వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఈ పేజీ సృష్టించి ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది.అప్పటినుండి దీనికి మూలాలు లేవు.ఇలాంటి ముఖ్యమైన వ్యాసాలకు నాలుగైదు వాక్యాలు రాసి చేతులు దులుపుకోవటం ఎంత మాత్రం భావ్యంకాదు.ఎదో లెక్కకు రాసినట్లుగా ఉంది.నాలుగైదు వాక్యాలలో ఉండేదానికన్నా లేకపోవటమే మంచిది. ఎవరో ఒకరు లేదని గమనించి తగిన మూలాలతో రాస్తారు.ఒక 10 రోజులలో తగిన మూలాలతో విస్తరించనియెడల ఈ వ్యాసం తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:43, 15 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుగత 00:37, 26 మార్చి 2020‎ YVSREDDY చర్చ రచనలు‎ చి 2,102 బైట్లు +65‎ వర్గం:రాజకీయ పార్టీలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి) దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 00:35, 26 మార్చి 2020‎ YVSREDDY చర్చ రచనలు‎ 2,037 బైట్లు +2,037‎ ←Created page with 'రాజకీయ పార్టీ అంటే ఒక దేశం యొక్క వ్యవహారాలను నడిపించడాన...'

 • ఈ వ్యాసం 2037 బైట్లతో విస్తరించే ప్రారంభించబడింది.
 • ప్రస్తుగత 06:03, 29 సెప్టెంబరు 2023‎ YVSREDDY చర్చ రచనలు‎ 13,248 బైట్లు +475‎ మూలాలు దిద్దుబాటు రద్దుచెయ్యి

ప్రస్తుగత 05:55, 29 సెప్టెంబరు 2023‎ YVSREDDY చర్చ రచనలు‎ 12,773 బైట్లు +7,673‎ విస్తరణ దిద్దుబాటు రద్దుచెయ్యి

 • నేడు ఈ వ్యాసాన్ని 13,248 బైట్లకు మూలాలతో సహా విస్తరించాను.
 • @యర్రా రామారావు గారు ఇటువంటి అద్భుతమైన విస్తరించబడిన వ్యాసాలను తొలగిస్తే గమనించి తెలుసుకున్న ఏ ఒకరు తెలుగు వికీపీడియాలో వ్రాయరు, YVSREDDY వనరులు అతి తక్కువగా ఉండే సమయంలోనే అత్యద్భుతంగా వ్రాసిన ఇటువంటి వ్యాసాలను తొలగిస్తున్నారు. మనం వ్రాసే వ్యాసాలను మాత్రం ఎంతకాలం ఉంచుతారు, అని ఏ ఒకరు వ్రాయరు. కావున ఇటువంటి గుడ్డి ఐడియాలు మానుకొని ఈ వ్యాసంలో తొలగింపు మూసను తొలగించగలరు. ఇప్పటికే తెలుగు వికీపీడియా సర్వనాశనం అయ్యింది. YVSREDDY (చర్చ) 06:37, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వైవిఎస్ రెడ్డి గారూ వ్యాసం విస్తరణ చేపట్టి నందుకు ధన్య వాదాలు.ఈ వ్యాసంలో మరియు పదాలు 27 ఉన్నవి.ఒకే వాక్యంలో రెండు, మూడు కూడా ఉన్నవి.మీరు అనుకునే అద్భుతమైన ఈ వ్యాసంలో వాటిని తొలగించి దానికి తగిన విధంగా అవసరంమేరకు కామా పెట్టి సవరించవలసిన అవసరముంది. మరియు పదాల విషయంలో వికీపీడియా:రచ్చబండ#మరియు/లేదా పవన్ సంతోష్ గారూ, చదువరి గారు మీకు వివరించి చెప్పారు.అయినా మీ పంథా మారలేదు. వ్యాసంలో మీకు తోచినది రాసినట్లుగా ఉంది. మూలాలు లేవు.దీని మీద ఇంకా సముదాయ సభ్యులు స్పందించవలసి ఉంది.చర్చలో నిర్ణయానికి లోబడి మూసను తొలగించుతారు. యర్రా రామారావు (చర్చ) 07:34, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం గురించి రెడ్డి గారు అద్భుతం, అత్యద్భుతం అంటేనూ అన్నారు గదా అని ఆసక్తిగా చదివాను.
