంది.ఉదాహరణకు కింది వాక్యాలు చూడండి.

..సీత తన భర్తవెంట అయోధ్యకు వచ్చింది. ..ప్రముఖ నటి సావిత్రి 1937 డిసెంబర్ 6 న కొమ్మారెడ్డి గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వీటిలో అమర్యాద ధ్వనించిందని అనలేము.

ఫోటోల గురించి

[మార్చు]

వికీపీడియాలో బొమ్మల కొరత చాల వున్నది. (ఫోటోలు) వికీపీడియా లోని వ్యాసాలకు గాని, విక్షనరీలోని పదాలకు గాని ఇతర దేశ బొమ్మలు చాల పెట్టి వున్నాయి. కనుక డిజిటల్ కెమెరా వున్న వికీపీడియనులు తమ కెమెరాతో ఫోటోలు తీసి వికీ కామన్స్ కీ ఎక్కించ వచ్చు. అక్కడి నుండి వికీపీడియాలోని ఇతర విభాగలలోనికి దిగుమతి చేసుకోవచ్చును. ఫోటోలు దేనిని తీయాలనే సందేహం రావడము సహజమే.... దానికి సమాదానంగా ఏ ఫోటో అయినా అనర్హం కాదు అనే సమాదానము చెప్ప వలసి వస్తుంది. మీ సందేహ నివృత్తికి ఇదివరకు కామన్స్ లో ఎక్కించిన ఫోటోలను చూడండి. మీరు కూడ వీలైనన్ని పోటోలు తీసి ఎక్కించండి.

1. బొమ్మలను "క్రాప్" చేయడం

ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ:Mahabubnagar Bus Station.jpg చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు. M S Picture Managerలో గాని, మరేదైనా Image Editing softwareలో గాని "crop" feature మీరు వాడవచ్చు. అలా సుద్ధి చేయబడిన బొమ్మలను వికీ కామన్స్ లో మాత్రమే ఎక్కించాలి. ఆతర్వాత వాటిని దిగుమతి చేసుకొని మీకు కావలసిన వ్యాసంలో ఎక్కించు కోవచ్చు.

2. సరైన ఉచిత బొమ్మ దొరకడం లేదు.

వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. సరయిన ఉచిత బొమ్మలు లభించకపోతే బొమ్మలేకుండా వ్యాసం వ్రాసేయడం ఉత్తమం. పరవాలేదు. తరువాత వీలయినప్పుడు, ఎవరైనా గాని, బొమ్మను చేర్చవచ్చును. కొన్ని నియమాలకు లోబడి మాత్రమే Fair Use బొమ్మలు చేర్చడం తగును. మరిన్ని వివరాలకు వికీపీడియా:కాపీహక్కులు మరియు వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం చూడండి. Fair Use గురించి అంగ్ల వికీలో ఉన్న గైడ్‌లైన్లు చూడండి.

3. బొమ్మలకు పేర్లు. ఎందుకు?

మీరు ఏదైనా చిత్రాన్ని అప్‌లోడ్ చేసినపుడు ఆ చిత్రం పేరు, (అవి మీరు తీసినవే అయి వుండాలి) ముఖ్య సమాచారం ఆంగ్లంలో ఉంటే మంచిది. ఎందుకంటే ఆ బొమ్మను ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టులలో కూడా వాడుకొనే అవకాశం ఉంది. బొమ్మ పేరును వివరణాత్మకంగా పెడితే ఉపయోగకరంగా, స్పష్టంగా ఉంటుంది. చిత్రాలను కేవలం వికీకామన్స్ లోనే ఎక్కించాలి. తర్వాత అక్కడినుండి దిగుమతి చేసుకోవచ్చు.

4. ఛాయా చిత్రాలు .

