వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలపై చర్చకు ఉద్దేశించినది ఈ నోటీసు బోర్డు. ముఖ్యంగా ఇది నిర్వాహకులకు ఉద్దేశించినదే ఐనా, సభ్యులందరూ ఇక్కడ చర్చలో పాల్గొనేందుకు ఆహ్వానితులే!

ముఖ్యమైన అంశాలు[మార్చు]

నిర్వాహకులు చేయవలసినవి.
గమనిస్తూవుండవలసిన (వీక్షణాజాబితాలో చేర్చుకోవటంద్వారా) లింకులు

సీరియస్‌నెస్ లోపించిన దిద్దుబాట్లు[మార్చు]

Nrgullapalli గారు ఈ మధ్య చేస్తున్న దిద్దుబాట్లు చూస్తే, ఆయన సీరియస్‌గా పనిచేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. మచ్చుకు గుడివాకలంక అనే పేజీలో వారు చేసిన దిద్దుబాట్లు..

  1. [1]
  2. [2]
  3. [3]
  4. [4]
  5. [5]
  6. [6]
  7. [7]
  8. [8]


ఎనిమిది దిద్దుబాట్లు - ఒక్కోదానిలో ఒక్కో కొత్త లైనును చేర్చారు, అంతే. అంటే ఎడిట్ ట్యాబును నొక్కి పేజీని ఎడిట్ మోడులో తెరవడం, ఎంటరు కీని ఒకసారి నొక్కడం, సేవు చెయ్యడం. మళ్ళీ వెంటనే ఎడిట్ ట్యాబును నొక్కడం, ఎంటరు కీని నొక్కడం, సేవు చెయ్యడం, మళ్ళీ వెంటనే ఎడిట్ ట్యాబును.. ఇలా వరసగా, మూణ్ణిముషాల్లో ఏడెనిమిది దిద్దుబాట్లు! ఏదో ఒక పేజీ విషయంలో కాదు, చాల ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటివి.

ఇలాంటి దిద్దుబాట్ల వలన వికీకి ప్రయోజనమేమైనా ఉందా అనే సంగతిని పక్కన ఉంచి, వికీకి నష్టమేమైనా ఉందా అని ఆలోచిస్తే, ఉందనే అనిపించింది. ఇతరులు కూడా ఈ దిద్దుబాట్ల ఆటలో పాల్గొనే అవకాశం ఉంది. ఒకరిద్దరు ఈ ఆట అంచుల్లో ఉన్నారేమో అనే సందేహం కలిగింది. (ప్రస్తుతానికి సందేహం మాత్రమే!) కొత్తగా చేరేవారు ఓహో ఇదన్నమాట ఇక్కడి అసలు బాగోతం అని తెవికీ పట్ల తేలిక భావం ఏర్పరచుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి దిద్దుబాట్లను ఆపించాలని నా ఉద్దేశం. ఏంచెయ్యాలో తోటి నిర్వాహకులు స్పందించాలని మనవి. __చదువరి (చర్చరచనలు) 02:56, 25 ఫిబ్రవరి 2019 (UTC)