 • "అధికార పార్టీకి చేరువగా అభ్యర్థులను గెలిపించుకున్న పార్టీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది." చేరువగా అనేది ఇక్కడ పొసగలేదు.
 • "రాజకీయ పార్టీ అనేది ఉమ్మడి రాజకీయ లక్ష్యాలు, సిద్ధాంతాలు మరియు విధానాలను పంచుకునే వ్యక్తుల యొక్క వ్యవస్థీకృత సమూహం, మరియు ఒక దేశం లేదా ప్రాంతం యొక్క రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి మరియు పాల్గొనడానికి కలిసి పని చేస్తారు." వాక్యం ఎలా మొదలైంది, ఎలా ముగిసింది? మధ్యలో ఏం చెప్పింది?
 • "రాజకీయ పార్టీలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలలో కీలక పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే పౌరులు తమను తాము వ్యవస్థీకరించుకోవడానికి మరియు వారి రాజకీయ ప్రాధాన్యతలను వ్యక్తీకరించడానికి ఒక మార్గాన్ని అందిస్తారు." పార్టీలు మార్గాన్ని అందిస్తారా? అందిస్తాయా?
 • "రాజకీయ పార్టీలు తమ సభ్యులు మరియు మద్దతుదారుల ప్రయోజనాలు, విలువలు మరియు ఆందోళనలను సూచిస్తాయి. వారు సమాజంలోని విభిన్న దృక్కోణాలను సమగ్రపరచడానికి మరియు వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తారు." సూచిస్తాయి? సూచించడమేంటి? ఆ రెండో వాక్యం లోని "వారు" ఎవరు? సభ్యులు, మద్దతుదారులా? లేక పార్టీలా? పార్టీలైతే వారు అని రాయడమేంటి?
 • "అధ్యక్షులు, శాసనసభ్యులు, గవర్నర్‌లు, మేయర్‌లు మొదలైన రాజకీయ పదవులకు పోటీ చేసేందుకు పార్టీలు అభ్యర్థులను నామినేట్ చేస్తాయి." గవర్నరు పదవికి పోటీయా?ఏ దేశంలో? అధ్యక్ష పదవికి పోటీయా? దేని అధ్యక్షుడు?
 • "ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, విద్య, విదేశాంగ విధానం మరియు మరిన్నింటి వంటి వివిధ సమస్యలపై తమ స్థానాలను వివరించే నిర్దిష్ట విధాన వేదికలు మరియు ఎజెండాలను పార్టీలు అభివృద్ధి చేస్తాయి మరియు ప్రచారం చేస్తాయి." ఈ మరియు మరిన్నింటి ఏంటి? అభివృద్ధి చేస్తాయి మరియు ప్రచారం చేస్తాయి -ఏం భాష ఇది?
ఇవి మచ్చుకు కొన్ని. మిగతావీ అలాగే ఉన్నాయి. ఒక్క వాక్యం సరిగ్గా ఉందా? అర్థం పర్థం లేని కృతక వాక్యాలే అన్నీ. ఇది అద్భుతమైన, అత్యద్భుతమైన వ్యాసం ఎలాగైంది? నేను రాసే మామూలు సీదా సాదా వ్యాసాల కంటే నాసిగా ఉంది. భాషను సరిచేసి, వ్యాసాన్ని అర్థవంతంగా మార్చాలి. పైగా ఒక్క మూలం కూడా లేదు. మూలం అంటే ఒక లింకును తెచ్చి అడుగున పడెయ్యడం కాదు, ఇన్‌లైన్‌లో చేర్చడం అనే ఒక్క పద్ధతుంది -అలా చేర్చాలి.
