వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాలో బొమ్మలు చేర్చుట - వికీమీడియా కామన్స్ తోడ్పాటుకు అవసరమయ్యే చేపుస్తకం
ఫైల్ ఎక్కింపు విజర్డుప్రశ్నల తెరపట్టు

బొమ్మలు, ఇతర ఫైళ్లను ఎక్కించుటకు వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు వాడితే ప్రశ్నలసహాయంతో వాడుకరికి మార్గదర్శనంచేసి తగిన లైసెన్స్ తో ఫైల్ ఎక్కించటానికి సహాయపడుతుంది. సంబంధిత వివరాల మూసను, ఉచితం కాని ఫైళ్లకు తగిన హేతువుల మూసను చేర్చుతుంది.

మీరు బొమ్మలను అప్లోడు చేసేముందు, బొమ్మల వినియోగ విధానాన్ని చదవండి. అంతర్జాలంలో మీకు కనిపించే బొమ్మల్లో చాలావరకు కాపీహక్కులు కలిగి ఉంటాయి. అవి వికీపీడియా లోకి అప్లోడు చేసేందుకు అనుకూలమైనవి కావు. మీరు అప్లోడు చెయ్యదలచిన బొమ్మ మీరు సృష్టించింది కాకపోయినా, లేక ఆ బొమ్మ కాపీహక్కుల స్థితి మీకు తెలియకున్నా, ఆ బొమ్మను అప్లోడు చెయ్యకండి. అలాగే, వ్యాపారేతర వినియోగాలకు మాత్రమే వినియోగించగలిగేవి, అనుమతి ద్వారానే వాడగలిగే బొమ్మలను వికీపీడియాలో అంగీకరించము. [1] వికీపీడియాలో అప్లోడు చేసేందుకు అనుకూలమైన బొమ్మలు ఎలా కనుక్కోవాలో తెలుసుకునేందుకు వికీపీడియా:వికీపీడియాకు అనుకూలమైన బొమ్మలను ఎలా పట్టుకోవాలి పేజీ చూడండి. వికీపీడియా:అప్లోడుకు బొమ్మలను సిద్ధం చెయ్యడం కూడా చూడవచ్చు.

ఓ కొత్త బొమ్మను అప్‌లోడు చెయ్యడం[మార్చు]

బొమ్మ కాపీహక్కుల స్థితిని నిర్ధారించుకోండి[మార్చు]

  1. మీ బొమ్మ ఫైలుకు ఏ బొమ్మ కాపీహక్కుల ట్యాగు సరిపోతుందో నిర్ధారించుకోండి.

స్వేచ్ఛా లైసెన్సు బొమ్మలు[మార్చు]

వికీపీడియా:కాపీహక్కులు, బొమ్మల కాపీహక్కుల ట్యాగులు పేజీలను చూసాక, ఒక బొమ్మ సార్వజనికమో లేక ఇతర స్వేచ్ఛా లైసెన్సులకు (ఉదా..GFDL, క్రియేటివ్ కామన్స్) లోబడి ఉందో నిర్ధారించుకోవచ్చు. తరువాత, ఆ బొమ్మను వికీమీడియా కామన్స్ లోకి అప్లోడు చెయ్యవచ్చు. అందరూ పంచుకోగలిగే బొమ్మలు, ఇతర మీడియాల ఖజానా. వికీమీడియా కామన్స్ లోకి అప్లోడు చేసిన బొమ్మలు తెలుగు వికీపీడియాకే గాక, ఇతర అన్ని భాషల వికీపీడియాలకూ అందుబాటులో ఉంటాయి. ([[బొమ్మ:]] అనే ట్యాగు కామన్స్ లో ఉన్న బొమ్మలను తెవికీలోని బొమ్మల లాగానే గుర్తిస్తుంది. కామన్స్ లో ఉన్న వర్గీకరణ వలన బొమ్మలను తేలిగ్గా వెతకగలిగే వీలూ కలిగిస్తుంది. కామన్స్ లోని ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే సదుపయోగం రకపు బొమ్మలను అక్కడ అనుమతించరు.

కామన్స్ లోకి అప్లోడు చేసే విషయమై సహాయం కోసం వికీమీడియా కామన్స్ సహాయం చూడండి

సదుపయోగ బొమ్మలు[మార్చు]

మీరు అప్లోడు చెయ్యదలచిన బొమ్మ స్వేచ్ఛా లైసెన్సు కింద లేనప్పటికీ సదుపయోగం విధానం కిందకి వస్తుంటే, ఆ బొమ్మను మీరు తెలుగు వికీపీడియా లోకి అప్లోడు చెయ్యవచ్చు. వాటికి కామన్స్ లోకి అనుమతి లేదు.