చదువరి గారు, ఎంతో కాలంగా ఇటువంటి మార్పులు కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. కానీ ఇంతకాలం నిర్వాహక అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది వాడుకరుల తప్పు కాదని నా అభిప్రాయం. ఇటువంటి మార్పులు చేస్తున్నప్పుడు, వెంటనే పెద్దలు ఎందుకు స్పందించ లేదో అర్థం కాదు అని నేను అనను, నన్ను తప్పు పట్టి నాతో చెత్త చర్చ చేస్తారు. అప్పటికీ ఈ మధ్యన నేను కూడా ఇదే పద్ధతిలో మార్పులు చేశాను. కనీసం నేనంటే స్పందిస్తారు అని అనుకున్నాను, కానీ స్పందనలు లేవు. ఇప్పటికైనా మీరు ఒక పోస్ట్ పెట్టారు, ఇప్పుడు ఏం చేయాలో పాలసీలు రూపొందిస్తారని ఆశిస్తాను. మీ అభిప్రాయంతో చాలావరకు ఏకీభవిస్తాను. ఒకసారి అందరూ ఆలోచించి వాడుకరులకు సరి అయిన దిశా నిర్దేశనం చేయండి. JVRKPRASAD (చర్చ) 03:05, 25 ఫిబ్రవరి 2019 (UTC)
నేను కూడా ఆ సభ్యుడి దిద్దుబాట్లను గమనించాను. కాని చర్చతీసి ప్రక్రియ ప్రారంభించిననూ పవన్ లాంటి వారు అడ్డగిస్తారని నాకు తెలుసు. కాబట్టి చూస్తూ ఊరుకోవడమే తప్ప చేసేదేమీలేదు. రెండేళ్ళ క్రితపు అనుభవం దృష్ట్యా నిర్వాహణ కార్యక్రమాలు నా నుంచి పూర్తిగా ఆగిపోయాయి. ఇలాంటి దిద్దుబాట్లను ఆపడానికి తప్పకుండా ప్రయత్నించాలి. లేదంటే హెచ్చరిక జారీచేసి ఖాతరు చేయనప్పుడు సదరు సభ్యుడిపై నిరోధం విధించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 05:03, 25 ఫిబ్రవరి 2019 (UTC)
ఇది ఖచ్చితంగా సదరు సభ్యుల బాధ్యతారాహిత్యమే. ఆయనను ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించి ఉన్నాము. అయినా ఆయన పద్ధతి మార్చుకోవడం లేదు. ఆయన ఇంక మారుతారని నేను ఆశించడం లేదు. శాశ్వత నిరోధం విధించడం మేలని నేను భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:28, 25 ఫిబ్రవరి 2019 (UTC)
ఈ విషయం ఆయన చర్చా పేజీలో రాశాను. ఒక రోజు సమయమిచ్చి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 06:54, 25 ఫిబ్రవరి 2019 (UTC)
దీనిని బట్టి నిర్వాహకులకన్నా వాడుకరులకు ఎక్కువ పవర్ ఉన్నట్లు అర్దమవుతుంది.నిజమైన వాడకరులకు చిత్తశుద్ది అనేది ఉంటే గణాంకాలు కోసం చెయ్యరు.ఏదేని ఒక వ్యాసం ఎడిట్ చేయాలని భావించినప్పుడు ఆ వ్యాసంలో తను గమనించిన సవరణలు అన్నీ ఒకటి, లేక రెండు ఎడిట్లులో చేస్తారు. అదే కొత్త వ్యాసం సృష్టించి,అభివృద్ధి చేసేటప్పుడు మరికొన్ని ఎక్కువ ఎడిట్లు చేయవలసిరావచ్చు.ఏదిఏమైనా ఇలా చేసే ఏ వాడుకరులైనా కేవలం గణాంకాల కోసమే అని అర్థమవుతుంది.పోనీ దీని ద్వారా నేను ఒక్కటి అడుగుతాను.దాని వలన వాడకరికి ఏదేని అదనపు ప్రయోజనం ఉందా?ఉద్యోగులకు మిగిలిన సెలవులు అమ్మకోవటానికి అవకాశం ఉన్నట్లు, వికీపీడియా వ్యవస్థాపకులు గణాంకాలను ఏమైనా కొనటానికి అవకాశం ఉందా?ఆలోచించగలరు. ప్రతి దానికి నియమాలు తయారు చేసుకోలేం.నియమాలు ఉన్నా మనం ఆచరిస్తేనే వాటి ఉపయోగం.ఇలాంటి పనులు ఏ వాడకరి చేసినా భాద్యతారాహిత్యమే. ముందుగా కొంత సమయమిచ్చి, మార్చుకొనలేక పోతే శ్వాశ్వత నిరోధం విధించడమే దీనికి పరిష్కార మార్గం అని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:04, 25 ఫిబ్రవరి 2019 (UTC)