ఇందులో భాషను సరిచేసి, మూలాలు చేర్చకపోతే తొలగించాలని నా అభిప్రాయం.__చదువరి (చర్చరచనలు) 13:59, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం గూగుల్ అనువాద పరికరంతో అనేక దోషాలతో అనువాదం చేసి, అందులోని వాక్యాలలోని దోషాలను సరిచేయకుండా యదాతథంగా కాపీ పేస్టు చేసారు. అందువల్ల అనేక యాత్రిక అనువాద దోషాలు కనిపిస్తున్నాయి. మూలాలు లేవు. ఒక వారం రోజులలో తగిన మూలాలతో విస్తరించి, శుద్ధి, వికీకరణ చేయనిచో ఈ వ్యాసాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 14:29, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@K.Venkataramana గారు చెప్పినదానికి తోడు మరొక్క సంగతి. @YVSREDDY గారికి మొదటి హెచ్చరిక జారీ చేస్తున్నాను. రామారావు గారి ఆలోచనలను గురించి మాట్లాడేప్పుడు "గుడ్డి ఐడియాలు" వంటి కటువైన పదజాలం వాడటం సాటివారిని గౌరవించమని చెప్పే మూలస్తంభానికి పూర్తిగా విరుద్ధం. అందువల్ల, ఇలాంటి భాష కొనసాగిస్తే ఆయనపై చర్యలు తప్పవు. పవన్ సంతోష్ (చర్చ) 10:42, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@K.Venkataramana గారూ, మీరు చెప్పి వారం రోజులు అయింది. ఆయన మూలాలతో విస్తరించడం మానివేసి మీపైన, ఇతర నిర్వాహకులపైనా మాటల దాడులకు, బెదిరింపులకు పాల్పడి నిరోధానికి గురయ్యారు. కాబట్టి, మీరు మీ నిర్ణయం ప్రకారం వ్యాసంపై చర్చ తీసుకోవచ్చనుకుంటున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 14:57, 7 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

26 మార్చి 2020‎న 2,102 బైట్లతో YVSREDDY ఈ వ్యాసంలో వ్రాసిన సమాచారం

[మార్చు]

రాజకీయ పార్టీ అంటే ఒక దేశం యొక్క వ్యవహారాలను నడిపించడానికి ఎన్నికల ద్వారా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే వ్యక్తుల లేదా సంస్థల వ్యవస్థీకృత సమూహం. ఇది తరచుగా ప్రభుత్వ కార్యాలయములకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ఎన్నికలలో పదవికి పోటీ చేస్తారు, ఎన్నికలలో గెలిచిన్న అభ్యర్థులు ప్రజాప్రతినిధులు అవుతారు. మెజారిటీ అభ్యుర్థులను గెలిపించుకున్న పార్టీ అధికార పార్టీగా అధికారాన్ని చేపట్టి నిర్ణీత గడువు వరకు పరిపాలన కొనసాగిస్తుంది. మళ్ళీ మళ్ళీ నిర్ణీత కాలాన్ని ఎన్నికలు జరుగుతుంటాయి, మళ్ళీ ఏ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అధికార పార్టీగా అధికారాన్ని చేపట్టి నిర్ణీత గడువు వరకు పరిపాలన కొనసాగిస్తుంది. అధికార పార్టీకి చేరువగా అభ్యర్థులను గెలిపించుకున్న పార్టీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది.

