Jump to content

చర్చ:రాజకీయ పార్టీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

26 మార్చి 2020‎న 2,102 బైట్లతో YVSREDDY ఈ వ్యాసంలో వ్రాసిన సమాచారం

[మార్చు]

రాజకీయ పార్టీ అంటే ఒక దేశం యొక్క వ్యవహారాలను నడిపించడానికి ఎన్నికల ద్వారా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే వ్యక్తుల లేదా సంస్థల వ్యవస్థీకృత సమూహం. ఇది తరచుగా ప్రభుత్వ కార్యాలయములకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ఎన్నికలలో పదవికి పోటీ చేస్తారు, ఎన్నికలలో గెలిచిన్న అభ్యర్థులు ప్రజాప్రతినిధులు అవుతారు. మెజారిటీ అభ్యుర్థులను గెలిపించుకున్న పార్టీ అధికార పార్టీగా అధికారాన్ని చేపట్టి నిర్ణీత గడువు వరకు పరిపాలన కొనసాగిస్తుంది. మళ్ళీ మళ్ళీ నిర్ణీత కాలాన్ని ఎన్నికలు జరుగుతుంటాయి, మళ్ళీ ఏ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అధికార పార్టీగా అధికారాన్ని చేపట్టి నిర్ణీత గడువు వరకు పరిపాలన కొనసాగిస్తుంది. అధికార పార్టీకి చేరువగా అభ్యర్థులను గెలిపించుకున్న పార్టీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది.

తెలుగు వికీపీడియాలో నేను చేరిన సమయంలో ఒక వాక్యం వ్రాస్తే అది గొప్పగా భావించేవారు. నేను వ్రాసిన వ్యాసాలలో కనీసం 6 లైన్లు ఉండాలని నాకు నేనుగా అనుకున్నాను. నేను సృష్టించిన ప్రతి వ్యాసంలో కనీసం 2000 బైట్లు ఉండేలా చేస్తున్నాను. కానీ ఈ వ్యాసం ప్రారంభమే 2000 బైట్లకి మించి ప్రారంభించబడింది. ఈ వ్యాసంలో తక్కువ సమాచరం ఉంది అని ఇప్పుడు తొలగింపు మూస పెట్టారు. ఈ విధానం వలన ఈ వ్యాసం యొక్క చరిత్ర పూర్తిగా చెడిపోతుంది. ఇలాంటి విధానాల వలన ఇప్పటికే తెలుగు వికీపీడియా సర్వనాశనం అయ్యింది. నేను సృష్టించిన ప్రతి వ్యాసం ఎవరు తొలగించినా దుర్మార్గమే తప్ప మరొకటి కాదు. నేను నిర్వాహకుడిగా, అధికారిగా అవ్వాలనే లక్ష్యంతో నేను తెలుగు వికీపీడియాలో చేరలేదు. తెలుగు వికీపీడియాలో నేను చేసిన కృషికి అతిసులభంగా నిర్వాహకుడిని అయ్యేవాడిని. నేను అనుకుంటే కేవలం మా ఊరి వారి సహకారంతోనే నేను నిర్వాహకుడిని కాగలను. నా తొలగించిన ప్రతి వ్యాసాన్ని పునఃసృష్టిచేయగలను. నేను అజ్ఞాతంగా వ్యాసాలు వ్రాస్తున్నాను, కాబట్టే నేను సృష్టించిన వ్యాసాలను దుర్మార్గంగా తొలగిస్తున్నారు. నేను సృష్టించిన వ్యాసాలను తొలగిస్తే నిర్వాహకులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ప్రతి తెలుగు వికీపీడియా నిర్వాహకుడి ఊరిలో కరపత్రములను పంచుతాను. నేను అజ్ఞాతంగా వ్యాసాలు వ్రాయబట్టే 2016 సంవత్సరంలో రోజుకో విజ్ఞాన వ్యాసం వ్రాసి ప్రపంచ రికార్డు సాధించినా ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పటికైనా తొలగించిన నా వ్యాసాలను పునఃప్రారంభించండి. నేను వ్రాసిన వ్యాసాలను తొలగిస్తే ఆ స్థానంలో ఏలాంటి వ్యాసాలు వచ్చాయో పరిశీలించండి. ఉదాహరణకు చర్చ:నిజాయితీ చూడండి. YVSREDDY (చర్చ) 13:01, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు కొరకు వ్యాసాలలో ఈ పేజీ తొలగింపుపై జరిగిన చర్చ

[మార్చు]

