క్రియేటివ్ కామన్స్

వికీపీడియా నుండి
(Creative Commons నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
క్రియేటివ్ కామన్స్
Creative Commons logo
స్థాపన2001; 23 సంవత్సరాల క్రితం (2001)
వ్యవస్థాపకులులారెన్స్ లెస్సీగ్
కేంద్రీకరణనకలు హక్కులను మరింత విస్తృత పరచడం
పద్ధతిక్రియేటివ్ కామన్స్ లైసెన్సు
ముఖ్యమైన వ్యక్తులురయాన్ మర్క్లీ, సీఈఓ
జాలగూడుhttp://creativecommons.org

క్రియేటివ్ కామన్స్ (సీసీ) అమెరికాకు చెందిన ఒక లాభాపేక్షలేని సంస్థ. సృజనాత్మక రచనలను ప్రోత్సహించి వాటిని మరింతమందికి చేరేలా చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించడం ఈ సంస్థ చేస్తున్న ముఖ్యమైన పని.[1] ఈ సంస్థ పలు కాపీరైట్ సంబంధిత లైసెన్సులను జనసామాన్యానికి ఉచితంగా అందుబాటులో తెచ్చింది. ఈ లైసెన్సులను వాడి రచయితలు వారి కృతులపై కొన్ని హక్కులను సడలించి సాధారణ జనాలకు అందుబాటులోకి తేవచ్చును. ఏ హక్కులను సాధారణ ప్రజలకోసం సడలిస్తున్నారో, ఏ హక్కులను తమ వద్దనే ఉంచేసుకుంటున్నారో వేరు వేరుగా తెలపవచ్చు. ఈ విషయాలను తెలిపేందుకు విశేష చిహ్నాలతో కూడిన బొమ్మలు లేదా ఆయా హక్కులను తెలిపే పొడి అక్షరాలను వాడవచ్చు. క్రియేటివ్ కామన్స్ రచయితకున్న కాపీ హక్కులను తొలగించదు, ఆ హక్కులను మరింత వివరిస్తుంది. సర్వ స్వామ్యహక్కులు అన్న పదానికి తెర తీస్తూ, లిఖిత పూర్వక ముందస్తు అనుమతి అన్న పంథాను మార్చివేస్తూ; రచయితకూ-రచనను వాడుకునే వ్యక్తికి మధ్య సంబంధాన్ని విస్తృత పరుస్తుంది. అనగా రచనను వాడుకోవాలనుకునే వ్యక్తి అవసరమున్నపుడు రచయితను సంప్రదించి అనుమతి తీసుకునే పద్ధతి కాకుండా, రచయితే తన రచనను స్వయంగా వాడుకోవచ్చు అని ముందస్తుగా ప్రకటన చేయడం. ఇందువలన అనవసరపు ఖర్చు, అనవసరపు సంప్రదింపులు తొలగిపోతాయి. తద్వారా రచయితకూ, వాడుకుంటున్న వ్యక్తికీ ఇద్దరికీ లాభం చేకూరుతుంది. వికీపీడియా ఈ లైసెన్సుల్లో ఒకదాన్ని వాడుతుంది.[2]

ఈ సంస్థ 2001లో, సెంటర్ ఫర్ పబ్లిక్ డొమెయిన్ అనే సంస్థ సహాయంతో, లారెన్స్ లెసీగ్, హాల్ ఏబెల్సన్, ఎరిక్ ఎల్డ్రెడ్ ద్వారా స్థాపించబడింది.[3] ఫిబ్రవరి 2002లో క్రియేటివ్ కామన్స్ గురించిన మొట్టమొదటి వ్యాసం వెలువడింది. ఇది హాల్ ప్లాట్కిన్ అనే వ్యక్తి వ్రాసారు.[4] డిసెంబరు 2002 లో మొదటి దఫా లైసెన్సులను జారీ చేసారు.[5] మనకు ఈనాడు తెలిసిన క్రియేటివ్ కామన్స్ లైసెన్సులను రూపొందించిన వారిలో మోలీ షాఫర్ వాన్ హౌవెలింగ్, గ్లెన్ ఓటిస్ బ్రౌన్, నీరు పహాడియా, బెన్ అడీడా ఉన్నారు.[6] 2003లో అంతకుముందు 1998 నుండి నడపబడుతున్న ఓపెన్ కంటెంట్ ప్రాజెక్టును డేవిడ్ ఎ వైలీ క్రియేటివ్ కామన్స్ లో విలీనం చేసి, క్రియేటివ్ కామన్స్ ను పాత ప్రాజెక్టుకు రూపాంతరం అని తెలుపుతూ ఆ సంస్థ నిర్దేశకుడిగా చేరారు.[7][8] మాథ్యూ హాఘే, ఆరన్ ష్వార్జ్[9] కూడా ఈ సంస్థ తొలినాళ్ళలో తమ వంతు సహకారం అందించారు.

