వికీపీడియా:బొమ్మల నిర్వహణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియాలో స్థానికంగా ఎక్కించిన బొమ్మలు లేక కామన్స్ ప్రాజెక్టులో ఎక్కించిన బొమ్మలు ఏకరీతిన వాడవచ్చు. అంతర్జాలంలో బొమ్మలు సులభంగా వెతకటం ద్వారా పొందవచ్చు కావున, వాటిని చాలా వాడుకరులు, తెలుగు వికీపీడియాలో ఎక్కించటం జరుగుతుంది. తెలుగు వికీపీడియా తొలినాళ్లలో స్థానికంగా బొమ్మల ఎక్కింపుకు ఏ విధమైన నియమాలులేవు. 2013 నవంబరులో అందుబాటులోకొచ్చిన ఫైల్ అప్లోడ్ విజర్డ్ బొమ్మలు ఎక్కించేటప్పుడు అవసరమైన వివరాలు చేర్చటానికి ఉపయోగపడంది. అయితే అనుభవమున్న వారికి నేరుగా బొమ్మలు ఎక్కించే వీలుండడంతో, అనుభవంలేని వారుకూడా నేరుగా బొమ్మలు ఎక్కించారు. ఇలా ఎక్కించిన బొమ్మలు నిర్వహించటంపై శ్రద్ద వున్న వికీపీడియన్లు ఒకరిద్దరు మాత్రమే వుండడంతో బొమ్మల సమస్యలు వేగంగా సరిచేయటంగా కాని, తొలగించడం ద్వారా కాని పరిష్కరించబడుటలేదు. బొమ్మల వాడుక సరిగా నిర్వహించలేకపోతే, స్థానికంగా బొమ్మలు ఎక్కించే సౌలభ్యం నిరోధించే అవకాశం వుంది. కావున సభ్యులు బొమ్మల నకలుహక్కులు విషయంలో అవగాహన పెంచుకొని బొమ్మల నిర్వహణలో పాలుపంచుకొనవలసిన అవసరం చాలావుంది. వారికి సహాయంగా కావలసిన సమాచారం, ఉపయోగపడే సాంకేతికాంశాల లింకులు అందించడం, బొమ్మల వాడుక నాణ్యత పెంచడానికి పనులను సమన్వయం చేయడం ఈ వ్యాసం ఉద్దేశం.

స్వేచ్ఛా నకలు హక్కుల బొమ్మలు

[మార్చు]

ఎక్కించే వారు స్వంతంగా తీసినవి, వారు ఇతరులచే వారికోసం తీయించినవాటిపై వారికి పూర్తిహక్కులుంటాయి. వాటిని స్వేచ్ఛానకలుహక్కుల లైసెన్స్ లతో వికీపీడియా లేక కామన్స్ లాంటి చోట్లలో ఎక్కించవచ్చు. వాటి ఉపయోగం తెలుగువికీపీడియా వరకే పరిమితమైతే (ఉదాహరణకు స్వంతంగా చేసిన తెలుగువికీపీడియా గణాంకాల బొమ్మలు) వాటిని తెలుగు వికీపీడియాలో ఎక్కించడం మంచిది. ఇతరాలు కామన్స్ లో ఎక్కించడం మంచిది. స్వేచ్ఛానకలుహక్కులలో వివిధ రకాలున్నాయి. ఒకటి ఏ ఉపయోగానికైనా, ఏ షరతు లేకుండా వాడుకోగలవాటిని ప్రజాపరిధి(Public domain) బొమ్మలు అంటారు. వీటికొరకు సాధారణంగా {{PD-self}} లేక క్రియేటివ్ కామన్స్ నకలుహక్కుల వాడుకలో {{Cc-0}} లైసెన్స్ మూసలు వాడాలి. గుర్తింపు అవసరమైన వాటికి సాధారణంగా {{Cc-by}}, గుర్తింపుతో పాటు బొమ్మ అధారంతో చేసే కొత్తవి కూడా అదే లైసెన్స్ తో విడుదలకావాలంటే Cc-by-sa లైసెన్స్ వాడాలి. CC-BY-SA లైసెన్స్ నియమాలు పరిణామక్రమంలో తాజాగా 4.0 విడుదల అందుబాటులో వుంది. దీనికొరకు {{Cc-by-sa-4.0}} వాడాలి.

సాధారణ దోషాలు, పరిష్కారం

[మార్చు]

కొత్త వాడుకరులు ఒక పుస్తకం ముఖచిత్రాన్ని కాని లేక ఫొటోఫ్రేమ్ ను కాని (2D అంశాలు) ఫొటోతీసి, వారు తీశారు కాబట్టి వారి స్వంతం అనుకుని స్వేచ్ఛానకలుహక్కులతో విడుదల చేస్తారు. అటువంటి వాటిని గుర్తించినపుడు ట్వింకిల్ ద్వారా లైసెన్స్ సరియైనది కాదు అని ఎవరైనా హెచ్చరించవచ్చు. వారంరోజుల తరువాత పరిష్కరించకపోతే నిర్వాహకులు తొలగించాలి.

