జాతీయ రహదారి 1 (పాత సంఖ్య)
National Highway 1 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 456 కి.మీ. (283 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణం చివర | ఢిల్లీ | |||
జాతీయ రహదారి 2 in ఢిల్లీ జాతీయ రహదారి 8 in ఢిల్లీ | ||||
ఉత్తరం చివర | అటారీ, పంజాబ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఢిల్లీ: 22 కి.మీ. (14 మై.) హర్యానా: 180 కి.మీ. (110 మై.) పంజాబ్: 254 కి.మీ. (158 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | ఢిల్లీ - సోనిపట్- కురుక్షేత్ర - అంబాల - జలంధర్ - లుధియానా - ఫగ్వారా - అమృత్‌సర్ - అటారీ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 1 లేదా ఎన్.హెచ్.1 భారత జాతీయ రహదారులలో ఒకటి. ఇది భారత రాజధాని కొత్త ఢిల్లీని పంజాబ్లోని భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ అనే పట్టణంతో కలుపుతుంది. ఇది లాహోర్ నుండి బెంగాల్ వరకు షేర్ షా సూరి అనే ఢిల్లీ పాలకుడి హయాంలో నిర్మించబడిన గ్రాండ్ ట్రంక్ రోడ్ లో భాగం. ఈ హైవేను జాతీయ రహదారుల సంస్థ నిర్వహిస్తోంది.
రహదారి గురించి
[మార్చు]ఈ రహదారి అమృత్‍సర్, జలంధర్, ఫగ్వారా,లుధియానా, రాజ్‍పురా, అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపత్, సోనిపత్ ఇంకా ఢిల్లీ మొదలగు నగరాలను కలుపుతుంది. ఈ రహదారి పొడవు దాదాపుగా 456 కి.మీ. (283 మై.). ఈ రహదారిపై ఢిల్లీ-లాహోర్ బస్సు నడుస్తుంది.