ఈ పేజీ సృష్టించి ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది.అప్పటినుండి దీనికి మూలాలు లేవు.ఇలాంటి ముఖ్యమైన వ్యాసాలకు నాలుగైదు వాక్యాలు రాసి చేతులు దులుపుకోవటం ఎంత మాత్రం భావ్యంకాదు.ఎదో లెక్కకు రాసినట్లుగా ఉంది.నాలుగైదు వాక్యాలలో ఉండేదానికన్నా లేకపోవటమే మంచిది. ఎవరో ఒకరు లేదని గమనించి తగిన మూలాలతో రాస్తారు.ఒక 10 రోజులలో తగిన మూలాలతో విస్తరించనియెడల ఈ వ్యాసం తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:43, 15 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుగత 00:37, 26 మార్చి 2020‎ YVSREDDY చర్చ రచనలు‎ చి 2,102 బైట్లు +65‎ వర్గం:రాజకీయ పార్టీలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి) దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 00:35, 26 మార్చి 2020‎ YVSREDDY చర్చ రచనలు‎ 2,037 బైట్లు +2,037‎ ←Created page with 'రాజకీయ పార్టీ అంటే ఒక దేశం యొక్క వ్యవహారాలను నడిపించడాన...'

  • ఈ వ్యాసం 2037 బైట్లతో విస్తరించే ప్రారంభించబడింది.
  • ప్రస్తుగత 06:03, 29 సెప్టెంబరు 2023‎ YVSREDDY చర్చ రచనలు‎ 13,248 బైట్లు +475‎ మూలాలు దిద్దుబాటు రద్దుచెయ్యి

ప్రస్తుగత 05:55, 29 సెప్టెంబరు 2023‎ YVSREDDY చర్చ రచనలు‎ 12,773 బైట్లు +7,673‎ విస్తరణ దిద్దుబాటు రద్దుచెయ్యి

  • నేడు ఈ వ్యాసాన్ని 13,248 బైట్లకు మూలాలతో సహా విస్తరించాను.
  • @యర్రా రామారావు గారు ఇటువంటి అద్భుతమైన విస్తరించబడిన వ్యాసాలను తొలగిస్తే గమనించి తెలుసుకున్న ఏ ఒకరు తెలుగు వికీపీడియాలో వ్రాయరు, YVSREDDY వనరులు అతి తక్కువగా ఉండే సమయంలోనే అత్యద్భుతంగా వ్రాసిన ఇటువంటి వ్యాసాలను తొలగిస్తున్నారు. మనం వ్రాసే వ్యాసాలను మాత్రం ఎంతకాలం ఉంచుతారు, అని ఏ ఒకరు వ్రాయరు. కావున ఇటువంటి గుడ్డి ఐడియాలు మానుకొని ఈ వ్యాసంలో తొలగింపు మూసను తొలగించగలరు. ఇప్పటికే తెలుగు వికీపీడియా సర్వనాశనం అయ్యింది. YVSREDDY (చర్చ) 06:37, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వైవిఎస్ రెడ్డి గారూ వ్యాసం విస్తరణ చేపట్టి నందుకు ధన్య వాదాలు.ఈ వ్యాసంలో మరియు పదాలు 27 ఉన్నవి.ఒకే వాక్యంలో రెండు, మూడు కూడా ఉన్నవి.మీరు అనుకునే అద్భుతమైన ఈ వ్యాసంలో వాటిని తొలగించి దానికి తగిన విధంగా అవసరంమేరకు కామా పెట్టి సవరించవలసిన అవసరముంది. మరియు పదాల విషయంలో వికీపీడియా:రచ్చబండ#మరియు/లేదా పవన్ సంతోష్ గారూ, చదువరి గారు మీకు వివరించి చెప్పారు.అయినా మీ పంథా మారలేదు. వ్యాసంలో మీకు తోచినది రాసినట్లుగా ఉంది. మూలాలు లేవు.దీని మీద ఇంకా సముదాయ సభ్యులు స్పందించవలసి ఉంది.చర్చలో నిర్ణయానికి లోబడి మూసను తొలగించుతారు. యర్రా రామారావు (చర్చ) 07:34, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం గురించి రెడ్డి గారు అద్భుతం, అత్యద్భుతం అంటేనూ అన్నారు గదా అని ఆసక్తిగా చదివాను.
  • "అధికార పార్టీకి చేరువగా అభ్యర్థులను గెలిపించుకున్న పార్టీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది." చేరువగా అనేది ఇక్కడ పొసగలేదు.
  • "రాజకీయ పార్టీ అనేది ఉమ్మడి రాజకీయ లక్ష్యాలు, సిద్ధాంతాలు మరియు విధానాలను పంచుకునే వ్యక్తుల యొక్క వ్యవస్థీకృత సమూహం, మరియు ఒక దేశం లేదా ప్రాంతం యొక్క రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి మరియు పాల్గొనడానికి కలిసి పని చేస్తారు." వాక్యం ఎలా మొదలైంది, ఎలా ముగిసింది? మధ్యలో ఏం చెప్పింది?
  • "రాజకీయ పార్టీలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలలో కీలక పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే పౌరులు తమను తాము వ్యవస్థీకరించుకోవడానికి మరియు వారి రాజకీయ ప్రాధాన్యతలను వ్యక్తీకరించడానికి ఒక మార్గాన్ని అందిస్తారు." పార్టీలు మార్గాన్ని అందిస్తారా? అందిస్తాయా?
  • "రాజకీయ పార్టీలు తమ సభ్యులు మరియు మద్దతుదారుల ప్రయోజనాలు, విలువలు మరియు ఆందోళనలను సూచిస్తాయి. వారు సమాజంలోని విభిన్న దృక్కోణాలను సమగ్రపరచడానికి మరియు వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తారు." సూచిస్తాయి? సూచించడమేంటి? ఆ రెండో వాక్యం లోని "వారు" ఎవరు? సభ్యులు, మద్దతుదారులా? లేక పార్టీలా? పార్టీలైతే వారు అని రాయడమేంటి?
  • "అధ్యక్షులు, శాసనసభ్యులు, గవర్నర్‌లు, మేయర్‌లు మొదలైన రాజకీయ పదవులకు పోటీ చేసేందుకు పార్టీలు అభ్యర్థులను నామినేట్ చేస్తాయి." గవర్నరు పదవికి పోటీయా?ఏ దేశంలో? అధ్యక్ష పదవికి పోటీయా? దేని అధ్యక్షుడు?
  • "ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, విద్య, విదేశాంగ విధానం మరియు మరిన్నింటి వంటి వివిధ సమస్యలపై తమ స్థానాలను వివరించే నిర్దిష్ట విధాన వేదికలు మరియు ఎజెండాలను పార్టీలు అభివృద్ధి చేస్తాయి మరియు ప్రచారం చేస్తాయి." ఈ మరియు మరిన్నింటి ఏంటి? అభివృద్ధి చేస్తాయి మరియు ప్రచారం చేస్తాయి -ఏం భాష ఇది?
ఇవి మచ్చుకు కొన్ని. మిగతావీ అలాగే ఉన్నాయి. ఒక్క వాక్యం సరిగ్గా ఉందా? అర్థం పర్థం లేని కృతక వాక్యాలే అన్నీ. ఇది అద్భుతమైన, అత్యద్భుతమైన వ్యాసం ఎలాగైంది? నేను రాసే మామూలు సీదా సాదా వ్యాసాల కంటే నాసిగా ఉంది. భాషను సరిచేసి, వ్యాసాన్ని అర్థవంతంగా మార్చాలి. పైగా ఒక్క మూలం కూడా లేదు. మూలం అంటే ఒక లింకును తెచ్చి అడుగున పడెయ్యడం కాదు, ఇన్‌లైన్‌లో చేర్చడం అనే ఒక్క పద్ధతుంది -అలా చేర్చాలి.
ఇందులో భాషను సరిచేసి, మూలాలు చేర్చకపోతే తొలగించాలని నా అభిప్రాయం.__చదువరి (చర్చరచనలు) 13:59, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]


