వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు పేరు[మార్చు]

User:Madu19, User:Sai kiranmai, User:సాయికిరణ్,User:Ramu ummadishetty గార్లకు , తెవికీ అనే ప్రాజెక్టు పేరు మరీ సాధారణంగా వుంది. మీ సంస్థతో జతచేస్తే అనగా వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటీ అనిమారిస్తే మెరుగనుకుంటాను. --అర్జున (చర్చ) 06:30, 3 మార్చి 2020 (UTC)

User:Arjunaraoc గారు ప్రాజెక్ట్ పేరు మార్చబడినది ధన్యవాదాలు . 2020-03-03T12:12:46‎ Ramu ummadishetty

ప్రాజెక్టు పేజీల పునఃనిర్మాణం[మార్చు]

వాడుకరి:Kasyap గారు, ప్రాజెక్టు పేజీలు దారిమార్పు లేకుండా ఉపపేజీలుగా చేసినప్పుడు, వాటికి ఇవ్వబడిన లింకులుకూడా మార్చాలి. లేకపోతే ఎర్రలింకులతో కనబడుతాయి. --అర్జున (చర్చ) 09:20, 24 ఫిబ్రవరి 2021 (UTC)

ఇంటర్న్ షిప్ లో భాగంగా అనువాదాలు[మార్చు]

వాడుకరి:Kasyap గారు, ఆంగ్ల వ్యాస అనువాదాలు ఇంటర్న్ షిప్ లో భాగంగా చేస్తున్నామని పేర్కొన్నారు. దాని గురించి మరిన్ని వివరాలు, ఏ ఉపకరణం, వ్యాసాల ఎంపిక, నాణ్యత మదింపు లాంటి వాటిగురించి మరింత సమాచారం తెలియచేయగలరా?--అర్జున (చర్చ) 09:37, 24 ఫిబ్రవరి 2021 (UTC)