యర్రా రామారావు గారు, వాడుకరులకు పవర్ ఎక్కువై కాదు, నిర్వాహకులకు శ్రద్ధ లేదని అనుకోకూడదా ? సవరణలు చేయడానికి కొలమానం అంటూ ఏముంటుంది ? గణాంకాలు వలన ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. అస్సలు ఇక్కడ చేసిన పనికి ఒక్క పైసా ఎవ్వరూ ఇవ్వరు, రాదు. కేవలం ఆయాసం మాత్రమే మిగులుతుంది. ఏ కిరీటాలు తొడగరు. మరీ మాట్లాడితే సీనియర్లను ఏదో మిషతో మాట్లాడనీయకుండా, ఏ పని చేయనివ్వకుండా ఒక మూలన కూర్చో బెడతారు, వీలయితే తొలగిస్తారు. భాద్యతారాహిత్య ఎడిట్లు అనే ఒక పదంతో వాడుకరులను ఎలా అనగలం ? అందరి ఆరోగ్యం ఒకలా ఉండదు. అందరికీ అవకాశాలు ఒకలా ఉండవు. శ్వాశ్వత నిరోధం విధించడమనడం మాట అనడం చాలా తేలికగానే ఉంటుంది. తెవికీలో ఎవరైనా ఒక అక్షరం అయినా మార్చితే చాలు అని నినాదం ఇస్తున్నారు కదా ! అందుకే అక్షరానికి ఒక ఎడిట్ చేస్తున్నారేమో ? ఇక్కడ సీనియర్ లేదా జూనియర్ లేదా కొత్త వాడుకరి అనేది లేదు, ఎవ్వరైనా ఒకటే కదా ! ఎవరు ఎవరినయినా ఏమయినా ఎంతటివారినయినా ఎవరికిష్టం వచ్చినట్లు ఒక సమూహంలో సభ్యుడుగా ఉంటే (ఒంటరి వాళ్ళకు కుదరదు), ఏదైనా అనొచ్చు, చేయవచ్చు అనేది కొససాగుతోంది కదా ! ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది ఉచిత సేవా సంస్థ అనేది కూడా మనసులో పెట్టుకోవాలి. ఎడిట్లు అనేవి వికీకి ద్రోహం కాదు, నేరం కాదు. అతి ఎక్కువ ఎడిట్లు ఒక చిన్న విషయానికి ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం నిర్వాహక అధికారులకుంది. ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకు అనేక ఆరోగ్య, ఆర్ధిక, ఇంటి సమస్యలు ఉంటాయి. మీరన్నట్లు ఒక పెద్ద ఎడిట్ చేద్దామని చేస్తుంటే, కరంట్ పోవడం, నెట్ ఆగడం, కళ్ళు తదేకంగా చూడలేక పోవడం, అంత పెద్ద ఎడిట్ చేసేతఫ్ఫుడు ఒక్కోసారి తెలియకుండా, యధాలాపంగా కొద్ది సమాచారం హైలైట్ అయ్యి కొత్తది చేరటం, ఇలా ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఇవి పరిగణలోనికి తీసుకోవాలి. ఎవరైన అవకాశం ఉన్నంత వరకు తక్కువ ఎడిట్లతో ఎక్కువ సమాచారం చేరవేస్తే మంచిది. ఎక్కువ ఎడిట్లు, తక్కువ సమాచారం జోడిస్తే అది వికీపీడియన్ యొక్క వ్యక్తిగత అర్హత లు తెలియజేస్తుందేమో ? ఎడిట్లు కాలం అనేది నెలవారీ జాబితాలో తొలగిస్తే చాలా సమస్య(లు) తగ్గుతుంది(తగ్గుతాయి). ఇక ముందు ముందు ఎడిట్ల గణాంకాలు లెక్కలు కాకుండా ఒకరోజులో ఎంత సమాచారాన్ని అందించారో అనే గణాంకాలు వస్తే ఇటువంటి సమస్యలు రావు. JVRKPRASAD (చర్చ) 08:27, 25 ఫిబ్రవరి 2019 (UTC)
ఒక్క అక్షరం అయినా మార్చండి అంటే చిన్న అక్షర దోషాలో, లేదా ఇంకేదో వికీకి ఉపయోగపడేదేదో చేయమని అర్థం. ఒకే మాటున వ్యాసంలో ఒక్కో విభాగానికి ఒక్కో మార్పుగా కొత్త లైనులు చేర్చుకుంటూ పోవడం కాదు. అలా చేస్తే ఎవరిదైనా ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే అవుతుంది. రవిచంద్ర (చర్చ) 10:02, 25 ఫిబ్రవరి 2019 (UTC)
ఆ అక్షరం మార్పు వలన వికీకి ఉపయోగం ఉందేమోనని అదే ధోరణిలో మార్చుతున్నారేమో వారు. వారిని అడిగితే అర్థం ఏం చెబుతారో ? బాధ్యతా రాహిత్యం అనేది పాలసీలో ఎక్కడ ఉందో వాళ్ళకి లింకు ఇస్తే సరిపోతుంది.JVRKPRASAD (చర్చ) 10:57, 25 ఫిబ్రవరి 2019 (UTC)
ప్రతి చిన్న విషయానికి పాలసీలు సృష్టించుకుంటూ పోతే మన సమయమంతా పాలసీలు రాయడానికే సరిపోతుంది. విజ్ఞాన సర్వస్వంలో రాసేటప్పుడు మనం చేసే మార్పు వికీకి ఎలా ఉపయోగ పడుతుంది అనే చిన్న ఆలోచన చేస్తే ఇలాంటి మార్పులు పెద్ద ఎత్తున చేయము. ఇలాంటి మార్పులు ఎందుకు అనర్థ దాయకమో ఆయనకు పలుమార్లు వివరించడం జరిగింది. కావాలంటే ఆయన చర్చా పేజీని చూడగలరు. రవిచంద్ర (చర్చ) 11:24, 25 ఫిబ్రవరి 2019 (UTC)