జనవరి 2016 నాటికి 110 కోట్ల కృతులు వివిధ రకాల క్రియేటివ్ కామన్స్ లైసెన్సుల్లో అందుబాటులో ఉన్నాయి.[10] మార్చి 2015 కి ఫ్లికర్ లో 30.6 కోట్ల ఫోటోలు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో ఉన్నాయి.[11] క్రియేటివ్ కామన్స్ నిర్వహణ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా జరుగుతుంది. రచయితలు వారి సొంత రచనలపై గల నకలు హక్కులను మరింత ప్రభావవంతంగా వాడటానికి ఈ లైసెన్సులు దోహదపడటం వలన ఎందరో ఈ లైసెన్సులను ఆదరిస్తున్నారు.

లక్ష్యం, ప్రభావం[మార్చు]

లారెన్స్ లెసీగ్ (January 2008)
క్రియేటివ్ కామన్స్ జపాన్ సెమినార్, టోక్యో (2007)
సీసీ కొన్ని హక్కుల భద్రం
గ్రనాడాలోని ఒక పబ్ లో ఉన్న ఒక నోటీస్. ఆ పబ్ లో వినబడే సంగీతం క్రియేటివ్ కామన్స్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉందని తెలుపుతోంది.

క్రియేటివ్ కామన్స్ కాపీలెఫ్ట్ ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకోవటంలో ముందంజలో ఉందని పరిగణిస్తారు. కాపీలెఫ్ట్ అంటే సర్వస్వామ్యహక్కులు నిర్బంధించే కాపీరైట్ అనే ధోరణికి విరుద్ధంగా మొదలైన ఒక ఉద్యమం.[12]

మూలాలు[మార్చు]

 1. "తరచూ అడిగే ప్రశ్నలు". క్రియేటివ్ కామన్స్. Retrieved 20 డిసెంబరు 2011.
 2. "వికీమీడియా ఫౌండేషన్ వారి వాడుక మార్గదర్శకాలు". Retrieved June 11, 2012.
 3. "క్రియేటివ్ కామన్స్ చరిత్ర". Archived from the original on 2011-06-23. Retrieved 2011-10-09.
 4. ప్లాట్కిన్, హాల్ (11 February 2002). "ఆల్ హెయిల్ క్రియేటివ్ కామన్స్ స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్ అండ్ ఆథర్ లారెన్స్ లెసీగ్ ప్లాన్స్ ఎ లీగల్ ఇన్సరెక్షన్". SFGate.com. Retrieved 2011-03-08.
 5. "క్రియేటివ్ కామన్స్ చరిత్ర". Archived from the original on 2012-02-13. Retrieved 2009-11-08.
 6. హాఫే, మాట్ (2002-09-18). "క్రియేటివ్ కామన్స్ అనౌన్సెస్ న్యూ మేనేజ్మెంట్ టీం". creativecommons.org. Archived from the original on 2013-05-07. Retrieved 2013-05-07.
 7. డేవిడ్ ఎ వైలీ (30 June 2003). "ఓపెన్ కంటెంట్ ఇజ్ అఫీషియల్లీ క్లోజ్డ్ అండ్ దట్స్ జస్ట్ ఫైన్. (ఓపన్ కంటెంట్ అధికారికంగా మూతబడింది. ఐనా ఏం పర్వాలేదు)". opencontent.org. Archived from the original on 2 ఆగస్టు 2003. Retrieved 2016-02-21.
 8. క్రియేటివ్ కామన్స్ వెల్కమ్స్ డేవిడ్ వైలీ యాజ్ ఎజుకేషనల్ యూజ్ లైసెన్స్ ప్రాజెక్ట్ లీడ్ creativecommons.org (June 23rd, 2003) పై మ్యాట్ వ్యాసం
 9. లెసీగ్, లారెన్స్ (2013-01-12). "రిమెంబరింగ్ ఆరన్ ష్వార్జ్". creativecommons.org. Archived from the original on 2015-12-04. Retrieved 2013-05-07.
 10. "స్టేట్ ఆఫ్ కామన్స్". Retrieved 2016-03-07.
 11. "ఎక్స్ప్లోర్ క్రియేటివ్ కామన్&శ్". ఫ్లికర్. Retrieved 15 March 2015.
 12. బ్రొసార్డ్, షరీ ఎల్. (September 2007). "ది కాపీలెఫ్ట్ మూవ్మెంట్: క్రియేటివ్ కామన్&శ్ లైసెన్సింగ్" (PDF). కమ్యూనికేషన్ రీసర్చ్ ట్రెండ్స్. Retrieved 2015-10-20.

బయటి లంకెలు[మార్చు]

{{{1}}} గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి