వికీపీడియా:బొమ్మల నిర్వహణ/సముచిత వినియోగం లేని ఫైళ్ల శుద్ధి - 1
స్వరూపం
దాదాపు 1927 సంఖ్య వున్న సముచిత వినియోగం లేని ఫైళ్ల శుద్ధి పూర్తయ్యింది. సుమారు 1392 తొలగించగా, 535 సముచిత వినియోగం వివరాలు చేర్చబడ్డాయి. ఆ పని సమీక్ష వివరాలు ఈ వ్యాసం ఉద్దేశం.
పని కాలం
[మార్చు]2021-12-26 : 2022-02-28
పాల్గొన్న వారు
[మార్చు]- User:Arjunaraoc
- ఫైళ్లు ఎక్కించిన వారిలో కొందరు: చదువరి, Pranayraj1985,K.Venkataramana, బత్తిని వినయ్ కుమార్ గౌడ్
సమీక్ష
[మార్చు]దాదాపు 1927 సంఖ్య వున్న సముచిత వినియోగం లేని ఫైళ్ల శుద్ధి పూర్తయ్యింది. సుమారు 1392 తొలగించగా, 535 సముచిత వినియోగం వివరాలు చేర్చబడ్డాయి. చివరిగా మిగిలిన ఎక్కింపు దారులను హెచ్చరించి, సముచిత వినియోగం సవరించని ఫైళ్లను 2022-02-28 నాడు తొలగించడం జరిగింది. ఈ ప్రక్రియలో చాలాకాలం తక్కువ సంఖ్యలో ఎక్కింపులు చేసిన సభ్యుల ఫైళ్లను అర్జున వీలైనంతవరకు వాటిలో గల వివరాలను బట్టి లైసెన్సులు సవరించడం, సముచిత వినియోగ వివరాలు చేర్చడం చేశారు. హెచ్చరింపుకు స్పందించిన వారిలో చదువరి ,Pranayraj1985,K.Venkataramana, బత్తిని వినయ్ కుమార్ గౌడ్ వున్నారు.
బాగా జరిగినవి
[మార్చు]- ఫైళ్లు ఎక్కువ సంఖ్యలో వుండడంతో ఎక్కువ సమయం ఇవ్వడం జరిగింది. అయితే అదనపు సమయం కోరకపోయినందున, వారానికొకసారి ఫైళ్ల పని గమనించి, పని తగ్గిన తరువాత మిగిలినవాటిని తొలగించడం జరిగింది.
- NFUR మూసలు వాడకుండా సాధారణ పాఠ్యంతో లేక Navbox మూసతో ఆంగ్లవికీలోగల సముచిత వినియోగం చేర్చడం కొన్ని ఫైళ్లలో గమనించాను. వీటికి NFUR మూస వాడుకకు మార్చడం కష్టం కావున, వాటి సముచిత వినియోగం ధృవీకరించి, అటువంటి వాటిని తొలగింపుకు మినహాయించాను. దీనికొరకు ధృవీకరించినవాటిని పేజీపైల్ లో చేర్చి ఆ తరువాత petscan క్వెరీ categories NOT pagepile ఐచ్ఛికంతో తొలగించవలసిన జాబితా తయారు చేశాను. ఈ పద్ధతి WP:FUW చేతనానికి ముందు ఎక్కించిన ఫైళ్ల శుద్ధికి వాడవచ్చు.
బాగా జరగనవి
[మార్చు]- హెచ్చరికలకు స్పందనలు తక్కువ. ౩౦ మందిలో 5 గురు స్పందించగా 4 గురు మాత్రమే కొంతవరకు ఫైళ్లకు సవరణలు చేశారు.
గమనింపులు, ముందు పనికి సూచనలు
[మార్చు]- కొన్ని వాడుకలలో బొమ్మ వాడుక వికీటెక్స్ట్ కోడ్ ఎక్కువ వరుసలకు విస్తరించారు లేక, చివరి బ్రాకెట్లు కొత్త వరుసలో వ్రాశారు. వీటిని శుద్ధి చేసేటపుడు, delink కోడ్ ఆగిపోతున్నది. అవి మానవీయంగా చేయవలసి వస్తుంది.
- కొన్ని బొమ్మలు సమాచారపెట్టెలో చేర్చుటకు బదులుగా, బొమ్మ చివరలో చేర్చారు. కొంత సమయం పట్టినా బొమ్మలు చేర్చటం సరిగా చేయాలి.
- ఒకటి కన్నా ఎక్కువ స్వేచ్ఛానకలుహక్కులు కాని బొమ్మలు కొన్ని వ్యాసాలలో వాడారు. తప్పనిసరైతే అనగా విస్తారమైన వివరం వుంటేనే అలా చేయాలి.