తెలుగు వికీపీడియాలో నేను చేరిన సమయంలో ఒక వాక్యం వ్రాస్తే అది గొప్పగా భావించేవారు. నేను వ్రాసిన వ్యాసాలలో కనీసం 6 లైన్లు ఉండాలని నాకు నేనుగా అనుకున్నాను. నేను సృష్టించిన ప్రతి వ్యాసంలో కనీసం 2000 బైట్లు ఉండేలా చేస్తున్నాను. కానీ ఈ వ్యాసం ప్రారంభమే 2000 బైట్లకి మించి ప్రారంభించబడింది. ఈ వ్యాసంలో తక్కువ సమాచరం ఉంది అని ఇప్పుడు తొలగింపు మూస పెట్టారు. ఈ విధానం వలన ఈ వ్యాసం యొక్క చరిత్ర పూర్తిగా చెడిపోతుంది. ఇలాంటి విధానాల వలన ఇప్పటికే తెలుగు వికీపీడియా సర్వనాశనం అయ్యింది. నేను సృష్టించిన ప్రతి వ్యాసం ఎవరు తొలగించినా దుర్మార్గమే తప్ప మరొకటి కాదు. నేను నిర్వాహకుడిగా, అధికారిగా అవ్వాలనే లక్ష్యంతో నేను తెలుగు వికీపీడియాలో చేరలేదు. తెలుగు వికీపీడియాలో నేను చేసిన కృషికి అతిసులభంగా నిర్వాహకుడిని అయ్యేవాడిని. నేను అనుకుంటే కేవలం మా ఊరి వారి సహకారంతోనే నేను నిర్వాహకుడిని కాగలను. నా తొలగించిన ప్రతి వ్యాసాన్ని పునఃసృష్టిచేయగలను. నేను అజ్ఞాతంగా వ్యాసాలు వ్రాస్తున్నాను, కాబట్టే నేను సృష్టించిన వ్యాసాలను దుర్మార్గంగా తొలగిస్తున్నారు. నేను సృష్టించిన వ్యాసాలను తొలగిస్తే నిర్వాహకులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ప్రతి తెలుగు వికీపీడియా నిర్వాహకుడి ఊరిలో కరపత్రములను పంచుతాను. నేను అజ్ఞాతంగా వ్యాసాలు వ్రాయబట్టే 2016 సంవత్సరంలో రోజుకో విజ్ఞాన వ్యాసం వ్రాసి ప్రపంచ రికార్డు సాధించినా ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పటికైనా తొలగించిన నా వ్యాసాలను పునఃప్రారంభించండి. నేను వ్రాసిన వ్యాసాలను తొలగిస్తే ఆ స్థానంలో ఏలాంటి వ్యాసాలు వచ్చాయో పరిశీలించండి. ఉదాహరణకు చర్చ:నిజాయితీ చూడండి. YVSREDDY (చర్చ) 13:04, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@YVSREDDY గారూ, మీరు " తెలుగు వికీపీడియాలో చేరిన సమయంలో ఒక వాక్యం వ్రాస్తే అది గొప్పగా భావించేవారు". ఎందుకంటే మీరు అప్పుడు కొత్తవారు. వికీపీడియా కూడా బాల్యావస్థలో ఉండేది. ఇప్పుడు అలా కాదు. మీరు బైట్ల గురించి, వాక్యాల గురించి చెప్పింది చక్కగా ఉంది. అయితే, మీరు చేస్తున్నది యాంత్రిక ధోరణిలోని అనువాదం. పోనీ, మీరేమీ దాన్ని సహజంగా ఉండేలా దిద్దుతున్నట్టు కూడా లేదు. సదుద్దేశంతో మీకు కొన్ని సలహాలు ఇస్తాను పాటించి చూడండి. వ్యాసాల్లోని భాష చాలా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను.
 1. పదాలకు తప్పు అనువాదాలు చాలానే చేస్తున్నారు. ఉదాహరణకు - న్యాయవాదం అని వాడారు ఈ వ్యాసంలో. Advocacy అన్న పదాన్ని ఇలా వాడారు. అయితే, రాజకీయ పార్టీలు చేసే Advocacy వేరు, న్యాయవాదం అంటే వచ్చే అర్థం వేరు. ఇక్కడ పాలసీలకు మద్దతునివ్వడాన్ని Advocacy అంటారు. మరి మీరు న్యాయవాదం అని రాసేస్తే ఎవరు వెనకాల దిద్దుకుంటూ వస్తారు? మీరు తెలియనప్పుడు శుభ్రంగా "అడ్వొకసీ" అని తెలుగు అక్షరాల్లో రాయడమో, చర్చాపేజీలో ఈ పదాన్ని తెలుగులో ఏమంటారు అని అడగడమో చెయ్యాలి. ఇకనైనా అలా చెయ్యండి మరి.