పాలసీ ఉంటే అది మూలంగా ఉండి, సొంత అభిప్రాయం కాకుండా ఉంటుంది. ఇంతకు ముందు ఉంటే ఆ లింకు ఇస్తే సరిపోతుందని అన్నాను. అందరూ మళ్ళీ చెప్పి, సరి అయిన నిర్ణయం ఆలోచించి తీసుకోవడం మంచిదే, నేను అన్నీ చదువుతునే ఉంటాను, కానీ నన్ను, నా అభిప్రాయం సవ్యంగా అర్హం చేసుకోక, అనవసర చర్చలు చేసి, నన్ను నిందిస్తూ నిర్ణయం చేస్తారని, నా అభిప్రాయం వ్రాయను. JVRKPRASAD (చర్చ) 11:37, 25 ఫిబ్రవరి 2019 (UTC)
వాడుకరి:C.Chandra Kanth Rao గారు, మళ్ళీ నన్ను అదే చర్చలోకి లాగారు. నేను గతంలో నిషేధాన్ని ఎత్తివేయమని గుళ్ళపల్లి గారు చేసుకున్న అభ్యర్థనను సమర్థించాను. నాలాగే మరో ఇద్దరు వికీపీడయన్లు కూడా సమర్థించారు. అదంతా ఇక్కడ ఛూడవచ్చు. నిరోధం_తొలగింపు_అభ్యర్థన అన్న ఉపవిభాగాన్ని మన నిరోధ విధానాన్ని ఏ ఆంగ్ల వికీలోనైతే తెచ్చి అనువదించుకున్నామో అక్కడి నుంచే అనువదించాను. దాని ఆధారంగా నేను ఇదే పేజీలో తోటి సభ్యుల ముందు అభ్యర్థన పెట్టాను. ఆయనొక పద్ధతి అవలంబించారు, నేనూ పద్ధతే అవలంబించాను. ఇదలా ఉండగా పైన "నిరోధం_తొలగించ_వలెనని_విజ్నప్తి" అన్నదగ్గర "శిక్షణ ఇవ్వడంలో తప్పేమీ లేదు. అది వికీకి ఎంతో అవసరం, శిక్షణా కార్యక్రమాన్ని చర్చలు, ఒప్పందాలూ అంటూ మాట్టాడ్డం ఆయన తీసుకున్న శ్రద్ధను, శ్రమనూ కించపరచినట్లు అవుతుంది." అని వాడుకరి:Chaduvari పేర్కొన్న విషయం ఇక్కడ అసందర్భం కాదనుకుంటాను. నేను వాడుకరి:Nrgullapalli గారికి శిక్షణనిచ్చి, ఆయన సరిగా పనిచేస్తారని ఆశించి, నిషేధం తొలగించమని చంద్రకాంతరావు గారిని అభ్యర్థించడం, ఆయన తిరస్కరిస్తే సముదాయాన్ని కోరడం అన్న ప్రాసెస్లో ఏ తప్పూ లేదు. ఆ ప్రాసెస్ మొత్తం విఫలం అయినంతమాత్రానా ప్రాసెస్ తప్పు కాదు. సముదాయ సభ్యునిగా నేనొక సదుద్దేశంతో చేసిన పనిని ఇన్నిసార్లు "అడ్డంకి" అడ్డంకి అంటూ ప్రస్తావించడం సముచితం కాదని నేను భావిస్తున్నాను. పైగా నేను ఇంకా వ్యాఖ్యానించని చర్చలో నన్ను ప్రస్తావిస్తూ "కాని చర్చతీసి ప్రక్రియ ప్రారంభించిననూ పవన్ లాంటి వారు అడ్డగిస్తారని నాకు తెలుసు." అనడం నన్ను అగౌరవించడం, ముందే నా అభిప్రాయ ప్రకటనకు అడ్డుకట్ట వేయడమని నమ్ముతున్నాను. ఇది ఏ మాత్రం వికీ స్ఫూర్తి కాదు. కానేరదు. ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను - నిరోధం తొలగింపు అన్నది ఒకటి వికీపీడియా ప్రపంచంలో ఉండగా అందుకు అభ్యర్థించడం, సముదాయాన్ని దానిని పున:పరిశీలించమని కోరడం ఏ విధంగా అడ్డంకి అవుతుంది? --పవన్ సంతోష్ (చర్చ) 18:19, 25 ఫిబ్రవరి 2019 (UTC)
ఇతర నిర్వాహకులు, అధికారులు ఈ అంశాన్ని కాస్త పరిశీలించాలి. ఒక నిర్వాహకుడు పద్ధతి ప్రకారం పోయి నిర్ణయం తీసుకున్నాకా, ఆ నిర్ణయాన్ని చర్చించకుండా రివర్ట్ చేస్తే నిర్వహణా పనులకు అడ్డంకి అవుతుంది. మరో చర్చ ప్రారంభించి, ఫలానా కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించుకొమ్మని విజ్నప్తి చేయడం, తర్వాత సముదాయానికి నివేదించి అభిప్రాయాలు కోరడం చేయకూడదా? అంటే వికీపీడియాలో ఒకరు నిర్ణయం తీసుకున్నాకా దాన్ని ప్రశ్నించడం కాదు సరికదా పున:పరిశీలించమని కోరకూడదా? నిరోధం_తొలగింపు_అభ్యర్థన అనే పద్ధతి అనుసరించి నేను చేసిన పని అసలు వికీపీడియా నియమ నిబంధనలే పాటించనట్టు వ్యాఖ్యలు చేయడం సబబేనా? దయచేసి అందరూ పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 18:31, 25 ఫిబ్రవరి 2019 (UTC)