అర్జున గారు ప్రస్తుతం ఎలాంటి అనువాద ఉపకరణం ఇంటర్న్ షిప్ లో భాగంగా చెప్పటం లేదు tewiki.iiit.ac.in లొ ఈ పరికరాలు ఇంటిగ్రేట్ చెయలేదు . దీనికి రెండు కారణాలు 1) సహజంగా చేసే అనువాదాలను ప్రోత్సహించటం 2) అనువాద కృతక స్థాయిని తగ్గించటం , మేము కొంత మందికి అనువాద ఉపకరణాల గురించి చెప్పాము కానీ దాని ద్వారా చేసిన వ్యాసాల నాణ్యత అనుకున్న స్థాయిలో లేదు, ఇవి వికీపీడియా కీలక వ్యాసాలు (vital articles) మొత్తం 50,000 వరకు ఉన్నాయి అందులో దశల వారీగా వ్యాసముల జాబితా తగిన సూచనల తో ఇక్కడ ప్రచురించాము. ఇవి ఒక స్థాయికి చేరుకున్న తరువాత తెలుగు వికీపీడియా సభ్యుల అనుమతి , సహకారము తో తెలుగు వికీపీడియాలో చేర్చాలన్నది మా ప్రయత్నం Kasyap (చర్చ) 12:08, 25 ఫిబ్రవరి 2021 (UTC)
Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ పద్ధతి పై నా అభిప్రాయాలు నిర్మొహమాటంగా తెలుపుతున్నాను.
మీ పద్ధతి గతంలో తెలుగు వికీపీడియా, లేక భారతదేశంలో వికీ కృషిని ప్రోత్సహించడానికి జరిగిన కార్యకలాపాలు, ప్రాజెక్టుల బలాలు, బలహీనతలు మదింపు చేసినదాని ఫలితంగా ఏర్పడినట్లుగా లేదు.
అనువాద ఉపకరణం వాడి వికీపీడియన్ల కృషి వేగవంతం అయిందని, వికీపీడియన్ల క్రియాశీలత పెరిగిందని అనువాద ఉపకరణం వివరణలో వుంటే, మీరు సహజంగా చేసే అనువాదాలు వాడడం, సాంకేతికాభివృద్ధికి వ్యతిరేకంగా వుందని నాకు అనిపిస్తున్నది. ఐఐఐటి నడుపుతున్న ప్రాజెక్టులో ఇలా జరగడం నాకు ఆశాభంగం కలిగించింది.
సహజంగా అనువాదాలు చేయటానికి అనువాదంలో డిప్లమా, లేక సర్టిఫికేట్ స్థాయి శిక్షణ గల వారే నాణ్యతగా చేయగలుగుతారు. మీరు అలాంటి స్థాయి శిక్షణ ఏ విధంగా అందిస్తున్నారు? దీనిని ఏ విధంగా వికీపీడియాలో కృషి చేద్దామన్నవారికి విస్తరించగలరు?
వేరే శాండ్ బాక్స్ లో మీరు తర్ఫీదు ఇచ్చి తరువాత తెవికీలో చేర్చటమనేది నా దృష్టిలో తప్పక విఫలమవుతుంది. వికీపనికి పారదర్శకత ముఖ్యం. వేరే శాండ్ బాక్స్ లో పనిచేయటం వలన ఆ పారదర్శకత వుండదు. వికీలో భిన్నాభిప్రాయాలకు గల స్వేచ్ఛతో ఏకాభిప్రాయం సాధించడం కష్టసాధ్యమైనందున మీ కృషి విజయవంతం అవుతుందని నాకు నమ్మకంలేదు.
కొత్త వాడుకరులు, అనువాద ఉపకరణం వాడి వారి వాడుకరి పేరుబరిలో ప్రయోగాత్మక అనువాదాన్ని ముద్రించి, సహసభ్యుల సమీక్షతో అభివృద్ధి చేసి, తరువాత ప్రధాన పేరుబరికి తరలించడం మంచిది. వాడుకరి పేరుబరిలో వ్యాసాన్ని అభివృద్ధి చేయడాన్ని, తెవికీలో ఏ అధికారి, నిర్వాహకుడు, సభ్యుడు వ్యతిరేకించలేరు. ఇలా చేయడంతో అనువాద ఉపకరణం డిబగ్గర్ సహాయంతో అనువాదకుడు ఎలా అనువాదం చేశాడో పేరాల వారీగా గమనించి తగు సూచనలు చేయటానికి ప్రాజెక్టు సభ్యులకే కాక, ఏ వికీపీడియన్ కైనా వీలుంది.
ఇక మీ లక్ష్యాలు, వ్యాసాల ఎంపిక గురించి. మీ లక్ష్యం నిర్ణయించడం కూడా గత 15 ఏళ్ళ తెవికీ చరిత్రను సరిగా అధ్యయనం చేసిన ఆధారంగా జరిగినట్లు లేదు. ఇతర వికీలో ఎక్కువ వ్యాసాలున్నాయి కాబట్టి తెవికీలో ఎక్కువ వ్యాసాలుండాలి అనే ప్రాథమిక అవగాహన తప్ప, వికీపీడియా వ్యాసాలకు వీక్షణలను పరిగణించనట్లు లేదు. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’. అన్న వేమన పద్యం తెలిపినట్లు, రాసి కాదు, వాసి ముఖ్యం. మెటావికీలో ఎవరో ప్రతి వికీలో ఉండవలసిన 50000 వ్యాసాల జాబితా పెట్టారని, అవి అనువాదం చేద్దామనుకోవటం మంచిది కాదు. తెవికీలో వీక్షణల ఆధారంగా తెవికీ ప్రస్తుత పరిస్థితిని మదింపు చెయ్యాలి. ఏ రంగాలలో తెలుగు చదువరులకు ఆసక్తి వున్నదో, వికీపీడియా పై అభిప్రాయ సర్వేలు నిర్వహించి తెలుసుకొని, ఆ ప్రాధాన్యతల ఆధారంగా జాబితా చేయాలి. గతంలో గూగుల్ అనువాద ప్రాజెక్టు ద్వారా భారతదేశంలో ఎక్కువ శోధనలు జరుగుతున్న అంశాల ఆధారంగా వికీపీడియా వ్యాసాలు అనువదించారు. కొత్త అనువాద