అప్లోడు చెయ్యడం ఎలా[మార్చు]

పరికరాల పెట్టె లోని ఫైలు అప్లోడు లింకును నొక్కి అప్లోడు పేజీకి వెళ్ళవచ్చు. ఆ పేజీలో ఉన్న "Browse..." మీటను నొక్కినపుడు మీ కంప్యూటరు లోని ఫైళ్ళను చూపించే పెట్టె తెరుచుకుంటుంది. మీరు ఎంచుకున్న ఫైలు పేరు పక్కనున్న ఫీల్డులోకి వచ్చి చేరుతుంది. ఉచితమైన లైసెన్సును కూడా ఎంచుకోవాలి. అలా ఎంచుకోగానే సంబంధిత లైసెన్సు సందేశం దానికింద వచ్చి చేరుతుంది. "ఫైలు అప్లోడు చెయ్యి" మీటను నొక్కగానే అప్లోడు మొదలవుతుంది. అప్లోడు పూర్తయ్యే సమయం మీ ఇంటర్నెట్టు కనెక్షను వేగం మీద ఆధారపడి ఉంటుంది.

ఇప్పటికే అప్లోడు చేసిన బొమ్మలను వెతకండి[మార్చు]

  • ఇప్పటికే తెలుగు వికీపీడియా లోకి అప్లోడు చేసిన బొమ్మల కోసం వెతికేందుకు అప్లోడు చేసిన బొమ్మల జాబితా చూడండి.
  • చేసిన అప్లోడులూ, తొలగింపులు అప్లోడు లాగ్ లో చేరి ఉంటాయి.
  • చాలా వరకు బొమ్మలను వర్గం:వికీపీడియా బొమ్మలు వర్గంలో గానీ, లేదా దాని ఉపవర్గాల లోకి గానీ చేర్చవచ్చు/చూడవచ్చు. మీరు వెతుకుతున్న బొమ్మ వర్గీకరించబడి ఉంటేనే ఆ విధంగా దొరుకుతుంది.

ఇతర వికీ పేజీల్లాగానే మీరు అప్లోడు చేసిన బొమ్మను వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఇతరులు సరిదిద్దవచ్చు, తొలగించనూ వచ్చు. అప్లోడు పద్ధతిని దుర్వినియోగపరిస్తే మిమ్మల్ని నిషేధించవచ్చు.

వ్యాసాలకు బొమ్మలను చేర్చడం[మార్చు]

బొమ్మను అప్లోడు చేసింది కామన్స్ లోకయినా, తెలుగు వికీపీడియా లోకయినా దాన్ని వ్యాసంలో చేర్చే పద్ధతి ఒకటే. ఆ పద్ధతి ఇది:

[[బొమ్మ:బొమ్మ పేరు|thumb|వ్యాఖ్య]]

ముఖ్య గమనిక: బొమ్మ పేరు తెలుగులోనైనా, ఇంగ్లీషులోనైనా పెట్టవచ్చు. పేరు ఇంగ్లీషులో పెడితే అది కేస్ సెన్సిటివ్ అని గమనించండి. ఫైలు ఎక్స్‌టెన్షను మాత్రం తప్పనిసరిగా ఇంగ్లీషులోనే ఉండాలి. ఉదాహరణకు బొమ్మపేరు Picture.jpg అని పెడితే picture.jpg అని లేదా Picture.JPG అనో వెతికితే అది దొరకదు.

మరింత సమాచారం కోసం వికీపీడియా:బొమ్మలు చూడండి.

సాంకేతిక అంశాలు[మార్చు]

ఫోటోలకు JPEG, డ్రాయింగులకు SVG, వెక్టర్ గ్రాఫిక్స్ కాని ఐకాన్ బొమ్మలకు PNG, ధ్వనికి Ogg Vorbis, వీడియోకు Ogg Theora వాడాలి. సందిగ్ధత లేకుండా ఫైళ్ళకు వివరమైన పేర్లు పెట్టండి. బొమ్మను వ్యాసంలో ఇమిడ్చేందుకు, కింది పద్ధతిని వాడండి [[బొమ్మ:ఫైలు.jpg]] లేదా [[బొమ్మ:ఫైలు.png|వ్యాఖ్య]] లేదా [[Media:File.ogg]] -ధ్వనికి.