 2. అత్యంత అవసరమైతే తప్ప 'యొక్క' అన్న పదాన్ని వాడొద్దు. ఉదాహరణకు " దేశం యొక్క వ్యవహారాలను" అనడానికి బదులు "దేశ వ్యవహారాలను" అని మార్చాలి. "ఉమ్మడి రాజకీయ లక్ష్యాలు, సిద్ధాంతాలు మరియు విధానాలను పంచుకునే వ్యక్తుల యొక్క వ్యవస్థీకృత సమూహం" అన్న పదబంధం ఎంత సంక్లిష్టంగా, సమస్యాత్మకంగా ఉందో చూడండి. మీరు మాట్లాడేప్పుడు అలా మాట్లాడారా? అలా మాట్లాడితే ఎవరికైనా అర్థం అవుతుందా? లేదు కదా. "ఒక తరహా రాజకీయ లక్ష్యాలు, సిద్ధాంతాలు, విధానాలు ఉండే వ్యక్తులు వ్యవస్థీకృతమైన సముదాయంగా ఏర్పడితే దాన్ని రాజకీయ పార్టీ అంటారు." అని రాస్తే బాగోదా? ఇలా రాయడానికి చేసే పని చాలా తేలిక, 'మరియు', 'యొక్క' తీసేసి, ఎలా మన మిత్రులకు చెప్తామో ఆలోచించండి. చక్కగా రాస్తారు.
 3. "మరియు" వాడకం కూడా విచ్చలవిడిగా ఉంది. ఏ ప్రసంగంలో మనం మరియు వాడతామో చెప్పండి? పంటికింద రాయిలా తగులుతుంది ఈ మరియు. దీన్ని తీసేసి కామా పెడితే సరిపోతుంది.
 4. మూలాలు: ఒక్క మూలం కూడా ఇవ్వకుండా మీరు వ్యాసం రాసేస్తున్నారు. అది కూడా రాజకీయ పార్టీ వంటి అత్యంత ప్రచారంలో ఉన్న అంశం మీద. దీనిమీద మూలాలే దొరకవా మీకు? దొరికినా ఇవ్వరా? ఏమిటి సమస్య? ఇంత ప్రాచుర్యం చెందిన అంశం మీద వ్యాసంలోనే మీరు మూలాలు ఇవ్వకపోతే నిర్వాహకులు తీసేస్తున్నారంటే తియ్యరా? మీరే ఆలోచించి చూడండి.
ఒక్క వ్యాసం చదివితేనే ఇన్ని కనిపిస్తున్నాయి. మరి, మీరే ఆలోచించుకోవాలి. మీరు నేర్చుకోదలిస్తే సాయం చేయడానికి నేనూ, ఇంకొందరు వికీమీడియన్లు ఎప్పుడూ సిద్ధమే. మీరే, నిర్ణయించుకోండి - నేర్చుకుంటారా మరి? మార్చుకుంటారా శైలి? పవన్ సంతోష్ (చర్చ) 11:04, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
26 మార్చి 2020 న‎ YVSREDDY చే 2037 బైట్లతో విస్తరించే ప్రారంభించబడిన ఈ వ్యాసంలో మరియు, యొక్క అనే పదాలు లేవు. ఈ వ్యాసం తక్కువ సమాచారంతో ఉందని ఇప్పుడు తొలగించమంటున్నారు. నేను వ్రాసినా వేరొకరు వ్రాసినా అది ముఖ్యమైన వ్యాసమనే వ్రాస్తారు. నాకు తెలిసింది నేను 2000 బైట్లకు మించే ఈ వ్యాసంలో వ్రాసాను. 2000 బైట్లకు పైన వ్రాయడిన వ్యాసాలు విస్తరింపబడిన వ్యాసాల కిందే లెక్క. మూలాలు లేవని వ్యాసాలు తొలగించకూడదు. 100 వాక్యాలు వ్రాసి వాటిలో ఒక వరుసలో మూలం ఇస్తే అది మూలాలు ఉన్న వ్యాసం కిందే లెక్క వస్తుంది ఇది సరైన పద్దతేనా. మూలాలు లేవని, కావాలని, చేర్చకపోతే తొలగిస్తామని ఇలాంటి సాధారణ వాక్యాలున్న వ్యాసాలలో కాదు అడగవలసింది. ఎవరికి తెలిసిన సమాచారం వారు చేర్చాలి కాని తక్కువ సమాచారం ఉందని వ్యాసాలు తొలగించకూడదు. నేను కొత్తగా వ్రాసిన సమాచారంలో తప్పులు ఉంటే ఆ కొత్త సమాచారాన్ని తొలగించాలి కాని, ఎప్పుడో వ్రాసిన వ్యాసాన్ని ఎలా తొలగిస్తారు. @పవన్ సంతోష్ గారు మీరు ముందు వ్యాసాలను తొలగించాలనే ఆలోచనను మానుకోండి. విస్తరించబడిన మంచి మంచి వ్యాసాలను ఎలా తొలగించాలో ఎవరికి నేర్పించకండి. వ్యాసాలను విస్తరించే వ్రాసిన వారి శైలిని, పంథాను మార్చకండి. ఈ వ్యాసాన్ని ఎలా తొలగించాలనే ఆలోచన మానుకొని, విస్తరణకు కృషి చేయండి. YVSREDDY (చర్చ) 15:00, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@YVSREDDY గారూ, మీరు ఏమైనా అర్థం చేసుకుంటారేమోనని రాశానండీ. ఆ ఉద్దేశ్యం మీకు లేదేమోనని మీరు రాసిన వ్యాఖ్య చూశాకా అర్థమైంది. ఫర్లేదు లెండి. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 15:03, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ,YVSREDDY గారికి ఈ వ్యాసాన్ని శుద్ధి చేయడానికి, సరైన మూలాలను చేర్చి వ్యాస నాణ్యతను పెంచడానికి 10 రోజులు గడువు ఇచ్చారు. 20 రోజులు గడిచినా వ్యాసంలో ఎటువంటి మార్పులు చేయకపోగా, అనుభవజ్ఞులైన సభ్యులు సలహాలిచ్చినా పాటించకుండా కాలయాపన చేస్తూ ఉండటం సరియైన విధానం కాదు. సరైన సలహాలు ఇస్తే నిర్వాహకులను దూషణలు చేయడం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నిర్వాహకులను బెదిరించడం కూడా జరిగినది. దీనిపై చర్చ వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు#రచ్చబండలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరింపు లో జరిగింది. ఈ వ్యాసం తొలగింపుపై ఈ చర్చలో పాల్గొనని నిర్వాహకులు నిర్ణయం తీసుకోవలసినదిగా కోరడమైనది.➤ కె.వెంకటరమణచర్చ 15:43, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@కె.వెంకటరమణ గారు మీరు ఎంతో అమాయకులుగా నటిస్తూ మీ తెలివితేటలతో తప్పును తప్పు అని చెప్పగల నిర్వాహకులను ఇతర నిర్వాహకులను వాడుకొని వెల్లగొట్టిస్తున్నారు. మంచి మంచి వ్యాసాలను తొలగించేస్తున్నారు. ఒక వ్యాసం విషయంలో మీరు చేస్తున్నది తప్పు అని చెప్పిన ఇద్దరు మంచి నిర్వాహకులను నిరోధానికి గురయ్యేలా చేశారు. మీరు మూడు ఖాతాలతో ముగ్గురిగా మంచి మంచి వ్యాసాలను తొలగించడానికి ప్రయత్నించారు. ఇప్పటికైనా మీ నటన ఆపి మీ శ్రద్ధను వ్యాసల తొలగింపుపై నుంచి వ్యాసాల విస్తరణ వైపుకు పెట్టండి. లేదంటే మీ మోసాలుపై ఒక పుస్తకాన్ని ప్రచురించి ఆ పుస్తకాలను మీరు పనిచేస్తున్న పాఠశాలలోనే పంచుతాను. YVSREDDY (చర్చ) 16:21, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDY గారూ, మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను మోసాలు చేస్తున్నట్లు వాటిని పుస్తకాలుగా పంచుతానని బెదిరిస్తున్నారు. ఇద్దరు నిర్వాహకులను నిరోధానికి గురయ్యేలా