పరికరానికి సహాయంగా 90 శాతంపైగా మానవీయ అనువాదన చేసినా ఆ వ్యాసాలు తొలగింపుకు గురి అయ్యాయి. ఆ సంస్థలు అనువాదంలో కొంతవరకు అనుభవమున్నవారినే నియమించి వుంటాయి అనుకుంటాను. అటువుంటివే తొలగింపుకు గురైనప్పుడు, అనువాద అనుభవం లేని కొత్త వారితో సహజ అనువాదం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయని నేను అనుకోవడంలేదు. ఒక వేళ ఐఐఐటి కొత్త అనువాద యంత్రం చేస్తున్నట్లైతే దానిని కూడా వికీపీడియా అనువాద ఉపకరణంతో జతచేసి, వాడుకరి పేజీలో అనువాదాన్ని ముద్రించడం ద్వారా పరీక్షించుకోవచ్చు, అభివృద్ధి పరచుకోవచ్చు.
నేను పైన తెలిపినవి ఆచరించడం కష్టమనిపిస్తే సులభంగా చేయదగినవి, వీ ప్రాజెక్టు సభ్యులు ప్రతిరోజు తెలుగు దినపత్రిక చదివి, వాటిలో ప్రముఖమైన విషయాలను వికీపీడియా వ్యాసాలుగా ప్రతిపాదించి, చర్చించి వాటిని జట్టు ఆమోదిస్తే, కొత్త వ్యాసంగా, లేక అనువాద వ్యాసంగా అభివృద్ధి చేయటం బాగుంటుంది.
వ్యాసాల ఎంపికలో శాస్త్ర సాంకేతిక వ్యాసాలు ప్రాధాన్యత తగ్గించడం మంచిది. తెలుగు సమాజంలో క్రమేపీ మాధ్యమంగా తెలుగు ప్రాధాన్యత తగ్గుతున్నది. అటువంటప్పుడు మనము ఉన్నత గణితం లేక ఇతర శాస్త్రాలు సంఖ్యాబలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయే తప్ప, వాటికి వీక్షకులనుండి ఆదరణ వుండదు. వీక్షకులఆదరణ వుండకపోతే అవి మెరుగుపడవు.
మీ ప్రాజెక్టు కృషిలో ఇప్పటివరకు నాకు ఆసక్తిగా అనిపించిన విషయం గూగుల్ క్లాస్ రూమ్ తో వికీపీడియా పాఠాలు. అవి కోర్స్ఎరా లాంటి ఆన్లైన్ కోర్సుగా అభివృద్ధి చెందితే వికీపీడియన్లకు చాలా ఉపయోగంగా వుంటుంది.
పై అభిప్రాయాలు కటువుగా అనిపిస్తే క్షమించండి. వాటిని పరిశీలించి చర్చించి ప్రాజెక్టును ముందుకుతీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 23:14, 25 ఫిబ్రవరి 2021 (UTC)
అర్జున గారు మేము అనువాద ఉపకరణాలు ఇంటర్న్ షిప్ వికిశిక్షణలో మాత్రం వాడటం లేదు, ఎందుకంటే వారిలో సహజ సామర్ధ్యానికి మేము ప్రాముఖ్యత ఇచ్చాము, తెలుగు వికీపీడియా భాషా పరమైన సాంకేతిక ఉపకరణాల అభివృద్ధి , సామర్ధ్య పరీక్షలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ లొ ఎన్నో జరుగు తున్నాయి, ఇప్పటికే కొన్ని ఉపయోగిస్తున్నాము, ఇండిక్ వికీ ప్రాజెక్టు లో భాగంగా అవగాహన పెంచే కార్యక్రమాలు, బోధన వనరులు , కొత్త వాడు కరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, అనువాద పరికరాలు, నిఘంటువులు, భాష అనువర్తనాలు తయారు చేయటం మొదలైనవి ఉన్నాయి, శాస్త్ర , సాంకేతిక అంశాల వ్యాసాలు , ముఖ్యమైన వ్యాసాలు అందరికీ అందుబాటులో ఉండాలి అన్న లక్ష్యం తో పనిచేస్తున్నాం , వీటికోసం WMF సభ్యులు , తోటి వికీపీడియన్ల సూచనలు కూడా తీసుకొంటున్నాము, ఇతర భాషలలో ఉన్న గణాంకాలు , వాటి అభివృద్ధి , అందులో ఉన్న ఇతర భారతీయ భాషల వ్యాసాల నాణ్యత మీద , క్రియాశీల వాడు కరులు వారు, కొత్తగా రాసున్న వ్యాసాల మీద , ఇతర ప్రపంచ భాషలతో పోలిస్తే భారతదేశంలో ఎందుకు తక్కువ వ్యాసాలు ఉన్నాయన్న అంశం మీద , యాంత్రిక అనువాదాల , బాట్ ద్వారా చేరిన వ్యాసాల మీద మీద మాకు కొంచెం అవగాహన ఉన్నది, అంతేకాక స్ట్రాటజీ విషయంలో CIS A2K , ఇలాంటి వాటినుండి నేర్చుకొంటున్నాము కూడా ! , ప్రస్తుతం ఉన్న వికీపీడియా వ్యాసాలకు వీక్షణ ప్రధానంగా కాకుండా ఎలాంటి విషయాలు తెలుగు వారికి అందుబాటులో ఉండాలి అన్న అంశం మీద ప్రధాన మైన దృష్టి పెట్టాము, మా వద్ద నేర్చుకొంటున్న వారికి ఇవి మాత్రమే రాయాలి అని సూచనలు చేయటం లేదు వీలయితే సాండ్ బాక్స్ లో ఇటీవలి వ్యాసముల జాబితా చూడగలరు , ఇందులో కీలక వ్యాసాలు అన్నది ఒక సూచన మాత్రమే , మీరు సూచించిన అంశాలు మా బృందం దృష్టికి తీసుకువస్తాను Kasyap (చర్చ) 09:06, 26 ఫిబ్రవరి 2021 (UTC)