మీరు గానీ, మీ బంధువులుగానీ, స్నేహితులుగానీ, మీకు తెలిసిన వాళ్ళెవరైనా సరే పర్యాటక ప్రదేశాలకు, చూడాల్సిన ప్రదేశాలకు వెళ్ళి ఉంటే దానికి సంబంధించిన ఫోటోలను వికీపీడీయా కు ఎగుమతి చెయ్యవచ్చు. ప్రస్తుతం తెలుగు వికీపీడియాకు బొమ్మల అవసం చాలా ఉంది. అంతే కాక అవి వ్యాసాలను మరింత ఆకర్షణీయంగా పరిపుష్టం చేయగలవు. కానీ చాయా చిత్రాలను నేరుగా వికీపీడియాలోని వ్యాసాలలోనికి ఎక్కించడానికి వీలు పడదు. వాటిని ముందుగా వికీ కామన్స్ లోకి ఎక్కించి తర్వాత దానిని మనకు కావలసిన వ్యాసంలోనికి దిగుమతి చేసుకోవచ్చు. మీరు పెట్టిన చాయా చిత్రాన్ని ఎవరైనా ఏ భాషలోని వ్వాసములోనికైనా వాడుకుంటారు. చాయా చిత్రాలు ప్రముఖ ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించినవి మాత్రమే కాదు.... ఏవైనా సరే అనగా..... చీమ, దోమ, కుక్కపిల్ల, పక్షి గూడు, పక్షి పిల్ల, ఈత చెట్టు, ఇలా ఏదైనా పరవాలేదు. బొమ్మ బాగ వుంటే చాలు ఎక్కించండి. అన్ని బొమ్మలు వ్యాసాలకు, విక్ష్నరీకి అవసరమే. పైగా తెలుగులో బొమ్మల కొరత చాల వున్నది.

5. పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు. నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. దాని కాపీహక్కుగా అని ఎంచుకోండి.

ఇదే విధంగా సినిమా సన్నివేశ చిత్రాన్ని కూడా కాపి రైట్ ఉన్నదని భావించాలి. ఇది ఒక కాపీహక్కులు కలిగిన సినిమానుండి ఎంచుకొన్న సన్నివేశం చిత్రం (screenshot). ఈ చిత్రం కాపీహక్కులు ఆ సినిమా నిర్మాత లేదా నిర్మాణ సంస్థకు చెందుతాయి. ఆ చిత్రంలో ఉన్న నటీనటులకు కూడా చెందవచ్చును.

తక్కువ రెజల్యూషన్ ఉన్నసన్నివేశ చిత్రాలను ఆ సినిమాను సమీక్షించడానికి మరియు దాని గురించి రాయడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల కాపీహక్కు చట్టములోని ఫెయిర్ యూజ్ ప్రకరణము కింద వాడుకొనవచ్చు. మరింత విస్తృత సమాచారమునకు కాపీహక్కులు చూడండి

వికీపీడియా ఐదు మూల స్థంభాలు

[మార్చు]
మొదటి స్థంభము

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు.

రెండవ స్థంభము
వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
మూడవ స్థంభము
స్వేచ్ఛగా పంచుకోగల విషయమైన వికీపీడియా ఎవరిచేనైనా మార్చుటకు వాడుటకు, సవరించుటకు మరియు పంపిణి చేయటకు వీలైనది. :సంపాదకులందరూ సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి , ఏ ఒక్క సంపాదకునికి వ్యాస యజమానిత్వం లేదు మరియు ఏరచనలైనా ఎలాగైనా మార్పులకు గురి అగుతాయి మరియు పంపిణి అవుతాయి. నకలు హక్కుల చట్టాలను గౌరవించండి మరియు మూలాల నుండి దొంగతనము చేయవద్దు. ఉచితం కాని మాధ్యమాలను అప్పుగా వాడుకొనుట సముచిత వినియోగం క్రింద అనుమతించ బడినది కాని మొదట స్వేచ్ఛగాపంచుకోగల వాటిగురించి గట్టి కృషి చేయాలి.
నాల్గవ స్థంభము
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించక పోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించు కునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
ఐదవ స్థంభము
ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ బద్రంగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.

వికీపీడియాలో ఏమేమి వ్రాయకూడదు

[మార్చు]
1. మౌలిక పరిశోధనలు నిషిద్ధం

మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనేది వికీపీడియా లోని వ్యాస విషయాన్ని నిర్దేశించే మూడు నిర్దేశకాల్లో ఒకటి. మిగతావి తటస్థ దృక్కోణం, నిర్ధారత్వం.

గతంలో ఏ విశ్వసనీయ వనరులోనూ ప్రచురించబడని వ్యాసాన్ని వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసం అంటారు. ఇంతకు ముందు ప్రచురితం కాని వాదనలు, చర్చలు, భావనలు, డేటా, ఆలోచనలు, ప్రకటనలు, సిద్ధాంతాలు, ఇప్పటికే ప్రచురితమైన విషయాలపై సాగిన కొత్త విషయాలతో కూడిన పరిశోధనాత్మక విశ్లేషణ ఈ కోవలోకి వస్తాయి.