C.Chandra Kanth Rao| గారూ, "కాని చర్చతీసి ప్రక్రియ ప్రారంభించిననూ పవన్ లాంటి వారు అడ్డగిస్తారని నాకు తెలుసు." - 1. ఇది వ్యక్తిగత నింద. 2. అసలు చర్చను పక్కదారి పట్టించే వ్యాఖ్య.
రెండేళ్ళ కిందటే నిర్వహణ కార్యక్రమాలు ఆపేసానని అన్నారు. మీరు ఆపేస్తే ఆపేసుకోవచ్చు, అది ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ మిగతా వారు చేసే నిర్వహణ కార్యక్రమాలను మాత్రం దయచేసి అడ్డుకోకండి. నమస్కారాలతో__చదువరి (చర్చరచనలు) 01:17, 26 ఫిబ్రవరి 2019 (UTC)
వాడుకరి:రవిచంద్ర గారూ, Disruptive editing అని చాలా చాల రకాలైన దిద్దుబాట్ల గురించి, వాటి విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆంగ్లంలో ఓ పాలసీ ఉంది. అది అనువదించుకుందాం. మనవాళ్ళు కనిపెట్టిన కొత్త రకాల డిస్రప్టివ్ ఎడిటింగ్ టెక్నిక్కులు బహుశా ఆంగ్ల వికీపీడియాలో కూడా తెలియదనుకుంటా, వాటిని చేర్చుకుని వాటికీ తగ్గ చర్యలు అక్కడ రాసుకుందాం. ఇక మిగతా చర్చ గురించి: విధానమో, మార్గదర్శకమో లేదని దుశ్చర్యలని సముదాయం నిశ్చయించుకున్నవాటిపై చర్యలు తీసుకోకుండా ఆపనక్కరలేదు. సముదాయంలో పలువురు చర్చించి చేసే నిర్ణయాలు అభిప్రాయాలు కావు, సాధారణంగా విధానాలు అలానే రూపొందుతాయి. అలానే నా అభిప్రాయంలో ఇక్కడ మనం చేసే నిర్ణయం ఆ పాలసీలకు ప్రాతిపదిక అవుతుంది. ఈ పద్ధతులన్నీ Gaming the system అని దాని కిందకి వస్తాయి. --పవన్ సంతోష్ (చర్చ) 06:28, 26 ఫిబ్రవరి 2019 (UTC)
అవును ఈ పాలసీ మనం ఏర్పరుచుకోవలసిందే. పేజీ సృష్టించండి. నేను అనువాదం మొదలు పెడతాను. దాన్ని మన సముదాయానికి తగ్గట్లుగా మార్చుకుందాం. రవిచంద్ర (చర్చ) 06:43, 26 ఫిబ్రవరి 2019 (UTC)
ఇది ముమ్మాటికీ అడ్డంకే. చర్చ కొనసాగింపు నా చర్చాపేజీకి మార్చాను. నా సమాధానాలు ఇక్కడ చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:45, 26 ఫిబ్రవరి 2019 (UTC)
చదువరి గారూ! అది వ్యక్తిగత నింద కాదు. "ఆ విషయం" కూడా ఈ చర్చకు సంబంధించినదే. ఆ సభ్యుడిపై జరిగే ప్రక్రియను అడ్డుకోకుంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేదే కాదు. సంవత్సరాల తరబడి ఒక సభ్యుడి దిద్దుబాట్ల మోజుతో తెవికీకి ఎంత నష్టం జరిగిందో అందరూ చూస్తున్నారు. మరి చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదెందుకు ? ఇది చర్చను పక్కదారి పట్టించే వ్యాఖ్యకూడా కాదు. ఇదివరకు చెప్పినట్లు ఇది కూడా చర్చకు సంబంధం ఉన్నదే. ఇప్పుడు "ఆ చర్చను" నా చర్చాపేజీలోనే కొనసాగిస్తాను. మీరు ప్రతిపాదించిన ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళండి. తెవికీ నాణ్యత మెరుగుపర్చడానికి చేసే ఏ ప్రతిపాదనకైనా నా పూర్తి మద్దతు ఉంటుంది. కేవలం చర్చకే మీరు "అడ్డుకోకండి" మాట ఉపయోగించారు. అయినా ఈ విషయంపై నేనేమీ ప్రశ్నించను కాని నిర్వహణ ప్రక్రియకు దెబ్బతీసే భిన్నమైన చర్చను ప్రారంభించడం మాత్రం "అడ్డంకి" కాదా! సి. చంద్ర కాంత రావు- చర్చ 09:56, 26 ఫిబ్రవరి 2019 (UTC)