ప్రాజెక్టు పేజీ సవరణలు[మార్చు]

వాడుకరి:Kasyap గారు, చొరవతీసుకొని ప్రాజెక్టు పేజీలో కొన్ని సవరణలు చేశాను. వాటిని మరింత మెరుగుచేయడానికి అవసరమనుకుంటే నేను చేసిన సవరణలు రద్దుచేసైనా ప్రయత్నించండి. --అర్జున (చర్చ) 09:43, 24 ఫిబ్రవరి 2021 (UTC)

అనువాదాల విషయంలో ప్రాజెక్టు సభ్యులకు విజ్ఞప్తి[మార్చు]

తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టు సభ్యులైన Dollyrajupslp Kasyap, Nskjnv.indicwiki, Adithya.indicwiki, Mohanakrishnaindicwiki, Swethaindicwiki, Sujini.indicwiki, Nikhil.indicwiki మరియు ప్రాజెక్టుకు అనుబందాన్ని సూచించే నిర్దిష్టమైన పేరుతో పనిచేయని ఇతర సభ్యులకు విజ్ఞప్తి. మీరు తెలుగు వికీపీడియాలో కృషి చేయటం ద్వారా తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడుతున్నందులకు ధన్యవాదాలు. ఇప్పటికే మీ ప్రాజెక్టు గురించి పై విభాగంలో కొన్ని వ్యాఖ్యలు చేశాను. అవి మీరు గమనించారనుకుంటాను. మీరు చేస్తున్న కొన్ని రచనలను పరిశీలించిన పిదప, మీ కృషితో తెలుగు వికీపీడియా వేగంగా అభివృద్ధి జరగటానికి కొన్ని సూచనలు చేయదలచుకున్నాను.

  1. మీలో చాలామంది శాస్త్ర సాంకేతిక అంశాలపై వ్యాసాలు అనువాదాలు నేరుగానో, లేక మీ వాడుకరిపేజీకి ప్రయోగశాల ఉపపేజీగానో చేయటం గమనించాను. తెవికీలో ఇప్పటికి అనువాద వ్యాసాల గురించిన చర్చలను గమనిస్తే, అనువాద వ్యాసాల కృషిలో చాలాదోషాలకు అవకాశమున్నదని, శాస్త్ర సాంకేతికాంశాల వ్యాసాల అనువాదాలు ఇంకా ఎక్కువ దోషపూరితంగా వుండే అవకాశం ఎక్కువ అని తెలుసుకున్నారనుకుంటాను. కావున తొలి అనువాదాలు సాధారణ అంశాల గురించి చేయడం మంచిది.
  2. మీలో చాలా మంది అనువాదం తెవికీలో కాక, ఇతర చోట్ల అనువాద ఉపకరణాలను ఉపయోగించో లేక నేరుగానో చేసి తెవికీలో ప్రధానపేరుబరిలోనో లేకు వాడుకరిపేజీకి ఉపపేజీయైన ప్రయోగశాలపేరుతో ముద్రిస్తున్నారు. ఇది ఆయా వ్యాసాల అభివృద్ధికి, మీరు తెవికీ గురించి మరింతగా నేర్చుకొనటానికి సహకరించదు. మీరు నేరుగా అనువాదం చేస్తుంటే, ఇప్పటికే కొంతమంది వికీ సభ్యులు చేస్తున్నట్లు తొలిగా ఆంగ్ల వ్యాసాన్ని మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా వున్న అనువాద వ్యాసపేరుతో నకలు చేయండి. సారాంశంలో ఆంగ్ల వికీ వ్యాస రూపానికి శాశ్వతలింకు తెలపండి. ఆ తరువాత ఒక్కొక్క విభాగం అనువదించండి. అనువదించదలచని భాగాలు తొలగించండి. ఆ ఆనువాద సమీక్షకై మీ ప్రాజెక్టు సభ్యులను, ఇతర వికీపీడియన్లను కోరండి. ఇది {{సహాయం కావాలి}} మూస చర్చాపేజీలో చేర్చడం ద్వారా అందరి దృష్టికి తీసుకొనిపోవచ్చు. సమీక్షలో స్పందనలననుసరించి వ్యాసాన్ని అభివృద్ధి చేయండి. ఆ తరువాత, వ్యాసాన్ని ప్రధాన పేరుబరికి దారిమార్పు లేకుండా తరలించండి.
  3. మీ అనువాద కృషి వేగంగాను, అనువాదంలో దోషాలు వికీసాంకేతికాలకు సంబంధించి దోషాలు పెద్దగా లేకుండాలంటే విషయ అనువాద ఉపకరణం వాడి తొలి అనువాద రూపాన్ని వాడుకరిపేజీకి ఉపపేజీగా ముద్రించి, ఆ తదుపరి ఇంతకు ముందు అంశంలో తెలిపినట్లు అభివృద్ధి చేయటం మంచిది. అనువాదంలో యాంత్రిక అనువాదం స్థాయి పై నియంత్రణ ని తొలగించాలని చేసిన ప్రతిపాదనను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, మీరు వెనక్కుదగ్గ నవసరంలేదు. వికీ అంటేనే స్వేచ్ఛగా కృషి చేయగలగటం, సమష్ఠిగా సహకరించి అభివృద్ధి చేయగలగటమని తెలుసుకోండి. ప్రతిపాదనను స్వాగతించినవారు చాలా మంది వున్నారని నియంత్రణా విధానంపై జరిగిన వోటు ప్రక్రియ పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రస్తుత నియంత్రణ స్థాయి అధిగమించడానికి చిట్కాతో పాటు, అనువాద వ్యాసాల నాణ్యత మెరుగవటానికి చేసిన సూచనలు గమనించి ఆచరించండి.

మీకేదైనా సందేహాలుంటే, మీ వ్యాసాల సమీక్షలకు సహాకారం కావలసి వస్తే, ఆయా వ్యాసాల చర్చాపేజీలో, లేక మీ వాడుకరిపేజీలో, లేక ఈ పేజీలో చర్చలు చేయండి. మీ కృషి మరింత సమర్ధంగా, వేగంగా జరిగి తెవికీ అభివృద్ధికి దోహదపడాలని కోరుతూ.--అర్జున (చర్చ) 06:23, 28 ఫిబ్రవరి 2021 (UTC)

నమస్కారం అర్జున గారు, మీరు అనువాద వ్యాసాల విషయంలో సూచించిన అంశాలు తెలుగు వికీలో మేము మరింత మెరుగైన వ్యాసాలు రాయడానికి సహకరిస్తాయని భావిస్తున్నాను. నేను వికీలో చేస్తున్న వ్యాస కృషికి indicwiki ప్రాజెక్టుకి ఏ సంబంధంలేదు. ఇప్పుడు నేను ఆ ప్రాజెక్టులో సభ్యున్ని కూడా కాదు. నా వాడుకరి పేరు మార్పుకి వికీలో దరఖాస్తు చేసుకున్నాను. నేను రాసే వ్యాసాలకి సంబందించిన విషయాలు నేరుగా నా వాడుకరి పేజీలో రాయగలరు, ధన్యవాదాలు. Nskjnv (చర్చ) 07:22, 28 ఫిబ్రవరి 2021 (UTC)
Nskjnv గారు, మీ స్పందనకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 11:49, 2 మార్చి 2021 (UTC)
అర్జున గారు ఇప్పుడు Nskjnv.indicwiki,Mohanakrishnaindicwiki,Swethaindicwiki,Sujini.indicwiki, ఇప్పుడు ప్రాజెక్టు సభ్యులు గారు Adithya.indicwiki కొంత విరామం తీ సుకున్నారు , ప్రస్తుతం Nikhil.indicwiki ఒక్కరే ప్రాజెక్టులో కొనసాగుతున్నారు Kasyap (చర్చ) 05:55, 1 మార్చి 2021 (UTC)
Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 11:49, 2 మార్చి 2021 (UTC)