26 మార్చి 2020 న‎ YVSREDDY చే 2037 బైట్లతో విస్తరించే ప్రారంభించబడిన ఈ వ్యాసంలో మరియు, యొక్క అనే పదాలు లేవు. ఈ వ్యాసం తక్కువ సమాచారంతో ఉందని ఇప్పుడు తొలగించమంటున్నారు. నేను వ్రాసినా వేరొకరు వ్రాసినా అది ముఖ్యమైన వ్యాసమనే వ్రాస్తారు. నాకు తెలిసింది నేను 2000 బైట్లకు మించే ఈ వ్యాసంలో వ్రాసాను. 2000 బైట్లకు పైన వ్రాయడిన వ్యాసాలు విస్తరింపబడిన వ్యాసాల కిందే లెక్క. మూలాలు లేవని వ్యాసాలు తొలగించకూడదు. 100 వాక్యాలు వ్రాసి వాటిలో ఒక వరుసలో మూలం ఇస్తే అది మూలాలు ఉన్న వ్యాసం కిందే లెక్క వస్తుంది ఇది సరైన పద్దతేనా. మూలాలు లేవని, కావాలని, చేర్చకపోతే తొలగిస్తామని ఇలాంటి సాధారణ వాక్యాలున్న వ్యాసాలలో కాదు అడగవలసింది. ఎవరికి తెలిసిన సమాచారం వారు చేర్చాలి కాని తక్కువ సమాచారం ఉందని వ్యాసాలు తొలగించకూడదు. నేను కొత్తగా వ్రాసిన సమాచారంలో తప్పులు ఉంటే ఆ కొత్త సమాచారాన్ని తొలగించాలి కాని, ఎప్పుడో వ్రాసిన వ్యాసాన్ని ఎలా తొలగిస్తారు. 2000 బైట్లకు పైబడి వ్రాయబడిన ఈ వ్యాసాన్ని ఎలా తొలగించాలనే ఆలోచన మానుకొని, విస్తరణకు కృషి చేయండి. తొలగింపు మూసను తీసివేయ్యండి. వికీపీడియా చరిత్రను చెడగొట్టకండి. YVSREDDY (చర్చ) 15:46, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]