"ఒక రోజు సమయమిచ్చి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాను." అని రవిచంద్ర గారు రాసారు. నేను ఆయన అభిప్రాయంతో ఏకీభచిస్తున్నాను. Nrgullapalli గారు చేస్తున్న దిద్దుబాట్లపై గతంలోనూ చర్చలు జరిగాయి. కానీ ఆయన మాత్రం ఆ చర్చల్లో తన వైపు వాదన చెప్పినట్లు నాకు గుర్తు లేదు. ఇప్పుడూ స్పందించలేదు. ఆయన తన తప్పును ఒప్పుకున్నట్లే మనం భావించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 02:02, 27 ఫిబ్రవరి 2019 (UTC)

నా పై అభిప్రాయానికి పొడిగింత - ఇప్పటికిప్పుడు నిషేధించాలి అనేది నా అభిప్రాయం కాదు. చర్య ఇప్పటికిప్పుడు కాకుండా, ఇకపై ఆయన తప్పు చేస్తే మరో హెచ్చరిక లేకుండా నిషేధించవచ్చు అని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 02:08, 27 ఫిబ్రవరి 2019 (UTC)
ఆయన దిద్దుబాట్లు ఆపినట్లున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఏమీ చర్య తీసుకోవడం లేదు. మళ్ళీ ఇదే మార్పులు చేస్తే హెచ్చరిక లేకుండా చర్య తీసుకోవచ్చు. ఇది కాకుంటా మరేదో రకమైన మార్పులు చేస్తే హెచ్చరించి తర్వాత చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 04:55, 27 ఫిబ్రవరి 2019 (UTC)
రవిచంద్ర గారితో నేను ఏకీభవిస్తున్నాను.__చదువరి (చర్చరచనలు) 06:19, 27 ఫిబ్రవరి 2019 (UTC)
గతంలో కూడా ఆయన దిద్దుబాట్లు ఆపినట్లే ఆపి మళ్ళీ మళ్ళీ అలాంటి పొరపాట్లే పదేపదే చేయడం జరిగింది. పొరపాట్లు చేయకుంటే ఫర్వాలేదు కాని ఇదివరకు ఎలాంటి తప్పిదాలకు హెచ్చరికలు జారీచేశామో అవే పొరపాట్లు పునరావృత్తమైతే ఇకపై హెచ్చరిక లేకుండా నిషేధం విధంచవచ్చు. కొత్తరకం పొరపాటు ఉంటేమాత్రం భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు చేయకుండా ముందుగా తెలిపి, హెచ్చరిక చేసి నిషేధం విధించవల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:54, 27 ఫిబ్రవరి 2019 (UTC)