బొమ్మను థంబ్ నెయిల్ గా ఇలా చూపించాలి: [[బొమ్మ:Apublicaffaircover.gif?|thumb|వ్యాఖ్య]].

ఉన్న ఇప్పటికే ఉన్న బొమ్మను వేరే బొమ్మతో మార్చినపుడు, కొత్త బొమ్మ కనిపించాలంటే మీ బ్రౌజరు కాషె ను తొలగించాలి. ఒక్కోసారి ఈ పద్ధతి పనిచెయ్యకపోవచ్చు.

టూకీగా.. ఎలా[మార్చు]

ఫైలు అప్లోడు పేజీలో నాలుగు ఫీల్డులుంటాయి.

  1. మూలం ఫైలు పేరు: దీనికి జతగా ఉన్న Browse మీటను నొక్కి మీ కంప్యూటరు లోని ఒక ఫైలును ఎంచుకోవచ్చు.
  2. గమ్యస్థానం ఫైలు పేరు: ఈ పేరుతోటే ఈ ఫైలుకు వ్యాసాల నుండి లింకు ఇస్తారు. మీ బ్రౌజర్లో జావాస్క్ర్తిప్టు సశక్తంగా ఉంటే, మూలం ఫైలు పేరు ఏదైతే ఇస్తారో అదే పేరు ఇక్కడికీ వచ్చి చేరుతుంది. లేదా మీకు కావలసిన పేరు ఇచ్చుకోవచ్చు. అలా లేని బ్రౌజర్లలో, ఈ ఫీల్డును ఖాళీగా వదిలేస్తే మూలం ఫైలు పేరునే వాడతాము.
  3. సారాంశం: అప్‌లోడు చేస్తున్న ఫైలుకు సంబంధించిన వివరాలను ఇక్కడ ఇవ్వవచ్చు. బొమ్మకు సంబంధించిన సంక్షిప్త చరిత్ర రాయండి.
  4. లైసెన్సు వివరాలు: ఈ జాబితా పెట్టెలో ఉన్న కాపీహక్కు వివరాల జాబితా నుండి సరైనదాన్ని ఎంచుకోవాలి.

"అప్లోడు చెయ్యి" మీటను నొక్కిన తరువాత ఫైలు నేరుగా అప్లోడు అవుతుంది. వ్యాసం పేజీలను దిద్దుబాటు చేసేటపుడు కనిపించే మునుజూపు అవకాశం ఇక్కడ లేదు. అప్లోడు అయిన తరువాత సారాంశం, లైసెన్సు వగైరాలు మార్చవలసి వస్తే మార్చు లింకును నొక్కి చెయ్యవచ్చు. మీరు ఎంచుకున్న ఫైలు పేరుతో ఒక ఫైలు ఇప్పటికే ఉంటే దాన్ని ఓవరురైటు చెయ్యాలో పేరు మార్చాలో నిర్ణయించుకునే అవకాశం మీకు ఉంటుంది.

బహుప్రాజెక్టుల అప్లోడు[మార్చు]

ఒక వికీమీడియా ప్రాజెక్టు లోకి అప్లోడు చేసిన బొమ్మను వేరే ప్రాజెక్టులో వాడుకోవడం కుదరదు. అలా వాడుకోదలిస్తే ఆ బొమ్మను వికీమీడియా కామన్స్ లోకి అప్లోడు చెయ్యాలి. ఆ బొమ్మ వెంటనే అన్ని వికీమీడియా ప్రాజెక్టులకు అందుబాటులోకి వస్తుంది. సార్వజనికమైనవి లేదా స్వేచ్ఛా లైసెన్సు కలిగిన వాటిని మాత్రమే కామన్స్ అనుమతిస్తుంది. బొమ్మ సదుపయోగం రకానికి చెందినదైతే దాన్ని కామన్స్ అనుమతించదు. ఒక వికీపీడియాలో ఉన్న బొమ్మను వేరే ప్రాజెక్టులోకి అప్లోడు చెయ్యాలంటే ముందు మీరా బొమ్మను మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకొని తరువాత దాన్ని రెండో ప్రాజెక్టు లోకి అప్లోడు చెయ్యాలి. ఆ రెంటి మధ్య భాషాంతర లింకులు ఇవ్వవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]