Jump to content

వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు

వికీపీడియా నుండి

బొమ్మల కాపీహక్కు పట్టీల పూర్తి జాబితా కోసం వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా చూడండి.

వికీపీడియా కాపీహక్కుల చట్టాన్ని చాలా నిష్ఠగా పాటిస్తుంది. బొమ్మ వివరణ పేజీల్లో బొమ్మకు చెందిన లైసెన్సు, వనరుల వివరాలు ఉంటాయి. దీనివలన ఆయా బొమ్మలను వాడేవారికి, వాటి తద్భవాల కర్తలకు వాటితో ఏమేం చెయ్యొచ్చో చెయ్యకూడదో తెలుస్తుంది.

మార్గదర్శకాలు

[మార్చు]
  • వికీపీడియా యొక్క బొమ్మల వినియోగ విధానం ప్రకారం ఏదైనా బొమ్మను స్వేచ్ఛాయుతమని గుర్తించాలంటే ఆ బొమ్మ యొక్క వ్యాపారాత్మక వినియోగాన్నీ, తద్భవాల సృష్టికీ సదరు లైసెన్సు అనుమతించాలి.
  • కాపీహక్కులు, లైసెన్సుల పట్టీలు ఒక్కొక్కటి ఒక్కో వరుసలో ఉంచాలి.
  • పట్టితో వనరు లేదా కాపీహక్కుదారుల సమాచారాన్ని తెలియజేయాలి. వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇవ్వండి.
  • బొమ్మ ప్రామాణిక లైసెన్సుకు అనుగుణంగా లేకపోతే, సదరు లైసెన్సు ఏం చెబుతోందో రాయండి.
  • బొమ్మ శ్రేయస్సు ఎవరికైనా చెందాల్సి ఉన్నట్లైతే సదరు వ్యక్తుల/సంస్థల వివరాలు ఇవ్వండి.
  • బొమ్మకు అనేక వర్గాలకు చెందినదైతే, వాటన్నిటినీ రాయండి.
  • వికీమీడియా కామన్స్ అదుపయోగం రకానికి చెందిన బొమ్మలను అనుమతించదు. కానీ అలాంటి బొమ్మలను తెలుగు వికీపీడియా లోకి అప్లోడు చెయ్యవచ్చు. (వికీపీడియా:కాపీహక్కులు#Fair use materials and special requirements చూడండి).

ఉదాహరణ

[మార్చు]

{{GFDL-self}} అనే పట్టీని పెట్టినపుడు కింది నోటీసు వస్తుంది:

బొమ్మలను సృష్టించేవారి కోసం

[మార్చు]

బొమ్మ సృష్టికర్త మీరే అయితే మీ ఇష్టమొచ్చిన స్వేచ్ఛా లైసెన్సును ఎంచుకోవచ్చు. కావాలంటే వివిధ లైసెన్సుల కింద బహుళ లైసెన్సులు ఇవ్వవచ్చు కూడా. అయితే మీరు ఎంచుకునే లైసెన్సు వ్యాపారత్మక వినియోగాన్ని, తద్భవాల తయారీని నిషేధించరాదు.

  • GNU స్వేచ్ఛా డాక్యుమెంటేషన్ లైసెన్సు - {{GFDL-self}} - ఫ్రీ స్సఫ్టువేరు ఫౌండేషను వారు తయారుచేసారు. మీ కృతిని వాడుకునేవారు దాని శ్రేయస్సును మీకు ఆపాదించాలి. మీ కృతిని వేరే కృతిలో వాడినపుడు గానీ, దానికి మార్పులు చేసి వేరే కృతి తయారుచేసినపుడు గానీ, దాన్ని అదే లైసెన్సుతో విడుదల చెయ్యాలి.
  • Creative Commons Attribution-ShareAlike - {{cc-by-sa-2.5|Attribution details}} - ఇది అనేక CC లైసెన్సులలో ఒకటి. ఇది అవేచ్ఛా వినియోగాన్నీ, వ్యాపారాత్మక వినియోగాన్నీ అనుమతిస్తుంది; కర్తగా మీకు శ్రేయస్సును ఆపాదించాలి; తద్భవ కర్త గానీ, పంపిణీదారు గానీ అదే లైసెన్సుతో విడుదల చెయ్యాలి. శ్రేయస్సు ఎలా ఆపాదించాలో ఆ పాఠాన్ని మూసలో రాయాలి.
  • Creative Commons Attribution - {{cc-by-2.5|Attribution details}} - పైదాని లాగానే, కానీ తద్భవ కృతులు అదే లైసెన్సును వాడాలన్న నిబంధన లేదు.
  • స్వేచ్ఛా కళాకృతుల లైసెన్సు - {{FAL}} - కళాకృతులకు కాపీలెఫ్టు లైసెన్సు; మార్పుచేర్పులు, వ్యారాత్మక వినియోగాలకు అనుమతి ఉంది. అయితే తద్భవ కృతులు అదే లైసెన్సును వాడాలి.
  • సార్వజనికం - {{PD-self}} - కృతి కర్త తన కృతిపై తన హక్కులను శాశ్వతంగా వదలుకుంటారు
  • వికీపీడియా పేజీల తెరమెరుపుల కోసం ఈ పట్టీని వాడవచ్చు: {{Wikipedia-screenshot}}

కొత్త పట్టీలను తయారు చెయ్యడం

[మార్చు]

ఒకే వనరు, లైసెన్సులతోటి అనేక బొమ్మలను అప్లోడు చేస్తూ ఉంటే, మీరో కొత్త కాపీహక్కు పట్టీని సృష్టించవచ్చు. మీరు చెయ్యదలచిన పట్టీని వికీపీడియా చర్చ:బొమ్మల కాపీహక్కు పట్టీలు పేజీలో ప్రతిపాదించండి. మీకీ విషయంలో పరిజ్ఞానం లేకపోతే సహాయం తీసుకోండి.

మూసను వాడే పేజీలను ఆటోమాటిగ్గా వర్గీకరించేందుకు ప్రతీ మూసకూ ఒక వర్గం ఉండాలి. వర్గ వివరణ పేజీలో కింది వివరణ ఉండాలి:

{{Image template notice|పట్టీ పేరు}}

అలాగే, ఆ మూసను బొమ్మల కాపీహక్కు పట్టీలు వర్గంలో చేర్చండి. చేర్చే పద్ధతి ఇది:

<noinclude>[[వర్గం:బొమ్మల కాపీహక్కు పట్టీలు|{{PAGENAME}}]]</noinclude>

ఇవి కూడా చూడండి

[మార్చు]