స్వచ్ఛంద రాజీనామా[మార్చు]

నేను నా తెవికీ నిర్వాహక హోదాను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. నిర్వాహకులెవరైనా స్టీవార్డుల దృష్టికి తెచ్చి నా నిర్వాహకహోదాను తొలగించుటకు ప్రయత్నించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:22, 1 మార్చి 2019 (UTC)

వాడుకరి:C.Chandra Kanth Rao గారూ, స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటున్నారు కాబట్టి, మీరే స్టీవార్డులను సంప్రదించాలి. మీ తరపున వేరొకరు చెయ్యడానికి కుదరదు. లింకు: m:Permissions#Removal_of_access __చదువరి (చర్చరచనలు) 17:47, 1 మార్చి 2019 (UTC)

గ్రామ పేజీల్లో సర్పంచి పేర్ల చేర్పు - మూకుమ్మడి మార్పులు[మార్చు]

శివకృష్ణ అనే సభ్యుడు మూకుమ్మడిగా గ్రామ వ్యాసాల్లో సర్పంచి పేర్లు చేరుస్తున్నారు. అందుకు మూలంగా కూడా కొన్ని లింకులు చూపిస్తున్నారు. ఉదాహరణకు ఆంధ్రభూమి, డైలీ హంట్ లాంటి మూలాలు. ఇలాంటి మార్పులను అంగీకరించాలా వద్దా అనే విషయంపై మనం చర్చించుకుంటే మంచిది. రవిచంద్ర (చర్చ) 08:01, 22 మార్చి 2019 (UTC)