.రచనలు కాదు, రచనల "గురించి వ్రాయండి"'

చాలా మంది క్రొత్త సభ్యులు ఉత్సాహంగా తమ రచనలు (కధలు, కవితల వంటివి) లేదా ఇతరుల రచనలు (అన్నమయ్య కీర్తనలు, తెనాలి రామకృష్ణ కధలు వంటివి) వ్రాయడంతో వికీ ప్రస్థానం ప్రారంభిస్తారు. ఇవి వికీకి పనికిరావు అనగానే నిరుత్సాహపడతారు. సింపుల్ రూల్ ఏమంటే కవితలు (మీవైనా, మరొకరివైనా గాని) వికీలో వ్రాయవద్దు. ప్రసిద్ధుల కవితల, రచనల "గురించి" వ్యాసాలు వ్రాయవచ్చును. ఉదాహరణకు మహాప్రస్థానం, ఎంకి పాటలు, వేయి పడగలు వంటి వ్యాసాలు చూడండి.

2. ఇలాంటివి వికీపీడియాలో వ్రాయవద్దు.

వికీపీడియాలో వ్రాయదగనివి చాలా ఉన్నాయి. ఉదాహరణకు

మీ వీధిలో దుకాణం గురించి మీరు నిన్ననే మొదలు పెట్టిన ఇద్దరు సభ్యుల సమాజం గురించి మీకిష్టమైన వంట మీ పెంపుడు కుక్క మీకు ఫలాని ఛానల్ ఎందుకు నచ్చదు? మీ మరపురాని విహార యాత్ర.

3.స్వీయ చరిత్రలు రాయకండి

వికీపీడియాలో ఎవరి గురించి వారు రాసుకోవడం నిషిద్ధం. ఒకవేళ నిజంగా గనుక ప్రముఖ వ్యక్తులైతే, ఇతర సభ్యులు మీ గురించిన రాసిన వ్యాసానికి, దాని చర్చా పేజీలో సమాచారాన్ని తెలుపవచ్చు. ఒక సాధారణ విధానానికి అనుగుణంగా తెలుగు వికీపీడియాలో తమ స్వీయ చరిత్రను వ్యాసంగా రూపొందించకండి. ఒకవేళ మీ గురించి ఏదైనా వ్యాసం ఉంటే (గుర్తింపు పొందిన వ్యక్తులపై) దాన్ని కూడా మీరు దిద్దకండి. మీకు ఏదైనా సరిచేయడంగాని, ఇంకా ఏదైనా వివరం కూర్చదలిస్తే దానిని ఆ వ్యాసం చర్చా పేజీలో వివరించండి. కాలం చెల్లిన నిజాలుగాని, తప్పులు గాని ఉంటే మొహమాటపడకుండా సహకరించండి.

4. వ్యాసాలలో మా పేర్లు వ్రాయ వచ్చా?

వికీపీడియాలో వ్యాసాలు సమిష్టి కృషితో రూపొందుతాయి. మీరు సృష్టించిన వ్యాసాన్ని వేరే సభ్యులెవరైనా మార్పులు చేయవచ్చు. కాబట్టి మీరు రాసే వ్యాసాలలో ఇట్లు తమ భవదీయులు <మీ పేరు> లాంటి వాక్యాలు రాయకండి. మీరు ఏ పేజీలలో నైనా ఇలాంటి వాక్యాలు చూస్తే తొలగించండి.

5. peacock terms వాడవద్దండి.

నిజమైన, స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఒక వ్యక్తి లేదా విషయం గురించి ఊదర గొట్టే పదజాలాన్ని peacock terms అంటారు. "ఈయన ఆ వూరి ప్రగతికి నిరుపమానమైన సేవ చేశాడు" అని వ్రాస్తే అది 'నెమలి మాట' అవుతుంది. "ఈయన హయాంలో వూరి చెరువు త్రవ్వించారు, గుడి మరమ్మతు చేయించారు. బడి రంగు వేయించారు." అని వ్రాయడం మంచిది.

ఇలాంటి మరికొన్ని పదజాలాలు - "చలం వ్రాసిన దాంట్లో శతసహస్రాంశమైనా వేరెవరూ వ్రాయలేదు", -- "మహాభారతం గొప్పతనం గురించి చెప్పడం సాధ్యం కాదు", -- "ఇది మన దేశచరిత్రను మలుపు త్రిప్పిన ఘటన" - ఇటువంటి పదజాలాన్ని వికీ వ్యాసాలలో వాడడం అనుచితం

6. Weasel Words వాడవద్దండి.

సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును.

మూలాలు

[మార్చు]