చేసాననడానికి ఆధారాలు చూపండి. నిరాధారమైన ఆరోపణలు చేయకండి. మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో మీరు రాసిన అనేక మొలకలను అందరం కలసి విస్తరించామని మీకు తెలియదా? మీరు మీరు రాసిన మొలక వ్యాసాలలో ఏవైనా అభివృద్ధి చేసారా? వ్యాసాల తొలగింపు ప్రక్రియలో ఒక వ్యాసంపై తొలగింపు చర్చ ప్రారంభమైతే మీకు కూడా సమాచారం వస్తుంది కదా. ఆ వ్యాసంలో లోటుపాట్లను సరిదిద్దకుండా అలానే వదిలేసి, చర్చ జరిగిన తరువాత ఆ వ్యాసాన్ని తొలగించిన తరువాత మరలా ఆ వ్యాసాలను అదే సమాచారంతో మీరు మరలా సృష్టించడం లేదా? ఇక్కడ వ్యాసాలను తొలగించడం ఒక విధానం ప్రకారం జరుగుతుందని గమనించాలి. ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. ఇద్దరు నిర్వాహకుల నిరోధానికి నాకూ ఏమి సంబంధం? ఆ నిరోధాలు కూడా చర్చలు జరిగి ఒక సమిష్టి నిర్ణయం ప్రకారం జరిగాయని మీరు గమనించాలి.➤ కె.వెంకటరమణచర్చ 17:00, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@YVSREDDY గారూ, మీ చర్చాపేజీని గమనిస్తే ఇప్పటికే మీరు నాలుగైదు సార్లు తోటి వాడుకరుల మీద నిరాధారమైన ఆరోపణలు చేశారనీ, ఆ కారణంగా మీపై నాలుగు నిరోధాలు జరిగాయని @Chaduvari గారు ఆధారాలతో రాసినదాన్ని బట్టి తెలుస్తోంది. ఆఖరుగా మీపై ఒకరోజు నిరోధాన్ని ఆయన ఆకారణంగానే విధించార.ు (అది ఆ లెక్కల్లో నాలుగోది) ఆ నిరోధాల తర్వాతైనా మీరు మీ వ్యవహార శైలి మార్చుకున్నట్టు నాకేమీ కనిపించడం లేదు. దీనికితోడు ఈ పేజీలోనే ఒకచోట నేను మిమ్మల్ని మర్యాదకరమైన పదజాలం వాడనందుకు హెచ్చరించాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు చేసిన ఆరోపణలకు రెండు రోజుల్లోపల ఆధారాలు ఇవ్వడం కానీ, ఆధారాలు లేకుంటే ఆ సంగతి ఒప్పుకుని మన్నించమని కె.వెంకటరమణ గారిని కోరడం కానీ చెయ్యకపోతే మీపైన గత, ప్రస్తుత ప్రవర్తన ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పవన్ సంతోష్ (చర్చ) 09:47, 7 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మధ్య @YVSREDDY గారికి ఇలా నిందించడం అలవాటై పోయింది, ఒక ఆటైపోయింది. ఒక రోజో ఒక వారమో నిరోధం పొందడం, అదవగానే కొన్నాళ్ళకు మళ్ళీ నిందలు మొదలుపెట్టడం. వాళ్ళని పంపించేసారని, వీళ్ళని నిరోధించారనీ నిర్వాహకులను నిందించడం పరిపాటై పోయింది. ఇప్పుడు "నటించడం", "మోసాలు" చేస్తున్నారనడం, పనిచేసేచోట పుస్తకాలు పంచుతాననడం చాలా చాలా తీవ్రమైన నిందలు, ఆరోపణలు, వేధింపులు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం అనుచితం, అమర్యాదకరం, తీవ్రమైన వేధింపు. బాధ్యతగా, నిర్మోహంగా, నిర్మొహమాటంగా పనిచేస్తున్న ఒక నిర్వాహకుణ్ణి ఇలా నిందించడం ఘోరం, అన్యాయం.