ఆ మార్పులు చెయ్యడం వరకూ నాకు అభ్యంతరం కనబడ్దం లేదు. అయితే మూలాలకు సంబంధించి ఆయన చూపిస్తున్న లింకు ఆర్కైవు లాంటిది కాదుగానీ.., అదొక యాగ్రిగేటరు సైటు లాంటిది. డైలీహంట్ ఎంత విశ్వసనీయమైనదో నాకు తెలవదు. (కానీ xiaomi అనే కెనానికల్ పేరు మాత్రం నాకు అభ్యంతరకరంగా ఉంది.). దాని వెనక ఉన్న అసలుపేజీ మాత్రం నవతెలంగాణ అనే పత్రికకు చెందినది. (నేను ఒకటి రెండు పేజీల్లో చూసాను). మరింత బలమైన వికీ-మిత్ర లింకుల కోసం నేను వెతికాను -ప్రభుత్వ సైట్లు, వార్తా సైట్లు వగైరాల్లో. నాకు ఎక్కడా సమాచారం కనబడలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషను సైట్లో కూడా తాజా ఫలితాల్లేవు. పాత సమాచారం మాత్రమే ఉంది.
నేనొక పని చేసాను. తూటికుంట్ల పేజీలో ఉన్న సమాచారానికి మూలంగా అనే లింకును ఇచ్చారు. ఆ పేజీకి మూలమైన పేజీ కోసం వెతికితే, అనే అసలుపేజీ ప్రస్తుతం అందుబాటులోనే ఉంది. దాన్ని ఆర్కైవులో భద్రం చేసుకుని ఆ లింకును మూలంగా ఇస్తే (ఈ లింకును 22 పేజీల్లో వాడవచ్చు) ఇక మనకు అభ్యంతరం ఉండటానికేమీ లేదు. (ఎందుకంటే నవతెలంగాణ లింకుతో మనకు అభ్యంతరమేమీ ఉండదనుకుంటాను.)
ఇకపోతే.. ఆంధ్రభూమి లింకులు - ఆయన ఆంధ్రభూమి లింకులు ఇచ్చి ఉంటే అసలు అభ్యంతరం ఎందుకు ఉండాలి?
ఒకే సైటు నుండి అన్నేసి పేజీల్లో మూలాలు ఇవ్వవచ్చా అనే ప్రశ్నకు.. అది పెద్ద సమస్య కాదేమోననుకుంటాను (నిజాయితీగా చెప్పాలంటే.. నేనది పరిశీలించాలి.). ఒకే వ్యాసంలోని అనేక మూలాలు ఒకే లింకుకు చెందినవైతే అది గమనింపులో పెట్టుకోవాల్సిన సంగతి (పాయింటాఫ్ కన్సర్న్) అని చదివినట్టు గుర్తు. మొత్తమ్మీద, మూలంగా నవతెలంగాణ లింకు ఇస్తే ఇబ్బందేమీ ఉండదని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 15:39, 22 మార్చి 2019 (UTC)
ఈ విషయమై అర్జున రావు గారు ఆ సభ్యుడికి హెచ్చరిక జారీ చేశారు. అందుకు సమాధానంగా అతను నేను మార్పులు చేయడమే ఎక్కువ. అసలు ఏం చేయమంటారు అంటూ అసహనం వ్యక్తం చేయడం చూశాను. వికీలో ఏదో మార్పులు చేద్దామని వచ్చే వారిని సరైన మార్గం చూపించడం మన కర్తవ్యం అని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:37, 25 మార్చి 2019 (UTC)
మొదట డైలీహంట్ అవిశ్వసనీయమైనది కాదు. అది అత్యంత ప్రాచుర్యం పొందిన న్యూస్ అగ్రిగేటర్. వార్తా పత్రిక, ఐటంల విశ్వసనీయతే ఆ లింకు విశ్వసనీయత అవుతుంది. అగ్రిగేటర్ కేవలం వార్తలు అక్కడ కూర్చుతుంది, ఆ కూర్చడంలో ఏ కలుపూ చేర్చుతున్నట్టు మనకి ఆధారాల్లేవు. కాబట్టి సమస్యలేదు. ఇక నవతెలంగాణ, ఆంధ్రభూమి విషయమై ఏ సమస్యలూ లేవు. ఒకే మూలాలు అన్ని వ్యాసాల్లోనూ ఇవ్వడం తప్పెందుకు కాదంటే రిలవెన్సు ఉంది. ఆయన అర్జున గారికి ఇచ్చిన సమాధానంలో అసహనం, కాస్త అవమానకరమైన ధోరణి ఉంది. ఆ ముక్క మొక్క మానయ్యేలోగా మనం వివరించాలి. ఇక్కడ తప్పనిసరిగా గారు, మీరు వంటి భాషే వాడాలని, అవతలివారిది తప్పే అనుకున్నా సదుద్దేశంతో చేస్తున్నారని భావించాలని వెళ్ళేకొద్దీ మనం చెప్పాలి. కానైతే మిగతా అంశాలన్నిటిలోనూ ఆయన ఉద్దేశపూర్వకంగా కానీ, తెలియక కానీ ఏ పొరబాటూ చేసినట్టు కనిపించడం లేదు. ఆయన పని స్పామ్ ధోరణిలోకి రాదు. మేలే చేస్తున్నారు.--పవన్ సంతోష్ (చర్చ) 07:47, 26 మార్చి 2019 (UTC)
చదువరి గారు అన్నట్టు అగ్రిగేటర్ కన్నా ఆర్కైవు మేలు. ఆ ముక్కే అర్జున గారూ చెప్పారు. కానీ ఒక కొత్త వ్యక్తి మేలు చేసే మార్పులు, చాలా దిద్దుబాట్ల కన్నా నాణ్యమైన మార్పులు మూలాలతో సహా చేస్తున్నప్పుడు వెనువెంటనే ఆర్కైవులు వెతుక్కునే భారం పెట్టదగునా అన్న సందేహం ఉంది నాకు. మనమే ఆ ఆర్కైవు చేర్పులు చేసి, మీకు సాయం చేస్తున్నాననీ, మీరూ ఇలా చేస్తే బావుంటుందని మనం చెప్పడం మేలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేస్తున్నవి తప్పుడు మార్పులు కావు, మంచివే. --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 26 మార్చి 2019 (UTC)

పెండింగు పనులు[మార్చు]

తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో రెండు పేజీల తొలగింపు ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. నిర్వాహకులు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోగలరు. __చదువరి (చర్చరచనలు) 08:25, 26 మార్చి 2019 (UTC)