సముచిత వినియోగ బొమ్మలు

[మార్చు]

బొమ్మపై వాణిజ్యపరమైన వినియోగంపై నకలుహక్కులు ఇతరులకు వున్నప్పుడు వీటిని కామన్స్ లో అనుమతించరు కాబట్టి అమెరికా నకలుహక్కుల చట్టం లేక భారత నకలుహక్కుల చట్టం సముచిత వినియోగ ప్రకారం వాటిని స్థానికంగా ఎక్కించి వికీపీడియాలో వాడవచ్చు. దానికి ఆధారం ప్రధానంగా వాటిపై విద్యావిషయ చర్చ లక్ష్యం. కావున అది నెరవేరటానికి, వికీపీడియాలో సముచిత వినియోగ నియమాలు (ఆంగ్లం) ఏర్పడ్డాయి. వాటిని పాటించనపుడు, ఆ బొమ్మల ఎక్కింపు దారులకు ట్వింకిల్ ద్వారా హెచ్చరించాలి. దీనికి ట్వింకిల్ మెనూలో ఉపమెనూ DI (Delayed speedy image deletion) వాడాలి. సమస్య పరిష్కరించబడకపోతే నిర్వాహకులు వారం రోజుల తరువాత వాటిని తొలగిస్తారు.

సముచిత వినియోగం ధృవీకరించడం

[మార్చు]

చిత్రాల సముచిత వినియోగ కారణాలు పరిశీలించి, అవి సముచిత వినియోగ నియమాలను ఉల్లంఘించనట్లైతే వాటిని ధృవీకరించడానికి లైసెన్స్ మూసవాడుకలో ( ఉదాహరణ{{Non-free fair use}}) "|image has rationale=yes" అని సముచిత వినియోగంపై అవగాహన పెంచుకున్నవారు ఎవరైన చేర్చవచ్చు. ఈ పని అవసరమైన బొమ్మలను వర్గం:Wikipedia non-free files for NFUR review లో చూడండి.

బొమ్మల నిర్వహణకు లింకులు

[మార్చు]

బొమ్మల వర్గాలు (గణాంకాలతో)

[మార్చు]

వర్గం:Wikipedia copyright

ఫైళ్లు

[మార్చు]

స్వేచ్ఛానకలుహక్కుల ఫైళ్లు

[మార్చు]

స్వేచ్ఛానకలుహక్కులు లేని ఫైళ్లు

[మార్చు]

ఫైల్ అప్లోడ్ విజర్డ్ వాడుక నిర్వహణ వర్గాలు

[మార్చు]

ట్వింకిల్ తొలగింపు మూసలు చేర్చిన ఫైళ్లు

[మార్చు]

మూస:Di-no_non-free_use_rationale వాడి హెచ్చరించిన పైళ్లు

చేయవలసిన పని, పురోగతి

[మార్చు]
తేది మూస వాడే పనిజరగవలసిన ఫైళ్ల సంఖ్య
2022-03-01 2090
2022-03-08 2090
2022-03-16 2049
  • దోషపూరిత సముచిత వినియోగ వివరణలను సవరించడం. ఉదాహరణ: సినిమా పోస్టరు (ఉదాహరణకు వ్యక్తుల చిత్రాలకు ) కానివాటికి సినిమా పోస్టరు సముచిత వినియోగ మూస వాడడం.
  • సముచిత వినియోగ వివరణలను పరిశీలించి, సరిగా వాడిన వాటిని ధృవీకరించడం
  • సముచిత వినియోగ ఫైళ్లను మూసల పేరుబరిలో వాడుక తొలగింపు

పరిష్కరించిన సమస్యలు

[మార్చు]
  • బొమ్మల వర్గవృక్షం దోషాలు: కొన్ని వర్గాల పేరులు తెలుగులో, ఇంకొన్ని వర్గాలపేరులు ఆంగ్లంలో వున్నవి.

జరిగిన పని

[మార్చు]
తేది పనిజరగవలసిన ఫైళ్ల సంఖ్య
2021-12-26 1927
2022-01-11 1851
2022-01-17 1728
2022-02-07 1456
2022-02-14 1442
2022-02-21 1406
2022-02-28 1405

మూకుమ్మడి తొలగింపుకు గురైన బొమ్మల జాబితాలు

[మార్చు]

ఈ క్రింది ఉపపేజీలలోని జాబితా ఫైళ్లలో ఎర్రలింకులు లేని ఫైళ్లు అదేపేరుతో కామన్స్ లో గలవి లేక తరువాత మరల ఎక్కించినవి అయివుండవచ్చు.

  • మొత్తం తొలగించిన ఫైళ్ల సంఖ్య: 2177
  1. 2021-11-30: వికీపీడియా:బొమ్మల నిర్వహణ/no-use-no-license-20211130.txt (278)
  2. 2021-12-29: వికీపీడియా:బొమ్మల నిర్వహణ/no-license-20211229.txt (195)
  3. 2022-01-10: వికీపీడియా:బొమ్మల నిర్వహణ/non-free-orphan-20220102 (312)
  4. 2022-02-28: వికీపీడియా:బొమ్మల నిర్వహణ/non-free-no-rationale-20220111 (1392)

శుద్ధి పనుల సమీక్షలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]