ఇప్పటికి ఇలాంటి తప్పులకు గాను రెడ్డిగారిని 8 సార్లు నిరోధించారు. అయినా ఆయన ధోరణి మారలేదు. తన పద్ధతి మార్చుకోలేదు. ఇప్పటికి నేను ఆయనతో ఒక డజను సార్లకు పైగా నేను చర్చల్లో పాల్గొని ఉంటాను. ఆయన చర్చలో పాల్గొన్నవారిని నిందించడం అలవాటు. సాధారణంగా ఆయనతో చేసే చర్చ సామరస్యంగా ముగియదు అనేది నా అనుభవం. తాను చేస్తున్న తప్పులను ఏనాడు ఈయన గ్రహించగా నేను చూళ్ళేదు. నాది పొరపాటే అని ఆయన ఒప్పుకోవడం జరగలేదు. తన పద్ధతిని మార్చుకునేందుకు తెవికీ నిర్వాహకులు ఆయనకు కల్పించిన అనేకానేక అవకాశాలను ఆయన సదుపయోగం చేసుకోలేక పోయారు. నాకు చాలా నిరాశ కలిగిస్తోంది ఆయన ధోరణి. ఇక ఈయన మారుతారనే ఆశ నాకు పోయింది.
ఈయన్ని తక్షణమే దీర్ఘకాలం పాటు (కనీసం ఆరు నెలలు ఉండేలా) నిరోధించాలని నా అభిప్రాయం. తద్వారా బాధ్యతగా పనిచేస్తున్న నిర్వాహకులకు ప్రశాంతత కలుగుతుంది. తెవికీకి ఏమాత్రం పనికిరాని, అనవసరమైన నిర్వహణ పని తగ్గిపోతుంది. వాళ్ళు మరిన్ని మంచి పనులపైన దృష్టి పెట్టొచ్చు. సముదాయంలో కూడా ఉద్రిక్తత తగ్గి, వాతావరణం తేలికపడుతుంది. కాబట్టి బాధ్యత గల నిర్వాహకులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 13:38, 7 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాలో నిర్వాహకులు చేస్తున్నంత చెడ్డ పనులు ప్రపంచంలో మరెక్కడా ఎప్పుడూ ఎవరు చూసి వుండరు, చూడబోరు. వాస్తవాలను నిందలు అంటారు. మంచి మంచి వ్యాసాలను తొలగిస్తారు. సరే నేను వ్రాసిన ఎటువంటి వ్యాసాలను మీరు తొలగిస్తున్నారో నేను వ్రాసిన సమాచారంతో సహా వ్రాసుకొని మీ చర్చా పేజీలో ఉంచుకుంటారా. మీరు మీ చర్చా పేజీలో నా తొలగింపు వ్యాసాల సమాచారంతో సహా ఉంచుకోండి. లేదంటే ప్రతి నిర్వాహకుడి పేజీలోను, ప్రతి వాడుకరి పేజీలోను నేను వ్రాసిన, మీరు అన్యాయంగా తొలగించిన వ్యాసాల సమాచారం నేను చేరుస్తాను. ఎవరైతే నన్ను అన్యాయంగా నిరోధిస్తారో వారి ఇంటికే స్వయంగా వెళ్ళి అక్కడే తేల్చుకుంటాను. YVSREDDY (చర్చ) 14:03, 7 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@YVSREDDY గారూ, మీకు రెండు రోజుల సమయం కూడా అక్కరలేదని తేలిపోయింది. మిమ్మల్ని తక్షణమే ఆరునెలల పాటు నిరోధిస్తున్నాను. వివరాలు మీ చర్చాపేజీలో రాస్తున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 14:33, 7 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]